25 మంది Bangladeshisను పంపించానంటూ పోలీసులకు సవాల్!

బెంగళూరుకు 25 మంది బంగ్లాదేశీయులను పంపించానని, వారిని పోలీసులు పట్టుకోలేరంటూ సోషల్ మీడియాలో ఓ వ్యక్తి చేసిన వీడియో కలకలం రేపింది. వారు పోలీసులు, రాజకీయ నాయకుల ఇంటికి వచ్చి వారి ఫ్యామిలీకి హాని చేస్తారని బెదిరించాడు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు కేస్ బుక్ చేసి దర్యాప్తు చేసారు. ఆ వ్యక్తి మండ్య జిల్లా కృష్ణరాజపేట చెందిన సంతోష్ కుమార్‌గా గుర్తించారు. దుబాయ్‌లో హోటల్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. తరువాత వీడియోను డిలీట్ చేసి, పోలీసులకు సారీ చెబుతూ మరో వీడియోను పోస్ట్ చేశాడు.



