Latest

₹500 నోటుపై అంబేద్కర్ ఫొటో?
India· 8 Aug 2026

₹500 నోటుపై అంబేద్కర్ ఫొటో?

భారత కరెన్సీపై మహాత్మా గాంధీతో పాటు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఫొటో కూడా ఉండాలా..?💵 తెలంగాణకు చెందిన ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ ప్రతిపాదన చేశారు. దేశ రాజ్యాంగ రూపకర్తగా అంబేద్కర్ చేసిన సేవలకు గౌరవ సూచకంగా భారత కరెన్సీపై ఆయన చిత్రాన్ని ముద్రించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం ఇది ఒక ప్రతిపాదన మాత్రమే. దీనిపై కేంద్ర ప్రభుత్వం లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఎలాంటి అధికారిక నిర్ణయం వెలువడలేదు. కాబట్టి ఇప్పటివరకు భారత కరెన్సీ డిజైన్‌లో ఎలాంటి మార్పు జరగలేదు.

బండి సంజయ్‌కు కాంగ్రెస్ నేత ఓపెన్ ఛాలెంజ్
Politics· 8 Aug 2026

బండి సంజయ్‌కు కాంగ్రెస్ నేత ఓపెన్ ఛాలెంజ్

TG: కేంద్ర సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ తప్పుడు ప్రచారాలు మానుకోవాలని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి అన్నారు. కరీంనగర్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులను కేంద్ర నిధులుగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం రూ.210 కోట్లు ఇస్తే రూ.840 కోట్లు తామే ఇచ్చినట్లు ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా లేకుండా ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదని పేర్కొన్నారు. నిధులపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, బండి సంజయ్ సిద్ధమా అని సవాల్ చేశారు.

మెడికో ప్రియాంక ఆరోగ్యంపై హైటెన్షన్
AP· 8 Aug 2026

మెడికో ప్రియాంక ఆరోగ్యంపై హైటెన్షన్

AP: రాజమండ్రి <a href="https://www.theclearcutnews.com/n/NtiWpLS">ఘటన</a>లో తీవ్రంగా గాయపడిన మెడికో ప్రియాంక ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని కిమ్స్ వైద్యులు తెలిపారు. సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స కొనసాగుతోంది. ప్రియాంకకు అప్నియా టెస్ట్ నిర్వహించేందుకు డాక్టర్స్ ప్రయత్నించినప్పటికీ, శరీరం సహకరించకపోవడంతో పరీక్షను నిలిపివేశారు. అనంతరం ఆరోగ్య పరిస్థితిపై తల్లిదండ్రులతో వైద్యులు చర్చించారు. ఈ నెల 3న రాజమహేంద్రవరంలో తోటి విద్యార్థితో బైక్‌పై వెళ్తుండగా ఇద్దరు యువకులు కారుతో ఢీకొట్టడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.

పెద్ది కుటుంబానికి KCR భరోసా
Politics· 8 Aug 2026

పెద్ది కుటుంబానికి KCR భరోసా

TG: ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి BRS అధినేత KCR అండగా నిలిచారు. ఆయన ఇద్దరు పిల్లలకు చెరో రూ.కోటి చొప్పున మొత్తం రూ.2 కోట్ల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. వృద్ధాప్యంలో ఉన్న సుదర్శన్‌రెడ్డి తల్లి అమృతమ్మ బాగోగుల కోసం ఆమె పేరుపై మరో రూ.25 లక్షలను బ్యాంకులో జమ చేయాలని తెలిపారు. మొత్తంగా కుటుంబానికి రూ.2.25 కోట్ల ఆర్థిక సహాయం అందించనున్నారు. పిల్లల చదువు, భవిష్యత్‌తో పాటు కుటుంబ సంక్షేమానికి పార్టీ అండగా ఉంటుందన్నారు.

వర్షాల కోసం ఈ నెల 10న CM వరుణ యాగం
Politics· 8 Aug 2026

వర్షాల కోసం ఈ నెల 10న CM వరుణ యాగం

TG: రాష్ట్రంలో వర్షాలు కురిసి, పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఈ నెల 10న నాగార్జునసాగర్‌లో ప్రభుత్వం వరుణ యాగం చేయనుంది. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంతో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ అర్చకులు, వేదపండితులు నిర్ణయించిన ముహూర్తంలో యాగం చేయనున్నారు. నాగార్జునసాగర్ విజయవిహార్‌లో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సారథ్యంలో ఈ యాగం జరగనుంది. తరువాత పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు.

GenZలపై మాట మార్చిన కంగనా రనౌత్
India· 8 Aug 2026

GenZలపై మాట మార్చిన కంగనా రనౌత్

మోహన్ భాగవత్ GenZలతో మాట్లాడిన తర్వాత బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ GenZలపై తన వైఖరి మార్చుకున్నారు. పార్లమెంట్‌ ప్రాంగణంలో వాళ్లను పొగిడారు. వాళ్లు మన దేశానికి బలం అన్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ద్వారా యువత ప్రభావితమవుతున్నారని చెప్పారు. దేశ యువత మన సంస్కృతికి అంబాసిడర్‌లుగా మారుతున్నారన్నారు. అయితే అల్లరి చేసే కొంతమంది వల్ల మొత్తం తరం పేరు పాడవుతోందని చెప్పారు. ఇటీవల GenZలపై విరుచుకుపడ్డ ఆమె ఇప్పుడు మాట మార్చడం చర్చగా మారింది.

మన్యం బంద్‌తో ఏజెన్సీలో టెన్షన్
AP· 8 Aug 2026

మన్యం బంద్‌తో ఏజెన్సీలో టెన్షన్

AP: అల్లూరి, పోలవరం జిల్లాల్లో ఆదివాసీ సంఘాలు చేపట్టిన మన్యం బంద్ కొనసాగుతోంది. జీవో నంబర్‌ 3ను పునరుద్ధరించడంతోపాటు స్థానిక గిరిజనులకు 100శాతం ఉద్యోగ రిజర్వేషన్‌ కల్పించాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. 1/70 చట్టాన్ని పక్కాగా అమలుచేసి, భూబదలాయింపులను అడ్డుకోవాలని కోరారు. పాడేరులో ఆదివాసీ సంఘాల నేతలు RTC కాంప్లెక్స్‌ వద్ద రోడ్డుపై బైఠాయించి బస్సులు, వాహనాలను అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు నిరసనకారులను చెదరగొట్టారు. రంపచోడవరం సహా పలు ఏజెన్సీ ప్రాంతాల్లో దుకాణాలు మూతపడ్డాయి.

భయపెట్టే పుర్రె.. ఇప్పుడు ఫ్యాషన్ ఐకాన్!
Infotainment· 8 Aug 2026

భయపెట్టే పుర్రె.. ఇప్పుడు ఫ్యాషన్ ఐకాన్!

ఒకప్పుడు చావుకు, భయానికి గుర్తుగా చూసే 'పుర్రె' (Skull💀) సింబల్, ఇప్పుడు గ్లోబల్ ఫ్యాషన్ ప్రపంచంలో ఒక క్రేజీ ట్రెండ్‌గా మారిపోయింది. మొదట్లో బైకర్స్, రాక్ స్టార్ల నుంచి వచ్చిన ఈ స్టైల్, తర్వాత హార్లే డేవిడ్సన్ లోగోలు, అలెగ్జాండర్ మెక్‌క్వీన్ డిజైన్లతో లగ్జరీ ఫ్యాషన్ ఐకాన్‌గా ఎదిగింది. ఉంగరాలు, టీషర్టులు, డ్రెస్సుల నుంచి సోషల్ మీడియా ఎమోజీల వరకు ఈ పుర్రె గుర్తు కూల్ అండ్ మోడ్రన్ స్టైల్ సింబల్‌గా యూత్‌ను ఆకట్టుకుంటుంది.

ఆరుతడి పంటలనే సాగు చేయాలి: కోమటిరెడ్డి
TG· 8 Aug 2026

ఆరుతడి పంటలనే సాగు చేయాలి: కోమటిరెడ్డి

TG: వరికి బదులుగా తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలు, కూరగాయల సాగు వైపు రైతులను మళ్లించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం నల్గొండలో నిర్వహించిన వ్యవసాయ, ఉద్యానవన శాఖల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో చిన్న, సన్నకారు రైతులు నష్టపోకుండా ఉండేందుకు తక్కువ నీటితో సాగయ్యే పంటలపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. రానున్న రెండు, మూడు నెలల్లో వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులకు ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పించాలన్నారు.

మైఖేల్ జాక్సన్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..
Cinema· 8 Aug 2026

మైఖేల్ జాక్సన్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..

పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ బయోపిక్ 'మైఖేల్' సీక్వెల్‌గా 'మైఖేల్ 2' రాబోతుంది. 2026 చివరిలో లేదా 2027 మొదట్లో షూటింగ్ ప్రారంభం కానుందని ప్రొడక్షన్ హౌస్ చైర్మన్ ఆడమ్ ఫోగెల్సన్ తెలిపారు. పార్ట్ వన్ సమయంలో తీసిన కొన్ని భారీ మ్యూజికల్ సీన్లను ఈ సీక్వెల్‌లో ఉపయోగించనున్నారు. ఈ సినిమాను 2027 చివర్లో లేదా 2028లో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

గోళ్లపై చేపల డిజైన్ల ట్రెండ్..
Viral· 8 Aug 2026

గోళ్లపై చేపల డిజైన్ల ట్రెండ్..

ఫ్యాషన్ ప్రపంచంలో రోజూ ఏదో ఒక కొత్త ట్రెండ్ వస్తూనే ఉంటుంది. లేటెస్ట్‌గా బ్యూటీ లవర్స్‌ని 'సర్డీన్ నెయిల్స్' అనే నెయిల్ ఆర్ట్ ఆకట్టుకుంటుంది. గోళ్లపై చిన్న వెండి రంగు చేపలు, నిమ్మకాయలు, ఆలీవ్ డిజైన్లను వేసుకోవడమే ఈ ట్రెండ్ ప్రత్యేకత. మెడిటరేనియన్ సమ్మర్ ఫీల్ ఇచ్చే ఈ నెయిల్ ఆర్ట్, యూరోపియన్ స్టైల్‌ని ఇష్టపడేవారికి బాగా నచ్చేస్తుంది. నెటిజన్లు తమ గోళ్లకు ఈ చేపల డిజైన్లను వేసుకుని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

రేపు వైన్స్ బంద్
TG· 8 Aug 2026

రేపు వైన్స్ బంద్

TG: బోనాల పండగ సందర్భంగా ప్రజాశాంతి, భద్రత దృష్ట్యా హైదరాబాద్ నగరం మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న వైన్ షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లు మూసేస్తున్నారు. రేపు ఉదయం 10 గంటల నుండి ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు ఈ బంద్ కొనసాగుతుంది. ప్రజలు ఈ ఆదేశాలను గౌరవించి, పోలీసుశాఖకు సహకరించి, బోనాల పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ విజ్ఞప్తి చేసింది.

ఆహారం కోసం వెళ్లిన కొండచిలువ.. ఎలక్ట్రిక్ షాక్‌ తగిలి?
Viral· 8 Aug 2026

ఆహారం కోసం వెళ్లిన కొండచిలువ.. ఎలక్ట్రిక్ షాక్‌ తగిలి?

పెరూలో ఎలక్ట్రిక్ పోల్‌పై ఉన్న పక్షులను వేటాడేందుకు వెళ్లిన కొండచిలువకు హైటెన్షన్ వైర్లు తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే చనిపోయింది. పక్షులను వేటాడేందుకు ఎలక్ట్రిక్ పోల్‌ ఎక్కిన కొండచిలువకు ఎలక్ట్రిక్ తీగలను తాకినట్లు తెలుస్తోంది. దింతో కొద్దిసేపు ఆ ఏరియాలో పవర్ సప్లై ఆగిపోయింది. ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరలయ్యింది.

థియేటర్లలో కొత్త రచ్చ!
Cinema· 8 Aug 2026

థియేటర్లలో కొత్త రచ్చ!

ఇటీవల థియేటర్లలో పక్కన కూర్చుని రన్నింగ్ కామెంట్రీ చెప్పేవాళ్ల గోల ఎక్కువైపోతోందని ప్రేక్షకులు మండిపడుతున్నారు. 'స్పైడర్ మ్యాన్' సినిమా చూస్తుండగా పక్కవాడికి సీన్ బై సీన్ స్టోరీ చెప్పిన ఒకరిని మిగతా జనాలు బయటకు లాగి కొట్టిన వీడియో వైరల్‌గా మారింది. హోమ్ థియేటర్ లాగా థియేటర్లను వాడుకుంటూ పక్కవాళ్ల మూడ్‌ను పాడుచేస్తున్నారని, ట్రైలర్స్ టైమ్‌లో ఎంతైనా మాట్లాడండి కానీ సినిమా మొదలయ్యాక మాత్రం కామ్‌గా ఉండాలని ప్రేక్షకులు కోరుతున్నారు.

రాజకీయ లబ్ధి కోసమే విమర్శలు: జూపల్లి
Politics· 8 Aug 2026

రాజకీయ లబ్ధి కోసమే విమర్శలు: జూపల్లి

TG: సాగు, తాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడే అర్హత BRSకు లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ ప్రయోజనాల కోసమే BRS నేతలు ప్రాజెక్టులపై మాట్లాడుతున్నారని ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయాలంటే రూ.80వేల కోట్లు అవసరమవుతాయని, గత ప్రభుత్వం కేవలం రూ.19 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని తెలిపారు. ప్రాజెక్టు పూర్తయితే 12లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. పదేళ్ల పాలనలో పాలమూరులో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించలేదని ఫైరయ్యారు.

iThrive CEO ముగ్ధా ప్రధాన్ వైరల్..
News· 8 Aug 2026

iThrive CEO ముగ్ధా ప్రధాన్ వైరల్..

iThrive సంస్థ CEO ముగ్ధా ప్రధాన్ దేశ ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. దేశంలో రోడ్లు, పరిసరాలు చెత్తగా ఉన్నాయని, బాధ్యతాయుతమైన పదవిలో ఉండి సమస్యలను పట్టించుకోవట్లేదని అన్నారు. ప్రధానిని కలిస్తే చెంపదెబ్బ కొడతానంటూ ఆమె మాట్లాడిన వీడియో వైరల్ అవ్వడంతో, నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి.

సైబర్ క్రైం బాధితులకు రూ.98.89 లక్షలు రికవరీ
TG· 8 Aug 2026

సైబర్ క్రైం బాధితులకు రూ.98.89 లక్షలు రికవరీ

TG: హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు జూలైలో 70 FIRలు నమోదు చేశారు. 15 రాష్ట్రాల ట్రేడింగ్ ఫ్రాడ్, సోషల్ మీడియా ఫ్రాడ్, డిజిటల్ అరెస్ట్ తదితర కేసులపై 49 మందిని అరెస్టు చేశారు. 38 ప్రధాన కేసుల్లో బాధితులు రూ.13.87 కోట్లు నష్టపోగా, అందులో రూ.98.89 లక్షలు రీఫండ్ చేశారు. జోనల్ సైబర్ సెల్స్ 2,059 NCRP పిటిషన్లు తీసుకుని 298 FIRలు నమోదు చేశాయి. సైబర్ పెట్రోల్‌లో 128 ఫేక్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్స్ తొలగించారు.

‘మిషన్ శక్తిశాట్’కు సెలెక్టయిన జెస్సీకి మంత్రి ప్రోత్సాహం
Politics· 8 Aug 2026

‘మిషన్ శక్తిశాట్’కు సెలెక్టయిన జెస్సీకి మంత్రి ప్రోత్సాహం

AP: ‘మిషన్ శక్తిశాట్’కు సెలెక్టయిన జెస్సీకి మంత్రి కందుల దుర్గేష్ స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌వాచ్, పవర్ బ్యాంక్‌తో పాటు దిల్లీకు వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్లను అందించారు. రాజమహేంద్రవరం క్యాంప్ ఆఫీస్‌లో జెస్సీ, ఆమె పేరెంట్స్‌ను ఇన్వైట్ చేసి కిట్‌ను ఇచ్చారు. స్పేస్ రీసెర్చ్ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించాలని ఆశీర్వదించారు. పదో తరగతి చదువుతూనే ‘శక్తిశాట్’కు ఎంపికైన జెస్సీ ప్రతి స్టూడెంట్‌కు స్ఫూర్తి అని మంత్రి అభినందించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి దుర్గేష్‌కు జెస్సీ కృతజ్ఞతలు తెలిపారు.

బాలీవుడ్‌లో హీరోయిన్లదే రాజ్యమా!
Cinema· 8 Aug 2026

బాలీవుడ్‌లో హీరోయిన్లదే రాజ్యమా!

ఈమధ్య బాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ట్రెండ్ అవుతున్నాయి. కేవలం హీరోల చుట్టూనే కాకుండా, హీరోయిన్లు లీడ్ రోల్స్ చేసే యాక్షన్, థ్రిల్లర్ సినిమాలపై నిర్మాతలు భారీగా ఖర్చు పెడుతున్నారు. ప్రేక్షకులు కూడా హీరోనా, హీరోయిన్ అని చూడకుండా మంచి కథలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. థియేటర్లే కాకుండా ఓటీటీ రైట్స్ ద్వారా వచ్చే ఆదాయం కూడా రిస్క్‌ను తగ్గిస్తుండటంతో, రాబోయే రోజుల్లో లేడీ ఓరియెంటెడ్ ఉన్న భారీ బడ్జెట్ సినిమాలు మరింత పెరగనున్నాయి.

కొరియన్ ఆత్మతో వరుణ్ తేజ్ రచ్చ..
Cinema· 8 Aug 2026

కొరియన్ ఆత్మతో వరుణ్ తేజ్ రచ్చ..

వరుణ్ తేజ్, రితికా నాయక్ జంటగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఇండో-కొరియన్ హారర్ కామెడీ మూవీ 'కొరియన్ కనకరాజు'. ఒక పల్లెటూరి యువకుడి శరీరంలోకి కొరియన్ ఆత్మ ప్రవేశించడం అనే సరికొత్త పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. వరుణ్ తేజ్ నటన, మేకోవర్ బాగుండగా, కమెడియన్ సత్య తన కామెడీ టైమింగ్‌తో థియేటర్లలో నవ్విస్తున్నారు.

FAKE or FACT..మనిషి కుక్కలా మారిపోయాడా?
Viral· 8 Aug 2026

FAKE or FACT..మనిషి కుక్కలా మారిపోయాడా?

26 ఏళ్ల జపాన్ మిలియనీర్ ‘జాసో’ కుక్కగా మారిపోయాడని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందుకోసం ఆయన ₹220 కోట్లు ఖర్చు చేసి సర్జరీలు చేయించుకున్నాడని అంటున్నారు. దీని మీద చాలా చర్చ జరుగుతోంది. అయితే ఈ వార్తకు ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. మనిషిని కుక్కగా మార్చే సర్జరీ అసాధ్యమని వైద్యులు అంటున్నారు. అందుకోసం వందల కోట్లు ఖర్చు చేయడం ఉట్టి పుకారు మాత్రమే అంటున్నారు. కాబట్టి ఈ వార్త FAKE.