Latest

ఆరోగ్యం మీ చేతుల్లో..
Health· 7 Aug 2026

ఆరోగ్యం మీ చేతుల్లో..

నరాల బలానికి, శరీరంలో శక్తి పెరగడానికి ఉపయోగపడే మెగ్నీషియం కోసం డార్క్ చాక్లెట్, ధాన్యాలు, అరటిపండు, పాలకూర, బాదం తీసుకోవాలి. మనకు రోగనిరోధక శక్తి పెరిగి, వ్యాధులు రాకుండా ఉండాలంటే జింక్ చాలా అవసరం. దీని కోసం రోజువారీ ఆహారంలో గుమ్మడి గింజలు, జీడిపప్పు, శనగలు, పాలు, గుడ్లు తీసుకోవాలి. గుండె ఆరోగ్యానికి, థైరాయిడ్ సమస్యలు రాకుండా కాపాడే సెలీనియం కావాలంటే చేపలు, బ్రెజిల్ నట్స్, ప్రొద్దుతిరుగుడు గింజలు, బ్రౌన్ రైస్‌ను డైట్‌లో తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు.

మనీ లాండరింగ్ కేసు పేరుతో భారీ మోసం
Crime· 7 Aug 2026

మనీ లాండరింగ్ కేసు పేరుతో భారీ మోసం

AP: ఈడీ అధికారులం, మేము ఢిల్లీ పోలీసులం అంటూ సైబర్‌నేరగాళ్లు కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన వృద్ధురాలు అలవేలు మంగమ్మను మోసం చేశారు. మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ చేస్తామని, ఆస్తులు సీజ్ చేస్తామని బెదిరించి వీడియో కాల్స్‌తో నమ్మించారు. కేసు నుంచి తప్పించాలంటే డబ్బు చెల్లించాలని చెప్పడంతో ఆమె రూ.1.43 కోట్లు RTGS ద్వారా వారి ఖాతాలకు బదిలీ చేశారు. మరో రూ.95 లక్షలు డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చిన బాధితురాలు అమెరికాలో ఉన్న తన కుమారుడికి విషయం చెప్పింది. అతడి సూచన మేరకు పోలీసులను ఆశ్రయించింది.

CJP నేషనల్ కమిటీలో హైదరాబాద్ యువకుడికి కీలక బాధ్యతలు
Politics· 7 Aug 2026

CJP నేషనల్ కమిటీలో హైదరాబాద్ యువకుడికి కీలక బాధ్యతలు

TG: హైదరాబాద్‌కు చెందిన యంగ్ సోషల్ యాక్టివిస్ట్ విజయ్‌రెడ్డి మల్లంగి CJP నేషనల్ మీడియా కోఆర్డినేటర్‌గా, సౌత్ స్టేట్స్ ఇన్‌చార్జిగా ఎంపికయ్యారు. CJP తొలి నేషనల్ లీడర్‌షిప్ టీమ్‌లో తెలుగు యువకుడికి చోటు దక్కడం విశేషం. అమెరికాలో హయ్యర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి జాబ్ వదిలి సోషల్ సర్వీస్‌లోకి వచ్చిన విజయ్‌రెడ్డి, 'Save KBR', 'కంచ గచ్చిబౌలి భూముల పరిరక్షణ' వంటి ఉద్యమాల్లో పాల్గొన్నారు. సోనమ్ వాంగ్‌చుక్ చేసిన నిరసన కార్యక్రమాల్లో కోఆర్డినేటర్‌గా చేసిన ఆయన సేవలను గుర్తించి సీజేపీ ఈ బాధ్యతలు అప్పగించింది.

YSRCP మాజీ ఎమ్మెల్యేకు రిమాండ్‌.. జైలుకు తరలింపు
Politics· 7 Aug 2026

YSRCP మాజీ ఎమ్మెల్యేకు రిమాండ్‌.. జైలుకు తరలింపు

AP: కిడ్నాప్‌, SC, ST అట్రాసిటీ కేసులో YSRCP మాజీ MLA ముస్తఫాకు నూజివీడు ఫస్ట్ అడిషనల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ రిమాండ్‌ విధించారు. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం కోయిలగూడెంకు చెందిన పొగాకు వ్యాపారి అభి కిడ్నాప్‌ కేసులో ముస్తఫా, ఆయన కొడుకు బషీర్‌ నిందితులుగా ఉన్నారు. అబ్స్కాండింగ్‌లో ఉన్న ముస్తఫాను పోలీసులు గుజరాత్‌లో అదుపులోకి తీసుకుని, మిడ్‌నైట్ మేజిస్ట్రేట్‌ ముందు ప్రవేశపెట్టగా రిమాండ్‌కు ఆదేశించింది. తరువాత ఆయనను, బషీర్‌ను నెల్లూరు జైలుకు తీసుకెళ్లారు.

గాంధీభవన్ నిరసనలపై DCC అధ్యక్షురాలు సీరియస్
Politics· 7 Aug 2026

గాంధీభవన్ నిరసనలపై DCC అధ్యక్షురాలు సీరియస్

TG: కొమురంభీమ్ జిల్లా కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత విభేదాలపై DCC అధ్యక్షురాలు ఆత్రం సుగుణ స్పందించారు. డీసీసీ హటావో.. కాంగ్రెస్ బచావో పేరుతో హైదరాబాద్‌లోని గాంధీభవన్ ఎదుట చేపట్టిన నిరసనలను ఆమె తీవ్రంగా ఖండించారు. ఆసిఫాబాద్‌లోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. పార్టీపై అసంతృప్తులు ఉంటే అంతర్గతంగా చర్చించాలని, బహిరంగ నిరసనలు పార్టీ ప్రతిష్టకు నష్టం కలిగిస్తాయని అని అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాలు, పదవుల ఆశతో కొందరు పార్టీని బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

బాలికల సాధికారతకు ప్రత్యేక కార్యాచరణ
Education· 7 Aug 2026

బాలికల సాధికారతకు ప్రత్యేక కార్యాచరణ

AP: బాలికల విద్య, సాధికారత, కెరీర్ అవకాశాలపై సమగ్ర అవగాహన కల్పించేందుకు శ్రీ సత్యసాయి జిల్లాలో "బాలికే భవిష్యత్తు" కార్యక్రమాన్ని మోడల్‌గా నిర్వహించాలని కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ అధ్యక్షతన "బాలికే భవిష్యత్తు" కార్యక్రమ సన్నాహక సమావేశం నిర్వహించారు. బాలికల విద్య, సాధికారత, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు, ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.

స్థానిక ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్
AP· 7 Aug 2026

స్థానిక ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా ఆదేశించారు. ఎన్నికలు ఎప్పుడైనా జరిగే అవకాశం ఉన్నందున అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని సూచించారు. విజయవాడలో జరిగిన సమీక్ష సమావేశంలో మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు పాల్గొన్నారు. మొత్తం 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఓటర్ల తుది జాబితా, పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై సన్నద్ధత కొనసాగుతోందన్నారు.

సామాజిక న్యాయమే ప్రధాన లక్ష్యం: కవిత
Politics· 7 Aug 2026

సామాజిక న్యాయమే ప్రధాన లక్ష్యం: కవిత

TG: BCలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్ల బిల్లును వచ్చే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోపు ఆమోదించాలని TRS పార్టీ అధ్యక్షురాలు కవిత కేంద్రాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వెయ్యి కార్లతో ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన సభలో ఆమె మాట్లాడారు. BCలు, SCలు, STలు, మైనార్టీలు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు, దివ్యాంగులకు సమాన హక్కులు కల్పించడమే తమ లక్ష్యమన్నారు. రాష్ట్రం పంపిన 42శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును రాష్ట్రపతి వెంటనే ఆమోదించాలని కోరారు.

ORR నిర్వహణపై CM సీరియస్
TG· 7 Aug 2026

ORR నిర్వహణపై CM సీరియస్

TG: ఔటర్ రింగ్‌రోడ్డు(ORR) నిర్వహణపై CM రేవంత్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తంచేశారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఫైరయ్యారు. నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ORR, రీజినల్ రింగ్‌రోడ్(RRR)‌, రాబోయే రేడియల్ రోడ్లను ఒకేవ్యవస్థ కిందకు తీసుకురావాలని సూచించారు. భూసేకరణ, రుణాలు, రోడ్ల నిర్వహణ అదేవ్యవస్థ పరిధిలో ఉండాలన్నారు. ట్రాన్స్‌ఫరబుల్‌ డెవలప్‌మెంట్‌ రైట్స్‌ బాండ్లపై ప్రత్యేక కమిటీ ఏర్పాటుచేయాలని, TDR ప్రక్రియను ఆన్‌లైన్‌లో పారదర్శకంగా నిర్వహించాలన్నారు.

APలో కొత్త పాలసీకి గ్రీన్ సిగ్నల్
AP· 7 Aug 2026

APలో కొత్త పాలసీకి గ్రీన్ సిగ్నల్

APలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య (PPP) ప్రాజెక్టులకు కొత్త విధానానికి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. CM చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో భారీ పెట్టుబడుల సమీకరణ, ప్రాజెక్టుల వేగవంతమైన అమలు, సమర్థ పర్యవేక్షణ లక్ష్యంగా కొత్త పాలసీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.1.23 లక్షల కోట్ల విలువైన PPP ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. ఆర్థికంగా సాధ్యంకాని ప్రాజెక్టులకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌తోపాటు వడ్డీలేని రుణాలు అందించేందుకు ప్రత్యేక బ్రిడ్జ్‌ఫండ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

“అమెరికాను ఆపండి.. లేదంటే మీకూ Risk”: IRAN
World· 6 Aug 2026

“అమెరికాను ఆపండి.. లేదంటే మీకూ Risk”: IRAN

అమెరికా దాడులను ఆపేలా ట్రంప్‌పై ఒత్తిడి తీసుకురావాలని ఇరాన్ గల్ఫ్ దేశాలను హెచ్చరించింది. లేదంటే ఆయిల్ ఫీల్డ్స్, పవర్ గ్రిడ్స్, వాటర్ సిస్టమ్స్, ట్రాన్స్‌పోర్ట్ నెట్‌వర్క్స్ వంటి కీలక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై ప్రతీకార దాడులు జరగొచ్చని వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు సౌదీ అరేబియా మాత్రం పరిస్థితి మరింత ముదరకుండా చర్చలకు అవకాశం ఇవ్వాలని అమెరికాను కోరుతోంది. దీంతో US–Iran మధ్య టెన్షన్ ఇప్పుడు గల్ఫ్ దేశాలకూ పెద్ద ఆందోళనగా మారుతోంది.

జిమ్ చేసేవారు జాగ్రత్త!
Health· 6 Aug 2026

జిమ్ చేసేవారు జాగ్రత్త!

జిమ్ చేసేవారికి అండ్ హెల్త్ కాన్షియస్ ఉన్నవారికి అలర్ట్! బాడీ బిల్డింగ్ కోసం అవసరానికి మించి ప్రొటీన్ తింటే మేలు కంటే డేంజరే ఎక్కువని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ ప్రొటీన్ తీసుకోవడం వల్ల కిడ్నీలపై ప్రెజర్ పడి పాడైపోయే ఛాన్స్ ఉంది. అంతేకాదు గ్యాస్, మలబద్ధకం, హై బిపి, లివర్ ప్రాబ్లమ్స్‌తో పాటు క్యాన్సర్ రిస్క్ కూడా పెరుగుతుంది. అందుకే ప్రొటీన్‌తో పాటు ఫైబర్ ఉన్న ఫుడ్స్ తింటూ, డైటీషియన్ సలహా తీసుకోవడం బెటర్.

రేపు పిడుగులతో వర్షాలు పడే ఛాన్స్!
Health· 6 Aug 2026

రేపు పిడుగులతో వర్షాలు పడే ఛాన్స్!

ఏపీలో రేపు వెదర్ కాస్త సీరియస్‌గా మారబోతోంది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, కోనసీమ, వెస్ట్ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడొచ్చని SDMA అలర్ట్ ఇచ్చేసింది. మిగతా ఏరియాల్లో కూడా అక్కడక్కడ చిన్నపాటి చినుకులు పడే ఛాన్స్ ఉంది. సో వర్షం పడే టైమ్‌లో చెట్ల కింద, ఎలక్ట్రిక్ పోల్స్, హోర్డింగ్స్ దగ్గర నిలబడి రిస్క్ తీసుకోకండి.

ఈ ఇటాలియన్ పాస్తా స్పెషాలిటీ ఏంటో తెలుసా?
Health· 6 Aug 2026

ఈ ఇటాలియన్ పాస్తా స్పెషాలిటీ ఏంటో తెలుసా?

ఎలేన్స్ ఫెటుచిని ఆల్‌ఫ్రెడో (ఇటాలియన్-అమెరికన్ పాస్తా) చూడటానికి సింపుల్ మ్యాక్ అండ్ చీజ్ లానే అనిపించినా, దాని టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్! పెద్దగా హడావుడి, కాంప్లికేటెడ్ ఇంగ్రెడియెంట్స్ ఏమీ లేకుండా చాలా లైట్‌గా, టేస్టీగా ఉండే ఈ ఇటాలియన్ పాస్తా డిష్ ఫుడ్ లవర్స్‌ను అమితంగా ఆకట్టుకుంటోంది. ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకునే ఈ డిష్, తింటే మాత్రం మంచి ఫీలింగ్ ఇస్తుందంటున్నారు ఫుడీస్.

భారత్ మరో కీలక మిసైల్ పరీక్ష సక్సెస్! 🚀
Science· 6 Aug 2026

భారత్ మరో కీలక మిసైల్ పరీక్ష సక్సెస్! 🚀

ఒడిశాలోని చాందీపూర్ నుంచి భారత్ ‘అగ్ని-IV’ బాలిస్టిక్ మిసైల్‌ను విజయవంతంగా పరీక్షించింది! 🚀🇮🇳 దాదాపు 4,000 కిలోమీటర్ల రేంజ్ కలిగిన ఈ మిసైల్‌కు సంబంధించిన ఆపరేషనల్, టెక్నికల్ సామర్థ్యాలను చెక్ చేసేందుకు ఈ ట్రయల్ నిర్వహించారు. పరీక్ష సమయంలో నిర్దేశించిన అన్ని లక్ష్యాలను మిసైల్ విజయవంతంగా చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. అగ్ని-IV భారత్‌కు చెందిన ఇంటర్మీడియట్-రేంజ్ బాలిస్టిక్ మిసైల్. దేశ రక్షణ సామర్థ్యాన్ని పరీక్షించడంలో ఈ ట్రయల్ మరో కీలక అడుగుగా నిలిచింది.

పశ్చిమాసియాలో టెన్షన్స్ వేళ బిగ్ అప్‌డేట్!
Politics· 6 Aug 2026

పశ్చిమాసియాలో టెన్షన్స్ వేళ బిగ్ అప్‌డేట్!

పశ్చిమాసియాలో టెన్షన్స్ పెరుగుతున్న టైమ్‌లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, భారత్ ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలు, వివిధ రంగాల్లో భాగస్వామ్యంపై చర్చించారు. దీనితో పాటు పశ్చిమాసియాలోని తాజా సిట్యుయేషన్‌పై కూడా ఇద్దరు లీడర్స్ డిస్కస్ చేసినట్లు ప్రధాని కార్యాలయం (PMO) వెల్లడించింది.

కస్టడీలోకి ట్రైనీ IPS ఆఫీసర్!
News· 6 Aug 2026

కస్టడీలోకి ట్రైనీ IPS ఆఫీసర్!

మహిళా ట్రైనీ IPS లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన ఉదయ్ కృష్ణారెడ్డిని ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో DCP లావణ్య నాయక్ పర్యవేక్షణలో CI జ్యోత్స్న విచారణ జరుపుతున్నారు. రేపు సాయంత్రం 5:30 గంటల వరకు కస్టడీ కొనసాగనుంది. గతనెల 28న అరెస్ట్ అయిన ఉదయ్ కృష్ణారెడ్డి నుంచి ఈ విచారణలో కీలక ఆధారాలు సేకరించాలని చూస్తున్నారు. కస్టడీలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉంది.

ఫ్రెండ్‌షిప్ డే రోజే ఘోరం!
Crime· 6 Aug 2026

ఫ్రెండ్‌షిప్ డే రోజే ఘోరం!

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఒక దారుణమైన ఇన్సిడెంట్ జరిగింది. పెళ్లి విషయంపై గొడవ జరగడంతో, ఫ్రెండ్‌షిప్ డే రోజే ఆశా డే (29) అనే యువతిని ఆమె ప్రియుడు కన్హాన్ నదిలోకి తోసేసి హత్య చేశాడు. ఘటన తర్వాత ఏమీ తెలియనట్లు నమ్మించే ప్రయత్నం చేసినా, పోలీసులు కేసును ఇన్వెస్టిగేట్ చేసి అసలు నిజం బయటపెట్టారు. నిందితుడు ఆశిష్ మాంపియాను అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

APలో 'దిశ బిల్లు' విత్‌డ్రా!
Politics· 6 Aug 2026

APలో 'దిశ బిల్లు' విత్‌డ్రా!

YCP హయాంలో తీసుకొచ్చిన దిశ బిల్లును విత్‌డ్రా చేసుకునేందుకు AP CM చంద్రబాబు నేతృత్వంలోని కేబినెట్ ఆమోదం తెలిపింది. మహిళల సేఫ్టీ కోసం 2019లో అప్పటి CM YS జగన్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా దిశ యాప్, పోలీస్ స్టేషన్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ఏర్పాటు చేశారు. ఈ యాప్ ద్వారా ఇప్పటివరకు 31,607 మందికి పోలీసులు రక్షణ కల్పించారు. అయితే, తాజాగా ఈ బిల్లును ఉపసంహరించుకునే ప్రతిపాదనకు మంత్రిమండలి ఓకే చెప్పింది.

Gen Zకి సపోర్ట్‌గా RSS చీఫ్ మోహన్ భగవత్ రెస్పాన్స్!
Politics· 6 Aug 2026

Gen Zకి సపోర్ట్‌గా RSS చీఫ్ మోహన్ భగవత్ రెస్పాన్స్!

NEET పేపర్ లీక్ ప్రోటెస్ట్స్‌పై RSS చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రొటెస్ట్ చేస్తున్న Gen Z యూత్‌ను 'యాంటీ నేషనల్స్' అనడం తప్పు అని.. వాళ్ల ప్రాబ్లెమ్స్ నిజమైనవని ముంబై ఈవెంట్‌లో స్పందించారు. ఇప్పటి Gen Z, Gen Alpha ప్రతీది క్వశ్చన్ చేస్తూ చాలా హానెస్ట్‌గా ఉన్నారని.. డెమోక్రసీలో ప్రొటెస్ట్ చేయడం కూడా కరెక్టే అని అన్నారు. సిస్టమ్‌లో ప్రాబ్లెమ్స్ ఉన్నప్పుడు క్వశ్చన్ చేయడం తప్పు కాదని, యూత్‌తో మాట్లాడి ప్రాబ్లెమ్స్ సాల్వ్ చేయాలని చెప్పారు.

నిద్రపోయే ముందు ఇవి అస్సలు మర్చిపోకండి!
Health· 6 Aug 2026

నిద్రపోయే ముందు ఇవి అస్సలు మర్చిపోకండి!

మంచి ఆరోగ్యం, ప్రశాంతమైన నిద్ర కావాలంటే రాత్రి పడుకోవడానికి ఒక అర గంట ముందే ఫోన్ పక్కన పెట్టాలని, అప్పుడే మంచి నిద్ర పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. తర్వాత కొన్ని నీళ్లు తాగితే బాడీ డీహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది. లైట్‌గా స్ట్రెచింగ్ చేయడం వల్ల రోజంతా ఉన్న అలసట తగ్గి బాడీ రిలాక్స్ అవుతుంది. రేపు పొద్దున్నే వేసుకునే బట్టలు, చేయాల్సిన పనులను ఇప్పటి నుంచే ప్లాన్ చేసి పెట్టుకుంటే ఉదయాన్నే టెన్షన్ ఉండదు. చివరిగా 7 నుండి 8 గంటలు హాయిగా నిద్రపోతే, మరుసటి రోజు ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉండవచ్చు.