స్థానిక ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా ఆదేశించారు. ఎన్నికలు ఎప్పుడైనా జరిగే అవకాశం ఉన్నందున అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని సూచించారు. విజయవాడలో జరిగిన సమీక్ష సమావేశంలో మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు పాల్గొన్నారు. మొత్తం 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఓటర్ల తుది జాబితా, పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై సన్నద్ధత కొనసాగుతోందన్నారు.



