Latest

AP, కర్ణాటకలో రేపే మోడీ టూర్?
రేపు ఆగస్ట్ 1న ప్రధాని నరేంద్ర మోడీ AP, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, రీసెర్చ్, కల్చర్ రంగాలకు చెందిన ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్‌లో ఆయన జాయిన్ కాబోతున్నారు. ట్రెడిషన్స్‌ని కాపాడుకుంటూనే, యూత్‌కి మంచి ఆపర్చ్యునిటీస్ క్రియేట్ చేయడానికి ఇవి హెల్ప్ అవుతాయని, 'వికసిత్ భారత్' వైపు ఇదొక బిగ్ స్టెప్ అని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

కమిషనర్‌ను వీలైనంత త్వరగా ట్రాస్ఫర్ చేయండి: హైకోర్టు
TG: హైడ్రాకు సంబంధించిన శాంతా శ్రీరామ్ కంపెనీ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన జరిగిందని, వివాదాస్పద భూమిలో హైడ్రా చేపట్టిన చర్యలు చట్టవిరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను వీలైనంత త్వరగా బదిలీ చేసి, ఆయన స్థానంలో మరో అధికారిని నియమించాలని సీఎస్‌ను హైకోర్టు ఆదేశించింది. చట్టబద్ధమైన పాలనే కొనసాగాలని, వ్యక్తుల పాలన కాదని గుర్తు చేసింది. వ్యక్తుల ఆధిపత్యం కొనసాగితే అది ప్రజాస్వామ్యానికి మరణశాసనంగా మారుతుందని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది.

F-47 ఫైటర్ జెట్‌కి గ్రీన్ సిగ్నల్
అమెరికా ఎయిర్ ఫోర్స్ అభివృద్ధి చేస్తున్న 6వ తరం F-47 ఫైటర్ జెట్ ప్రోగ్రామ్ కీలక దశలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం Engineering & Manufacturing Development (EMD) దశ ప్రారంభమైందని అధికారులు తెలిపారు. ఈ దశలో కొన్ని టెస్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు తయారు చేసి పరీక్షలు నిర్వహించనున్నారు. తొలి F-47 2028లో ఆకాశంలోకి ఎగరనుందని ఎయిర్ ఫోర్స్ వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న F-22 Raptor స్థానంలో కనీసం 185 F-47 జెట్లు కొనుగోలు చేయాలని అమెరికా ప్లాన్ వేసింది.

తల్లిపాలు: అమృతంతో సమానం..
తల్లిపాలు పట్టడం బిడ్డలకు, తల్లులకు ఎంతో ఆరోగ్యదాయకం, అలాగే ప్రాణ రక్షణ అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ (WHO)తెలిపింది. బిడ్డ పుట్టిన మొదటి 6 నెలల పాటు శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను తల్లిపాలు అందిస్తాయి. విరోచనాలు, న్యూమోనియా వంటి తీవ్రమైన వ్యాధుల నుండి కాపాడే శక్తివంతమైన ప్రోటీన్లు వీటిలో ఉంటాయి. తల్లిపాలు తాగిన పిల్లల్లో ఊబకాయం, దీర్ఘకాలిక రోగాలు వచ్చే ప్రమాదం తగ్గడమే కాకుండా వారు ఐక్యూ పరీక్షల్లోనూ, తెలివితేటల్లోనూ మెరుగ్గా ఉంటారు.

మొరాకో నుంచి వేలాది మంది జనం..ఎందుకంటే!
ఒకేసారి మన ఊరికి వందలమంది వలసదారులు వస్తే ఎలా ఉంటుంది? ప్రస్తుతం అలాంటి పరిస్థితిలోనే ఉంది ఉత్తర ఆఫ్రికా ఎన్‌క్లేవ్ అయిన సియుటా. మొరాకో నుంచి వేలాది మంది ఇక్కడికి వస్తున్నారు. ఆర్థిక, రాజకీయ సంక్షోభాల కారణంగా మొరాకోను విడిచి, సముద్రంలో ఈదుతూ సరిహద్దు దాటి వస్తున్నారు. ఒక్క రోజులో పెద్ద సంఖ్యలో జనం రావడంతో రిసెప్షన్ సెంటర్లు నిండిపోయాయి. వందలాది మంది వీధుల్లో, పార్కుల్లో నిద్రపోయారు. స్పెయిన్ మొరాకో మధ్య సియుటా-మెలిల్లా ఎన్‌క్లేవ్‌లు, పశ్చిమ సహారా లాంటి అంశాలు ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి.

కన్న కూతురిపై తండ్రి దారుణం
TG: వికారాబాద్ జిల్లాలో కన్న తండ్రే దారుణానికి ఒడిగట్టాడు. 9వ తరగతి చదువుతున్న తన కూతురిపై అత్యాచారం చేశాడు. ఫోన్‌లో అసభ్యకరమైన వీడియోలు చూపిస్తూ కొంతకాలంగా ఈ అరాచకానికి పాల్పడుతున్నాడు. అమ్మాయి స్కూల్‌లో ఇబ్బంది పడుతుండటంతో టీచర్లు అనుమానం వచ్చి ఆరా తీయగా అసలు విషయం బయటపడటంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు నిందితుడిని పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు.
CM విజయ్‌తో మీటింగ్ క్యాన్సిల్- కర్ణాటక CM
తమిళనాడుకు కావేరి నీటిని విడుదల చేయాలన్న CWMI ఆదేశాలపై కర్ణాటకలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆగస్టు 3న జరగాల్సిన మీటింగ్ ని వాయిదా వేసుకోవాలని తమిళనాడు CM విజయ్‌ని DK శివకుమార్ కోరారు. ఇరు రాష్ట్రాల మధ్య శాంతియుత వాతావరణం ఏర్పడ్డాకే సమన్వయంతో చర్చలు జరుపుతామని తెలిపారు. చట్టాన్ని గౌరవిస్తూ రాష్ట్రంలో ఎలాంటి బంద్‌లు నిర్వహించవద్దని, శాంతిభద్రతలను కాపాడాలని ఈ సందర్భంగా DK శివకుమార్ విజ్ఞప్తి చేశారు.

'సర్దార్ 2' రిలీజ్ డేట్‌పై సందేహాలకు చెక్..
కోలీవుడ్ స్టార్ కార్తీ హీరోగా పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ స్పై థ్రిల్లర్ 'సర్దార్ 2'. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 10న విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఇటీవల విడుదల చేసిన కొత్త పోస్టర్‌లో తేదీ ప్రస్తావించకపోవడంతో సినిమా వాయిదా పడుతోందనే ప్రచారం జరిగింది. ఎలాంటి మార్పూ లేదని స్పష్టం చేస్తూ, త్వరలోనే అప్‌డేట్‌తో రాబోతున్నట్లు చిత్రబృందం తెలిపింది. దీంతో రిలీజ్ డేట్‌పై ఉన్న సందేహాలన్నింటికీ పుల్‌స్టాప్ పడింది.

తెలంగాణ SIRలో 40 లక్షల ఓట్లు మిస్?
TG: తెలంగాణలో జరుగుతున్న SIR ప్రక్రియలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 40 లక్షల ఓట్లను అన్‌కలెక్టబుల్ ఓట్లుగా గుర్తించామని అధికారులు తెలిపారు. వాటిని ఓటర్ల లిస్ట్ నుంచి తొలగించే ప్రక్రియపై ఎన్నికల అధికారులు కసరత్తు చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 76.72 శాతం మంది ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ పూర్తైనట్లు అధికారులు తెలిపారు. దీంతో ఈ అంశంపై రాజకీయ పార్టీలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి.
'పైసా నక్కో' రూట్ మార్చిన నకిలీ పోలీస్!
తెలంగాణ బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద లారీ డ్రైవర్‌ను నకిలీ పోలీసులు రూ.200 లంచం డిమాండ్ చేశారు. దానికి భయపడకుండా ఆ డ్రైవర్ తన స్మార్ట్‌ఫోన్‌తో స్పాట్‌లోనే రికార్డింగ్ స్టార్ట్ చేశాడు. సదరు వ్యక్తులకు కనీసం నేమ్‌ప్లేట్ కూడా లేకపోవడాన్ని పాయింట్ అవుట్ చేస్తూ, లంచం ఎందుకు ఇవ్వాలని గట్టిగా నిలదీశాడు. సీన్ రివర్స్ అవ్వడంతో షాక్ తిన్న ఆ వ్యక్తులు 'పైసా నక్కో' అంటూ మాట మార్చేశారు. హైవేలపై ఇలా ఐడీ కార్డ్, నేమ్‌ప్లేట్ లేకుండా మిమ్మల్ని ఎవరైనా ఆపి మనీ డిమాండ్ చేస్తే నకిలీ పోలీసులు కావచ్చు, అలర్ట్ గా ఉండండి.

"రాహుల్ చెప్పిందే చెప్పాలి!": BJP MP
"రాజకీయాల్లో స్క్రిప్ట్ మారొచ్చు.. కానీ బ్యాక్‌స్టోరీ మారదేమో!" అన్నట్టుగా BJP MP నిశికాంత్ దూబే చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తనకు చాలా ఏళ్ల నాటి ఫ్రెండ్ అని, ఇద్దరూ కలిసి ఒకప్పుడు RSS, ABVP కోసం పనిచేశామని చెప్పారు. "రేవంత్ రెడ్డి మైండ్‌సెట్ బాగుంటుంది. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పిందే చెప్పాల్సిన పరిస్థితి" అంటూ కామెంట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో "రాజకీయాల్లో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఉంటారా.. లేక పర్మనెంట్ పార్టీలా?" అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
కేంద్ర కేబినెట్ ఇవాళ సమావేశమైంది. ప్రధాని సూర్య సరోవర్ యోజనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నీటిపై ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్స్, ఇంధన నిల్వ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన పథకం ఇది. ఈ పథకం కోసం రూ.5070 కోట్లు కేటాయిస్తారు. దీనిద్వారా ఐదేళ్లలో 5 వేల మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతోపాటు ఖేలో ఇండియా పథకానికి రూ.29 వేల కోట్లు కేటాయించనున్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ఐదేళ్లకు పొడిగించి, దానికి రూ.3,15,614 కోట్లు కేటాయించారు.

ఏపీ-తెలంగాణకు కొత్త రైల్వే లైన్
ఆంధ్రప్రదేశ్‌లోని మాచర్ల నుంచి తెలంగాణలోని గద్వాల్ వరకు కొత్త రైల్వే లైన్ కోసం కేంద్ర రైల్వే శాఖ సర్వే సిద్ధం చేసింది. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా ఆరు కొత్త రైల్వే లైన్లలో ఇది ఒకటి. ఈ మార్గం ఏర్పడితే తెలంగాణ, కర్ణాటక నుంచి ఏపీ పోర్టులకు సరుకు రవాణా వేగవంతం కానుంది. దీంతో పాటు పల్నాడు, నాగార్జునసాగర్ ప్రాంతాలకు రైలు కనెక్టివిటీ పెరగనుంది.
రోడ్డు పక్కన పానీపూరీ తింటున్నారా?
TG : హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎలాంటి బోర్డు లేకుండా రహస్యంగా నిర్వహిస్తున్న ఒక ఫుడ్ సెంటర్ లో తీవ్ర అపరిశుభ్ర పరిస్థితుల్లో భారీగా పానీపూరీలు, సమోసాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. వీటిని నగరంలోని వివిధ రోడ్డు పక్కన ఉండే బండ్లకు సరఫరా చేస్తున్న ఈ అక్రమ తయారీ పై అధికారులు, కఠిన చర్యలు చేపట్టారు. రోడ్డు పక్కన దొరికే ఆహారం పట్ల ప్రజలు జాగ్రత్త వహించాలని సూచించారు.

పెళ్లి వద్దన్న గాయని జమునారాణి..రీజన్ అదేనా?
ఇవాళ మరణించిన సీనియర్ గాయని జమునారాణికి ఆమె అభిమానులు, కళాకారులు నివాళి అర్పిస్తున్నారు. ఐదు భాషల్లో సుమారు 6 వేలకు పైగా పాటలు పాడారామె. జీవితాంతం అవివాహితగానే ఉన్నారు. అందుకు కారణాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె వివరించారు. తోటి గాయనీమణుల వైవాహిక జీవితాలు, వారి కష్టాలు చూడటం వల్లనే ఆమె వివాహానికి దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.

వెండితెరపైకి బాలయ్య చిన్న కుమార్తె !
నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని త్వరలోనే నటిగా వెండితెరకు పరిచయం కాబోతున్నారనే వార్త సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేపుతోంది. కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా, యువతకు స్ఫూర్తినిచ్చే ఒక ప్రయోగాత్మక స్పోర్ట్స్ డ్రామా కథతో ఆమె ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆహా 'అన్‌స్టాపబుల్' టాక్ షోకి క్రియేటివ్ హెడ్‌గా, పలు సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన ఆమె, కెమెరా ముందుకు రాబోతున్నారనే ప్రచారంతో నందమూరి అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

విద్యార్థుల అడ్మిషన్లపై SIR ఎఫెక్ట్ : RS ప్రవీణ్ కుమార్
TG : EAPCET, NEET, CPGET కోర్సుల్లో అడ్మిషన్ల కౌన్సెలింగ్ కోసం కులం, ఆదాయం, నివాస ధృవీకరణ పత్రాలను సమర్పించడంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ అన్నారు. స్థానిక మండల రెవెన్యూ అధికారులు SIR ప్రక్రియలో బిజీగా ఉన్నామని సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దీనివల్ల విద్యార్థులు అడ్మిషన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోల్పోయే ప్రమాదం ఉందని, వెంటనే సర్టిఫికెట్లు జారీ చేయాలని ‘ఎక్స్’లో రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీని డిమాండ్ చేశారు.

భార్య పాయల్‌తో CM ఒమర్ అబ్దుల్లా విడాకులు
జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, అతని భార్య పాయల్‌కు సుప్రీంకోర్టు విడాకులు ఇచ్చింది. వీళ్లిద్దరూ తమ ఇష్టంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నారు. 1994లో వీరికి పెళ్లి కాగా, 2011 నుంచి వేరుగా ఉంటున్నారు. 2016లో ఒమర్ విడాకుల కోసం అడగగా ఫ్యామిలీ కోర్టు, ఢిల్లీ హైకోర్టు ఒప్పుకోలేదు. దీంతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఇద్దరూ మాట్లాడుకుని విడిపోవాలని నిర్ణయించుకోవడంతో కోర్టు వారికి విడాకులు ఇస్తామంది.

రేపే భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభం
AP: రేపు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌ను పీఎం నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏవియేషన్ మినిస్టర్ కింజరాపు రామ్మోహన్ నాయుడుతో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభంతో ఉత్తరాంధ్రలో పారిశ్రామిక, పర్యాటక, వాణిజ్య రంగాలకు కొత్త ఊపు లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

రేషన్ కార్డు KYC పేరుతో వసూళ్లు
హైదరాబాద్ LBనగర్ నియోజకవర్గంలోని నాగోల్ డివిజన్ జైపురి కాలనీలో రేషన్ కార్డుల KYC పేరుతో కొందరు ఒక్కొక్కరి నుంచి రూ.200 వసూలు చేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. ప్రభుత్వం కేవైసీ ప్రక్రియను పూర్తిగా ఉచితంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, వాటిని పట్టించుకోకుండా డబ్బులు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బు చెల్లించిన తర్వాతే కేవైసీ పూర్తి చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు వెంటనే విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

‘రామాయణ’లో సాయి పల్లవి పై బాలీవుడ్ ట్రోల్స్!
‘రామాయణ’ చిత్రంలో సీత పాత్ర పోషిస్తున్న సాయి పల్లవిపై కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. ‘ఆదిపురుష్’లో కృతి సనన్ సీతగా మెరుగ్గా నటించిందని, ఈ పాత్రకు ఆమే సెట్ అవుతుందని కామెంట్లు చేస్తున్నారు. దీనిపై ప్రాంతీయ దురభిమానంతోనే సాయి పల్లవిని టార్గెట్ చేస్తున్నారని, ఆమె అద్భుతమైన నటనను తక్కువ చేసి మాట్లాడటం సరికాదని సౌత్ ఫ్యాన్స్ అంటున్నారు. ప్రస్తుతం ఈ వివాదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.