Latest

కంకర రాళ్లకు బంగారు పూతతో మోసం
TG: నిజామాబాద్ హమాల్‌వాడీకి చెందిన రమేష్ దగ్గర శ్రీనివాస్ రూ.1.30 లక్షలు అప్పు తీసుకున్నాడు. డబ్బులు తిరిగి ఇవ్వాలని రమేష్ అడగడంతో, తనకు గుప్తనిధులు దొరికాయని శ్రీనివాస్ నమ్మించాడు. అప్పు కింద బంగారు రాళ్లు ఇస్తానని చెప్పి 'డిచ్‌పల్లి' దగ్గర ఉన్న ఘన్‌పూర్‌కు పిలిపించాడు. పైగా అదనంగా మరో రూ.32 వేలుతీసుకొని నాలుగు కుండల్లో నాలుగు రాళ్లు ఇచ్చాడు. తరువాత రమేష్ వాటిని చూసి అవి బంగారు రంగు వేసిన కంకర రాళ్లు అని గుర్తించాడు. తాను మోసపోయానని గ్రహించి డిచ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఒలెక్ట్రా గ్రాండ్ మైలురాయి: 4,000 చేరుకున్న ఎలక్ట్రిక్ బస్సు
భారతీయ ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ (OGL) చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. వివిధ రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థలకు అందించిన ఎలక్ట్రిక్-బస్సుల సంఖ్య 4,000కు చేరింది. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్‌కు 4,000వ బస్సును అందజేయడంతో ఈ ఘనత సాధ్యమైంది. హెచ్‌ఆర్‌టీసీకి ఒలెక్ట్రా మొత్తం 297 బస్సులను సరఫరా చేసింది.ఈ 4,000 ఎలక్ట్రిక్ బస్సులు ఇప్పటివరకు 73 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించి, 6.5 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించింది.

ఏపీలో SIR ముసాయిదా ఓటర్ల లిస్ట్ విడుదల
AP: ఆంధ్రప్రదేశ్‌లో SIR ముసాయిదా ఓటర్ల లిస్ట్‌ను విడుదల చేసినట్లు రాష్ట్ర CEO వివేక్ యాదవ్ వెల్లడించారు. ఎన్యూమరేషన్ ఫామ్స్‌ను సమర్పించిన 3.71 కోట్ల మంది వివరాలను ముసాయిదా లిస్ట్‌లో చేర్చినట్లు తెలిపారు. ఇందులో 15.22 లక్షల మంది మరణించినట్లు, రెండు చోట్ల నమోదైన 7.37 లక్షల ఓట్లను గుర్తించామని చెప్పారు. ఆగస్టు 30 వరకు అభ్యంతరాలుంటే స్వీకరిస్తామని, అర్హులైన వారు <a href="https://www.ceodelhi.gov.in/WriteReadData/userfiles/file/Forms/FORM6.pdf">ఫామ్-6</a> ద్వారా ఓటరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించారు. అక్టోబర్ 3న చివరి ఓటర్ల లిస్ట్‌ను విడుదల చేస్తామని సీఈవో స్పష్టం చేశారు.

వాగులోకి దూసుకెళ్లిన సిలిండర్ల లారీ
AP: నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం తెడ్డుపాడు వద్ద నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖాళీ గ్యాస్ సిలిండర్లతో కడప వైపు వెళ్తున్న లారీ అదుపుతప్పి పిల్లాపేరు వాగులోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో లారీలో ఉన్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా, స్థానికులు వెంటనే వారిని అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించారు. సిలిండర్లు చెల్లాచెదురుగా పడిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

నిరసనల తర్వాత మహిళలకు ఆన్‌లైన్ బెదిరింపులు
ఇటీవల రోజుల్లో నిరసనల్లో పాల్గొన్న మహిళలను సోషల్ మీడియాలో కొందరు తీవ్రంగా బెదిరిస్తున్నారు. ప్రధానిని తిట్టారని ఒక మహిళ పేరు, ఊరు వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టారు. అలాగే జంతర్ మంతర్ దగ్గర వీడియో తీసిన ఒక 23ఏళ్ల స్టూడెంట్ ఆవీడియో సోషల్ మీడియాలో పెట్టి డిలీట్ చేసి క్షమాపణలు చెప్పినా, ఆమెను చంపేస్తామని బెదిరిస్తున్నారు. కొన్ని సోషల్ మీడియా అకౌంట్లు పనికట్టుకుని మహిళల లొకేషన్లు, అడ్రస్‌లు, ఫోన్ నంబర్లు బయటపెడుతూ వారిని భయపెడుతున్నాయి.
తెలంగాణ నయాగరా ఉగ్రరూపం
TG: భారీ వర్షాలతో ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని ప్రసిద్ధ కుంటాల జలపాతం జలకళను సంతరించుకుని ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరడంతో జలపాతం మరింత ఉగ్రరూపం దాల్చింది. ప్రకృతి అందాలను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నప్పటికీ, నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయిలో ఉండటంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమై తాత్కాలికంగా సందర్శనను నిలిపివేసినట్లు తెలిపారు. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు పర్యాటకులు కుంటాల జలపాతం వైపు రావద్దని సూచించారు.

Situationship Vs Relationship
"మేము రిలేషన్‌లో లేం... కానీ రోజూ గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, కాల్స్, డేట్స్, పోజెసివ్ ఫైట్స్ అన్నీ ఉంటాయి!" ఇదే ఇప్పుడు Gen Zలో ఫుల్ ట్రెండ్ అవుతున్న Situationship. అంటే రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టే ఉంటారు... కానీ "నువ్వు నా గర్ల్‌ఫ్రెండ్/బాయ్‌ఫ్రెండ్ కదా?" అంటే వెంటనే "లేబుల్స్ ఎందుకు బ్రో?" అంటారు. 😭 సింపుల్‌గా చెప్పాలంటే, Relationship అంటే Love + Commitment ❤️, Situationship అంటే Love + Confusion + Unlimited Overthinking + "మనం అసలు ఏమిటి?" అనే డైలీ డౌట్! OTP రావడం ఈజీ Commitment రావడం కష్టం! 🤡

కన్నీళ్లు పెట్టిస్తున్న నటుడి పరిస్థితి!
ఒకప్పుడు మలయాళ చిత్రసీమలో హీరో, దర్శకుడు, నిర్మాత, రచయితగా గుర్తింపు పొందిన 'మోహన్ శర్మ'. ఇప్పుడు ఆయనకు 70 సంవత్సరాలు చెన్నై సమీపంలోని గుమ్మిడిపూండి వృద్ధాశ్రమంలో జీవిస్తున్నారు. కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు ఆయనను ఒంటరిని చేశాయి. జీవితాంతం మందులు అవసరమైన పరిస్థితిలో ఉన్న ఆయనకు వాటిని కొనుగోలు చేసే స్థోమత కూడా లేదు. తాను నిర్మించి, దర్శకత్వం వహించిన 'గ్రామం' చిత్ర శాటిలైట్ హక్కులు అమ్ముడైతే వచ్చే డబ్బుతో వైద్య ఖర్చులు భరిస్తానని ఆశిస్తూ సహాయం కోరుతున్నారు.
నేతకు వీడ్కోలు.. నర్సంపేటలో జనవెల్లువ
తెలంగాణ ఉద్యమ నేత, నర్సంపేట మాజీ MLA <a href="https://www.theclearcutnews.com/n/XCo6KYd">పెద్ది సుదర్శన్ రెడ్డి</a>కి అంతిమ వీడ్కోలు పలికేందుకు వేలాది మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు నర్సంపేటకు తరలివచ్చారు. ఆయన భౌతికకాయాన్ని చివరిసారి చూసేందుకు పెద్దఎత్తున జనం రావడంతో పట్టణమంతా శోకసంద్రంగా మారింది. ప్రధాన రహదారులన్నీ జనంతో నిండిపోవడంతో రెండు కిలోమీటర్లకు పైగా ట్రాఫిక్ స్తంభించింది. అభిమాన నేతకు కన్నీటి వీడ్కోలు పలుకుతూ ప్రజలు భావోద్వేగానికి గురయ్యారు. నాయకులు, కార్యకర్తలు ఆయన సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు.

విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలొద్దు
TG: ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీసీ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు, నాయకులు నిరసన చేపట్టారు. బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపు మేరకు నిర్వహించిన ఈ ధర్నాలో, సుమారు 14 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన రూ.8వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. బకాయిలు విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

టిఫిన్ బండి వ్యాపారిపై కేసు.. సోషల్ మీడియాలో చర్చ
TG: హైదరాబాద్‌లో అర్ధరాత్రి టిఫిన్ బండి నిర్వహిస్తున్న చిరు వ్యాపారిపై మల్కాజిగిరి పోలీసులు కేసు పెట్టారు. దీనికి రెండు రోజుల నార్మల్ జైలు శిక్షతో పాటు రూ.50 ఫైన్ కూడా వేశారు. ఈ వివరాలను మల్కాజిగిరి పోలీసులు తమ ఆఫీసియల్ 'X' అకౌంట్లో పోస్టు చేశారు. ఆ పోస్టుపై నెటిజన్ల నుంచి నెగటివ్ రెస్పాన్స్ రావడంతో పోస్టు డిలీట్ చేశారు. అప్పటికే ఆ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు పోలీసుల పనిని సమర్దించగా, మరికొందరు ఆ వ్యాపారిపై ఈ శిక్ష అవసరమా అని ప్రశ్నిస్తున్నారు.

20 ఏళ్ల తర్వాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్
బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ రెండు దశాబ్దాల తర్వాత కోల్‌కతాకు వచ్చారు. రవీంద్ర సదన్‌లో మత ఛాందసవాదానికి వ్యతిరేకంగా జరిగే కార్యక్రమంలో ఆమె పాల్గొననున్నారు. వివాదాస్పద పుస్తకం ‘ద్విఖండితో’పై జరిగిన నిరసనల కారణంగా 2007లో ఆమె నగరాన్ని విడిచి వెళ్లవలసి వచ్చింది. ఆమె కోల్‌కతాలో బహిరంగంగా కనిపించడం ఇదే మొదటిసారి. మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందనే ఆరోపణలతో 2003లో అప్పటి సీపీఎం నేతృత్వంలోని బెంగాల్ ప్రభుత్వం ఆమె పుస్తకాన్ని నిషేధించింది. 63 ఏళ్ల ఆమె ప్రస్తుతం దిల్లీలో ఉంటున్నారు.
చాలా రోజుల గ్యాప్ తర్వాత లడఖ్ లో సోనమ్ వాంగ్‌చుక్..
సోనమ్ వాంగ్‌చుక్ మళ్లీ తన SECMOL క్యాంపస్‌కి తిరిగొచ్చారు. చాలా రోజుల గ్యాప్ తర్వాత క్యాంపస్‌కి వచ్చిన ఆయనకు స్టూడెంట్స్, స్టాఫ్ అందరూ కలసి లడఖ్ ట్రెడిషనల్ తెల్లని శాలువాలతో చాలా ఆత్మీయంగా, గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పారు. స్టూడెంట్స్ అందరూ ఆయనను హగ్ చేసుకుంటూ వెల్‌కమ్ చెప్పిన ఈ క్యూట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
నా మాటలు నచ్చకపోతే మీ ఇష్టం- కంగనా రనౌత్
తనపై వస్తున్న విమర్శలపై BJP MP కంగనా రనౌత్ స్పందించారు. తనకు సక్సెస్, సమాజంలో హోదా, పేరు తెచ్చిపెట్టిన విషయాలనే అందరికీ చెబుతానని కామెంట్స్ చేశారు. సొంత ఇంట్లో పిల్లలకు ఒకలా, బయటి పిల్లలకు ఇంకోలా చెప్పే డబుల్ స్టాండర్డ్స్ తనకు ఉండవన్నారు. ఈ ప్రిన్సిపల్స్ నచ్చితే ఫాలో అవ్వొచ్చని, లేదంటే ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చంటూ ఆమె ఆన్సర్ ఇచ్చారు. రీసెంట్గా Gen Z ని మురికివారు అనడంతో CJP ప్రతినిధి సౌరవ్ దాస్, ఆమెని సొంత పార్టీనే పట్టించుకోదు అన్నాడు. దీంతో కంగనా ట్రోల్ అవుతున్నారు.

ఫ్రెండ్‌ను ఇరికించబోయి బుక్కయ్యాడు
TG: కరీంనగర్‌లో కానిస్టేబుల్ అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈగల్ విభాగానికి చెందిన కానిస్టేబుల్ నాగరాజు తన ఫ్రెండ్‌ను అక్రమ కేసులో ఇరికించేందుకు అతడి ఇంట్లో గంజాయి ప్యాకెట్లు ఉంచి పోలీసులతో దాడులు చేయించాడు. అయితే విచారణలో అనుమానాలు తలెత్తడంతో పోలీసులు CCTV దృశ్యాలు, ఇతర ఆధారాలను పరిశీలించగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. గంజాయిని స్వయంగా నాగరాజే ఇంట్లో ఉంచినట్లు నిర్ధారణ కావడంతో ఆయనను సస్పెండ్ చేశారు.
లక్నో-కాన్పూర్ ఎక్స్‌ప్రెస్‌వే వివాదం
రూ.4,200 కోట్లతో నిర్మించిన రోడ్డును లక్నో-కాన్పూర్ ఎక్స్‌ప్రెస్‌వేను జూలై 13న ప్రారంభించారు. కొద్ది రోజుల్లోనే దెబ్బతినడం వివాదంగా మారింది. దీంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేశాయి. రోడ్డు పాడైపోలేదని, పైపొర మాత్రమే దెబ్బతిందని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) స్పష్టం చేసింది. దెబ్బతిన్న ప్రాంతాన్ని పునరుద్ధరించామని, రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయని పేర్కొంది.
సినిమా కోసం మనీషా కొయిరాలా కష్టాలు!
బాలీవుడ్ యాక్ట్రెస్ మనీషా కొయిరాలా తన ఫిట్‌నెస్ సీక్రెట్స్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. నెక్స్ట్ సినిమా కోసం ఫిట్‌గా అవ్వాలని ఎంత డైట్ చేసి వర్కౌట్స్ చేసినా వెయిట్ తగ్గకపోవడంతో చాలా ఏడ్చేశానని చెప్పారు. వెయిట్ మిషన్ తప్పు చూపిస్తుందేమో అని కొత్తది కొన్నా సేమ్ రిజల్ట్ వచ్చిందని అన్నారు. ఏజ్ పెరిగేకొద్దీ బాడీ చేంజ్ అవుతుందని రియలైజ్ అయి, డాక్టర్స్ సలహాతో తన రూట్ మార్చుకుని 4 నెలల్లో రిజల్ట్ చూశానని తన ఎక్స్‌పీరియన్స్ పోస్ట్ చేశారు.

రాపిడో డ్రైవర్‌కు డబ్బులు ఎగ్గొట్టిన మహిళ
రాపిడో బైక్ టాక్సీలో వచ్చిన ఒక మహిళ డబ్బులు ఇవ్వకుండా దిల్లీ 'సాకేత్ కోర్టు'లోకి వెళ్లిపోయింది. వెంటనే అక్కడి సెక్యూరిటీ ఆమెను ఆపారు. భరణం కేసుకు సంబంధించి ఆమె కోర్టుకు వచ్చినట్లు సమాచారం. డబ్బుల విషయంలో డ్రైవర్ తో గొడవ జరగడంతో సెక్యూరిటీ సిబ్బంది ఆమెను పట్టుకున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆమె మీద ఎవరైనా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారా లేదా అనేది కూడా ఇంకా తెలియలేదు.
ఈ వైరల్ వీడియో వెనుక ఉన్న కథ తెలిస్తే బాధేస్తుంది!
అందరూ దాడినే చూశారు.. కానీ ఈ బాలుడి కథ ఎవరూ చూడలేదు. తల్లిని కోల్పోయిన బాధ ఓ బాలుడిని ఇలా మార్చేసిందా? మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో 14 ఏళ్ల బాలుడు వృద్ధ మహిళలపై కర్రతో దాడి చేసిన వీడియో వైరల్ కావడంతో అధికారులు ఇంక్వైరీ మొదలుపెట్టారు. బాలుడి తల్లి తీవ్ర కాలిన గాయాలతో ఈ వృద్ధాశ్రమంలో చేరి కొద్ది రోజులకే మరణించగా, అప్పటి నుంచి అతడు అక్కడే ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. అతడి మెంటల్ కండిషన్ బాగోలేదని అధికారులు చెబుతున్నారు. కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాత అతడిని బాలల సంరక్షణ కేంద్రానికి తరలించనున్నారు.

హైదరాబాద్ మెట్రో LOAN విషయంలో బిగ్ ట్విస్ట్
TG: హైదరాబాద్ మెట్రోకు ఊహించని షాక్ తగిలింది. మెట్రో ఫేస్-1 టేకోవర్ లోన్‌పై IRFC (Indian Railway Finance Corporation) వెనక్కి తగ్గింది. లోన్ విడుదల చేయలేమని రాష్ట్రానికి సమాచారం ఇచ్చింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం సీఎస్ సంజయ్ జాజు అధ్యక్షతన అత్యవసర సమావేశం నిర్వహించింది. ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది. ఈ పరిణామాలతో మెట్రో నిర్మాణం ముందుకు సాగుతుందా, లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

వర్షాల్లో ఈ మిస్టేక్స్ చేయకండి!
వర్షాకాలంలో భారీ వర్షాలు, గాలుల వల్ల కరెంట్ యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. అందుకే అందరూ కొన్ని సేఫ్టీ రూల్స్ ఫాలో అవ్వాలని విద్యుత్ అధికారులు చెప్తున్నారు. వర్షం పడేటప్పుడు తడిసిన కరెంట్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, వేలాడే వైర్లకు దూరంగా ఉండాలి. తడి చేతులతో స్విచ్‌లు, ఫోన్ ఛార్జర్లు ముట్టుకోవద్దు. ప్లాస్టిక్ వైర్లకే బట్టలు ఆరేయాలి. ఏమైనా ఎమర్జెన్సీ లేదా కరెంట్ ప్రాబ్లమ్ ఉంటే వెంటనే 1912 టోల్ ఫ్రీ నంబర్‌కి కాల్ చేయొచ్చు.