అదిరిపోయే హంగులతో భోగాపురం ఎయిర్ పోర్టు !

విశాఖ లోని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు అత్యాధునిక మౌలిక వసతులు ప్రత్యేకమైన ఆర్కిటెక్చర్‌తో అట్రాక్టివ్ గా రూపొందింది. సుమారు 2,700 ఎకరాల భారీ విస్తీర్ణంలో, రూ. 4,727 కోట్ల అంచనా వ్యయంతో తయారైన ఈఎయిర్ పోర్టు కంటికి ఇంపుగా ఉండే ‘ఫ్లయింగ్ ఫిష్’ (ఎగిరే చేప) ఆకారంలో డిజైన్ చేశారు. తీరప్రాంతం కావడంతో గంటకు 275 కిలోమీటర్ల వేగంతో వీచే బలమైన తుఫాను గాలులను సైతం తట్టుకునేలా దీని నిర్మాణాన్ని చేపట్టారు. ఈ ఎయిర్‌పోర్ట్‌లో 3,800 మీటర్ల పొడవైన రన్ వేతో పాటు మోడ్రన్ ATC టవర్ కూడా ఉంది.



