Latest

యూరియా యాప్ పై అవగాహన లేక రైతుల అవస్థలు
Local· 5d ago

యూరియా యాప్ పై అవగాహన లేక రైతుల అవస్థలు

నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలో గ్రామాల్లో యూరియా ఎరువు కోసం రైతుల ఇబ్బందులు కొనసాగుతున్నాయి. వ్యవసాయ అధికారులు వ్యవసాయ గ్రూపుల్లో యూరియా యాప్‌పై సమాచారం, సూచనలు పంపుతున్నప్పటికీ, రైతులకు యాప్‌పై పూర్తి అవగాహన లేకపోవడంతో యూరియా పొందడంలో అయోమయం నెలకొంది. పంట సీజన్‌ మధ్య దశకు చేరుకున్నా సమస్యలు తప్పడం లేదని రైతులు వాపోతున్నారు. యూరియా వినియోగం, యాప్‌ నమోదు, సరఫరా విధానంపై గ్రామస్థాయిలో రైతులకు ప్రత్యక్షంగా వివరించడానికి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని రైతులు వ్యవసాయ అధికారులను కోరుతున్నారు.

సెప్టెంబర్ 5న ఢిల్లీలో నిరసనలు లేవు: సౌరవ్ దాస్
Current Affairs· 5d ago

సెప్టెంబర్ 5న ఢిల్లీలో నిరసనలు లేవు: సౌరవ్ దాస్

సెప్టెంబర్ 5న ఢిల్లీలో చేయాలనుకున్న నిరసన కార్యక్రమాన్ని విత్‌డ్రా చేసుకుంటున్నట్టు సుప్రీంకోర్టులో CJPనేత సౌరవ్ దాస్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిరసనకారులపై పెట్టిన కేసులను విత్‌డ్రా చర్యలు తీసుకుంటున్నందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఢిల్లీ పోలీసులు, బీహార్, అస్సాం, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర రాష్ట్రాలు విద్యార్థుల నిరసనలకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయాలని దరఖాస్తులు పెట్టాయని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు వివరించారు. దీంతో సెప్టెంబర్ 5 నిరసనను CJP రద్దు చేసింది.

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టులో రిలీఫ్!
TG· 5d ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టులో రిలీఫ్!

TG: శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్ కేసులో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో రిలీఫ్ లభించింది. ఆయనను పదవి నుంచి మార్చాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్‌ను డివిజన్ బెంచ్ టెంపరరీగా సస్పెండ్ చేసింది. కేసుపై తదుపరి విచారణను నవంబర్ 3కి పోస్ట్‌పోన్ చేసింది. అప్పటి వరకు రంగనాథ్‌ను మార్చాల్సిన అవసరం లేదని కోర్టు క్లారిటీ ఇచ్చింది. అయితే నెక్స్ట్ హియరింగ్‌లో ఆదేశాలు వచ్చే వరకు లోతుకుంటా భూముల జోలికి వెళ్లొద్దని హైకోర్టు ఆదేశించింది.

ఆ ఒక్క మీటింగ్… టిమ్ కుక్ లైఫ్‌నే మార్చేసింది! 🔥
Technology· 5d ago

ఆ ఒక్క మీటింగ్… టిమ్ కుక్ లైఫ్‌నే మార్చేసింది! 🔥

యాపిల్ కంపెనీ అంటే ముందు గుర్తొచ్చే పేరు స్టీవ్ జాబ్స్. ఆ తర్వాత గుర్తొచ్చే పేరు టిమ్ కుక్. అయితే ఆయన ఆ కంపెనీలో చేరడానికి ముందు ‘నో’ చెప్పారన్న విషయం తెలుసా? 1998లో కాంపాక్‌లో మంచి జాబ్‌లో ఉన్న టిమ్ కుక్‌కి, దివాలా తీసే స్టేజ్‌లో ఉన్న యాపిల్ నుండి ఆఫర్ వచ్చింది. ముందు "నో" చెప్పినా, స్టీవ్ జాబ్స్‌ని మీట్ అయ్యాక ఆయన విజన్ నచ్చింది. రిస్క్ తీసుకుని యాపిల్‌లో జాయిన్ అయ్యారు. కట్ చేస్తే, అదే యాపిల్‌ని వరల్డ్ నంబర్ 1 కంపెనీగా మార్చి, రీసెంట్‌గా సీఈఓగా రిటైర్ అయ్యారు! గట్ ఫీలింగ్ అంటే ఇదే కదా!

టీటీడీ బోర్డు సభ్యుడి కుమారుడి అరెస్టు
Current Affairs· 5d ago

టీటీడీ బోర్డు సభ్యుడి కుమారుడి అరెస్టు

TG: హైదరాబాద్ రాయదుర్గంలో జరిగిన హిట్-అండ్-రన్ ప్రమాదంలో బీహార్‌కు చెందిన నందులాల్ మరణించాడు. అతనికి సాయం చేయడానికి వచ్చిన స్టూడెంట్ జైద్ షా కాద్రి కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ORR రోటరీ నుంచి ఖాజాగూడ వైపు వెళ్లే రోడ్డుపై నడుస్తున్న నందులాల్‌ను ఇన్నోవా కారు ఢీకొట్టింది. అతనికి సాయం చేస్తున్న స్టూడెంట్‌ను కూడా అదే కారు ఢీకొట్టి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. CCTV ఆధారంగా వాహనాన్ని గుర్తించి, ఈ ఘటనకు కారణమైన ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌ను అరెస్ట్ చేశారు.

డ్రగ్స్‌కు దూరంగా ఉంటేనే భవిష్యత్తు
Local· 5d ago

డ్రగ్స్‌కు దూరంగా ఉంటేనే భవిష్యత్తు

డ్రగ్స్‌కు దూరంగా ఉంటేనే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రొఫెసర్ సామ రవీందర్ రెడ్డి అన్నారు. షాద్‌నగర్ పట్టణంలోని విజ్ఞాన్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు డ్రగ్స్ నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మత్తుపదార్థాల కారణంగా యువత భవిష్యత్తు ఎలా నాశనం అవుతుందో ఆయన తెలిపారు. ప్రిన్సిపల్ విశ్వనాథ్, లెక్చరర్ శ్రీనివాసరావు కార్యక్రమంలో పాల్గొన్నారు.

నంబర్ ప్లేట్లు లేని 40 వాహనాలకు జరిమానా
Local· 5d ago

నంబర్ ప్లేట్లు లేని 40 వాహనాలకు జరిమానా

మంచిర్యాలలో నంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నంబరు ప్లేట్లు లేకుండా, అస్పష్టంగా ఉన్న నంబర్లతో, రిజిస్ట్రేషన్ కాకుండా తిరుగుతున్న 40 వాహనాలను గుర్తించి ఫైన్ వేశారు. సీఐ హన్నన్ మాట్లాడుతూ వాహనాలకు RTA నిబంధనల ప్రకారం స్పష్టంగా కనిపించే నంబర్ ప్లేట్లను అమర్చుకోవాలన్నారు.

ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలి
Local· 5d ago

ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలి

తెలంగాణ రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన దాదాపు రూ. 14,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ డిమాండ్ చేసింది. జగిత్యాల జిల్లా బుగ్గారం మండల్ DT రాకేష్‌కి జేఏసీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. జిల్లా నాయకులు మానాల కిషన్ మాట్లాడుతూ ప్రభుత్వ నిధులు విడుదల కాకపోవడంతో ఫీజులు చెల్లించలేని దుస్థితి ఏర్పడిందని, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు తమ చదువులను కొనసాగించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అక్రమ మట్టి తవ్వకాలతో పర్యావరణానికి ముప్పు
Local· 5d ago

అక్రమ మట్టి తవ్వకాలతో పర్యావరణానికి ముప్పు

గూడూరు మండలం పోటుపాలెం, చిల్లకూరు మండలం నాంచారమ్మపేట సరిహద్దుల్లో అనుమతులు లేకుండా మట్టి తవ్వి తరలిస్తుండగా పోలీసులు జేసీబీ, లారీని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ తవ్వకాలతో భూమి స్వరూపం దెబ్బతినడంతోపాటు పర్యావరణం, వ్యవసాయ భూములకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. వాహనాలను గూడూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు.

ఖర్గేను అవమానించిన వారిపై పోలీసులకు ఫిర్యాదు
Local· 5d ago

ఖర్గేను అవమానించిన వారిపై పోలీసులకు ఫిర్యాదు

ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై హల్ద్వానీలో జరిగిన అవమానాన్ని నిరసిస్తూ మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ ఎస్సీ సేల్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. బాధ్యులపై వెంటనే ఎస్ఐఆర్ నమోదు చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షులు తిప్పర్తి శ్రీధర్ డిమాండ్ చేశారు. దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని, రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు ప్రతిఒక్కరూ పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.

వాగులో చిక్కుకున్న ముగ్గురిని కాపాడిన పోలీసులు
Local· 5d ago

వాగులో చిక్కుకున్న ముగ్గురిని కాపాడిన పోలీసులు

AP: మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలంలోని నూతలవాగులో బొలెరో వాహనం ఉధృతంగా ప్రవహిస్తున్న నీటి ప్రవాహంలో చిక్కుకుంది. ప్రాణరక్షణ కోసం ఈ ప్రమాదంలో చిక్కుకున్న ముగ్గురు వ్యక్తులు ఆ ప్రవాహం పక్కనే ఉన్న చెట్టుపైకి ఎక్కి సహాయం కోసం కేకలు వేశారు. ప్రొక్లెయిన్‌‌తో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ముగ్గురిని సురక్షితంగా రక్షించారు. నల్లమలసాగర్‌ జలాశయానికి సొరంగాల ద్వారా కృష్ణాజలాలు భారీగా చేరుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.

గణేష్ ఉత్సవాలపై పోలీసులు ఫోకస్.. DJలకు చెక్!
TG· 5d ago

గణేష్ ఉత్సవాలపై పోలీసులు ఫోకస్.. DJలకు చెక్!

TG: హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాలపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఉత్సవాలకు ఆరు దశల్లో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు DGP తెలిపారు. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు ఉత్సవ కమిటీలు పోలీసులకు కోఆపరేట్ చేయాలని కోరారు. DJలకు దూరంగా ఉండాలని, భారీ సౌండ్‌తో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉందని సూచించారు. ఈ ఏడాది సిటీలో ఏర్పాటు చేసే గణేష్ విగ్రహాల ఎత్తు 16 అడుగులకు మించకూడదని హైదరాబాద్ సీపీ వీ.సీ. సజ్జనార్ తెలిపారు.

మూగజీవాలకు టీకాలు వేయండి మహాప్రభో
Local· 5d ago

మూగజీవాలకు టీకాలు వేయండి మహాప్రభో

ఖమ్మం జిల్లా, పెనుబల్లి మండలంలో పశువుల ఆరోగ్యం ప్రధాన ఇష్యూ అయ్యింది. వానాకాలం వస్తోంది కాబట్టి, గొర్రెలకు, మేకలకు వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. పాత కుప్పనగుంట్లలో ఈ మేరకు జరిగిన సమావేశంలో జీఎంపీఎస్ ఖమ్సం జిల్లా నాయకుడు మాట్లాడుతూ "పశుసంవర్ధక శాఖ వెంటనే ముందుకు రావాలి. వ్యాధులు రాకుండా టీకాలు, నులిపురుగుల మందులు ఉచితంగా ఇవ్వాలి. ప్రతి గ్రామంలో పశువైద్య శిబిరాలు పెట్టాలి.<br>పశువులు చనిపోతే రైతులకు పరిహారం ఇవ్వాలని" అని డిమాండ్ చేశారు. మీ ఊళ్లో ఉన్న గొర్రెలకు, మేకలకు టీకాలు వేశారా? కామెంట్ చేయండి.

42 బాల్స్‌లోనే 50 రన్స్ ..వైభవ్ సూర్యవంశీ కొత్త రికార్డు
Sports· 5d ago

42 బాల్స్‌లోనే 50 రన్స్ ..వైభవ్ సూర్యవంశీ కొత్త రికార్డు

క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ దులీప్ ట్రోఫీలో కొత్త రికార్డు సాధించాడు. టోర్నమెంట్‌లో హాఫ్ సెంచరీ చేసిన అతి చిన్న వయసు వ్యక్తిగా మారాడు. నిన్న బెంగళూరులో జరిగిన సెమీఫైనల్‌లో ఈస్ట్ జోన్ తరఫున సెంట్రల్ జోన్‌పై ఆడుతూ 81 బాల్స్‌లో 92 రన్స్ చేశాడు. 42 బాల్స్‌లోనే 50 రన్స్ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లు కొట్టాడు. 15 సంవత్సరాల 157 రోజుల వయసులో ఈ రికార్డు సాధించాడు. 50 ఏళ్లకు పైగా ఉన్న పాత రికార్డును అతను దాటేసి కొత్త రికార్డ్ నెలకొల్పాడు.

👶 Peek-a-boo ఎందుకు ఇంత ఇష్టం?
Parenting· 5d ago

👶 Peek-a-boo ఎందుకు ఇంత ఇష్టం?

బేబీతో ఆడుతూ మనం “Peek-a-boo!” అంటూ ముఖం దాచుకుంటే మన ముఖం మళ్లీ కనిపించగానే బేబీ నవ్వుతుంది. ఇది సరదా కాదు. ముఖం కనిపించకపోయినా మనం అక్కడే ఉన్నామని బేబీ అర్థం చేసుకోవడం ఇక్కడే మొదలవుతుంది. మళ్లీ కనిపిస్తామని ఊహించడం కూడా నేర్చుకుంటుంది. అంతేకాదు, ఈ ఆటలో చూడటం, ఎదురుచూడటం, మనతో కలిసి ఆడటం లాంటి basic social skills కూడా develop అవుతాయి. అందుకే ప్రపంచంలోని దాదాపు ప్రతి బేబీకి Peek-a-boo అంత ఇష్టం. మనకి ఇది చిన్న ఆటే అయినా బేబీకి మాత్రం ఇది ఒక పెద్ద learning.

వన్ షాట్ తో 33 ట్రాన్స్ఫార్మర్ చోరీ కేసులు సాల్వ్
Local· 5d ago

వన్ షాట్ తో 33 ట్రాన్స్ఫార్మర్ చోరీ కేసులు సాల్వ్

నిర్మల్ జిల్లా, భైంసా సబ్ డివిజన్‌లో ఎనిమిది నెలల్లో 33 ట్రాన్స్ఫార్మర్లు చోరీ అయ్యాయ్. ఇవన్నీ వ్యవసాయ పొలాల్లోవే! ’’మా పంటలను ఎలా కాపాడుకోవాలి’’ అని రైతులు ఆందోళన పడి పోలీసులను ఆశ్రయించారు. అప్రమత్తమైన ముధోల్ సర్కిల్ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. చాకచక్యంగా నిందితులను పట్టుకుని, 33 కేసులూ ఛేదించేశారు. వారి నుంచి 250 కిలోల రాగి తీగలు, 2 బైకులు, 4 ఫోన్లు, ఎలక్ట్రికల్ వస్తువులు సీజ్ చేశారు. దీంతో రైతులు ఇప్పుడు రిలాక్స్ అయ్యారు. పోలీసులు చేసిన పనికి ఫిదా అయిపోయామని స్థానికులు అంటున్నారు.

రవితేజ కొడుక్కి మస్త్ ఆటిట్యూడ్ ఉందనుకున్నా- యాదమ్మ రాజు
Entertainment· 5d ago

రవితేజ కొడుక్కి మస్త్ ఆటిట్యూడ్ ఉందనుకున్నా- యాదమ్మ రాజు

రవితేజ బ్రదర్ రఘు సన్ మాధవ్ భూపతిరాజు హీరోగా డెబ్యూ చేస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా 'మారెమ్మ'. మంచాల నాగరాజ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో కమేడియన్ యాదమ్మ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు కాబట్టి మాధవ్‌కి చాలా ఆటిట్యూడ్ ఉంటుందని అనుకున్నానని, కానీ పరిచయం అయ్యాక అతను చాలా అమాయకుడని అర్థమైందని మాట్లాడారు. సెప్టెంబర్ 10న థియేటర్లలోకి రాబోతున్న ఈ మూవీ గ్రామీణ నేపథ్యంలో సాగే రియల్ ఈవెంట్స్ ఆధారంగా తెరకెక్కబోతోంది.

ఎల్ నినో ఎఫెక్ట్..ఆగస్టులో తక్కువ వర్షాలు
TG· 5d ago

ఎల్ నినో ఎఫెక్ట్..ఆగస్టులో తక్కువ వర్షాలు

ఎల్ నినో ఎఫెక్ట్ వల్ల తెలంగాణలో ఆగస్టు నెలలో వర్షాలు తగ్గాయి. 215.8 మి.మీ. వర్షం పడాల్సిన చోట 134.5 మి.మీ. మాత్రమే పడింది. ఇది 38 శాతం తక్కువ. ఈ సీజన్‌లో ఇప్పటివరకు వర్షాలు అతి తక్కువగా పడిన నెల ఇదే. గతేడాది ఆగస్టులో 378.5 మి.మీ. వర్షం పడింది. ఈసారి దాదాపు 64 శాతం తక్కువగా ఉంది. నెల మొదట్లో 40 శాతం కంటే ఎక్కువ తక్కువగా ఉండగా, తర్వాత కొంత రోజులు మంచి వర్షాలు పడి మళ్లీ తగ్గాయి. చివరికి 38 శాతం లోటుతో నెల ముగిసింది.

విశాఖలో టెన్షన్.. గురుకుల స్కూల్ కోసం ఆందోళన!
AP· 5d ago

విశాఖలో టెన్షన్.. గురుకుల స్కూల్ కోసం ఆందోళన!

AP: విశాఖ మారికవలస జంక్షన్‌లో గురుకుల పాఠశాల కొనసాగించాలని YSRCP నాయకులు, గిరిజన నేతలు ఆందోళన చేపట్టడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. స్కూల్‌ వరకు వెళ్లకుండా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అక్కడి నుంచి తరలించే టైమ్‌లో నిరసనకారులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మహిళా కానిస్టేబుల్ తీరుపై మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి సీరియస్ అయ్యారు. మహిళ అయ్యుండి తన చీరను ఎలా లాగుతారని ప్రశ్నించారు. గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్న తమపై పోలీసుల తీరును ఖండిస్తున్నామని అన్నారు.

‘మిషన్ రంగీన్ మచ్లీ 2031’ను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి
National· 5d ago

‘మిషన్ రంగీన్ మచ్లీ 2031’ను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి

భారతదేశ ఆర్నమెంటల్ ఫిషరీస్ రంగాన్ని అభివృద్ధి చేయడం, బయోసెక్యూరిటీని మెరుగుపరచడం, నాణ్యతా ప్రమాణాలు, ట్రేసబిలిటీని ఏర్పాటు చేయడం లక్ష్యంగా ‘మిషన్ రంగీన్ మచ్లీ 2031’ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్‌ను ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ లక్షద్వీప్‌లో స్టార్ట్ చేశారు. దీని వల్ల ఆర్నమెంటల్ ఫిషెస్ పెంపకం, వాణిజ్యం (దేశీయ, అంతర్జాతీయ)లో ఒకేలాంటి స్టాండర్డ్స్ ఏర్పాటు చేయడానికి వీలవుతుంది. ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ దేశం బ్లూ రివల్యూషన్ వైపు అడుగులు వేస్తోందని అన్నారు.

గోదావరిఖానిలో పశువుల భీతి! ప్రాణాలు పోతున్నాయ్
Local· 5d ago

గోదావరిఖానిలో పశువుల భీతి! ప్రాణాలు పోతున్నాయ్

పెద్దపల్లి జిల్లా, గోదావరిఖానిలో రోడ్లపై పశువుల సంచారం భయంగా మారింది. రాత్రిళ్లు పశువుల సంచారం ప్రయాణికులకు ప్రాణ సంకటంగా మారింది. 5in cline కాలనీ నుంచి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ వరకు ఈ సమస్య తీవ్రంగా ఉంది. గతంలో ఇలాంటి ప్రమాదాల్లో చాలామంది మరణించారు. అయినా, అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నారు. కంప్లైంట్ చేసినా ప్రయోజనం లేదు. "వెంటనే పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి" అని స్థానికులు అంటున్నారు.. మీ పరిసరాల్లో కూడా ఇలాంటి సమస్య ఉందా? కామెంట్ చేయండి.