Latest

విద్యార్థులకు మద్దతుగా రాహుల్ గాంధీ, ప్రతిపక్ష ఎంపీల ర్యాలీ
విద్యార్థుల పోరాటానికి మద్దతు తెలుపుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తో పాటు పలువురు ప్రతిపక్ష ఎంపీలు ఢిల్లీలోని గాంధీ స్మృతికి బయలుదేరారు. సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టిన విద్యార్థుల డిమాండ్లకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. శాంతియుత మార్గంలో నిరసన తెలుపుతున్న వారి స్వరానికి బలాన్ని ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్తు, వారి హక్కుల పరిరక్షణే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఇండియా మేల్కొంది- GenZ
దేశంలో నీట్, నెట్ వంటి పోటీ పరీక్షల పేపర్ లీకేజీలపై విద్యార్థుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఢిల్లీ నుంచి హైదరాబాద్, చెన్నై, కలకత్తా, జైపూర్, బెంగళూరు వరకు దాదాపు 30కి పైగా ప్రముఖ నగరాల్లో యువత భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ‘ఇండియా మేల్కొంది’ అంటూ పేపర్ లీక్ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా సాగుతున్న ఈ ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి.
మమ్మల్ని కాదు.. రేపిస్టులను పట్టుకోండి!
ఉత్తరప్రదేశ్ ఆజంఘడ్‌లో నిరసన తెలుపుతున్న ప్రొటెస్టర్లపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడంపై ఒక యువతి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. తమను అడ్డుకోవడం ఆపి, అసలైన రేపిస్టులను పట్టుకుంటే అత్యాచారాలు ఆగుతాయని పోలీసుల ముందే దైర్యంగా చెప్పింది. తమ హక్కులను అడగడం తప్పా అని ప్రశ్నిస్తూ, న్యాయం కావాలని డిమాండ్ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
జంతర్ మంతర్ వద్ద మోదీ గొంతు!
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గత నెలరోజుల నుండి నిరుద్యోగ యువత ప్రొటెస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే, ఈ నిరసనలో ఒక ప్రొటెస్టర్ ప్రధాని మోదీ వాయిస్‌ను మిమిక్స్ చేస్తూ.. ఆయన ఇచ్చిన హామీలను, రీసెంట్ పేపర్ లీకేజ్ అంశాలను ప్రస్తావిస్తూ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఎగ్జామ్స్ రద్దుతో నష్టపోయిన తమకు న్యాయం జరిగే వరకు మరియు ఈ పోరాటంలో విజయం సాధించే వరకు ఐక్యతతో, పీస్‌ఫుల్‌గా ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఓటు లేకపోతే స్కీమ్స్ బంద్: CM రేవంత్
ఓటు పోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అందరూ ఓటర్ లిస్ట్‌లో తమ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలని కోరారు. BLOల రోల్ క్రూషియల్ కాబట్టి గ్రౌండ్ లెవెల్‌లో సూపర్ వైజ్ చేయాలని తమ పార్టీ లీడర్స్ ని సూచించారు. తనకు రెండు ఓట్లు లేవని, ఓటును కొడంగల్‌కు మార్చుకున్నాని క్లారిటీ ఇచ్చారు. కావాలని ఫేక్ కంప్లైంట్ ఇస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
ముందు మీ స్కామ్స్‌పై ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టండి: కపిల్
నీట్-యూజీ పేపర్ లీక్ వ్యవహారంపై రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసే ముందు అధికార పార్టీలో స్కామ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేపర్ లీక్ కేసుల్లో సీబీఐ ఎందుకు దర్యాప్తు చేయడం లేదని ప్రశ్నించారు. జూన్ 28 నుంచి విద్యార్థుల నిరసనలు 25 రోజులుగా కొనసాగుతున్నా ప్రభుత్వం సమస్యలను పరిష్కరించలేదని, నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థుల ఆరోగ్యంపైనా నిర్లక్ష్యం చూపుతోందని ఆరోపించారు.

స్టూడెంట్స్‌కు స్పోర్ట్స్ స్టార్స్ సపోర్ట్!
స్టూడెంట్స్ ప్రొటెస్ట్ కు స్పోర్ట్స్ ప్రపంచం నుంచి మద్దతు పెరుగుతోంది. ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అభినవ్ బింద్రా, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, క్రికెటర్లు యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్, షూటర్ మనూ భాకర్, బాక్సర్ నిఖత్ జరీన్ విద్యార్థుల భవిష్యత్తు కోసం పారదర్శక విద్యా వ్యవస్థ, శాంతియుత సంభాషణ, బాధ్యులపై చర్యలు అవసరమని కోరారు. రాజకీయాలకు అతీతంగా యువత గొంతు వినాలని పిలుపునిచ్చారు

మహబూబ్‌నగర్‌లో భారీ ర్యాలీ..
ఢిల్లీలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళనలకు మద్దతుగా మహబూబ్‌నగర్‌లో విద్యార్థి, యువజన సంఘాల వేదిక ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు చేసిన లాఠీఛార్జీని నేతలు తీవ్రంగా ఖండించారు. నీట్ అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని, ప్లకార్డులతో భారీస్థాయిలో నిరసన తెలిపారు.

పులసకు ‘గో’దారేది?
AP: గోదావరి జిల్లాలో లభించే అరుదైన, రుచికరమైన 'పులస' చేపల సందడి ఈసారి లేదు. హిందూ మహాసముద్రం నుంచి బంగాళాఖాతం ద్వారా గోదావరిలోకి ఎదురీదే ఈ చేపలు ఎర్రటి మట్టి నీటిలోని పోషకాల కారణంగా ఒమేగా-3 కొవ్వుతో, అద్భుతమైన రుచితో ఉంటాయి. వర్షాలు లేకపోవడం, నదిలో ప్రవాహం తగ్గడం వల్ల చేపలు గోదావరిలోకి రాలేకపోతున్నాయి. జూలై మూడో వారమొచ్చినా ఒక్క చేప కూడా దొరకలేదని మత్స్యకారులు చెబుతున్నారు.

మోదీ నిర్ణయంపై నారా లోకేష్ పోస్ట్
AP: 'నీట్' పేపర్ లీక్ కేసుల కోసం 'ఫాస్ట్ ట్రాక్ కోర్టులు' పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని మంత్రి నారా లోకేష్ మెచ్చుకున్నారు. ఈ నిర్ణయం యువత భవిష్యత్తుకు ఎంతో రక్షణ ఇస్తుందని చెప్పారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకునే వారికి ఇది గట్టి హెచ్చరిక అన్నారు. స్టూడెంట్స్ భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలని లోకేష్ తెలిపారు.

'నీట్' పేపర్ లీక్ పై రేపు BRS ప్రొటెస్ట్
TG: దిల్లీలో NEET పేపర్ లీక్ ప్రొటెస్ట్‌లో విద్యార్థులపై జరిగిన పోలీసుల అణచివేతను ఖండిస్తూ, సెంట్రల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ BRS పార్టీ నిరసనకు పిలుపునిచ్చింది. వర్కింగ్ ప్రెసిడెంట్ KTRతో కలిసి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ రేపు ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌లో నిరసనకు హాజరవుతారు. వేలాది విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తున్న NEET లీక్‌ను ఖండిస్తూ, ఈ నిరసనను చేపట్టనున్నారు

ఆగస్టులో రెండు గ్రహణాలు
2026 ఆగస్టులో రెండు గ్రహణాలు ఏర్పడనున్నాయి. ఆగస్టు 12న సంపూర్ణ సూర్యగ్రహణం, ఆగస్టు 28న పాక్షిక చంద్రగ్రహణం సంభవించనున్నాయి. ఇది చాలా అరుదైన ఘటన అని, అయితే ఈ రెండు గ్రహణాలు భారత్‌లో కనిపించవని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు.
ప్రొటెస్ట్‌లో పోరాటం..సోషల్ మీడియాలో మీమ్‌ల ప్రవాహం
దిల్లీ విద్యార్థుల నిరసనకు GenZ ఫుల్ వైరల్ ట్విస్ట్ ఇచ్చింది. పోలీసుల నుంచి పరుగెత్తిన వీడియోలకు ‘Subway Surfers IRL’, ‘1.60 km Pace – Thanks for the cardio, Delhi Police!’ అంటూ మీమ్స్ పేలాయి. టీ-రెక్స్ కాస్ట్యూమ్‌లో వచ్చిన నిరసనకారుడిపై ‘Dinosaur Wild Card Entry’ ట్రెండ్ అయింది. బాలీవుడ్ పాటలు, రీల్స్, ఫన్నీ ఎడిట్స్‌తో నిరసన తెలుపుతూ సోషల్ మీడియాలో మీమ్ ఫెస్టివల్ చేస్తున్నారు.

రేపు హైదరాబాద్‌లో విద్యార్థుల వరుస నిరసనలు
TG: నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌తో రేపు హైదరాబాద్‌లో విద్యార్థి సంఘాలు నిరసనలు చేపట్టనున్నాయి. నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నేతలు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధర్నాచౌక్ వద్ద ప్రొటెస్ట్ చేయనున్నారు. ఓయూ విద్యార్థులు కూడా నిరసనల్లో పాల్గొననున్నారు.
మోదీ ప్రకటనపై కేజ్రీవాల్ విమర్శలు
పేపర్ లీక్ కేసుల కోసం ఫాస్ట్-ట్రాక్ కోర్టుల ఏర్పాటుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేశారు. దీనిపై ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఈ ప్రకటన సరిపోదని పేర్కొంటూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌ను గుర్తుచేశారు. నీట్ పేపర్ లీక్ ఆరోపణలపై దేశవ్యాప్త నిరసనలు, పరీక్షా విధానంలో సంస్కరణల డిమాండ్లపై 'ఎక్స్' వేదికగా కేజ్రీవాల్ ప్రశ్నించారు.
TPCC అధికార ప్రతినిధులతో మహేష్ కుమార్ గౌడ్ భేటీ
TG: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ అధికార ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ విజయాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తీసుకెళ్లాలని అన్నారు. ప్రతిపక్షాల విమర్శలను వాస్తవాలతో తిప్పికొట్టాలన్నారు.
ఒక్క ప్రెస్ మీట్ పెట్టే ధైర్యం లేదా?
TG: ఉస్మానియా యూనివర్సిటీలో ఓ విద్యార్థిని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. తాము ఏ రాజకీయ పార్టీ కాదని, కేవలం తమ హక్కుల కోసం, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసమే పోరాడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పీఎం మోదీ ఇప్పటివరకూ ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించకపోవడం సిగ్గుచేటన్నారు. తమిళనాడు వెళ్ళగానే రూపం, మాటలు మారుస్తూ నటనలు చేయడం తప్ప విద్యార్థుల సమస్యలపై కనీసం ఎందుకు మాట్లాడటం లేదని ఆమె ప్రశ్నించారు.

‘మిషన్ శక్తిశాట్'కు ఎంపికైన బాలిక: అభినందించిన పవన్ కళ్యాణ్
AP: ప్రపంచంలోనే తొలి బాలికల లూనార్ క్యూబ్‌శాట్ మిషన్ 'మిషన్ శక్తిశాట్' కోసం భారతదేశ టాప్-20లో ఆంధ్రప్రదేశ్ నుంచి కందుల జెస్సీ ఎంపికైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనను అభినందించారు. ప్రభుత్వ పాఠశాల నుంచి చంద్ర మిషన్ వరకు ఆమె చేసిన ప్రయాణం రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఇస్రో ద్వారా దేశానికి సేవ చేయాలనే ఆమె కల సాకారం కావాలని ఆకాంక్షిస్తున్నానని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
హిస్టరీలో మొదటిసారి.. సుప్రీంకోర్టు దగ్గర ఏం జరిగిందంటే?
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న స్టూడెంట్స్ ప్రొటెస్ట్‌కి మద్దతుగా సుప్రీంకోర్టు లాయర్లు రంగంలోకి దిగారు. నిరసనకారులపై పోలీసుల చర్యలను నిరసిస్తూ సుప్రీంకోర్టు ఆవరణలో రాజ్యాంగ పీఠిక (Preamble) చదివారు. అనంతరం జాతీయ గీతం పాడి తమ నిరసన తెలిపారు. రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసమే ఈ నిరసన అని, విద్యార్థులకు న్యాయం జరగాలంటూ లాయర్లు గళమెత్తారు.

ఒంటరిగా పోలీస్ వ్యాన్‌ను ఆపేసింది.. ఎవరీ మోడల్?
NEET పేపర్ లీక్‌పై ముంబై శివాజీ పార్క్ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులను పోలీసులు వ్యాన్‌లో అరెస్ట్ చేశారు. అది చూసిన 27 ఏళ్ల మోడల్ రియా అహిర్, ఒంటరిగానే పోలీస్ వ్యాన్‌కి అడ్డంగా నిలబడి నిరసనకారులను విడుదల చేసేలా చేసింది. గతంలో ఎప్పుడూ ప్రొటెస్ట్‌లలో పాల్గొనని రియా ధైర్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆర్మీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన ఆమె చొరవపై తీవ్ర ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
విజయవాడలో విద్యార్థుల భారీ ఆందోళన
AP: విజయవాడలో విద్యార్థి, యువజన సంఘాల 'చలో రాజ్‌భవన్' పిలుపుతో ఉద్రిక్తత నెలకొంది. సెంట్రల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని నేతలు పట్టుబట్టారు. గవర్నర్‌ను కలిపిస్తామని చెప్పి పోలీసులు మోసం చేశారని నిరసనకారులు మండిపడ్డారు. విద్యార్థులపై పోలీసులు దాడి చేయడంతో కొందరికి గాయాలయ్యాయి. సివిల్ డ్రెస్‌లో ఉన్న కొంతమంది పోలీసులు తమను ఈడ్చిపారేశారని విద్యార్థులు అన్నారు.