Latest

ప్లాస్టిక్ వస్తువుల వాడకంతో ప్రమాదం!
రోజూ ఇంట్లో వాడే ప్లాస్టిక్ వస్తువులు, ప్యాకేజింగ్ మెటీరియల్స్ వల్ల ఊబకాయం వచ్చే అవకాశం ఉందని సైంటిస్టులు అంటున్నారు. ప్లాస్టిక్‌లో ఉండే 'బిస్‌ఫెనాల్-ఎ'(BPA), థాలేట్స్ రసాయనాలు శరీరంలోని హార్మోన్లను దెబ్బతీస్తాయంటున్నారు. ప్లాస్టిక్ బాక్సు మైక్రోవేవ్‌లో వేడి చేసి తినడం, ప్లాస్టిక్ డబ్బాల్లో నిల్వ చేయడం ద్వారా కెమికల్స్ ఆహారంతో కలిసి శరీరంలోకి వెళ్తాయంటున్నారు. అందుకే ప్లాస్టిక్ వాడకం తగ్గించి గాజు లేదా సిరామిక్ పాత్రలు వాడటం మంచిదని సైంటిస్టులు చెప్తున్నారు.
టంగ్ స్లిప్ అయిన తెలంగాణ సీఎం
TG: పబ్లిక్ మీటింగ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి టంగ్ స్లిప్ అయ్యారు. ‘సోనియా గాంధీ ప్రణబ్ ముఖర్జీని ప్రధానమంత్రిని చేశారు’ అన్నారు. ఈ క్లిప్ సోషల్ మీడియాలో VIRALగా మారింది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో UPA కూటమి విజయం సాధించిన తర్వాత సోనియా గాంధీ PM పదవిని తిరస్కరించి మన్మోహన్ సింగ్‌ను PM అభ్యర్థిగా ఎనుకున్నారు. ప్రణబ్ ముఖర్జీ 2012లో రాష్ట్రపతి అయ్యారు కానీ ప్రధాని ఎప్పుడు కాలేదు. రేవంత్ రెడ్డి మాటలు ఈ వాస్తవాలకు వ్యతిరేకంగా ఉన్నాయని విమర్శకులు అంటున్నారు.

తారు రోడ్డు, కాంక్రీట్ రోడ్డు..ఏది బెస్ట్?
తారు, కాంక్రీట్ రోడ్లు రెండూ వేర్వేరు అవసరాలకు పనికొస్తాయి. తారు రోడ్లు తక్కువ ఖర్చుతో వేగంగా పూర్తవుతాయి. ప్రయాణం సాఫీగా ఉంటుంది. అందుకే వీటిని హైవేలపై వేస్తారు. అయితే వర్షాలకు ఇవి త్వరగా పాడవుతాయి. కాంక్రీట్ రోడ్లు 25 నుంచి 30 ఏళ్ల వరకు ఎక్కువ కాలం వచ్చేలా ఉంటాయి. నీరు నిలిచినా పాడవవు కాబట్టి వీటిని గ్రామాల్లో ఎక్కువగా నిర్మిస్తారు. కానీ కాంక్రీట్ రోడ్ల తయారీకి ఖర్చు, సమయం ఎక్కువ పడుతుంది. రద్దీ, వాతావరణాన్ని బట్టి ఇంజినీర్లు ఏ రోడ్డు వేయాలో నిర్ణయిస్తారు.
దేవాదులలో మోటర్ల సంఖ్య పెంపు
TG: రైతుల నుంచి వ్యతిరేకత రావటంతో ఇప్పటివరకు ఐదు మోటర్లతో నడుస్తున్న దేవాదుల ప్రాజెక్టులో ప్రభుత్వం తొమ్మిది మోటర్లను ప్రారంభించింది. దీంతో సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు భారీగా నీరు చేరుతోంది. ప్రస్తుతం సమ్మక్క సాగర్‌కు 40,200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 38,410 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదైంది. అధికారులు 1,790 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు.

ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు ఆహ్వానం
AP: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీని కలిసి భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని సీఎం తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలో విమానయాన రంగం చాలా అభివృద్ధి చెందిందన్నారు. ఈ విమానాశ్రయం టూరిజం, వ్యాపారం, ఉద్యోగ అవకాశాలను పెంచి, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఉపయోగపడుతుందని చంద్రబాబు తన 'ఎక్స్' అకౌంట్‌లో తెలిపారు.
PMకి ఫ్లైట్ టికెట్, మంత్రికి రిజైన్ లెటర్ రెడీ!
NEET పేపర్ లీక్ ఇష్యూపై స్టూడెంట్స్ కొత్తగాగా ప్రొటెస్ట్ చేశారు. ఎగ్జామ్స్ సరిగ్గా నిర్వహించలేకపోయిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కి ఒక ‘Resignation Letter’ రెడీ చేశారు, ఆ పేపర్ మీద ఆయన ఒక సంతకం లేదా వేలిముద్ర వేయాలని డిమాండ్ చేశారు. అలాగే మణిపూర్ ఇష్యూపై సైలెంట్‌గా ఉన్న ప్రధాని మోదీ కోసం ఢిల్లీ నుంచి ఇంపాల్‌కి ఓ ఫ్రీ ‘Flight Ticket’ డిజైన్ చేశారు. Tax Payers మనీతోనే ఈ టికెట్ అంటూ స్టూడెంట్స్ సెటైర్లు వేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
కాంగ్రెస్, బీజేపీ ఆందోళనలు..ట్రాఫిక్ జామ్
TG: హైదరాబాద్‌లో కాంగ్రెస్ ‘లోక్‌భవన్’ ముట్టడికి పిలుపునిస్తే, బీజేపీ లీడర్లు 'గాంధీ భవన్' వైపు దూసుకొచ్చి ముట్టడించడానికి ట్రై చేశారు. దీంతో నాంపల్లి, అబిడ్స్, లక్డీకాపూల్ రోడ్లలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వర్షం పడడంతో బండ్లు ఆగిపోయి జనాలు ఇబ్బంది పడ్డారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి రెండు పార్టీల లీడర్లు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

పెంపుడు జంతువులకు రిజిస్ట్రేషన్..రూ.5,000 జరిమానా
జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ పెంపుడు జంతువుల రిజిస్ట్రేషన్‌ను సెప్టెంబర్ 30 నాటికి నమోదు చేసుకోకపోతే రూ.5,000 జరిమానా విధిస్తామని హెచ్చరించింది. రేబిస్ వ్యాధి లేకుండా చేయడం, జంతువుల హెల్త్ డీటెయిల్స్ తెలుసుకోవడాని ఇది అవసరమని చెప్పింది. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.1,000, రెన్యూవల్ ఫీజు రూ.500గా అధికారులు నిర్ణయించారు. 3 నెలల వయసులోనే మొదటి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించి వివరాలు నమోదు చేయాలన్నారు.

ప్రభుత్వ వైఫల్యాలపై దిల్లీలో రాహుల్ ప్రెస్ మీట్
దేశంలో యువత భవిష్యత్తును కేంద్ర ప్రభుత్వం దెబ్బతీస్తోందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. దిల్లీలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ దేశంలో సరైన విద్యా వ్యవస్థ లేదని, భారత విద్యావిధానాన్ని నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో 152 పేపర్ లీక్ ఘటనలు జరిగాయని పేర్కొన్నారు. విద్యార్థుల మూడు డిమాండ్లకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని, పేపర్ లీక్‌లపై ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

రావణాసురుడిగా సీఎం విజయ్..కేసు నమోదు
తమిళనాడులోని సేలం జిల్లా ఆత్తూర్ మారియమ్మన్ ఆలయంలో ఆషాఢ మాస వేడుకలో యువకులు ముఖ్యమంత్రి, నటుడు విజయ్‌ని రావణాసురుడిగా, త్రిషను అమ్మవారిగా చూపిస్తూ బ్యానర్ వేశారు. గుడి వేడుకలో సినిమా నటులను దేవుళ్ల రూపంలో చూపించడం సరికాదంటూ అక్కడున్నవాళ్ళందరూ మండిపడ్డారు. బ్యానర్ వేసిన ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఉప్పు సత్యాగ్రహంతో ‘చలో సంసద్’ను పోల్చిన ప్రకాశ్‌రాజ్
దిల్లీలో మొన్న జరిగిన ‘చలో సంసద్’ నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని ప్రస్తావిస్తూ 'ఇది గతంలోనూ జరిగింది. మళ్ళీ జరుగుతుంది. ఈ ప్రభుత్వ క్రూరత్వాన్ని కూడా యువత అధిగమిస్తుంది' అని తన ‘ఎక్స్’లో రాశారు నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్‌రాజ్. 1930 ఉప్పు సత్యాగ్రహ వీడియోతో 2026 దిల్లీ యువత నిరసనలను పోల్చారు.

సెల్‌ఫోన్ పేలి బాలుడు మృతి
TG: ఆసిఫాబాద్ జిల్లా చింతామానేపల్లి మండలం గూడెం గ్రామంలో ఓ బాలుడు సెల్‌ఫోన్‌తో ఆడుకుంటుండగా అది పేలింది. దీంతో లోకేష్(14) తీవ్రంగా గాయపడ్డాడు. పేలుడు ధాటికి ముఖం ఛిద్రం కావడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.

ఏపీలో నాపై తప్పుడు కేసులు: నటి జిత్వానీ
AP: ఏపీలో తనపై, తన కుటుంబంపై తప్పుడు కేసులు పెట్టారని నటి కాదంబరి జిత్వానీ ఆరోపించారు. సీఐడీ దర్యాప్తు ఏకపక్షంగా సాగిందని, తన వాంగ్మూలాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. ఛార్జిషీట్‌లో తనపై అసత్య ఆరోపణలు చేశారని, రూ.4.5 లక్షల డిపాజిట్‌ను రూ.1.32 కోట్లుగా తప్పుగా చూపించారని తెలిపారు. కె.విద్యాసాగర్‌తో ఆర్థిక లావాదేవీలు దశాబ్దం క్రితమే ముగిశాయని క్లారిటీ ఇచ్చారు. తనకు ఎలాంటి రాజకీయ పలుకుబడి లేదని, బలిపశువుగా మార్చి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నా ఇద్దరి పిల్లలని కూడా కొట్టండి!
ఢిల్లీలోని జంతర్ మంతర్ నిరసన ప్రదేశంలో ఒక తల్లి పోలీసుల ఎదుట కన్నీళ్లు పెట్టుకుని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. "నిన్న చాలా మంది పిల్లల తలలు పగలగొట్టారు కదా.. నా ఇద్దరి పిల్లలని కూడా తీసుకొచ్చాను, వీరిని కూడా కొట్టేయండి" అంటూ ఆవేదనతో ఆమె మాట్లాడిన తీరు అక్కడున్న వారిని కలచివేసింది. నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల ప్రవర్తనను ప్రశ్నిస్తూ, ఆ తల్లి తీవ్రంగా స్పందించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కేంద్ర మంత్రి ఇన్విటేషన్‌ని రిజెక్ట్ చేసిన స్టూడెంట్స్!
కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఇంటికి చర్చలకు రావాలని ఢిల్లీ పోలీస్ ఇచ్చిన ఆహ్వానాన్ని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న స్టూడెంట్స్ రిజెక్ట్ చేశారు. ప్రైవేట్ ఇళ్లకు చర్చల కోసం వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మంత్రులకు మాట్లాడాలని ఉంటే జంతర్ మంతర్ వద్ద ఉన్న ప్రజల మధ్యకే రావాలని డిమాండ్ చేశారు. భద్రతా కారణాలు ఉంటే జంతర్ మంతర్ సమీపంలోని ఏదైనా న్యూట్రల్ ప్లేస్‌లో కలవడానికి ఓకే చెప్పారు. స్టూడెంట్స్ డిమాండ్స్ నెరవేర్చే నిజమైన ఉద్దేశం ఉంటేనే చర్చలకు రావాలని CJP స్పోక్స్ పర్సన్ సౌరవ్ దాస్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ vs BJP.. జర్నలిస్ట్‌పై రాళ్లదాడి!
హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్, BJP కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగింది. ఇరువర్గాలు కర్రలు, రాళ్లతో దాడి చేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనను కవర్ చేస్తున్న ఒక న్యూస్ రిపోర్టర్‌కి రాయి తగలడంతో తలకు తీవ్ర గాయమై రక్తం కారింది. గాయపడినప్పటికీ ఆ విలేకరి స్పాట్ నుంచే కవరేజ్ కొనసాగించడం గమనార్హం. కాగా, రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

దేశంలో నిరసనలు జరుగుతున్నా, APలో స్పందన లేదు
AP: YCP నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి నీట్, DSC పేపర్ లీకేజీలపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీక్‌పై పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నా, APలో అలాంటి స్పందన కనిపించకపోవడం ఆశ్చర్యకరమన్నారు. సినిమా బెనిఫిట్ షోల విషయంలో ప్రజలు, యువత చూపే ఉత్సాహం విద్యార్థులు, నిరుద్యోగుల భవిష్యత్తుతో ముడిపడిన నీట్, డీఎస్సీ అంశాలపై ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. పేపర్ లీకేజీల వల్ల వేలాది మంది అభ్యర్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని, ఇప్పటికైనా మౌనం వీడి విద్యార్థుల హక్కుల కోసం గళం వినిపించాలని కేతిరెడ్డి పిలుపునిచ్చారు.

నన్ను దెబ్బతీయాలని కుట్రలు చేస్తున్నారు: CM
TG: కొడంగల్ నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తల ఆశీర్వాదంతోనే రాష్ట్రానికి నాయకత్వం వహించే అవకాశం వచ్చిందని CM రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్‌లో తనను రాజకీయంగా దెబ్బతీయాలని కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రస్థాయిలో బలహీనపరచాలంటే తన పునాదులను దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపించారు. పేర్లు వేరైనా BRS, BJP రెండూ ఒక్కటేనని విమర్శించారు. తన నియోజకవర్గంలో కాంగ్రెస్ సానుభూతిపరుల ఓట్లు తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. 119 నియోజకవర్గాలను అభివృద్ధి చేయడం కోసం రోజుకు 18గంటలు పనిచేసినా నాకు టైమ్ సరిపోవడంలేదన్నారు.
ఇది SP, కాంగ్రెస్, BJP ఇష్యూ కాదు- అఖిలేష్ యాదవ్
పార్లమెంట్‌లో విద్యార్థుల సమస్యలకు మద్దతుగా, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ BJPపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఇది SP, కాంగ్రెస్ లేదా BJPకి సంబంధించిన పొలిటికల్ ఇష్యూ కాదు, దేశంలోని స్టూడెంట్స్ సమస్య" అని స్పష్టం చేశారు. రోడ్లపై ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్స్, ఆడపిల్లలపై పోలీసులు దారుణంగా దాడి చేస్తుంటే సభలో కేంద్రం ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. బయట స్టేట్‌మెంట్స్ ఇచ్చే ప్రధాని మోదీ, సభలోకి వచ్చి విద్యార్థుల హక్కులపై ఎందుకు సమాధానం చెప్పడం లేదని ఫైర్ అయ్యారు.
2 రోజులుగా వర్షం లోనే- MP చంద్రశేఖర్ ఆజాద్
2 రోజులుగా వర్షంలో తడుస్తూ, స్టూడెంట్స్ కి మద్ధతుగా నిరసన కొనసాగిస్తున్న వీడియోను పంచుకుంటూ భీమ్ ఆర్మీ చీఫ్, MP చంద్రశేఖర్ ఆజాద్ ఎక్స్ వేదికగా సంచలన కామెంట్స్ చేశారు. "వర్షపు బొట్టునైనా భరిస్తాం కానీ, అమాయకులపై జరిగే అన్యాయాన్ని అస్సలు సహించం" అని, అన్యాయం చేసినవారు ఎంతటి శక్తిమంతులైనా, వారి వెనుక ఎంత పెద్ద వ్యవస్థ ఉన్నా సమాధానం చెప్పక తప్పదని హెచ్చరించారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశయాలే తన పోరాటానికి ప్రధాన బలమని చెబుతూ, "జై భీమ్.. జై భారత్" అంటూ తన ఆందోళనను కొనసాగిస్తున్నారు.

కరీంనగర్ MP ఆఫీస్ వద్ద ఉద్రిక్తత
TG: ఢిల్లీలో రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతల అరెస్టుకు నిరసనగా కరీంనగర్‌లో జరిగిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపిన కాంగ్రెస్ కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు బీజేపీ MP కార్యాలయం వద్దకు చేరుకుని నిరసనకు దిగడంతో BJP కార్యకర్తలతో ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు కోడిగుడ్లు, టమాటాలు, చెప్పులు, కర్రలతో పరస్పరం దాడులకు దిగాయి. ఈ ఘటనలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలకు గాయాలయ్యాయి. పోలీసులు ఇరు వర్గాలను అదుపులోకి తెచ్చి, అక్కడికి వచ్చిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.