తగ్గిన బంగారం, వెండి ధరలు!

బంగారం, వెండి కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. బులియన్ మార్కెట్‌లో నేడు ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై ₹760 తగ్గి ₹1,42,530కి చేరింది. అలాగే, 22 క్యారెట్లపై ₹700 తగ్గి ₹1,30,650 వద్ద, 18 క్యారెట్లపై ₹570 తగ్గి ₹1,06,900 వద్ద ట్రేడ్ అవుతోంది. కేజీ వెండి ధర కూడా తగ్గి ₹2,30,000 వద్ద స్థిరంగా ఉంది. మార్కెట్ ఒడిదుడుకుల వల్ల లైవ్ రేట్స్ మారుతుంటాయి కాబట్టి షాపింగ్‌కి వెళ్లే ముందు ఒకసారి ప్రైస్ చెక్ చేసుకోండి.



