Latest

వచ్చే నెల నుంచే కొత్త పెన్షన్ల అప్లికేషన్లు: తెలంగాణ
తెలంగాణ గవర్నమెంట్ కొత్త పెన్షన్లు ఇవ్వడానికి ఫుల్ స్పీడ్‌గా వర్క్ చేస్తోంది. ఇందులో భాగంగానే నెక్స్ట్ మంత్ నుంచే కొత్త అప్లికేషన్లు తీసుకోవాలని బిగ్ డెసిషన్ తీసుకుంది. ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరికీ పెన్షన్ ఇస్తూనే.. అర్హత లేని వాళ్ళను లిస్ట్ నుండి తీసేయడానికి ఒక కొత్త సిస్టమ్‌ను తెస్తోంది. ఇకపై పెన్షన్ అమౌంట్ డైరెక్ట్‌గా బెనిఫిషియర్స్ బ్యాంక్ అకౌంట్లలోనే పడిపోతుంది.

గూగుల్‌లో 'హత్య' పాఠాలు!
పుణెకు చెందిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో మైండ్ బ్లోయింగ్ విషయాలు బయటపడ్డాయి. నిందితులు సియా గోయల్, చేతన్ చౌదరీలను విచారించగా.. కేతన్‌ను ఎలా చంపాలో చాలా రోజుల ముందు నుంచే ఆన్‌లైన్‌లో రకరకాలుగా సెర్చ్ చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. పక్కా ప్లాన్‌తో జూన్ 18న లోహగడ్ కోట వద్ద కేతన్‌ను లోయలోకి తోసి చంపేశారు. అంతేకాదు, వీరిద్దరూ గత 6 నెలల్లో ఏకంగా 2004 సార్లు ఫోన్ కాల్స్ మాట్లాడుకుని, 238 గంటల పాటు మర్డర్ ప్లాన్ గురించే డిస్కస్ చేసినట్లు డిజిటల్ ఆధారాల ద్వారా తేలింది. ఈ డిజిటల్ ఫుట్‌ప్రింట్, సెర్చ్ హిస్టరీనే ఇప్పుడు నిందితులను బుక్ చేసింది.

9th క్లాస్ సిలబస్‌లో ఎమర్జెన్సీ.. కాంగ్రెస్‌పై BJP ఫైర్!
9వ తరగతి సోషల్ స్టడీస్ సిలబస్‌లో 1975 నాటి 'జాతీయ ఎమర్జెన్సీ' చాప్టర్‌ను NCERT చేర్చింది. ఈ నిర్ణయాన్ని BJP స్వాగతించగా, ప్రతిపక్షాల నుండి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై BJP అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా స్పందిస్తూ కాంగ్రెస్‌పై తీవ్రంగా మండిపడ్డారు. 1975 జూన్ 25 దేశ చరిత్రలోనే చీకటి రోజు అని, ఇందిరా గాంధీ అధికారాన్ని వాడుకుని ఎమర్జెన్సీ విధించారని, మీడియాపై ఆంక్షలు పెట్టి ఆఖరికి ఆల్ ఇండియా రేడియో నుండి కిషోర్ కుమార్ పాటలను కూడా తొలగించారని విమర్శించారు. అప్పటి నిజాలు నేటి తరం విద్యార్థులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

నేషనల్ హైవేపై ఘోర ప్రమాదం
AP: నెల్లూరు జిల్లా మనుబోలు వద్దనున్న నేషనల్ హైవేపై రోడ్ యాక్సిడెంట్ జరిగింది. వేగంగా వెళుతున్న ఆటో ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టి బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న పదిమంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను గూడూరు ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్స్ తెలిపారు. గూడూరు రూరల్ మండలం చెన్నూరుకు చెందిన కూలీలు మనుబోలు మండలం వీరంపల్లిలోని ఓ రొయ్యల కేంద్రం ప్రాసెస్ యూనిట్‌లో పనిచేసేందుకు వెళుతుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది.

డబుల్ బెడ్‌రూమ్ స్కీమ్‌లో బిగ్ స్కామ్ !
TG: పేదలకు ప్రభుత్వం ఇచ్చే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ఇప్పిస్తామని భారీ మోసానికి పాల్పడిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఈ స్కామ్‌లో ఏడుగురు నిందితులను గుర్తించగా వారిలో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు మల్కాజ్‌గిరి DCP శ్రీధర్ తెలిపారు. గతంలో GHMCలో పనిచేసి, ప్రస్తుతం కలెక్టరేట్‌లోని అడల్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్‌లో ఔట్సోర్సింగ్ ఉద్యోగినిగా పనిచేస్తున్న తిమ్మరి పుష్పలత, ఆమె కుమారుడు విశాల్ ఈ మోసంలో కీలకపాత్ర పోషించినట్లు గుర్తించారు. ఈ ముఠా 100మంది నుంచి దాదాపు కోటి రూపాయలు వసూలు చేసినట్లు వెల్లడించారు.

ఒకే ఫ్రేమ్‌లో AP, తెలంగాణ, కర్ణాటక CMలు.. రీజన్ ఇదే!
తుంగభద్ర ప్రాజెక్టుకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ డెవలప్‌మెంట్ జరిగింది. కర్ణాటకలోని హోస్పేట్‌లో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లను కేంద్రమంత్రి CR పాటిల్‌తో పాటు కర్ణాటక, AP, తెలంగాణ CMలు కలిసి గ్రాండ్‌గా ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రాజెక్టు 17వ గేటును కేంద్రమంత్రి CR పాటిల్, 18వ గేటును కర్ణాటక CM, 19వ గేటును AP CM, అలాగే 20వ గేటును తెలంగాణ CM ప్రారంభించారు. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు కేంద్రమంత్రి ఒకే వేదికపైకి వచ్చి ఈ కొత్త గేట్లను లాంచ్ చేయడం విశేషం.

BIG BOSSలో ఛాన్స్ ఇవ్వాలని SI రిక్వెస్ట్
AP: నంద్యాల జిల్లా గడివేముల పోలీస్‌స్టేషన్‌లో SIగా విధులు నిర్వహిస్తున్న నాగార్జునరెడ్డి BIG BOSS సీజన్-10లో తనకు కంటెస్టెంట్‌గా అవకాశం ఇవ్వాలని విడుదల చేసిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. విధి నిర్వహణలో కఠినంగా ఉండే SI నాగార్జునరెడ్డి, ఇంట్లో మాత్రం పక్కా ఫ్యామిలీ మెన్. తన ఇద్దరు కుమార్తెల కోరిక మేరకే తాను వీడియో చేస్తున్నట్లుగా స్వయంగా వెల్లడించారు. తన కూతుళ్లు ఇస్తున్న సపోర్టుతోనే BIG BOSSకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లుగా పేర్కొన్నాడు. దీనిపై ప్రభుత్వ నిబంధనలు, ఉన్నతాధికారులు అంగీకరిస్తారా? అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

ఇండియా హిస్టరీలోనే ఫస్ట్ టైం.. సుప్రీంకోర్టుకు లేడీ బాస్!
భారత న్యాయవ్యవస్థలో రాబోయే ఎనిమిదేళ్లలో (2025-2033) కీలక మార్పులు జరగబోతున్నాయి. సుప్రీంకోర్టుకు కాబోయే తదుపరి 8 మంది ప్రధాన న్యాయమూర్తుల (CJI) లిస్ట్ వచ్చేసింది. ప్రస్తుతం జస్టిస్ సూర్యకాంత్ సీజేఐగా కొనసాగుతుండగా, ఆ తర్వాత జస్టిస్ విక్రమ్ నాథ్ బాధ్యతలు తీసుకోనున్నారు. అయితే ఈ లిస్ట్‌లో బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే. 2027 సెప్టెంబర్‌లో జస్టిస్ B.V. నాగరత్న ఇండియాస్ ఫస్ట్ ఫీమేల్ చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించనున్నారు. వీరితో పాటు జస్టిస్ P.S. నరసింహ, J.B. పార్దివాలా, K.V. విశ్వనాథన్, జాయ్‌మల్య బాగ్చీ, విపుల్ పంచోలి ఈ లైన్‌లో ఉన్నారు.

సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న కూరగాయల ధరలు!
గృహిణులకు బ్యాడ్ న్యూస్! రెండు వారాల గడువులోనే మార్కెట్‌లో కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఎండ తీవ్రత వల్ల లోకల్ పంటలు దెబ్బతినడంతో ఇతర ప్రాంతాల నుండి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తోంది. ధర్మవరం, పుట్టపర్తి తదితర ప్రాంతాల్లో పచ్చిమిర్చి రూ.40 నుండి రూ.80 కి, మునక్కాయలు రూ.90 కి చేరాయి. క్యారెట్, బీట్‌రూట్ ధరలు కూడా రెట్టింపు అయ్యాయి. పశ్చిమాసియా వార్ ఎఫెక్ట్‌తో ఆల్రెడీ ఆయిల్ ధరలు పెరగ్గా, ఇప్పుడు వెజిటేబుల్స్ కూడా పెరగడంతో బడ్జెట్ తలకిందులైందని జనాలు జనాలు ఆందోళన చెందుతున్నారు. కొత్త పంట వచ్చే వరకు ఇదే పరిస్థితి ఉంటుందట.

ఫ్రీ ఫైర్ ఫ్రెండ్‌షిప్.. ఇంటి నుంచి వెళ్లిపోయిన అక్కాచెల్లెళ్లు
హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్రాంతానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు 8, 9 తరగతులు చదువుతున్నారు. స్మార్ట్‌ఫోన్‌కు అలవాటు పడిన వీరు తమ కుటుంబసభ్యుల మొబైల్ ఫోన్లలో ఫ్రీఫైర్ ఆడటం మొదలుపెట్టారు. గేమ్‌లో ఒకేసారి 4 నుంచి 16 మంది గ్రూప్‌గా కలిసి ఆడేందుకు వీలుండటంతో ఆట మధ్యలో వీరికి బిహార్‌కు చెందిన అపరిచిత వ్యక్తులతో పరిచయం ఏర్పడింది. గుర్తుతెలియని వ్యక్తుల మాయమాటలు నమ్మిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఇల్లు వదిలి రైలులో బిహార్‌కు బయల్దేరారు. పోలీసులు IP అడ్రస్, మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా APలోని ఏలూరు వద్ద వారిని సురక్షితంగా అదుపులోకి తీసుకున్నారు.

గ్రామస్తులను టెన్షన్ పెట్టిన మందు బాబు!
ఉత్తరప్రదేశ్ మహారాజ్‌గంజ్ జిల్లా పర్సాఖుర్ధా గ్రామంలో ఒక రేంజ్ హై-డ్రామా జరిగింది. దీనదయాళ్ అనే వ్యక్తి ఫుల్‌గా తాగేసి, ఏకంగా 11,000 వోల్టుల కరెంట్ స్తంభం ఎక్కి వైర్లపై ఉయ్యాల ఊగాడు. దీంతో టెన్షన్ పడ్డ గ్రామస్తులు బీతౌలి పోలీసులకు, విద్యుత్ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పవర్ సప్లై ఆపించారు. గంటల కొద్దీ కష్టపడి అతన్ని కిందకి దించారు. షాకింగ్ ఏంటంటే.. అతను స్తంభం ఎక్కడానికి జస్ట్ కొన్ని నిమిషాల ముందే పవర్ కట్ అవ్వడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

చిన్నారి జాను మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. జ్యోతిష్యుడు ఏం చెప్పారంటే?
చిన్నారి జాను మిస్ అయి 19 రోజులు అవుతున్నా ఇంకా ఎలాంటి క్లూ దొరకలేదు. ఈ టైమ్‌లో ఒక జ్యోతిష్యుడు చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆ పాపను ఎవరో కిడ్నాప్ చేసి ఈస్ట్ డైరెక్షన్ వైపు తీసుకెళ్లారని, ఇంటికి ఒక 100 కిలోమీటర్ల దూరంలో పాప సేఫ్‌గా ఉందని ఆయన ప్రెడిక్ట్ చేశారు. అంతేకాదు, జూలై నుండి సెప్టెంబర్ నెలల మధ్యలో జాను మళ్లీ ఇంటికి వచ్చేస్తుందని చెప్పారు.

హైదరాబాద్‌లో మొదటి IT టవర్ ఇక లేదు!
హైదరాబాద్ బేగంపేటలో ఉన్న మొదటి IT టవర్ ఇక లేదు. 1987లో ఇక్కడ అమెరికాకు చెందిన 'ఇంటర్ గ్రాఫ్ కన్సల్టింగ్' అనే ఫస్ట్ MNC కంపెనీని స్టార్ట్ చేశారు. అయితే రీసెంట్‌గా ఈ బిల్డింగ్ కింద ఉన్న అండర్‌గ్రౌండ్ వాటర్ సంపు బాగా దెబ్బతింది. దీంతో బిల్డింగ్ సేఫ్టీ కాదని భావించిన మేనేజ్‌మెంట్. దాన్ని కూల్చేయాలని డిసైడ్ అయింది. ఈ విషయాన్ని పోలీసులు కన్ఫర్మ్ చేశారు. దీంతో హైదరాబాద్ IT ప్రస్థానంలో ఒక ల్యాండ్‌మార్క్ బిల్డింగ్ కనుమరుగవుతోంది.

కారులో మంటలు.. క్షణాల్లో బతికి బయటపడ్డ ఏడుగురు
TG: ఖమ్మం - దేవరపల్లి నేషనల్ హైవేపై వేంసూరు వద్ద కారులో మంటలు చెలరేగి దగ్ధమైంది. హైదరాబాద్ నుంచి అన్నవరం వెళ్తోన్న కారు ముందు టైరు పేలి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. లింగంపాలెం ఎగ్జిట్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో ఒక్కసారిగా మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో ఉన్న ఏడుగురు స్వల్ప గాయాలతో భయటపడ్డారు. పెను ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు.

నల్గొండ హత్య కేసులో ట్విస్ట్.. కూతురే సుపారీ ఇచ్చి చంపించింది
TG: నల్గొండలోని తెలంగాణ కాలనీలో భార్యాభర్తలు సుల్తాన్(45), హసీనా(40), కొడుకు ముజామిల్ (21), కూతురు అక్సర (11) లు అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆత్మహత్యా? హత్యా? అనేక అనుమానాల నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నలుగురి హత్య కేసులో సుపారీ హత్య చేయించింది కూతురేనని పోలీసుల దర్యాప్తులో తేలింది. హత్య జరిగిన ఇల్లు మృతురాలు హసీనాకు చెందినది. సుల్తాన్‌తో పెళ్లి కాకముందే హసీనా ఈ ఇంటిని నిర్మించుకుంది. ఆస్తిని దక్కించుకోవాలనే దురాశతో హసీనా మొదటి భర్త కూతురు బుషా బుటానీ సుఫారీ హత్య చేయించినట్లు గుర్తించారు.

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆర్డర్స్!
ఇంజినీరింగ్ కాలేజీల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై క్లారిటీ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. "కోట్లలో బకాయిలు ఉంటే కాలేజీల మేనేజ్‌మెంట్ ఎలా సాధ్యం? స్టూడెంట్స్ నుండి ఫీజులు వసూలు చేయొద్దంటే ప్రస్తుత అడ్మిషన్లు ఎలా ఇస్తారు?" అని ప్రశ్నించింది. రీయింబర్స్‌మెంట్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఫండ్స్ గందరగోళంపై పూర్తి రిపోర్ట్ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఫైనల్ డేట్ చెప్పాలంటూ హైకోర్టు ఈ కేసు విచారణను గురువారానికి వాయిదా వేసింది.

నేడు కింగ్ ఆఫ్ పాప్ వర్ధంతి
అద్భుతమైన గాత్రంతో, విభిన్నమైన లైవ్ డాన్స్ స్టెప్స్‌తో సంగీత ప్రపంచంలో రాజుగా ఏలిన మైకేల్ జాక్సన్ వర్ధంతి. ఈరోజు. ఎంతో కృషితో ఆయన సృష్టించిన సిగ్నేచర్ 'మూన్‌వాక్' స్టెప్, సరికొత్త కాన్సెప్ట్ వీడియోలు అప్పట్లో ఒక సంచలనం. లైవ్‌గా పాడుతూ విభిన్నమైన నృత్యం చేయడం కేవలం ఆయనకే సాధ్యమైంది. ఆయన భౌతికంగా దూరమైనా.. ఆ మ్యూజిక్ క్వాలిటీ నేటి జనరేషన్‌కు కూడా బలంగా కనెక్ట్ అవుతూ ఎప్పటికీ అజరామరంగా నిలుస్తోంది.

షాకింగ్.. హాస్టల్లో ఇంటర్ స్టూడెంట్ డెలివరీ!
హైదరాబాద్ గోల్కొండలోని ఒక మైనారిటీ హాస్టల్లో అమానవీయ ఘటన జరిగింది. ఒక ఇంటర్ స్టూడెంట్ హాస్టల్ బాత్రూంలో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆపై ఏడుపు వినపడకుండా ముక్కు, నోరు నొక్కేయడంతో శిశువు చనిపోయింది. అనంతరం మృతదేహాన్ని థర్డ్ ఫ్లోర్ నుండి కిందకు విసిరేసింది. ప్రిన్సిపాల్ సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితురాలిని గుర్తించారు. మేనబావ వల్లే గర్భం దాల్చినట్లు ఆమె ఒప్పుకుంది. ప్రస్తుతం పోలీసులు నిందితుడి కోసం సెర్చ్ చేస్తున్నారు.

ఫకీరు వేషంలో వచ్చి నగదు కొట్టేశాడు
AP: నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలంలోని సౌరదిన్నె గ్రామంలో ఫకీరు వేషంలో వచ్చిన ఓ దుండగుడు మహిళను మోసం చేసి నగదును అపహరించాడు. పూజలు చేయాలని చెప్పి బయటకు పంపి ఇంట్లోకి చొరబడ్డ దొంగ రూ.50 వేల నగదును దోచుకెళ్లాడు. బాధితురాలు కాశింభీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్!
గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్! డాలర్ స్ట్రాంగ్ అవ్వడం, ఇంటర్నేషనల్ మార్కెట్ ఎఫెక్ట్‌తో బంగారం ధరలు వరుసగా రెండో రోజూ భారీగా తగ్గాయి. ఈరోజు హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ప్రైస్ రూ.1,40,130 కాగా. 22 క్యారెట్ల రేటు రూ.1,28,450 గా ఉంది. అటు సిల్వర్ రేట్ కూడా తగ్గి కిలో వెండి రూ.2,30,000 కి పడిపోయింది. బంగారం కొనాలనుకునే వారికి ఇదే బెస్ట్ టైమ్. కానీ ప్రైసెస్ ఎప్పుడైనా మారొచ్చు, కాబట్టి షాపింగ్‌కి వెళ్లే ముందు ఒకసారి లైవ్ రేట్ చెక్ చేసుకోండి.

20రోజులైనా దొరకని చిన్నారి ఆచూకీ.. తల్లి ఆస్పత్రిపాలు
AP: కాకినాడ జిల్లా తుని మండలం CH అగ్రహారంలో మిస్సైన చిన్నారి జ్ఞానేశ్వరి (జాను) ఆచూకీ 20 రోజులు దాటినా దొరకలేదు. చిన్నారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా జరుగుతున్నప్పటికీ, బిడ్డ దూరమవడంతో జ్ఞానేశ్వరి తల్లి భవానికి తీవ్రమైన దిగులుతో మంచాన పడ్డారు. నిద్ర, ఆహారం లేక ఆమె ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబసభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. చిన్నారి ఆచూకీ కోసం అధికారులు, పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఏ చిన్న ఆధారాన్నీ వదిలిపెట్టకుండా ముమ్మరంగా గాలిస్తున్నారు.