← Back to news

నల్గొండ హత్య కేసులో ట్విస్ట్.. కూతురే సుపారీ ఇచ్చి చంపించింది

By DK· 25 Jun 2026· నల్గొండ జిల్లా
నల్గొండ హత్య కేసులో ట్విస్ట్.. కూతురే సుపారీ ఇచ్చి చంపించింది

TG: నల్గొండలోని తెలంగాణ కాలనీలో భార్యాభర్తలు సుల్తాన్(45), హసీనా(40), కొడుకు ముజామిల్ (21), కూతురు అక్సర (11) లు అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆత్మహత్యా? హత్యా? అనేక అనుమానాల నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నలుగురి హత్య కేసులో సుపారీ హత్య చేయించింది కూతురేనని పోలీసుల దర్యాప్తులో తేలింది. హత్య జరిగిన ఇల్లు మృతురాలు హసీనాకు చెందినది. సుల్తాన్‌తో పెళ్లి కాకముందే హసీనా ఈ ఇంటిని నిర్మించుకుంది. ఆస్తిని దక్కించుకోవాలనే దురాశతో హసీనా మొదటి భర్త కూతురు బుషా బుటానీ సుఫారీ హత్య చేయించినట్లు గుర్తించారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 21h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.