AP

మంత్రి ఆరోపణలపై ప్రకాష్ రాజ్ ఫైర్
AP· 5 Jul 2026

మంత్రి ఆరోపణలపై ప్రకాష్ రాజ్ ఫైర్

AP: నటుడు ప్రకాష్‌రాజ్‌కు, యూట్యూబర్, ప్రశ్న రావణ్‌కు మధ్య చీకటి సంబంధాలు ఉన్నాయని కందుల దుర్గేష్ ఆరోపించిన విషయం తెలిసిందే. మంత్రి వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్‌ స్పందించారు. వేర్వేరు సందర్భాల్లో నేను చేసే ట్విట్లను, మాట్లాడుకున్న వాయిస్ మెసెజెస్‌తో సోషల్ మీడియాలో లీక్ చేసి ప్రశ్న రావణ్, నేను మాట్లాడుతున్నట్లు పెట్టిన ఆడియో అవాస్తవమని, దీన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రశ్నించే గొంతులను అణచివేయాలని అనుకోవడం సరికాదని ప్రకాష్ రాజ్ ఫైరయ్యారు. గాలి మాటలు సృష్టించి చేస్తున్న అక్రమ అరెస్టులను, దౌర్జన్యాన్ని తెలుగు ప్రజలు చూస్తున్నారన్నారు.

ప్రశ్న రావణ్‌ మరోసారి అరెస్ట్
AP· 5 Jul 2026

ప్రశ్న రావణ్‌ మరోసారి అరెస్ట్

AP: ఇప్పటికే నాలుగు వేర్వేరు కేసుల్లో అరెస్టై బెయిల్ పొందిన ప్రశ్న రావణ్‌ను తాజాగా ఐదోసారి పోలీసులు అరెస్ట్ చేశారు. డిప్యూటీ CM పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ప్రశ్న రావణ్‌పై రాష్ట్రవ్యాప్తంగా PSలలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు ఆయన్ను వరుసగా అరెస్టు చేస్తున్నారు. శుక్రవారం రాత్రి కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం మచిలీపట్నం నుంచి ఆయనను నక్కపల్లి రూరల్ సర్కిల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తాజాగా గన్నవరం స్టేషన్‌లో నమోదైన కేసులో ఆదివారం తెల్లవారుజామున రావణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

నన్ను చంపవచ్చు కానీ ప్రశ్నను చంపలేరు
AP· 5 Jul 2026

నన్ను చంపవచ్చు కానీ ప్రశ్నను చంపలేరు

AP: యూట్యూబర్ రావణ్ అలియాస్ జోసెఫ్‌ను మరో కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే నాలుగుసార్లు రావణ్‌ను అరెస్ట్ చేయగా, నాలుగు సార్లు బెయిల్ వచ్చింది. ఎలమంచిలి కోర్టులో రావణ్ బెయిల్‌పై విడుదలైన కాసేపటికే నక్కపల్లి టోల్ ప్లాజా వద్ద ఏలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. తనపై కావాలనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని రావణ్ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. కావాలంటే తననను స్టేషన్‌లోనే చంపేయాలని అన్నారు. తనను చంపకుండా స్టేషన్ల చుట్టూ తిప్పినా తానే ఆహారం మానేసి చనిపోతానని అన్నాడు. తనను చంపవచ్చు కానీ ప్రశ్నను చంపలేరని అన్నారు.

షాకింగ్.. కొబ్బరిబొండమే ఇద్దరి ప్రాణాలు తీసింది
AP· 4 Jul 2026

షాకింగ్.. కొబ్బరిబొండమే ఇద్దరి ప్రాణాలు తీసింది

AP: రాజమహేంద్రవరానికి చెందిన పురోహితుడు దువ్వురి హరిప్రసాద్(52) చిన్న కుమారుడి వివాహం హైదరాబాద్‌లో జరిగింది. వివాహ వేడుకలు ముగించుకుని హరిప్రసాద్ తన కారు వెనుక సీట్లో పూజాసామాగ్రితో రాజమహేంద్రవరం తిరుగు ప్రయాణమయ్యారు. గొల్లపూడి బైపాస్ రోడ్డు సమీపంలో కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టి, ఆపై రోడ్డు పక్కన ఆగి ఉన్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. హరిప్రసాద్ స్పాట్‌లోనే మృతి చెందగా, బైక్‌పై ఉన్న వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయారు. కొబ్బరిబొండం డ్రైవింగ్ సీట్ కింద ఉన్న బ్రేక్, క్లచ్ పెడల్స్ మధ్య ఇరుక్కోవడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

మరో కేసులో ప్రశ్న రావణ్ అరెస్ట్
AP· 4 Jul 2026

మరో కేసులో ప్రశ్న రావణ్ అరెస్ట్

AP: ప్రముఖ యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్‌ను మరో కేసులో పోలీసులు అరెస్టు చేశారు. CM చంద్రబాబు నాయుడు, డిప్యూటీ CM పవన్ కళ్యాణ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసుల్లో ఆయన మూడు రోజుల వ్యవధిలో వరుసగా మూడుసార్లు అరెస్టయ్యారు. తొలుత పిఠాపురం పోలీసులు అతన్ని హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా బెయిల్ మంజూరైంది. విడుదలైన వెంటనే సర్పవరం పోలీసులు 2025 నాటి మరో కేసులో అదుపులోకి తీసుకోగా, ఆ కేసులోనూ కోర్టు బెయిల్ ఇచ్చింది. బెయిల్ రాగానే మరో కేసులో రావణ్‌ను అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పోలీసులు అరెస్ట్ చేశారు.