AP

కూతురు కోసం తండ్రి కన్నీటి పోరాటం
AP· 3 Jul 2026

కూతురు కోసం తండ్రి కన్నీటి పోరాటం

AP: కాకినాడ జిల్లా తుని మండలం CH అగ్రహారంలో చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సై 27 రోజులైనా ఆచూకీ దొరకకపోవడంతో కుటుంబసభ్యులను తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏజెన్సీ ప్రాంతాలలో క్షుణ్ణంగా గాలిస్తున్నారు. CCTV ఫుటేజీలను పరిశీలించడంతో పాటు, స్థానికులను విచారిస్తూ పాప ఆచూకీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. తమ బిడ్డ కోసం తండ్రి గణేష్ పడుతున్న ఆవేదన అంతా ఇంతా కాదు. గణేష్ స్వయంగా లంబసింగి, చింతపల్లి పరిసర ప్రాంతాల్లోని ప్రధాన కూడళ్లలో జ్ఞానేశ్వర్ ఫోటోలతో కూడిన వాల్ పోస్టర్లను అతికించారు. పాప కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.

పెళ్లి వేడుకలో తీవ్ర విషాదం
AP· 3 Jul 2026

పెళ్లి వేడుకలో తీవ్ర విషాదం

AP: ఆనందోత్సాహాల మధ్య జరగాల్సిన పెళ్లి వేడుక విషాదంగా మారింది. మార్కాపురం జిల్లా గిద్దలూరులోని నల్లబండ బజార్‌కు చెందిన ఆవుల వీరక్కకు, కంభంకు చెందిన పాములేటితో శుక్రవారం వివాహం జరగాల్సి ఉంది. వినాయకుడి ఆలయం వద్ద పెళ్లికూతురితో కొబ్బరికాయ కొట్టించి పూజలు నిర్వహించేందుకు పెళ్లి బృందం ఆగింది. అదే సమయంలో లారీ అదుపుతప్పి ఆటోతోపాటు అక్కడున్న వారిపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో అలకనంద(19), అంకాలు(20), నగేష్(17), చిన్నారి నాగేశ్వరి మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. పెళ్లికూతురు వీరక్కతోపాటు మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి.

చిన్నారి కోసం 6KM నడిచిన వార్డెన్
AP· 2 Jul 2026

చిన్నారి కోసం 6KM నడిచిన వార్డెన్

AP: పార్వతీపురం మన్యం జిల్లాలోని ఓ గిరిజన గ్రామానికి చెందిన 7వ తరగతి విద్యార్థిని భువనేశ్వరి ఫీవర్‌తో బాధపడుతోంది. బాలిక పరిస్థితి విషమంగా మారింది. ఆమెను తక్షణమే హాస్పిటల్‌కు తరలించాల్సి ఉండగా, ఆ గ్రామానికి కనీస రోడ్డు మార్గం లేకపోవడంతో అంబులెన్స్, బైక్ కూడా వెళ్లలేని పరిస్థితి. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హాస్టల్ వార్డెన్ హేమ బాలికను తన భుజాలపై కూర్చొబెట్టుకుని కొండలు, గుట్టలు దాటి 6KM మేర భుజాలపై మోసుకుంటూ కాలినడకన ప్రధాన రహదారికి తీసుకువచ్చారు. అక్కడ నుంచి వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి సకాలంలో వైద్యసేవలు అందేలా చూశారు.

కలెక్టర్ షాకింగ్ కామెంట్స్.. ఉద్యోగులు ఆగ్రహం
AP· 2 Jul 2026

కలెక్టర్ షాకింగ్ కామెంట్స్.. ఉద్యోగులు ఆగ్రహం

AP: సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ కింది స్థాయిలో ఉద్యోగులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆయా నియోజకవర్గాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) విధులకు సంబంధించి జిల్లా అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. SIR ప్రక్రియ విధుల్లో ఎవరైనా సరిగా పనిచేయకపోతే.. లాగిపెట్టి కొట్టండి అంటూ అధికారుల ముందే కలెక్టర్ అనడం సంచలనంగా మారింది. కలెక్టర్ వ్యాఖ్యలపై జిల్లాలోని ఉద్యోగులు, సిబ్బంది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

AP మహిళలు కష్టపడి పనిచేస్తారు
AP· 2 Jul 2026

AP మహిళలు కష్టపడి పనిచేస్తారు

AP: తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మదనపాలెంలో హీరో మోటోకార్ప్ సంస్థ రూ.750 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న 'గ్లోబల్ పార్ట్స్ సెంటర్ 2.0' కు CM చంద్రబాబు శంకుస్థాపన చేశారు. హీరో మోటోకార్ప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పవన్ ముంజాల్‌తో కలిసి ఆయన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. సీఎం మాట్లాడుతూ.. '2018లో హీరో మోటార్స్ సంస్థ వేరే రాష్ట్రంలో ప్లాంట్ పెట్టాలనుకున్నప్పుడు, వారితో చర్చించి ఇక్కడే రూ.1,600 కోట్లతో ప్లాంట్ ఏర్పాటుచేసేలా ఒప్పించామన్నారు. AP మహిళలు కష్టపడి పనిచేస్తారు, త్వరగా నైపుణ్యాలు నేర్చుకుంటారు. హీరో ప్లాంట్లో 40% మంది మహిళలే పనిచేస్తుండటం గర్వకారణం అని అన్నారు.

వాయిస్ మెసేజ్‌తో ప్రభుత్వానికి ఫిర్యాదు
AP· 30 Jun 2026

వాయిస్ మెసేజ్‌తో ప్రభుత్వానికి ఫిర్యాదు

AP: ప్రజలతో నిత్యం సంబంధాలున్న శాఖలు, విభాగాల్లో ప్రభుత్వ సేవలు పొందడం సులభతరం చేయాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో వివిధ శాఖల పనితీరుపై CM సమీక్షించారు. ప్రజా ఫిర్యాదుల వ్యవస్థను ప్రజలకు మరింత అందుబాటులోకి తేవాలని, దీని కోసం ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పించాలని సూచించారు. వాయిస్ మెసేజ్ ద్వారా కూడా ఫిర్యాదులు స్వీకరించాలని, నెట్‌వర్క్ సమస్యలు లేకుండా చూడాలన్నారు. సుమారు 3వేల ప్రాంతాల్లో కనెక్టివిటీ సమస్య ఉందని, రాబోయే మూడు నెలల్లో సమస్య పరిష్కరించేలా నెట్‌వర్క్ సంస్థలతో మాట్లాడాలని అధికారులను ఆదేశించారు.