Crime

కాలం చెల్లిన పదార్థాలతో బేకరీ ఐటమ్స్
Crime· 18 Jul 2026

కాలం చెల్లిన పదార్థాలతో బేకరీ ఐటమ్స్

TG: హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు బేకరీలు, స్వీట్లు, కేకులు, బిస్కెట్ల తయారీ కేంద్రాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. తనిఖీల్లో తీవ్ర అపరిశుభ్రత, ఈగలు, పురుగులు పట్టిన ఆహార పదార్థాలతో తయారీ జరుగుతున్నట్లు గుర్తించారు. కొన్ని యూనిట్లలో కాలం చెల్లిన రంగులు, ఫ్లేవర్లు వినియోగించడంతో పాటు తయారీ తేదీ, ఎక్స్‌పైరీ వివరాలు లేకుండానే ఉత్పత్తులను విక్రయానికి సిద్ధం చేసినట్లు తేలింది. మరికొన్ని కేంద్రాలు FSSAI లైసెన్స్‌ గడువు ముగిసినా, పాతవాటితోనే గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారాలు సాగిస్తున్నట్లు తనిఖీల్లో బయటపడింది.

హుబ్బళ్లిలో రేప్ బాధితురాలి బిడ్డ అమ్మకం- ఆ మైనర్ మళ్లీ ప్రిగ్నెంట్
Crime· 17 Jul 2026

హుబ్బళ్లిలో రేప్ బాధితురాలి బిడ్డ అమ్మకం- ఆ మైనర్ మళ్లీ ప్రిగ్నెంట్

కర్ణాటకలోని హుబ్బళ్ళిలో అత్యంత ఘోరమైన ఘటన వెలుగుచూసింది. 2025లో పలుమార్లు లైంగిక దాడికి గురై ప్రిగ్నెంట్ అయిన ఒక మైనర్ బాలికకు పుట్టిన శిశువును, ఆమె తల్లిదండ్రులు వేరే కుటుంబానికి అమ్మేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం ఆ బాలిక మళ్లీ గర్భం దాల్చడం కలకలం రేపింది. ఈ ఘటనపై నిందితుడితో పాటు, గర్భాన్ని దాచిపెట్టిన తల్లిదండ్రులు, లీగల్ ప్రొసీజర్స్ పాటించకుండా ట్రీట్మెంట్ ఇచ్చిన ఇద్దరు ప్రైవేట్ వైద్యులపై పోక్సో (POCSO) , భారతీయ న్యాయ సంహిత (BNS) కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గర్భవతి అయిన స్కూల్ చిన్నారి.. ఇద్దరిపై పోక్సో కేసు!
Crime· 17 Jul 2026

గర్భవతి అయిన స్కూల్ చిన్నారి.. ఇద్దరిపై పోక్సో కేసు!

నల్లగొండ జిల్లా అనుముల మండలంలో ఘోరం జరిగింది. ఒక స్కూల్ గర్ల్‌ను ఇద్దరు యువకులు బెదిరించి, పలుమార్లు రేప్ చేశారు. మొదట ఒక యువకుడు మాయమాటలతో లొంగదీసుకోగా, ఆ విషయం తెలిసిన మరో యువకుడు బ్లాక్‌మెయిల్ చేస్తూ అత్యాచారానికి పాల్పడ్డాడు. రీసెంట్‌గా ఆ బాలిక ప్రెగ్నెంట్ అవ్వడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. పేరెంట్స్ కంప్లైంట్‌తో అలర్ట్ అయిన పోలీసులు నిందితులపై POCSO యాక్ట్ కింద కేసు బుక్ చేశారు. ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఈ ఇన్సిడెంట్‌పై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆస్తి కోసం అత్తను చంపింది
Crime· 17 Jul 2026

ఆస్తి కోసం అత్తను చంపింది

TG: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం తూర్పుగూడెంలో కొణతం భాగ్యమ్మ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో మృతురాలి కోడలు మధురనే హత్య చేసినట్లు తేలింది. భాగ్యమ్మకు 6ఎకరాల భూమి ఉంది. భూమిలో వాటా కావాలని కుమార్తె శోభారాణి కోర్టులో కేసు వేసింది. దీంతో అత్తా, కోడళ్ల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అత్తను చంపాలని డిసైడ్ అయిన మధుర, ఆమెను గట్టిగా నెట్టివేసింది. మళ్లీ లేవగా, వెనుక నుంచి చేతులతో మెలివేసి మంచంపైకి నెట్టి చంపినట్లు DSP ప్రసన్నకుమార్ తెలిపారు. మధురను అరెస్ట్ చేశామన్నారు.

అమ్మవారి తాళిబొట్టు కూడా వదల్లేదు
Crime· 16 Jul 2026

అమ్మవారి తాళిబొట్టు కూడా వదల్లేదు

AP: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలోని ఎల్లమ్మ టెంపుల్‌లో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఆలయ ప్రధాన గేటు తాళాలు పగులగొట్టిన దొంగలు CCTV కెమెరాలను ధ్వంసం చేశారు. అమ్మవారి విగ్రహానికి ఉన్న 11 గ్రాముల బంగారు తాళిబొట్టుతో పాటు, ఆలయ ప్రాంగణంలో ఉన్న మినరల్ వాటర్ కాయిన్ బాక్స్‌ను ఎత్తుకెళ్లారు. ఆలయంలో ఏళ్ల తరబడి హుండీ లెక్కింపు చేపట్టకపోవడంతో అందులో భారీగా నగదు ఉన్నట్లు సమాచారం. దుండగులు ఆ హుండీని పగులగొట్టి నగదును దోచుకెళ్లారు. పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.