Crime

మహిళ పట్ల డెలివరీ బోయ్ అసభ్య ప్రవర్తన !
Crime· 12 Jul 2026

మహిళ పట్ల డెలివరీ బోయ్ అసభ్య ప్రవర్తన !

బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. ఓ డెలివరీ బోయ్ ఆర్డర్ ఇవ్వడానికి వచ్చి బలవంతంగా ఓ యువతి ఫ్లాట్ లోకి చొరబడి అడ్డుకుంటున్నా యూరినల్స్ అర్జెంట్ అంటూ డైరక్ట్ గా తోసుకుని లోపలికి వెళ్లి బాత్ రూమ్ లో దూరాడు. ఆపై బయటకొచ్చి తన ప్రైవేట్ పార్ట్ ను ఆ యువతికి చూపిస్తూ అసభ్యంగా బిహేవ్ చేసాడు. హడలి పోయిన బాధితురాలు అంత షాక్ లోనూ ఆ ఘటనను వీడియో తీసింది. ఈ దారుణంపై కన్నీరు మున్నీరవుతూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది. పోలీసులకు కంప్లైట్ చేస్తానని హెచ్చరించడంతో ఆ డెలివరీ బాయ్ అక్కడనుంచి జారుకున్నాడు. ఐటీ హబ్ బెంగళూరులో పట్టపగలు ఈ ఇన్సిడెంట్ మహిళలను భయపెడుతోంది.

జైలు నుంచి పోక్సో నిందితుడు ఎస్కేప్
Crime· 12 Jul 2026

జైలు నుంచి పోక్సో నిందితుడు ఎస్కేప్

TG: వనపర్తి జిల్లా అమరచింత మండలం నందిమల్ల గ్రామానికి చెందిన కిశోర్‌‌కుమార్‌ రెడ్డి సమీప బంధువైన బాలికను ప్రేమ వివాహం చేసుకున్నాడు. తమ కూతురు మైనర్‌ అని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కిశోర్‌పై పోక్సో కేసు నమోదు చేశారు. జూన్‌ 12న అతన్ని మహబూబ్‌నగర్ జైలుకు తరలించారు. అయితే కిశోర్‌ ఈ నెల 6న జైలు గోడ దూకి పారిపోయాడు. ఖైదీ పారిపోవడానికి జైలు సూపరింటెండెంట్‌ శశికాంత్‌ నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా గుర్తించారు. శశికాంత్‌ను చంచల్‌గూడ కేంద్ర కారాగారానికి బదిలీ చేశారు. ఇద్దరు వార్డెన్లను సస్పెండ్‌ చేసి మరికొందరికి ఛార్జ్‌ మెమోలు ఇచ్చారు.

షాబాద్ పోక్సో కేసులో ట్విస్ట్.. CI సస్పెండ్
Crime· 12 Jul 2026

షాబాద్ పోక్సో కేసులో ట్విస్ట్.. CI సస్పెండ్

TG: రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఆరుగురిని హత్య చేసిన రాజ్‌కుమార్ పోక్సో కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. బాధిత బాలిక కుటుంబం తనపై పెట్టిన పోక్సో కేసులో అరెస్ట్ అవ్వకుండా ఉండేందుకు రాజ్‌కుమార్ రూ.20 లక్షలు ఇచ్చాడని సమాచారం. అంత భారీ మొత్తంలో డబ్బులు ఇచ్చాడు కాబట్టే పోక్సో కేసులో కఠినమైన సెక్షన్లు పెట్టకుండా స్టేషన్ బెయిల్ వచ్చే బలహీన సెక్షన్లు పెట్టినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు ఉన్నతాధికారులు అంతర్గత విచారణ జరిపి ఒక్కొక్క అధికారిపై వేటు వేస్తున్నారు. ఇప్పటికే SI రమేష్‌ను సస్పెండ్ చేయగా, ఇప్పుడు CI కాంతారెడ్డిని సస్పెండ్ చేశారు.