బస్టాండ్‌లో యువతిని నరికి చంపిన ప్రేమోన్మాది
కర్ణాటక రాష్ట్రం మంగళూరు దగ్గర్లోని బంట్వాల్ బస్టాండ్‌లో లావణ్య(21) అనే యువతిని ఆమెకు దూరపు బంధువైన చేతన్ దారుణంగా నరికి చంపాడు. బస్టాండ్‌లో ఉన్న లావణ్యను కత్తితో పొడిచి అక్కడి నుండి పారిపోయాడు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని, ప్రేమను కాదన్నందుకే నిందితుడు లావణ్యను చంపేసుంటాడని అనుమానిస్తున్నారు.



