← Back to news

భార్యే విలనా? హై-సెక్యూరిటీ ఇంట్లో డాక్టర్ హత్య!

By sahani· 16 Jul 2026· Karnataka
భార్యే విలనా? హై-సెక్యూరిటీ ఇంట్లో డాక్టర్ హత్య!

కర్ణాటక ధార్వాడ్‌లోని ఓ హై-సెక్యూరిటీ అపార్ట్‌మెంట్‌లో డాక్టర్ కిరణ్ (45) కిరాతకంగా హత్యకు గురయ్యారు. ఆయన 8 ఏళ్ల కొడుకుపై కూడా కత్తితో దాడి జరగడంతో హాస్పిటల్‌లో క్రిటికల్ కండిషన్‌లో ఉన్నాడు. ఇన్సిడెంట్ టైంలో ఇంట్లోకి బయటి వ్యక్తులు ఎవరూ రాలేదని, కేవలం భార్య ప్రియాంక మాత్రమే ఉందని పోలీసులు కన్ఫర్మ్ చేశారు. బంధువుల ఫోన్లకు ఆమె పొంతన లేని ఆన్సర్స్ ఇవ్వడంతో ఈ కేసులో మరింత అనుమానాలు వ్యక్తమవుతున్నయి. ఫ్యామిలీ గొడవలే రీజన్ అని డౌట్ పడుతున్న పోలీసులు.. భార్యనే హత్య చేసి ఉంటుందనే కోణంలో విచారిస్తున్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 16h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.