Health

తెలంగాణలో సైలెంట్‌గా కరోనా వ్యాప్తి
Health· 22 Jul 2026

తెలంగాణలో సైలెంట్‌గా కరోనా వ్యాప్తి

TG: దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న వేళ తెలంగాణలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. APలో ఇప్పటికే కొవిడ్ కారణంగా నలుగురు మృతి చెందగా, హైదరాబాద్‌లో జలుబు, జ్వరం, దగ్గు లక్షణాలతో ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య పెరుగుతున్నట్లు డాక్టర్స్ తెలిపారు. అయితే ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఈ పరీక్షలు జరగకపోవడంతో కేసులు నిర్ధారణ కావడం లేదని సమాచారం. తార్నాకకు చెందిన ఓ మహిళ ఊపిరితిత్తులు దెబ్బతిని మృతి చెందిన ఘటనలో కూడా కొవిడ్ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టెస్టు కిట్ల కొరత, ముందస్తు జాగ్రత్తల లోపంపై ప్రజారోగ్య విభాగంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్ర‌తి 10 మందిలో 9 మందికి ర‌క్తంలో కొవ్వు స‌మ‌స్య‌: ICMR
Health· 20 Jul 2026

ప్ర‌తి 10 మందిలో 9 మందికి ర‌క్తంలో కొవ్వు స‌మ‌స్య‌: ICMR

భారతీయుల ఆరోగ్యంపై 'ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్-ఇండియా డయాబెటిస్' చేసిన సర్వేలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. దేశంలో ప్రతి 10 మంది పెద్దవారిలో తొమ్మిది మంది 'డైస్లిపిడెమియా'(రక్తంలో కొవ్వుల అసాధారణ నిష్పత్తి) సమస్యతో బాధపడుతున్నారని తెలిపింది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం, మంచి కొలెస్ట్రాల్ తగ్గడం వల్ల గుండెపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్తున్నారు. ఈ సమస్య సిటీలో 89%, గ్రామీణ ప్రాంతాల్లో 86.5% విస్తరించి ఉందని, పురుషుల కంటే మహిళల్లోనే దీని తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

ఆస్పత్రిలో MLA సర్‌ప్రైజ్ విజిట్
Health· 18 Jul 2026

ఆస్పత్రిలో MLA సర్‌ప్రైజ్ విజిట్

AP: అన్నమయ్య జిల్లా మదనపల్లె MLA షాజహాన్ బాషా శుక్రవారం రాత్రి బైక్‌పై ఒంటరిగా వచ్చి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఎమర్జెన్సీ వార్డును సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై వైద్యులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రోగులు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. విషం సేవించి చికిత్స పొందుతున్న ఓ మహిళను పరామర్శించి, ఆమెను వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని డాకర్లకు సూచించారు.

విజయవాడలో డయేరియా కలకలం
Health· 18 Jul 2026

విజయవాడలో డయేరియా కలకలం

AP: విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని గిరిపురంలో డయేరియా కలకలం రేపుతోంది. రెండు వీధులకు చెందిన సుమారు 20 మంది డయేరియా బారిన పడగా, పలువురు చికిత్స పొందుతున్నారు. కుళాయిల ద్వారా కలుషిత నీరు సరఫరా అవుతుండటమే దీనికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. గురువారం రాత్రి ఒకేసారి ఐదుగురు డయేరియా బాధితులను గుర్తించారు. శుక్రవారం మధ్యాహ్నం రెండేళ్ల చిన్నారికి తీవ్ర విరోచనాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. అధికారులు వెంటనే స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని, హెల్త్ క్యాంప్‌లు ఏర్పాటు చేసి బాధితులకు చికిత్స అందించాలని కోరారు.

కరోనా కలకలం.. ఎయిమ్స్‌లో ప్రత్యేక వార్డు
Health· 16 Jul 2026

కరోనా కలకలం.. ఎయిమ్స్‌లో ప్రత్యేక వార్డు

AP: గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రికి కొవిడ్ అనుమానిత లక్షణాలతో వచ్చిన ఓ వ్యక్తికి డాక్టర్స్ చికిత్స అందించారు. బాధితుడిని హోం ఐసోలేషన్‌లో ఉండాలని ఇంటికి పంపించారు. ఇటీవల జ్వరాల బారిన పడుతున్న బాధితుల సంఖ్య పెరుగుతుండటం, కొవిడ్ లక్షణాలు కనిపిస్తుండటంతో ఎయిమ్స్ డాక్టర్స్ ముందస్తు చర్యలు చేపట్టారు. ఎయిమ్స్ ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఫీవర్ వార్డును ఏర్పాటు చేశారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు, జ్వరంతో వచ్చే రోగులకు ఇక్కడే ప్రత్యేక వైద్యసేవలు అందించేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎయిమ్స్‌లో కరోనా కలకలం రేపడంతో గుంటూరు (GGH) వైద్యులు అలెర్ట్ అయ్యారు.