← Back to news

కరోనా కలకలం.. ఆరోగ్యశాఖ హైఅలర్ట్

By DK· 22 Jul 2026
కరోనా కలకలం.. ఆరోగ్యశాఖ హైఅలర్ట్

APలో కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఒకే రోజు గుంటూరు జిల్లాలో 4, తూర్పుగోదావరిలో 2, బాపట్లలో ఒకటి చొప్పున మొత్తం 7 కొత్త కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 26కు చేరింది. ప్రస్తుతం 10 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, 9 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ముగ్గురు కోలుకోగా, ఇప్పటివరకు నలుగురు మరణించారు. కేసుల పెరుగుదలతో ఆరోగ్యశాఖ అప్రమత్తమై, 17 బోధనాస్పత్రుల్లో 255 ప్రత్యేక కొవిడ్ పడకలు సిద్ధం చేసింది. మాస్కులు, PPE కిట్లు, శానిటైజర్లు కూడా అందుబాటులో ఉంచింది.

More in Health