International· 20 Aug 2026
బీఫ్ మాంసం ఎగుమతుల్లో భారత్ రికార్డ్!
భారత్ నుంచి గేదె మాంసం ఎగుమతులు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. 2025-26లో ఇవి 25.6% పెరిగి 5.1 బిలియన్ డాలర్లకు చేరగా, 2026-27లో 6 బిలియన్ డాలర్లు దాటొచ్చని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వియత్నాం, ఈజిప్ట్, మలేషియా, UAE, రష్యా, ఉజ్బెకిస్తాన్ మార్కెట్లకూ వ్యాపారం విస్తరించింది. భారత్లో బీఫ్ ఎగుమతికి అనుమతి లేదు. పాలివ్వని, వయసు మళ్లిన, సంతానోత్పత్తి లేని గేదెల మాంసాన్నే ఎగుమతి చేస్తారు. పాత గేదెలను అమ్మితే వచ్చే డబ్బుతో రైతులు కొత్తవాటిని కొంటూ పాడి పరిశ్రమను అభివృద్ధి చేసుకుంటున్నారు.