← Back to news

మయన్మార్‌లో మిలిటరీ దారుణం.. బౌద్ధ విహారంపై అటాక్

By Mahesh· 22 Aug 2026· Myanmar
మయన్మార్‌లో మిలిటరీ దారుణం.. బౌద్ధ విహారంపై అటాక్

మయన్మార్‌లో మిలిటరీ దారుణానికి పాల్పడింది. సాగైంగ్ దగ్గరలోని ఓ బౌద్ధ మఠంపై నిన్న ఎయిర్‌స్ట్రైక్ చేసింది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. బౌద్ధుల వారం రోజుల ధ్యాన కార్యక్రమం జరుగుతుండగా అటాక్ జరిగింది. దాదాపు 100 మంది అక్కడ ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఫైటర్ జెట్ రెండు బాంబులు వేసినట్లు కొన్ని సంస్థలు తెలిపాయి. ఈ ఘటనపై మయన్మార్ సైన్యం ఇంకా రెస్పాండ్ అవ్వలేదని తెలుస్తోంది.

More in International