Local· 17 Aug 2026
రేపు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి
TG: బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి వేడుకలకు రేపు జోగులాంబ గద్వాలలో ఘనంగా నిర్వహించనున్నారు. జిల్లా గౌడ సంఘం, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ కుల సంఘాల ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరగనున్నాయి. కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా ఉన్న గౌడ సోదరులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘ నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు TGSGDCFL చైర్పర్సన్ శ్రీమతి సరితా తిరుపతయ్య కోరుతున్నారు.