← Back to news

అదర్శ గంగదేవిపల్లి ఎందరికో నేర్పుతోంది!

By Naveed Mohd.· 17 Aug 2026
అదర్శ గంగదేవిపల్లి ఎందరికో నేర్పుతోంది!

TG: గ్రామాభివృద్ధిలో అదర్శంగా నిలిచిన వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గంగదేవిపల్లి గ్రామానికి సందర్శకులు పెరుగుతున్నారు. నందిపేట్ మండల సర్పంచ్‌లు, ఫోరం ప్రతినిధులు ఈ గ్రామాన్ని సందర్శించారు. అధ్యక్షుడు లింగం అధ్వర్యంలో వివిధ గ్రామాల సర్పంచ్‌లు గంగదేవిపల్లిలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి తెలుసుకున్నారు. ఈ గ్రామం 100 శాతం అక్షరాస్యత సాధించడంతోపాటు, సంపూర్ణ మద్యపాన నిషేధం, పరిశుభ్ర నిర్వహణ, స్వయం సమృద్ధిలో ముందుంది.<br>ప్రజల భాగస్వామ్యంతో ఈ విజయాలను ఎలా సాధించారో సర్పంచ్‌లు తెలుసుకున్నారు.

More in Local