Motivational· 13 Apr 2026
వయసు 55 డిగ్రీలు 138
చదువుకి వయసుతో సంబంధం లేదని అంటారు కదా..? ఈ విషయాన్ని 55 ఏళ్ల రాజస్థాన్ ఎక్స్-ఆర్మీ మ్యాన్ దశరథ్ సింగ్ నిరూపించాడు. ఝుంఝును జిల్లా ఖిరోడ్ గ్రామం నుంచి వచ్చిన ఆయనకి మొత్తం 138 డిగ్రీలున్నాయి. లేటెస్ట్గా IGNOU నుంచి Vedic Studiesలో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నాడు.ఆర్మీలో 16 ఏళ్ల సర్వీస్ చేసి రిటైర్ అయ్యాక, స్టడీస్ మీద కాన్సన్ ట్రేట్ చేశాడు. 3 PhDs, 46 PGలు, 52 సర్టిఫికెట్ కోర్సులు చేశాడు. 11 వరల్డ్ రికార్డులు ఇతని పేరు మీద ఉన్నాయి.. ఇప్పుడు సైన్యంలో లీగల్ అడ్వైజర్ గా ఉన్నాడు. దశరథ్ సింగ్ నుంచి జెన్ జీ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది