TG

LBనగర్ ఆరంజ్ హాస్పిటల్‌లో మహిళ వీరంగం
TG· 28 Jun 2026

LBనగర్ ఆరంజ్ హాస్పిటల్‌లో మహిళ వీరంగం

TG: హైదరాబాద్‌ LBనగర్‌లో ఉన్న శ్రేష్ఠ ఆరెంజ్ హాస్పిటల్‌కు లలిత కరీర అనే మహిళ కడుపునొప్పి ఉందంటూ అర్ధరాత్రి అత్యవసర విభాగానికి వచ్చింది. విధుల్లో ఉన్న డాక్టర్స్ ఆమెకు ప్రాథమిక చికిత్స అందించి పరీక్షలు నిర్వహించగా, ఎలాంటి అనారోగ్య సమస్య లేదని నిర్ధారించారు. అనంతరం మహిళ ఒక్కసారిగా ఆగ్రహానికి లోనై వైద్యులు, నర్సులను అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడి చేసింది. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకుంది. ఎమర్జెన్సీ వార్డులో ఉన్న రోగులు, వారి బంధువులు టెన్షన్ పడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.

ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. జులై 15 నుంచి కొత్త స్కీమ్
TG· 28 Jun 2026

ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. జులై 15 నుంచి కొత్త స్కీమ్

TG : రాష్ట్రంలో ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) జులై 15 నుంచి ప్రారంభం కానుంది. ఈ పథకం అమలుకు వారంలోగా సమగ్ర మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు. ఉద్యోగుల హెల్త్ కేర్ ట్రస్ట్ మొదటి సమావేశం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షతన హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌లో నిర్వహించారు. ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసిందని CS తెలిపారు. గతంలో చికిత్సలకు గరిష్ఠంగా రూ.2 లక్షలు చెల్లించేవారని, దాన్ని ఒకేసారి చికిత్సకు కనీసం రూ.5 లక్షలిచ్చేలా మార్చాలని TS PRTU రాష్ట్ర అధ్యక్షుడు పుల్గం దామోదర్‌రెడ్డి కోరారు.

SIRతో అద్దె ఇంట్లో ఉండే వాళ్లలో టెన్షన్
TG· 28 Jun 2026

SIRతో అద్దె ఇంట్లో ఉండే వాళ్లలో టెన్షన్

TG: బతుకుదెరువు కోసం పట్టణాలు, నగరాలకు వచ్చి అద్దె ఇళ్లలో ఉంటున్న ప్రజలకు ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) భయం పట్టుకుంది. గతంలో ఒక ఇంట్లో అద్దెకు ఉండి అక్కడే ఓటు పొందినవారు. ఇప్పుడు ఆ చిరునామాలో లేకుంటే తమ ఓటు తీసేస్తారా? అనే డౌట్‌తో టెన్షన్ పడుతున్నారు. కొత్త ఇంటి అడ్రస్‌కు సంబంధించిన రుజువుపత్రాలు లేకుంటే ఏం చేయాలని ప్రశ్నిస్తున్నారు. అద్దెకు ఉంటున్నవారికి ప్రస్తుతం నివసిస్తున్న చిరునామాలో ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. తమ నివాసాన్ని నిర్ధారించే ఆధారాలు సమర్పించాలి. అడ్రస్ ఫ్రూప్ లేకపోతే BLOలు విచారణ చేసి నిర్ధారిస్తారు.

బస్సులో మహిళ ప్రాణాలు కాపాడిన RTC డ్రైవర్, కండక్టర్
TG· 27 Jun 2026

బస్సులో మహిళ ప్రాణాలు కాపాడిన RTC డ్రైవర్, కండక్టర్

TG: పెద్దపల్లి జిల్లా మద్దికుంట గ్రామానికి చెందిన తాండ్ర నిరోషా అనే మహిళ RTC బస్సులో వెళ్తోంది. ఆమెకు తీవ్రమైన ఛాతి నొప్పి రావడంతో బస్సు సీట్లోనే స్పృహ తప్పి పడిపోయింది. గమనించిన బస్సు కండక్టర్ సుమన్,, డ్రైవర్ రాజు వెంటనే అలర్ట్ అయ్యారు. బస్సును ఓదెలలోని 108 అంబులెన్స్ పాయింట్‌కు తీసుకొచ్చారు. మహిళను అంబులెన్స్ ఎక్కించి శ్రీరాంపూర్ గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం పెద్దపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించగా, ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. డ్రైవర్, కండక్టర్‌లను శాలువాలతో సన్మానించి అభినందించారు.

తెలంగాణకు ట్రంప్ స్పెషల్ థ్యాంక్స్
TG· 27 Jun 2026

తెలంగాణకు ట్రంప్ స్పెషల్ థ్యాంక్స్

హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ ఆఫీస్ పక్కనున్న రహదారికి తన పేరు పెట్టడంపై US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. తన పేరుతో రోడ్డుకు నామకరణం చేయడంపై తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విధంగా గౌరవాన్ని అందుకున్న తొలి అమెరికా అధ్యక్షుడిని తానేనని ట్రంప్ వెల్లడించారు. అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 23న హైదరాబాద్‌లో విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ ప్రత్యేక ఫలకాన్ని అమెరికా రాయబారి సెర్గియో గోర్‌తో కలిసి డిప్యూటీ CM భట్టివిక్రమార్క ఆవిష్కరించారు.

మూసీ నిర్వాసితులకు 2BHK ఇళ్లు
TG· 27 Jun 2026

మూసీ నిర్వాసితులకు 2BHK ఇళ్లు

TG: మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని CM రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మూసీ రివర్ ఫ్రంట్‌పై CM సమీక్ష నిర్వహించారు. భూసేకరణ కోసం ఆసక్తిగా ఉన్న వారికి టీడీఆర్ లేదా పరిహారం చెల్లించాలని రేవంత్ చెప్పారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం తీసుకుంటున్న రక్షణశాఖ భూముల్లో ఉన్న కార్యాలయాలను రాష్ట్ర ప్రభుత్వమే తరలించాలన్నారు. ప్రజల సందర్శన కోసం నెక్లెస్ రోడ్డులో మూసీ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మూసీ ప్రాజెక్టులో చేపట్టబోయే పనులు ఇందులో ప్రతిబింబించాలని అన్నారు.

అధికారుల అండతోనే బుక్ బిజినెస్: TGVP
TG· 25 Jun 2026

అధికారుల అండతోనే బుక్ బిజినెస్: TGVP

TG: నిజామాబాద్ జిల్లా బోధన్ టౌన్‌లో కొనసాగుతున్న పుస్తకాల వ్యాపారంపై తెలంగాణ విద్యార్థి పరిషత్(TGVP) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు విద్యాశాఖ అధికారులు అండదండలు ఉన్నాయని, వారి పోద్బలంతో ఇష్టరాజ్యంగా వ్యాపారం కొనసాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని TGVP నాయకులు మీసాల నగేష్ ఆరోపించారు. బోధన్ MEO నాగయ్యను తాము కలిసి సమస్యను విన్నవిస్తే పుస్తకాల విక్రయాలను అడ్డుకునే అధికారం తమకులేదని సమాధానం చెప్పారన్నారు. DEO అశోక్‌ను తాము ఫోన్‌లో సంప్రదిస్తే సరైన సమాధానం ఇవ్వకపోవడంలో అంతర్యం ఏంటని ప్రశ్నించారు.

ఫ్రీ ఫైర్ ఫ్రెండ్‌షిప్.. ఇంటి నుంచి వెళ్లిపోయిన అక్కాచెల్లెళ్లు
TG· 25 Jun 2026

ఫ్రీ ఫైర్ ఫ్రెండ్‌షిప్.. ఇంటి నుంచి వెళ్లిపోయిన అక్కాచెల్లెళ్లు

హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్రాంతానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు 8, 9 తరగతులు చదువుతున్నారు. స్మార్ట్‌ఫోన్‌కు అలవాటు పడిన వీరు తమ కుటుంబసభ్యుల మొబైల్ ఫోన్లలో ఫ్రీఫైర్ ఆడటం మొదలుపెట్టారు. గేమ్‌లో ఒకేసారి 4 నుంచి 16 మంది గ్రూప్‌గా కలిసి ఆడేందుకు వీలుండటంతో ఆట మధ్యలో వీరికి బిహార్‌కు చెందిన అపరిచిత వ్యక్తులతో పరిచయం ఏర్పడింది. గుర్తుతెలియని వ్యక్తుల మాయమాటలు నమ్మిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఇల్లు వదిలి రైలులో బిహార్‌కు బయల్దేరారు. పోలీసులు IP అడ్రస్, మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా APలోని ఏలూరు వద్ద వారిని సురక్షితంగా అదుపులోకి తీసుకున్నారు.