← Back to news

కొడుకులిద్దరి పరిస్థితిని తట్టుకోలేక.. తల్లి ఆత్మహత్య

By dk· 14 Aug 2026· హైదరాబాద్
కొడుకులిద్దరి పరిస్థితిని తట్టుకోలేక.. తల్లి ఆత్మహత్య

TG: రంగారెడ్డి జిల్లా జన్వాడకు చెందిన సుధ KPHB సర్దార్‌ పటేల్‌ నగర్‌లోని ఓ ప్రైవేట్‌ హాస్టల్‌లో హౌస్‌కీపింగ్‌‌గా చేస్తూ అక్కడే నివసిస్తోంది. ఆమెకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు తండ్రి హత్య కేసులో చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. చిన్న కుమారుడు గంజాయికి బానిసై తల్లిని తరచూ వేధిస్తున్నాడు. ఇద్దరు కొడుకులు పెడదోవ పట్టడంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు సుధ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

More in TG