Latest

📞 మొదటి Phone Call ఎవరికి చేశారు?
ఇప్పుడు రోజుకు ఎన్నో Calls చేస్తుంటాం.. కానీ మొబైల్ చరిత్రలో మొదటి కాల్ ఎవరికి చేశారో తెలుసా? 😏 1973 ఏప్రిల్ 3న Motorola ఇంజనీర్ మార్టిన్ కూపర్ న్యూయార్క్‌లోని ఓ వీధి నుంచి ప్రపంచంలోనే తొలి హ్యాండ్‌హెల్డ్ మొబైల్ కాల్ చేశారు. ఆశ్చర్యంగా.. ఆయన కాల్ చేసింది తన ప్రత్యర్థి సంస్థ Bell Labs ఇంజనీర్ జోయెల్ ఎంగెల్‌కే! అప్పటి Motorola DynaTAC ప్రోటోటైప్ దాదాపు 1 కిలో బరువు ఉండేది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 20–30 నిమిషాలే మాట్లాడగలిగేది. ఆ ఒక్క కాల్‌తో మొబైల్ కమ్యూనికేషన్‌లో కొత్త శకం మొదలైంది.📱

ఉద్యోగినికి కోయంబత్తూరు కంపెనీ సపోర్ట్.. Hatsoff
కోయంబత్తూరులోని ఓ కంపెనీ తన ఉద్యోగినికి గొప్ప సపోర్ట్ అందించింది. ఆమె తండ్రి మెడికల్ ఖర్చుల్లో 20 శాతం భరించింది. ఆమెకు 30 రోజుల సెలవు ఇచ్చింది. కంపెనీ ఛైర్మన్ వ్యక్తిగతంగా ఆమెకు మెసేజ్ చేసి పరిస్థితిని కనుక్కున్నారు. కంపెనీ 50 ఏళ్లకు పైగా పనిచేస్తోంది. ఇందులో 4,000 మందికి పైగా ఉద్యోగులున్నారు. సోషల్ మీడియాలో చాలామంది ఆ కంపెనీని పొగుడుతున్నారు. కార్పొరేట్ కంపెనీల కంటే ఇలాంటి చిన్న కంపెనీలు ఉద్యోగుల పట్ల శ్రద్ధ చూపుతాయని అంటున్నారు.

ఫూలే దంపతుల విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం
హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని ఐమ్యాక్స్ సర్కిల్ దగ్గర మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే విగ్రహాలను CM రేవంత్ రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ ప్రోగ్రామ్‌కు TPCC చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖలతో పాటు పలువురు MPలు, MLAలు అటెండ్ అయ్యారు. సొసైటీలో సమానత్వం, ఉమెన్ ఎడ్యుకేషన్ కోసం ఫైట్ చేసిన ఈ ఐకానిక్ కపుల్, క్యాస్ట్ డిస్క్రిమినేషన్‌కు వ్యతిరేకంగా పోరాడి అణగారిన వర్గాల డెవలప్‌మెంట్ కోసం తమ లైఫ్‌ను సాక్రిఫైస్ చేశారని CM ఈ సందర్భంగా తెలిపారు.

ఎర్రకోటపై 'వందేమాతరం' 150 ఏళ్ల పండగ!
ఈ ఆగస్టు 15న మనదేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోబోతోంది. ఢిల్లీ ఎర్రకోటపై ప్రధాని మోదీ జెండా ఎగరేసి జాతిని ఉద్దేశించి మాట్లాడతారు. ఈసారి ప్రత్యేకత ఏంటంటే.. 'వందేమాతరం' 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చిన ఈ జాతీయ గేయాన్ని ఎర్రకోట బురుజుల నుంచి తొలిసారిగా పాడతారు. హెలికాప్టర్ ద్వారా పూలవాన కురిపిస్తూ వందేమాతరం బ్యానర్‌ను చూపిస్తారు. 'యువశక్తి'కి ప్రాధాన్యమిస్తూ 2,500 మంది NCC, మై భారత్ వాలంటీర్లు జ్ఞాన్‌పథ్‌లో ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నారు.

KCR ఇంట్లో తీవ్ర విషాదం!
BRS చీఫ్ కేసీఆర్ బావమరిది ఉప్పల శ్రీనివాసరావు అనారోగ్యంతో కన్నుమూశారు. సమాచారం అందుకున్న వెంటనే కేసీఆర్ ఆయన నివాసానికి చేరుకుని, భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తీవ్ర దుఃఖంలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్‌ని పరామర్శించి ధైర్యం చెప్పారు. శ్రీనివాసరావు మృతిపై పలువురు BRS లీడర్స్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఆయన ఫ్యామిలీకి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

'వర్క్ ఫ్రమ్ హోమ్' సైబర్ దందా గుట్టురట్టు
చైనాతో లింకులున్న 'వర్క్ ఫ్రమ్ హోమ్' సైబర్ దందాను డిల్లీ పోలీసులు క్రాక్ చేశారు. జాబ్స్ పేరుతో రూ. 12 లక్షలు కాజేసిన నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. టెలిగ్రామ్ ద్వారా చైనాకు చెందిన నేరస్థులతో సంబంధాలు పెంచుకున్న యువకులు మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్ ద్వారా డబ్బును 'USDT' క్రిప్టోకరెన్సీ రూపంలోకి మారుస్తున్నట్టు గుర్తించారు. ఈ డబ్బును చైనాకు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నట్టు తెలుసుకున్నారు. గురుగ్రామ్, గాజియాబాద్, నోయిడా, ఇటావాలో దాడులు చేసి వాళ్లను అరెస్ట్ చేశారు.

ఆన్‌లైన్ గేమింగ్ మోజు..తండ్రినే మోసం చేసిన కొడుకు
ఒకే కొడుకు కావడంతో గారాబంగా పెరిగాడు. ఆన్‌లైన్ గేమింగ్‌కు అలవాటు పడ్డాడు. అందుకోసం చేసిన అప్పులు తీర్చేందుకు యూపీకి చెందిన 11వ తరగతి విద్యార్థి కిడ్నాపింగ్ డ్రామా ఆడాడు. ఢిల్లీలో ఉన్న తన లవర్ సాయంతో తను గాయపడినట్టు AIతో ఫోటో తయారు చేసి తండ్రికి పంపాడు. ఫ్రెండ్స్ సాయంతో కిడ్నాపర్లు రూ.లక్ష కావాలని డిమాండ్ చేస్తున్నారని చెప్పాడు. ఆయన పోలీసులకు చెప్పడంతో వాళ్ల విచారణలో అసలు నిజం వెలుగులోకి వచ్చింది.

రాత్రిపూట గజ్జెల సౌండ్స్.. భయంతో హాస్టల్ ఖాళీ!
మహారాష్ట్రలోని అమరావతిలో దెయ్యాల భయంతో గవర్నమెంట్ ట్రైబల్ ఆశ్రమ్ స్కూల్‌కు చెందిన 608 మంది స్టూడెంట్స్ ఇంటికి వెళ్లిపోయారు. స్కూల్లో రాత్రిపూట గజ్జెల సౌండ్స్, నవ్వులు, ఏడుపులు వినిపిస్తున్నాయని కొందరు స్టూడెంట్స్ చెప్పడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. అధికారులు దీన్ని సీరియస్‌గా తీసుకుని బాలికలకు హెల్త్ టెస్టులు చేయించారు. తీవ్రమైన హిస్టీరియా వంటి సమస్యల కారణంగా లక్షణాలు ఉండొచ్చని డాక్టర్లు చెప్పినట్లు హెడ్‌మాస్టర్ తెలిపారు. రూమర్స్‌ను నమ్మి ప్యానిక్ కావొద్దని అధికారులు పేరెంట్స్‌కు సూచించారు.
కేరళ యూనివర్సిటీలో అక్రమాలు..విద్యార్థుల నిరసన
కేరళ యూనివర్సిటీలో మొదటి సెమిస్టర్ ఎల్‌ఎల్‌బీ పరీక్షలపై వచ్చిన కంప్లైంట్స్‌తో యూనివర్సిటీ రిజిస్ట్రార్ కార్యాలయం బయట ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఎల్‌ఎల్‌బి ఎగ్జామ్ పేపర్ వ్యాల్యుయేషన్‌లో లోపాలున్నాయని, చాలామంది మొదట ఫెయిల్ అయినట్లు అనౌన్స్ చేసి, రీవ్యాల్యుయేషన్‌లో పాస్ అయ్యారని వాళ్లు ఆరోపించారు. ఎగ్జామ్ పేపర్ వ్యాల్యుయేషన్‌ని సెంట్రలైజ్డ్ వ్యాల్యుయేషన్ క్యాంపుల్లో నిర్వహించాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్ చేస్తోంది.

‘మోదీ ఫొటో పెట్టాల్సిందే’.. రేషన్ కార్డులపై రఘునందన్
TG: రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులపై BJP ఎంపీ రఘునందన్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. కార్డులపై ప్రధాని మోదీ ఫొటో కచ్చితంగా ఉండాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న 6 కిలోల బియ్యంలో 5 కిలోలు కేంద్రం ఇస్తున్నవేనని అన్నారు. అలాంటప్పుడు ఒక్క కిలో బియ్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ నేతల ఫొటోలు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. కొత్తగా ఎన్ని రేషన్ కార్డులు ఇస్తున్నారో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

గ్రీన్ ఇండియా మిషన్ టార్గెట్ 97.57% Fail
పర్యావరణ మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న గ్రీన్ ఇండియా మిషన్ గత పదేళ్ల కాలంలో తన లక్ష్యాలను చేరుకోవడంలో ఫెయిలైందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) రిపోర్ట్ తెలిపింది. 2015-16 నుంచి 2024-25 వరకు 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ పథకాన్ని కాగ్ పరిశీలించింది. గ్రీన్ ఇండియా మిషన్ 1.4 మిలియన్ హెక్టార్ల అటవీ విస్తీర్ణం పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నా, 0.03409 మిలియన్ హెక్టార్లు మాత్రమే పెరిగిందని తెలిపింది. అంటే 97.57% ఫెయిల్ అయిందని తేల్చింది.
‘మీ పిల్లలకు ఇలాంటి సౌకర్యాలే ఇస్తారా?’...నిలదీసిన స్టూడెంట్
‘మీ పిల్లలకు ఇలాంటి సౌకర్యాలే ఇస్తారా?’ అంటూ రాజస్థాన్‌లోని అల్వార్ ప్రభుత్వ పాఠశాలలో ఓ స్టూడెంట్ అధికారులను నిలదీసింది. టీచర్స్ కొరత, శిథిలావస్థలో ఉన్న భవనాలు, సౌకర్యాలు లేమితో స్టూడెంట్స్ ధర్నా చేశారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తన ‘ఎక్స్’ అకౌంట్‌లో షేర్ చేసి, మంచి విద్య, పాఠశాలల్లో సౌకర్యాలు పిల్లల ప్రాథమిక హక్కులని, వాటి కోసం వారు బీజేపీ ప్రభుత్వంతో పోరాడాల్సి వస్తోందని అన్నారు.

మన పురాతన కట్టడాలు.. సర్కారు పైసలు!
మన చారిత్రక కట్టడాల బాగుకోసం కేంద్ర ప్రభుత్వం ఈసారి రూ.376.67 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇది గతేడాది కంటే ఎక్కువైనా, రెండేళ్ల కిందట పెట్టిన రూ.443.53 కోట్ల కంటే తక్కువే. టూరిస్టులు తగ్గడంతో మన సంస్కృతిని, కట్టడాలను కాపాడుకోవాలి . ఇందుకోసం బ్రిక్స్ దేశాలతో కలసి పనిచేయడంతో పాటు, నెట్‌ఫ్లిక్స్ ద్వారా మన చారిత్రక ప్రదేశాలను ప్రపంచానికి చూపించేందుకు ప్రభుత్వం కొత్త అడుగులు వేస్తోంది.

సింగరేణిలో 300 పోస్టులు.. రెండ్రోజుల్లో Apply చేసుకోండి
నిరుద్యోగులకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) గుడ్ న్యూస్. సంస్థలో 300 అప్రెంటిస్ పోస్టులను ప్రకటించింది. ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిగ్రీతో పాటు డిప్లొమా పూర్తి చేసిన క్యాండిడేట్స్ <a href="https://scclmines.com/apprenticeship/">అప్లై చేసుకోవచ్చు.</a> 2023-24 నుంచి 2025-26 అకడమిక్ ఇయర్స్‌లో కోర్సులు పూర్తి చేసిన వారు అర్హులు. ఆగస్ట్ 16 వరకు అప్లై చేసుకునే అవకాశముంది. ఇంజినీరింగ్‌కు 150, నాన్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు 100, డిప్లొమా అభ్యర్థులకు 50 పోస్టులున్నాయి. నెలకు స్టైపెండ్‌గా రూ.12,300 వరకు ఇస్తారు.
5KM జెండాతో 2 వరల్డ్ రికార్డ్స్!
హర్యానాలోని పల్వల్ హైవేపై ‘హర్ ఘర్ తిరంగా’ క్యాంపెయిన్‌లో భాగంగా స్పోర్ట్స్ మినిస్టర్ గౌరవ్ గౌతమ్ నాయకత్వంలో ఆగస్టు 13న వేలాది మంది జనాల మధ్య ఏకంగా 5KM పొడవు, 10 అడుగుల వెడల్పు ఉన్న భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఒక స్పెషల్ ట్రక్కుపై అమర్చిన రోలర్ ద్వారా జెండాను అన్‌రోల్ చేస్తుంటే, ప్రజలు తమ చేతులతో పట్టుకుని ముందుకు సాగారు. ఈ అద్భుతమైన తిరంగా యాత్ర గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌తో పాటు గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.

సూర్య ఖాతాలో మరో ఫ్యామిలీ హిట్!
వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య, మమితా బైజు జంటగా వచ్చిన సినిమా 'విశ్వనాథ్ అండ్ సన్స్' కి పాజిటివ్ టాక్ వస్తున్నది. 40 ఏళ్ల ఒలింపియన్ సంజయ్ (సూర్య), తన బిడ్డ వైద్యం కోసం సరోగసి మదర్ మ్యాడీ (మమిత)ని ఇంటికి తీసుకువచ్చిన తర్వాత... వారి మధ్య జరిగే ఎమోషన్ల ప్రయాణమే ఈ సినిమా. సూర్య, మమితా నటన, జీవీ ప్రకాష్ సంగీతం సినిమాకు ప్రధాన బలం. సెకండాఫ్ కాస్త నెమ్మదించినా, కుటుంబ బంధాలతో ఆకట్టుకుంటుంది. ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ మంచి సినిమా అని ప్రేక్షకులు అంటున్నారు.

చరిత్రకారుడు సుమిత్ సర్కార్ కన్నుమూత
ప్రముఖ చరిత్రకారుడు, స్కాలర్ సుమిత్ సర్కార్(87) ఢిల్లీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆధునిక భారతదేశ చరిత్రలో ప్రముఖ స్కాలర్ అయిన ఆయన ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. లండన్‌లోని వుల్ఫ్‌సన్ కాలేజీలో ఫెలోగా కూడా పనిచేశారు. ‘ది స్వదేశీ మూవ్‌మెంట్ ఇన్ బెంగాల్, 1903-1908’ అని 1973లో ఆయన రాసిన పుస్తకం బెంగాల్‌లోని జాతీయోద్యమంపై వచ్చిన ముఖ్యమైన పుస్తకంగా మిగిలింది.

23న ముస్లింవాద సాహిత్య సభ
TG: ఆగస్టు 23(ఆదివారం) మహబూబాబాద్‌లోని TPTF భవన్‌లో సాయంత్రం 5.30లకు ‘ముస్లింవాద సాహిత్య సభ’ నిర్వహించనున్నారు. దీనికి కవి, కథకుడు సయ్యద్ ఖుర్షీద్ అధ్యక్షత వహించనున్నారు. కవి, కథకుడు స్కైబాబ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ‘అస్తిత్వ ఉద్యమాలు: ముస్లింవాద సాహిత్యం’ అనే అంశంపై చర్చ జరుగుతుంది. వక్తలుగా బండారు రాజ్‌కుమార్, రహిమొద్దీన్, గన్నోజు ప్రసాద్ పాల్గొంటారు.

కాంగ్రెస్‌లోనే ఉంటా.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ
TG: రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. బయట నుంచి వచ్చిన వ్యక్తుల కారణంగా అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని అన్నారు. సీమాంధ్ర పాలకుల చెప్పుచేతల్లో తెలంగాణ ప్రభుత్వం ఉండకూడదన్నదే తన అభిప్రాయమన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసమే రాష్ట్ర ఉద్యమం జరిగిందని గుర్తుచేశారు. ప్రజాపాలన అంటే ప్రజల కోసం పనిచేయాలి కానీ పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్ల కోసం కాదని స్పష్టం చేశారు.

కల్యాణ లక్ష్మీపై స్టే.. కోడితో BRS మహిళల నిరసన
TG: ట్యాంక్‌బండ్ వద్ద BRS మహిళా నాయకులు కోడితో వెరైటీగా నిరసన చేపట్టారు. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు స్టే విధిస్తే.. ప్రభుత్వం కావాలనే బలమైన వాదనలు వినిపించలేదని ఆరోపించారు. పథకాలను ఎత్తివేయాలనే ఉద్దేశంతోనే కోర్టులో పిటిషన్ వేయించారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆడబిడ్డలకు తులం బంగారం కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

BCIపై CJI ఫైర్
CJI సూర్యకాంత్ పాల్గొనే గ్రాడ్యుయేషన్ డేపై నిరసన తెలిపిన నల్సార్ లా విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ ఆపాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(BCI) ఇచ్చిన ఆర్డర్స్‌పై సుప్రీంకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థులకు పీస్‌ఫుల్‌గా నిరసన తెలిపే రైట్ ఉందని, ఇందులో BCI జోక్యం అనవసరమని స్పష్టం చేసింది. స్టూడెంట్స్, ఫ్యాకల్టీపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోకూడదని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చీల ధర్మాసనం స్టే విధిస్తూ ఇంటరిమ్ ఆర్డర్స్ ఇచ్చింది.