← Back to news

23న ముస్లింవాద సాహిత్య సభ

By విశీ· 14 Aug 2026
23న ముస్లింవాద సాహిత్య సభ

TG: ఆగస్టు 23(ఆదివారం) మహబూబాబాద్‌లోని TPTF భవన్‌లో సాయంత్రం 5.30లకు ‘ముస్లింవాద సాహిత్య సభ’ నిర్వహించనున్నారు. దీనికి కవి, కథకుడు సయ్యద్ ఖుర్షీద్ అధ్యక్షత వహించనున్నారు. కవి, కథకుడు స్కైబాబ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ‘అస్తిత్వ ఉద్యమాలు: ముస్లింవాద సాహిత్యం’ అనే అంశంపై చర్చ జరుగుతుంది. వక్తలుగా బండారు రాజ్‌కుమార్, రహిమొద్దీన్, గన్నోజు ప్రసాద్ పాల్గొంటారు.

More in Arts/Literature