Latest

ఖననం చేసిన శిశువు మృతదేహం మాయం
Crime· 11 Aug 2026

ఖననం చేసిన శిశువు మృతదేహం మాయం

TG: హైదరాబాద్ బంజారాహిల్స్‌లో కవల శిశువుల విషాద ఘటనలో షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఆరునెలలకే జన్మించిన కవలలకు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగా, ఒకరోజు వ్యవధిలో ఇద్దరూ మృతి చెందారు. మొదటి శిశువు మృతదేహాన్ని కుటుంబసభ్యులు పంజాగుట్ట స్మశానవాటికలో ఖననం చేశారు. రెండో శిశువు మృతదేహాన్ని కూడా అక్కడే ఖననం చేసేందుకు తీసుకురాగా, మొదటి శిశువు సమాధి కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు షాక్‌కు గురయ్యారు. సమాధిని తవ్వి చూడగా మృతదేహం కనిపించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

NEETకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం
Politics· 11 Aug 2026

NEETకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం

అండర్‌గ్రాడ్యుయేట్ మెడికల్ అడ్మిషన్స్‌కు నిర్వహిస్తున్న NEETను వ్యతిరేకిస్తూ తమిళనాడు అసెంబ్లీ ప్రత్యేక తీర్మానం చేయనుంది. కేంద్ర చట్టాలను సవరించి దేశంలో అమలవుతున్న యూనిఫైడ్ NEET పాలసీని క్యాన్సిల్ చేయాలని హెల్త్ మినిస్టర్ సుబ్రమణియన్ రిజల్యూషన్ ప్రవేశపెట్టనున్నారు. NEET వల్ల సోషల్ జస్టిస్, ఈక్వాలిటీ ఉండవని, రూరల్, ఫైనాన్షియల్‌గా వీక్‌గా ఉన్న స్టూడెంట్స్‌కు ప్రాబ్లమ్స్ రావొచ్చని తీర్మానంలో పేర్కొన్నారు. కోచింగ్‌పై ఆధారపడటం పెరిగి, స్టూడెంట్స్ ఫోకస్ చదువు నుంచి డైవర్ట్ అవుతుందని విమర్శించారు.

రాజమండ్రిలో ప్రేమజంట విషాదం
Crime· 11 Aug 2026

రాజమండ్రిలో ప్రేమజంట విషాదం

AP: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని కాతేరు గామన్ బ్రిడ్జి సమీపంలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. స్థానికులు ఓ యువతి మృతదేహంతోపాటు తీవ్ర గాయాలతో ఉన్న యువకుడిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు యువకుడిని వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువకుడు కోటిలింగాలపేటకు చెందిన అభిలాష్‌గా, యువతి శాంతినగర్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

యువకుల రక్షణకు లోకేశ్ బిగ్ యాక్షన్
AP· 11 Aug 2026

యువకుల రక్షణకు లోకేశ్ బిగ్ యాక్షన్

AP: ఉద్యోగాల పేరుతో థాయ్‌లాండ్ వెళ్లి మోసపోయి బ్యాంకాక్‌లో చిక్కుకున్న తెలుగు యువకులకు మంత్రి నారా లోకేశ్ అండగా నిలిచారు. తమను బలవంతంగా మయన్మార్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని, వెంటనే రక్షించాలని బాధితులు సోషల్‌మీడియాలో వేడుకున్నారు. విషయంపై మంత్రి లోకేశ్ ఎక్స్ వేదికగా స్పందించారు. బాధితుల ఆవేదనను అర్థం చేసుకున్నానని, వారిని సురక్షితంగా స్వరాష్ట్రానికి తీసుకొచ్చేందుకు అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. వారి రక్షణకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్‌ కానిస్టేబుల్‌ ప్రపంచ రికార్డ్!
Sports· 11 Aug 2026

హైదరాబాద్‌ కానిస్టేబుల్‌ ప్రపంచ రికార్డ్!

TG: హైదరాబాద్‌లో పోలీస్ కానిస్టేబుల్ వి. సుధాకర్ అరుదైన వరల్డ్ రికార్డు సాధించారు. నేషనల్ లెవెల్ కరాటే స్పోర్ట్స్‌మెన్ సుధాకర్ 9 రకాల కరాటే టెక్నిక్‌లతో 80 షాబాద్ టైల్స్‌ను బద్దలు కొట్టారు. ‘మిషన్-80’ పేరుతో GVR కరాటే అకాడమీ ఏర్పాటు చేసిన డాక్టర్ GS మెల్కోటే పార్క్‌లో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేశారు. 8 నిమిషాల టైమ్ ఇవ్వగా.. కేవలం 3 నిమిషాల 26 సెకన్లలోనే టార్గెట్‌ని పూర్తి చేశారు. Wonder Book of Records International పర్యవేక్షణలో ఈ రికార్డు సాధించారు.

గుప్త నిధుల పేరుతో ఘరానా మోసం.. రూ.కోటి స్వాహా
Crime· 11 Aug 2026

గుప్త నిధుల పేరుతో ఘరానా మోసం.. రూ.కోటి స్వాహా

TG: హైదరాబాద్‌లో గుప్త నిధుల పేరుతో మోసాలు చేస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇళ్ల కింద నిధులున్నాయని నమ్మించి, గుంతల్లో బొగ్గు, ఫేక్ గోల్డ్ కాయిన్స్ పాతిపెట్టేవారు. తాము చెప్పిన పూజలు చేస్తే బొగ్గు బంగారంగా మారుతుందని నమ్మించి బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసేవారు. ఇలా 11 మందిని మోసం చేసి రూ.కోటి వరకు దోచేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి రెండు కార్లు, ఆటో, రెండు బైక్‌లు, నాలుగు ఫోన్లు, 25 ఫేక్ గోల్డ్ కాయిన్స్, పూజా ప్రొడక్ట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

AAIలో 389 జాబ్స్.. వెంటనే అప్లై చేసుకోండి
Jobs· 11 Aug 2026

AAIలో 389 జాబ్స్.. వెంటనే అప్లై చేసుకోండి

ఎయిర్‌ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) వివిధ కేటగిరీల్లో మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు <a href="https://www.aai.aero/en/careers/recruitment">ఆన్‌లైన్ అప్లికేషన్లను</a> స్టార్ట్ చేసింది. మొత్తం 389 పోస్టులకు ఆగస్ట్ 8 నుంచి ఎలిజిబుల్ కాండిడేట్స్ సెప్టెంబర్ 7, 2026 వరకు అప్లై చేసుకోవచ్చు. మేనేజర్ పోస్టులకు మ్యాక్సిమమ్ ఏజ్ 32 ఇయర్స్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 27 ఇయర్స్ ఉండాలి. SC, STలకు 5 ఇయర్స్, OBC నాన్-క్రీమీ లేయర్ కాండిడేట్స్‌కు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది.

మద్యం మత్తులో వైద్యం.. బాలిక మృతి
TG· 11 Aug 2026

మద్యం మత్తులో వైద్యం.. బాలిక మృతి

TG: మద్యం మత్తులో RMP డాక్టర్ చికిత్స చేయడంతో బాలిక మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో కలకలం రేపింది. బస్వాపురానికి చెందిన హిమశ్రీ(16) జలుబు, దగ్గుతో బాధపడుతుండటంతో తండ్రి స్థానిక ఆర్ఎంపీ మారుతిసంపత్ వద్దకు తీసుకెళ్లారు. మద్యంమత్తులో డాక్టర్, బాలికకు ఇంజక్షన్ ఇచ్చినట్లు కుటుంబసభ్యులు ఆరోపించారు. మరో ఇంజక్షన్ ఇస్తుండగా ఆమె నోటినుంచి నురగలు వచ్చి స్పృహ కోల్పోయింది. అనంతరం ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కొన్ని Memories జీవితాంతం ఎందుకు గుర్తుంటాయి? 🧠
Science· 11 Aug 2026

కొన్ని Memories జీవితాంతం ఎందుకు గుర్తుంటాయి? 🧠

మన జీవితంలో ఎన్నో క్షణాలు వస్తాయి.. కానీ కొన్ని మాత్రం ఎన్ని సంవత్సరాలు గడిచినా మనసులో అలాగే ఉండిపోతాయి. ❤️ చిన్నప్పుడు ఫ్రెండ్స్తో గడిపిన రోజులు, ఫ్యామిలీతో ఉన్న ఓ క్షణం, మొదటి విజయం, ఊహించని సంతోషం.. ఇలా మనకు గట్టిగా అనిపించిన మొమెంట్స్ను మెదడు బలంగా గుర్తుపెట్టుకుంటుంది. ముఖ్యంగా సంతోషం, బాధ, భయం లాంటి భావోద్వేగాలు ఉన్నప్పుడు మెదడులోని "అమిగ్డాలా" జ్ఞాపకాలను మరింత బలంగా నిలిచేలా చేస్తుంది. అందుకే కొన్ని మెమరీస్ను ఎంత మర్చిపోవాలనుకున్నా అవి మళ్లీ గుర్తొస్తుంటాయి.

ఫస్ట్ టైమ్ ఉద్యోగులకు రూ.15 వేల వరకు ఇన్సెంటివ్స్
Jobs· 11 Aug 2026

ఫస్ట్ టైమ్ ఉద్యోగులకు రూ.15 వేల వరకు ఇన్సెంటివ్స్

ఫస్ట్ టైమ్ అఫీషియల్‌గా జాబ్‌లో చేరిన వారికి ఇండియన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన 'ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన' <a href="https://pmvbry.epfindia.gov.in/">(PM-VBRY)</a> స్కీమ్ బెనిఫిట్ కానుంది. ఈ స్కీమ్ ద్వారా ఎలిజిబిలిటీ ఉన్న ఫస్ట్ ఎంప్లాయిస్‌కు రూ.15,000 వరకు ఇన్సెంటివ్ పొందవచ్చు. అలాగే ఇంకొన్ని జాబ్‌ను కల్పించే కంపెనీలకు కూడా గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఇవ్వనుంది. ఈ స్కీమ్‌కు కేంద్రం మొత్తం రూ.99,446 కోట్లను కేటాయించింది. 2 ఇయర్స్‌లో 3.5 కోట్లకు పైగా జాబ్ క్రియేషన్ టార్గెట్‌గా ప్రభుత్వం ఈ స్కీమ్‌ను అమలు చేయనుంది.

ఆ ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దు: శ్రీధర్‌బాబు
TG· 11 Aug 2026

ఆ ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దు: శ్రీధర్‌బాబు

TG: రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో టెస్సెరాక్ట్ సంస్థకు తక్కువ ధరకే భూములు కేటాయించారంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టంచేశారు. CM రేవంత్‌రెడ్డి సోదరుడికి టెస్సెరాక్ట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ సంస్థతో ఎలాంటి సంబంధం లేదన్నారు. భూముల కేటాయింపు పారదర్శకంగా జరిగిందన్నారు. కన్సల్టేటివ్ కమిటీ ఆన్ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్(CCESDM) కమిటీ ఆమోదంతోనే భూములు కేటాయించినట్లు వివరించారు. BRS, BJPలు రాజకీయలబ్ధి కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు.

సంప్రదాయ కళలకు ఊతం: పవన్ కల్యాణ్
AP· 11 Aug 2026

సంప్రదాయ కళలకు ఊతం: పవన్ కల్యాణ్

AP: సంప్రదాయ హస్త కళాకారులకు అండగా నిలిచేందుకు రాష్ట్రంలో క్రాఫ్ట్ ఉడ్ బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నామని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. సచివాలయంలో క్రాఫ్ట్‌ ఉడ్‌ బ్యాంకుల ఏర్పాటుపై ఆయన సమీక్ష నిర్వహించారు. కళాకారులకు అవసరమైన నాణ్యమైన కలపను తక్కువ ధరకు అందించి, వారి ఉత్పత్తి ఖర్చును తగ్గించడమే లక్ష్యమన్నారు. తొలిదశలో కొండపల్లి, ఏటికొప్పాక, బొబ్బిలి, శెట్టిగుంట, మాధవమాల, ఉదయగిరి ప్రాంతాల్లో ఉడ్ బ్యాంకులు అందుబాటులోకి రానున్నాయి. కళాకారులకు నిరంతరం కలప అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

రాజధాని పనుల్లో వేగం పెంచాలి: అమిత్ షా
AP· 11 Aug 2026

రాజధాని పనుల్లో వేగం పెంచాలి: అమిత్ షా

AP: అమరావతి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా TDP MPలకు సూచించారు. TDP పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు నేతృత్వంలో MPలు ఢిల్లీలోని పార్లమెంట్‌లో అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా అమరావతి నిర్మాణ పురోగతిపై రూపొందించిన కాఫీ టేబుల్ బుక్‌ను ఆయనకు అందజేశారు. రాజధానిలో ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణ పనులు, ఇప్పటివరకు సాధించిన పురోగతిని వారు వివరించారు. అమరావతి నిర్మాణానికి కేంద్రప్రభుత్వం ఆర్థిక, చట్టపరమైన సహకారం అందిస్తున్నందుకు ఎంపీలు కృతజ్ఞతలు తెలిపారు.

అన్నదాతల సంక్షేమానికి వెనుకాడం: పొంగులేటి
TG· 11 Aug 2026

అన్నదాతల సంక్షేమానికి వెనుకాడం: పొంగులేటి

TG: రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం రైతుల కోసం నెలకు సగటున రూ.2,500 కోట్లు ఖర్చు చేయగా, తమ ప్రభుత్వం నెలకు రూ.5,250 కోట్లు వ్యయం చేస్తోందని చెప్పారు. హనుమకొండలో నిర్వహించిన జిల్లా స్థాయి రైతు మేళాలో మంత్రి మాట్లాడారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా అన్నదాతల కోసం ఖర్చుకు వెనుకాడటం లేదన్నారు. గత ప్రభుత్వం ధరణి పేరుతో భూమాయ చేసిందని, భవిష్యత్ తరాలకు భూవివాదాలు లేకుండా భూభారతి తీసుకొచ్చామన్నారు.

ఆ భావజాలం మళ్లీ బలపడకుండా చూస్తాం: DGP
TG· 11 Aug 2026

ఆ భావజాలం మళ్లీ బలపడకుండా చూస్తాం: DGP

TG: 'ఆపరేషన్ కగార్' తర్వాత రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం పూర్తిగా తగ్గిపోయిందని DGP CV ఆనంద్ పేర్కొన్నారు.<br>ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన తెలంగాణ-ఛత్తీస్‌గడ్ సరిహద్దుల్లోని కర్రెగుట్ట ప్రాంతంలోని CRPF బేస్ క్యాంప్‌ను సందర్శించారు. లొంగిపోయిన వారి కోసం పునరావాస చర్యలు చేపడుతున్నామని, వారిపై నిరంతర నిఘా కొనసాగుతుందని, ఆ భావజాలం తిరిగి జీవం పోసుకోకుండా చూస్తామన్నారు. ఇటీవల లొంగిపోయిన 23 మంది మావోయిస్టులకు ఆర్థిక సాయాన్ని, ఆరోగ్య కార్డులను అందజేశారు.

ప్రజలు సుభిక్షంగా ఉండాలి: రేవంత్‌రెడ్డి
TG· 11 Aug 2026

ప్రజలు సుభిక్షంగా ఉండాలి: రేవంత్‌రెడ్డి

తెలంగాణలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడిపంటలతో రాష్ట్రం సస్యశ్యామలంగా మారాలని CM రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లో నిర్వహించిన మహా వరుణయాగంలో CM సతీసమేతంగా పాల్గొన్నారు. కృష్ణా, గోదావరి నదులు జలకళతో పరవళ్లు తొక్కాలని, రైతుల మోముల్లో సంతోషం వెల్లివిరియాలని యాగంలో ప్రార్థనలు చేశారు. అనంతరం నాగార్జునసాగర్ జలాశయాన్ని సందర్శించి నీటి నిల్వలు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

రీసర్వేతో భూరికార్డుల ప్రక్షాళన: చంద్రబాబు
AP· 11 Aug 2026

రీసర్వేతో భూరికార్డుల ప్రక్షాళన: చంద్రబాబు

AP: సుపరిపాలన అందిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రతినెలా సమావేశాలు నిర్వహిస్తున్నామని CM చంద్రబాబు స్పష్టం చేశారు. గత పాలనలో అస్తవ్యస్తంగా మారిన భూరికార్డులను ప్రక్షాళన చేసేందుకు రెవెన్యూ సంస్కరణలు చేపట్టామని చెప్పారు. ఏలూరు జిల్లా కలిదిండిలో ఆయన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. 2027 నాటికి రీసర్వే పూర్తి చేసి రైతులు, భూ యజమానులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

Google Searchకి ముందు సైట్లు ఎలా వెతికేవాళ్లు? 👀
Politics· 10 Aug 2026

Google Searchకి ముందు సైట్లు ఎలా వెతికేవాళ్లు? 👀

Google Search రాకముందు ఇంటర్నెట్‌లో ఏం చేసేవాళ్లు? ఇప్పుడు ఏదైనా తెలుసుకోవాలంటే సెర్చ్ బార్‌లో టైప్ చేస్తే చాలు. కానీ అప్పట్లో పరిస్థితి వేరుగా ఉండేది. Yahoo Directory, AltaVista, Lycos లాంటి సెర్చ్ సైట్లలో వెతికేవాళ్లు. కొన్ని విషయాలు తెలియకపోతే ఫోరమ్స్, ఈమెయిల్ గ్రూప్స్, చాట్ రూమ్స్‌లో ఇతరులను అడిగేవాళ్లు. నచ్చిన వెబ్‌సైట్లను బుక్‌మార్క్స్‌లో దాచుకుని మళ్లీ వాటినే తెరిచేవాళ్లు. అంటే అప్పట్లో ఇంటర్నెట్‌లో సమాచారం కావాలంటే కాస్త ఓపికగా వెతకాల్సిందే. Google వచ్చాక ఈ పని చాలా సింపుల్ అయిపోయింది!

స్టూడెంట్స్‌పై దాడి ఎందుకు చేస్తున్నారు?: అభిజిత్ దీప్కే
Politics· 10 Aug 2026

స్టూడెంట్స్‌పై దాడి ఎందుకు చేస్తున్నారు?: అభిజిత్ దీప్కే

జార్ఖండ్‌లో ప్టోటెస్ట్ చేస్తున్న స్టూడెంట్స్‌పై పోలీసులు దాడి చేయడంపై CJP ఫౌండర్ అభిజిత్ దీప్కే రియాక్ట్ అయ్యారు. పొలిటికల్ పార్టీలు నిరసనలు చేస్తున్నపుడు లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగాలు కనిపించవని, మరి స్టూడెంట్స్ నిరసనలపై పదేపదే ఇలాంటి దాడులు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. స్టూడెంట్స్‌పై పోలీసులు దాడి చేయడం ఆపాలని డిమాండ్ చేశారు.

GPS లేకుండానే దారి తెలుసుకునే తాబేళ్లు!
Science· 10 Aug 2026

GPS లేకుండానే దారి తెలుసుకునే తాబేళ్లు!

సముద్రంలో ఎటు వెళ్లాలో మ్యాప్ లేకుండానే తాబేళ్లు ఎలా తెలుసుకుంటాయో తెలుసా? వాటికి భూమి యొక్క మాగ్నెటిక్ ఫీల్డ్‌ను గుర్తించే ప్రత్యేక సామర్థ్యం ఉందని రీసెర్చ్ సూచిస్తోంది. ఈ మాగ్నెటిక్ సంకేతాలను ఉపయోగించి సముద్రంలో దిశను గుర్తించడంతో పాటు, దూరంగా ఉన్న ప్రాంతాల వైపు ప్రయాణించగలవు. కొన్ని రీసెర్చ్‌ల ప్రకారం, తాబేళ్లు తమ గమ్యస్థానానికి చేరువైనప్పుడు వాసన వంటి ఇతర సంకేతాలను కూడా ఉపయోగించవచ్చు. అంటే GPS లేకపోయినా.. ప్రకృతే వాటికి నావిగేషన్ సిస్టమ్‌లా పనిచేస్తుందన్నమాట అనుకోండి!

క్యాన్సర్‌పై కొత్త CRISPR ప్రయోగం! 🧬
Science· 10 Aug 2026

క్యాన్సర్‌పై కొత్త CRISPR ప్రయోగం! 🧬

క్యాన్సర్ కణాల్లో కనిపించే ప్రత్యేక మార్పులను టార్గెట్ చేసే కొత్త CRISPR ఎంజైమ్‌పై రీసెర్చ్ జరుగుతోంది. ఈ ఎంజైమ్ క్యాన్సర్ కణాల DNAను దెబ్బతీయగల సామర్థ్యాన్ని చూపించినట్లు రీసెర్చర్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఇది ప్రారంభ దశలోనే ఉంది. అయినా, క్యాన్సర్ కణాలను టార్గెట్ చేసే కొత్త ట్రీట్‌మెంట్‌లకు ఇది ఉపయోగపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఇది మనుషుల్లో ఎంతవరకు పనిచేస్తుంది, ఎంత సేఫ్ అనేది తెలియాలంటే ఇంకా రీసెర్చ్ అవసరం.