ఆ ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దు: శ్రీధర్‌బాబు

TG: రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో టెస్సెరాక్ట్ సంస్థకు తక్కువ ధరకే భూములు కేటాయించారంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టంచేశారు. CM రేవంత్‌రెడ్డి సోదరుడికి టెస్సెరాక్ట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ సంస్థతో ఎలాంటి సంబంధం లేదన్నారు. భూముల కేటాయింపు పారదర్శకంగా జరిగిందన్నారు. కన్సల్టేటివ్ కమిటీ ఆన్ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్(CCESDM) కమిటీ ఆమోదంతోనే భూములు కేటాయించినట్లు వివరించారు. BRS, BJPలు రాజకీయలబ్ధి కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు.



