Latest

రాజస్థాన్ ఎడారుల్లో స్ట్రాబెర్రీ పంట !
News· 30 Jul 2026

రాజస్థాన్ ఎడారుల్లో స్ట్రాబెర్రీ పంట !

సాధారణంగా చల్లని ప్రాంతాల్లో మాత్రమే పండే స్ట్రాబెర్రీ పంటను రాజస్థాన్‌లోని ఎడారి నేలల్లో పండించి కొందరు రైతులు విప్లవాత్మక మార్పు తెచ్చారు. డ్రిప్ ఇరిగేషన్, పాలీహౌస్/మల్చింగ్ సాంకేతికత,వినూత్న వ్యవసాయ పద్ధతులను ఉపయోగించి వారు ఈ అసాధ్యమైన పంటను సాధ్యం చేశారు. తక్కువ నీటి వినియోగంతో అధిక దిగుబడి సాధిస్తూ, స్థానిక రైతులు సంప్రదాయ పంటల కంటే కొన్ని రెట్లు ఎక్కువ లాభాలు గడిస్తున్నారు. ఈ విజయం ఎడారి ప్రాంతాల్లో ఉద్యానవన రంగానికి (Horticulture) కొత్త ఊపిరి పోసింది.

మీ మెమరీకి మూలం మీరు తిసుకునే పుడ్డే !
Health· 30 Jul 2026

మీ మెమరీకి మూలం మీరు తిసుకునే పుడ్డే !

మన మెమరీ పవర్ మనం తినే ఫుడ్ పై డిపెండ్అయి ఉంటుందని మీకు తెలుసా? మితిమీరి జంక్ ఫుడ్తినడం, పోషకాహార లోపం ఉంటే మెదడులోని హిప్పో క్యాంపస్ అంటే మెమరీ పవర్ కి కేంద్రం పనితీరును దెబ్బ తింటుందం టున్నారు సైంటిస్టులు. బాలెన్స్ డ్ పుడ్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల మెమరీ పవర్ పెరుగుతుందని, అల్జీమర్స్ లాంటి సమస్యల ముప్పు తగ్గుతుందని సైంటిస్టులు అంటున్నారు.

‘రామాయణ: పార్ట్ 1’ ట్రైలర్ విడుదల: విశేషాలు ఇవే!
Cinema· 30 Jul 2026

‘రామాయణ: పార్ట్ 1’ ట్రైలర్ విడుదల: విశేషాలు ఇవే!

నితీష్ తివారీ దర్శకత్వంలో రూపుదిద్దు కుంటున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'రామాయణ: పార్ట్ 1' 4 నిమిషాల నిడివితో ఉన్న గ్రాండ్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ ట్రైలర్‌లో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణాసురుడిగా యాష్ తమ నటనతో మెప్పించారు. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, DNEG నిర్మిస్తున్న ఈ దృశ్యకావ్యం 2026 దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది

నేరాలకు, బాధితులకందే సాయానికీ పొంతనే లేదు
News· 30 Jul 2026

నేరాలకు, బాధితులకందే సాయానికీ పొంతనే లేదు

దేశంలో మహిళలపై జరిగే నేరాలకు సంబంధించి గంటకు సగటున 51 ఎఫ్‌ఐఆర్‌లు (FIRs) నమోదవుతున్నప్పటికీ, నష్టపరిహారం అందుతున్న బాధితుల సంఖ్య ఏడుగురిలో ఒకరి కంటే తక్కువగానే ఉందంటూ ఓ నివేదిక వెల్లడించింది. తీవ్రమైన లైంగిక దాడి కేసుల్లో కూడా అవగాహన లోపం, సంక్లిష్టమైన దరఖాస్తు ప్రక్రియ, ఫండ్స్ వినియోగంలో నిర్లక్ష్యం వల్ల మెజారిటీ బాధితులకు ప్రభుత్వ సాయం అందడం లేదు. న్యాయ ప్రక్రియలో ఈ వ్యత్యాసాన్ని సరిచేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

విద్యావ్యవస్థపై హరగోపాల్ ప్రసంగాల సంకలనం ఆవిష్కరణ !
News· 30 Jul 2026

విద్యావ్యవస్థపై హరగోపాల్ ప్రసంగాల సంకలనం ఆవిష్కరణ !

పాలమూరు అధ్యయన వేదిక, డెమోక్రటిక్ టీచర్స్ పెడరేషన్ జాయింట్ గా రూపొందించిన సంక్షోభ కాలంలో విద్యారంగం బుక్ ఆవిష్కరణ ఆగస్టు 2, ఆదివారం హైదరాబాద్ లోని బాగ్ లింగం పల్లి, సుందరయ్య విజ్ఞాన వేదికలోని కాట్రగడ్డ శ్రీనివాస రావు హాలులో జరగనుంది.1980 నుంచి 2026 నేటి కాక్రోచ్ ఉద్యమం వరకూ క్షీణిస్తున్న విద్యావ్యవస్థ తీరును వివిధ వేదికలపై ప్రొఫెసర్ హర గోపాల్ చేసిన ప్రసంగాల ఆధారంగా పుస్తక రూపంలోకి తెచ్చారు. ప్రొపెసర్ వి. ఎస్ . ప్రసాద్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు.

కడప జిల్లాలో మెగా స్టార్ మూవీకి అరుదైన రికార్డ్
Cinema· 30 Jul 2026

కడప జిల్లాలో మెగా స్టార్ మూవీకి అరుదైన రికార్డ్

ఓటీటీలు వచ్చాక పెద్ద సినిమాలు ఎక్కువ రోజులు థియేటర్లలో ఆడే పరిస్థితి లేని ఈ తరుణంలో థియేటర్లలో నటుడు చిరంజీవి మూవీ ఏకంగా 200రోజులు ఆడింది. ఈ ఏడాది 2026 జనవరి 12న విడుదలైన మన శివ శంకర వర ప్రసాద్ మూవీ కడప జిల్లా, యర్రగుంట్లలోని "హేమ పిక్చర్ ప్యాలెస్"లో 200 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటికే OTT లోకి వచ్చినప్పటికి ధీయేటర్ లో రోజూ ఇప్పటికీ 4 ఆటలుతో కొనసాగుతుండటం విశేషం.!

ఈట్ క్లబ్ సెంట్రల్ కిచెన్ లైసెన్స్ సస్పెన్షన్
News· 30 Jul 2026

ఈట్ క్లబ్ సెంట్రల్ కిచెన్ లైసెన్స్ సస్పెన్షన్

రంగారెడ్డి జిల్లా ఘట్ కేసర్ లోని ఈట్ క్లబ్ బ్రాండ్స్ సెంట్రల్ కిచెన్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసి అనేక నిబంధనల ఉల్లంఘనలను గుర్తించారు. పరిశుభ్రత లోపం,పురుగుల ముట్టడి, ఫుడ్ నిల్వల్లో నిబంధనలు క్రాస్ చేయడం, లేబిలింగ్ లోపాలు, సింథటిక్ కలర్స్ వాడటం లాంటి అంశాలు చూశాక లై సెన్స్ సస్పెండ్ చేశారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్ట్స్ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటున్నారు.

విద్యా రుణాల పంపిణీ రెట్టింపుకు కేంద్రం భారీ ప్రణాళిక
Education· 30 Jul 2026

విద్యా రుణాల పంపిణీ రెట్టింపుకు కేంద్రం భారీ ప్రణాళిక

దేశంలో విద్యా రుణాల (Education Loans) పంపిణీని రాబోయే ఏడాదిలో రెట్టింపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రక్రియను వేగవంతం చేసి, 10 రోజుల్లోనే రుణాలు మంజూరు చేసేలా బ్యాంక్‌లకు మార్గదర్శకాలు ఇచ్చారు. కళాశాలల్లోనే ప్రత్యేక క్యాంప్‌లు నిర్వహించి స్పాట్ శాంక్షన్లు ఇవ్వనున్నారు. రూ. 7.5 లక్షల వరకు గ్యారెంటీ కవరేజ్, co-applicant నిబంధనల సడలింపు ద్వారా విద్యార్థులకు మరింత సులభంగా రుణాలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇకపై బట్టలకు  ఇండియన్ సైజ్ కొలతలు !
General· 30 Jul 2026

ఇకపై బట్టలకు ఇండియన్ సైజ్ కొలతలు !

ఇప్పటివరకు యూఎస్ (US), యూకే (UK) సైజ్ చార్టుల ఆధారంగా దుస్తులు తయారవు తుండగా, త్వరలోనే భారతీయుల శరీర ఆకృతికి సరిపోయేలా సొంత సైజ్ చార్ట్ రాబోతోంది. భారత జౌళి మంత్రిత్వ శాఖ, నిఫ్ట్ (NIFT) సంయుక్తంగా 'INDIAsize' ప్రాజెక్టు ద్వారా 3D బాడీ స్కేనింగ్ పరిజ్ఞానంతో 25,000 మందికి పైగా భారతీయుల శారీరక కొలతలను సేకరించాయి. దీనివల్ల బట్టల ఫిట్టింగ్ సమస్యలు తొలగిపోయి, ఫిర్యాదులు , ఆన్‌లైన్ రిటర్న్‌లు గణనీయంగా తగ్గుతాయి.

హైబ్రిడ్ యుగానికి  సూటయ్యే 'క్విన్టెసెన్షియల్' ల్యాప్ టాప్స్
Technology· 30 Jul 2026

హైబ్రిడ్ యుగానికి సూటయ్యే 'క్విన్టెసెన్షియల్' ల్యాప్ టాప్స్

ఆఫీస్,హోమ్ ఆఫీస్ (హైబ్రిడ్) రెండింటికీ యూజ్ అయ్యేలా డిజైన్ చేసిన ల్యాప్‌టాప్‌లు నేడు అందరినీ అట్రాక్ట్ చేస్తున్నాయి. Lenovo ThinkPad X1 Carbon (లేదా X1 2-in-1), HP EliteBook / Dragonfly Series, MacBook Air/Pro మోడల్స్ ఈ విభాగంలో ముందంజలో ఉన్నాయి. లైట్ వెయిట్ లో రొజంతా సరిపోయే బ్యాటరీ సామర్ధ్యం, మైక్రోసాఫ్ట్ కోపిలట్, ఎన్ పియూ ప్రోసెసర్లు బ్యాటరీ వేస్ట్ కాకుండా వీడియో కాల్స్ వాయిస్ ఐసోలేషన్, బ్యాక్ గ్రౌండ్ టాస్క్ లను పూర్తి చేస్తాయి.

గ్లాస్ గో ప్రజల లైఫ్ స్టైల్ లో భాగమైన  కర్రీ పాయింట్స్
General· 30 Jul 2026

గ్లాస్ గో ప్రజల లైఫ్ స్టైల్ లో భాగమైన కర్రీ పాయింట్స్

స్కాట్లాండ్‌లోని గ్లాస్గో (Glasgow) నగరంలో 'కరీ హౌసెస్' (ఇండియన్ రెస్టారెంట్లు) అక్కడి కల్చర్ లో భాగమయ్యాయి. 1950ల నుండి దక్షిణాసియా వలసదారుల రాకతో ప్రారంభమైన ఈ ఆహార సంస్కృతి, స్థానిక బ్రిటీష్ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ప్రముఖ 'చికెన్ టిక్కా మసాలా' ఇక్కడే పుట్టిందని నమ్ముతారు. కాలక్రమేణా ఇవి కేవలం భోజనశాలలుగానే కాక, గ్లాస్గో ప్రజల నిత్య జీవితంలో, వేడుకల్లో కీలక వేదికలుగా స్థిరపడ్డాయి.

క్రియేటివిటీ లోపించిన విద్యా విధానం !
Education· 30 Jul 2026

క్రియేటివిటీ లోపించిన విద్యా విధానం !

ప్రస్తుత విద్యావిధానంలో సృజనాత్మకత నశిస్తోందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. సృజనాత్మకత, విమర్శ నాత్మక ఆలోచనలకు ప్రయారిటీ లేక పోవడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. నోమ్ చోమ్‌స్కీ వంటి ఆలోచనాపరులు విద్యావ్యవస్థ స్వేచ్ఛా ఆలోచనను అణిచేసే ఫిల్టర్‌లా మారిందని విమర్శించగా, అతి పోటీ తత్వం విద్యార్థులలో మానసిక ఒత్తిడి పెంచుతోందన్నారుఆల్బర్ట్ ఐన్‌స్టీన్. దీపక్ నయ్యర్ వంటి భారతీయ విద్యావేత్తలు ప్రాక్టికల్ నైపుణ్యాలు లోపిస్తున్నాయని హెచ్చరించారు. బట్టీ పట్టే విధానానికి స్వస్తి పలకాలన్నారు.

లక్ష కోట్లు దాటేసిన IPL బిజినెస్ వాల్యూ !
Sports· 30 Jul 2026

లక్ష కోట్లు దాటేసిన IPL బిజినెస్ వాల్యూ !

దిగ్గజ క్రికెట్ లీగ్ ఐపీఎల్ (IPL) వ్యాపార విలువ ఏకంగా 20.6 బిలియన్ డాలర్లకు (సుమారు ₹1.97 లక్షల కోట్లు) చేరింది. హులిహాన్ లోకీ IPL వాల్యుయేషన్ స్టడీ 2026 ప్రకారం, గత ఏడాదితో పోలిస్తే ఐపీఎల్ విలువ 11.4% పెరగ్గా, బ్రాండ్ విలువ 10.3% పెరిగి $4.3 బిలియన్లకు చేరింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) $312 మిలియన్ల బ్రాండ్ విలువతో అత్యంత విలువైన జట్టుగా నిలిచింది. ఫ్రాంచైజీల భారీ విక్రయాలు ఈ ఎదుగుదలకు దోహదపడ్డాయి.

నెమలి ఈకల తలపాగాలతో రాష్ట్రపతి భవన్‌లో సందడి!
News· 30 Jul 2026

నెమలి ఈకల తలపాగాలతో రాష్ట్రపతి భవన్‌లో సందడి!

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బస్తర్ పీపుల్ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము, హోంమినిస్టర్ అమిత్ షాని కలిశారు. తమ ప్రత్యేకమైన 'మాంఝీ-చలాకీ' సంప్రదాయ దుస్తులు, నెమలి ఈకల తలపాగాలు ధరించి వచ్చిన వారితో <a href="https://x.com/AmitShah/status/2082806776395899194?s=20">అమిత్ షా</a> ప్రత్యేకంగా మాట్లాడారు. బస్తర్ సంస్కృతి, వారి పండుగలను కాపాడుకోవడం గ్రేట్ అని, ఫ్యూచర్‌లో ఈ ఏరియా బాగా డెవలప్ అవుతుందని చెప్పారు.

ఇరాన్‌పై చైనాకు నిజంగానే అంత పట్టు ఉందా?
Politics· 30 Jul 2026

ఇరాన్‌పై చైనాకు నిజంగానే అంత పట్టు ఉందా?

చైనా ఒక్క మాట చెబితే ఇరాన్ ఆగిపోతుందా..? ఇదే ఇప్పుడు గల్ఫ్ దేశాల ఆశ. ఇరాన్‌తో యుద్ధం మళ్లీ తీవ్రం కావడంతో, గల్ఫ్ దేశాలు ఇప్పుడు అమెరికా కంటే చైనా వైపు చూస్తున్నాయి. హోర్ముజ్ జలసంధి, ఎర్ర సముద్రంలో రాకపోకలు సజావుగా కొనసాగేలా ఇరాన్‌పై తన ఆర్థిక ప్రభావాన్ని ఉపయోగించాలని చైనాను కోరుతున్నాయి. అయితే చైనా మాత్రం యుద్ధంలో ఏ పక్షం వైపు నిలవకుండా, చర్చల ద్వారానే సమస్య పరిష్కారం కావాలని చెబుతోంది. దీంతో ఇరాన్‌పై చైనాకు నిజంగా ఎంత ప్రభావం ఉందనే విషయం ఇప్పుడు పరీక్షగా మారింది.

ఇండియాలో 'డైట్ కోక్' కొరత!
Business· 30 Jul 2026

ఇండియాలో 'డైట్ కోక్' కొరత!

ఇండియాలో ఇటీవల Diet Coke కొరత ఏర్పడటానికి కారణం దాని డిమాండ్ విపరీతంగా పెరగడమేనని కోకాకోలా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జాన్ మర్ఫీ తెలిపారు. వెస్ట్ ఏషియా వార్ వల్ల అల్యూమినియం క్యాన్ల సప్లై దెబ్బతిని, ప్యాకేజింగ్ కాస్ట్స్ పెరగడం వల్లనే ఈ షార్టేజ్ వచ్చిందని చెప్పారు. డైట్ కోక్ కేవలం క్యాన్లలోనే అమ్మడం వల్ల ఈ ప్రాబ్లమ్ ఎక్కువైందని. కొరత ఉన్నప్పటికీ, ఇండియా తమకు లాంగ్ టర్మ్‌లో బిగ్ ఆపర్స్యూనిటీ అని, ఈ ఇయర్ ఆర్డర్లు 10 రెట్లు పెరుగుతాయని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది.

తోటి నటీమణులపై పోలీస్ కేస్?
Legal· 30 Jul 2026

తోటి నటీమణులపై పోలీస్ కేస్?

మలయాళ నటి అన్సిబా హాసన్ ఫిర్యాదు చేసిన పిటిషన్‌పై కేరళ హైకోర్టు రెస్పాండ్ అయింది. తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వీడియోపై కేస్ రిజిస్టర్ చేయడానికి లోకల్ కోర్టు నో చెప్పడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. తోటి నటీమణులు లక్ష్మీప్రియ, శ్వేతా మీనన్‌లపై FIR ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ జరిపేలా పోలీస్‌లను ఆదేశించాలని రిక్వెస్ట్ చేశారు. అన్సిబా పిటిషన్‌ను యాక్సెప్ట్ చేసిన హైకోర్టు, దీనిపై వివరణ ఇవ్వాలని స్టేట్ గవర్నమెంట్‌కు నోటీసులు ఇచ్చింది.

మిస్సైళ్లు తగ్గిపోతున్నాయా? అమెరికా ₹5 లక్షల కోట్ల డీల్!
Politics· 30 Jul 2026

మిస్సైళ్లు తగ్గిపోతున్నాయా? అమెరికా ₹5 లక్షల కోట్ల డీల్!

యుద్ధం కోసం అమెరికా భారీ ప్లాన్.. ₹5 లక్షల కోట్ల మిస్సైల్ డీల్! ఇరాన్, ఉక్రెయిన్ యుద్ధాల కారణంగా అమెరికా వద్ద Patriot మిస్సైళ్ల నిల్వలు తగ్గుతున్నాయనే ఆందోళన పెరుగుతోంది. దీంతో Lockheed Martin కంపెనీతో 58.6 బిలియన్ డాలర్ల (సుమారు ₹5 లక్షల కోట్లు) విలువైన భారీ ఒప్పందం చేసుకుంది. ఈ డీల్‌తో 2026 నుంచి 2032 వరకు Patriot మిస్సైళ్ల తయారీ పెంచాలని అమెరికా ఆర్మీ ప్లాన్ చేస్తోంది. భవిష్యత్తులో యుద్ధ పరిస్థితులకు సిద్ధంగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అమ్మ ఎత్తుకుంటే ఏడుపు.. అన్నయ్య రాగానే సైలెంట్!
Viral· 30 Jul 2026

అమ్మ ఎత్తుకుంటే ఏడుపు.. అన్నయ్య రాగానే సైలెంట్!

అన్నయ్య చేతుల్లో ప్రశాంతంగా ఉన్న చిన్నారిని అమ్మ వచ్చి ఎత్తుకోగానే ఒక్కసారిగా ఏడవడం స్టార్ట్ చేసింది. ఎంత ఓదార్చినా పాప ఏడుపు ఆపకపోవడంతో, మళ్లీ అన్నయ్య ప్రేమగా చేతుల్లోకి తీసుకోగానే వితిన్ సెకండ్స్‌లో సైలెంట్ అయిపోయింది. ఈ క్యూట్ బాండింగ్ అండ్ క్రేజీ రియాక్షన్ చూసి అక్కడ ఉన్నవాళ్లు మురిసిపోయారు. ప్రస్తుతం ఈ లవింగ్ అండ్ హార్ట్‌వార్మింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రాత్రి ఆలస్యంగా తింటున్నారా?
Health· 30 Jul 2026

రాత్రి ఆలస్యంగా తింటున్నారా?

రాత్రి లేట్ గా తినడం వల్ల లివర్ లో ఫ్యాట్ వచ్చి కాలేయం ఖరాబయ్యే ఛాన్స్ ఉంటుంది. లేట్ నైట్ తింటే ఆ ఎక్స్‌ట్రా కాలరీస్ కొవ్వుగా మారి లివర్‌లో డిపాజిట్ అవుతాయి. అలాగని రాత్రి తిండి మానేయడం దానికి సొల్యూషన్ కాదు, నిద్రపోయే 2-3 గంటల ముందే లిమిట్‌గా తింటే సరిపోతుంది. డైలీ ఎక్సర్‌సైజ్, స్వీట్స్ తగ్గించడం, ఆల్కహాల్‌కి దూరంగా ఉండటం వల్ల ఈ లివర్ ప్రాబ్లమ్స్‌కి చెక్ పెట్టొచ్చు.

మంటలు చూసి భయపడిన రైలు ప్రయాణికులు
News· 30 Jul 2026

మంటలు చూసి భయపడిన రైలు ప్రయాణికులు

వెస్ట్ బెంగాల్ దక్షిణేశ్వర్ స్టేషన్ వద్ద సాయంత్రం ఓవర్ హెడ్ వైరు తెగిపోయింది. ప్రయాణికులు మంటలు కనిపించడంతో భయంతో ట్రైన్ నుంచి దిగి పరుగెత్తారు. అయితే ఎవరికీ ఎటువంటి గాయాలు అవ్వలేదు వెంటనే రైల్వే ఉద్యోగులు బాగుచేసారు. దీని వలన ట్రైన్ సర్వీసులు కొంతసేపు ఆగాయి.