Latest

జిల్లా మైనింగ్ AD సస్పెండ్
AP· 31 Jul 2026

జిల్లా మైనింగ్ AD సస్పెండ్

AP: అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్ వ్యవహారంపై రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లా మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ (AD) మజ్జి శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో అసిస్టెంట్ జియాలజిస్ట్ పురుషోత్తంకు బాధ్యతలు అప్పగించారు. అక్రమ క్వారీ అనుమతులపై విచారణ నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. తవ్వకాల అనుమతులను రద్దు చేసి, పంచదార్లను 'నో మైనింగ్ జోన్'గా చర్యలు చేపట్టాలని డిప్యూటీ CM పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు.

తెలంగాణ ఉద్యమంలో చెరగని ముద్ర పెద్ది: CM
TG· 31 Jul 2026

తెలంగాణ ఉద్యమంలో చెరగని ముద్ర పెద్ది: CM

TG: నర్సంపేట మాజీ MLA, తెలంగాణ ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం పట్ల CM రేవంత్ రెడ్డి, TPCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమని సీఎం కొనియాడారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన నాయకుడిని కోల్పోవడం రాష్ట్రానికి తీరని లోటని పేర్కొన్నారు. శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, సుదర్శన్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

చింతూరు ఏజెన్సీలో హైఅలర్ట్
AP· 31 Jul 2026

చింతూరు ఏజెన్సీలో హైఅలర్ట్

AP: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో శబరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. వరద నీరు భారీగా చేరడంతో నదీ ప్రవాహం రోజురోజుకూ పెరుగుతోంది. శబరికి అనుసంధానమైన కుయుగూరు, చీకటి, సోకిలేరు, చంద్రవంక వాగులు కూడా పొంగిపొర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నది పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేకుండా నదులు, వాగుల వద్దకు వెళ్లొద్దని, ప్రమాదకర ప్రాంతాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు.

పారదర్శకంగా సంక్షేమ పథకాలు: పొంగులేటి
TG· 31 Jul 2026

పారదర్శకంగా సంక్షేమ పథకాలు: పొంగులేటి

TG: ప్రజాసంక్షేమం, సమగ్ర అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని, ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ సంకల్పమన్నారు. మహిళల ఆర్థిక సాధికారత, రైతుల సంక్షేమం, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.

విద్యుత్ వైర్లపై కూలిన ఐరన్ రాడ్లు
TG· 31 Jul 2026

విద్యుత్ వైర్లపై కూలిన ఐరన్ రాడ్లు

TG: హైదరాబాద్ IS సదన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మారుతినగర్‌లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. నిర్మాణంలో ఉన్న భవనానికి అమర్చిన భారీ సెంట్రింగ్ ఐరన్ రాడ్లు ఒక్కసారిగా కూలి విద్యుత్ మెయిన్ వైర్లపై పడ్డాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన స్థానికులు భవనంలో పనిచేస్తున్న కార్మికులను వెంటనే బయటకు తీసుకురావడంతో ప్రాణాపాయం తప్పింది. ఘటనతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం ఇచ్చినా విద్యుత్ శాఖ అధికారులు ఆలస్యంగా స్పందించారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీనియర్ గాయని జమునారాణి కన్నుమూత
Cinema· 31 Jul 2026

సీనియర్ గాయని జమునారాణి కన్నుమూత

ప్రముఖ సీనియర్ గాయని జమునారాణి(88) బెంగుళూరులో కన్నుమూశారు. 1946లో 'త్యాగయ్య' సినిమాతో బాలగాయనిగా సినీరంగ ప్రవేశం చేసిన ఆమె ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, సింహళ భాషల్లో 5 వేలకు పైగా పాటలు పాడారు. తెలుగులో 'మామ మామ మామా' పాటతో చిరస్థాయిగా నిలిచిపోయారు. తెలుగులో ఆఖరిగా 'మిథునం' సినిమాలో 'ఎవరు గెలిచారిప్పుడు' పాట పాడారు.

ఎల్‌నినో ఎఫెక్ట్.. రైతులకు కొత్త సూచనలు
TG· 31 Jul 2026

ఎల్‌నినో ఎఫెక్ట్.. రైతులకు కొత్త సూచనలు

TG: సూపర్ ఎల్‌నినో ప్రభావంపై రైతులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, వచ్చే ఏడాది జూలై వరకు తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రిజర్వాయర్ల నీటి వినియోగానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రైతులకు ఆరుతడి, స్వల్పకాలిక పంటలు, పప్పుధాన్యాలు, ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కల్పించాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులో ఉండాలని చెప్పారు.

తెలంగాణ ఉద్యమ సహచరుడిని కోల్పోయా: KCR
Politics· 31 Jul 2026

తెలంగాణ ఉద్యమ సహచరుడిని కోల్పోయా: KCR

తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ MLA, BRS నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల పార్టీ అధినేత KCR తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉద్యమ సహచరుడిని, ఆప్త మిత్రుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో సుదర్శన్ రెడ్డి చేసిన సేవలను ఆయన స్మరించుకున్నారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన ఆయన మరణం BRSకు తీరని లోటని పేర్కొన్నారు. పెద్ది కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని సూచించారు.

ప్రతి ఇంజనీరింగ్ విద్యార్థికి స్కిల్ తప్పనిసరి
Education· 31 Jul 2026

ప్రతి ఇంజనీరింగ్ విద్యార్థికి స్కిల్ తప్పనిసరి

TG: రాష్ట్రంలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన అనేక మంది విద్యార్థులకు ప్రాథమిక ఉద్యోగ దరఖాస్తు కూడా రాయడం రాకపోవడం ఆందోళనకరమని CM రేవంత్ రెడ్డి అన్నారు. జర్మనీ, ఫిన్లాండ్‌లలో అత్యుత్తమ విద్యా విధానాలను అధ్యయనం చేసి వచ్చిన ప్రభుత్వ ఉపాధ్యాయులతో సీఎం సమావేశమై మాట్లాడారు. ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం ప్రత్యేక స్కిల్ డెవలప్‌మెంట్ ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. జర్మనీ, ఫిన్లాండ్ విద్యా విధానాలను అధ్యయనం చేసి విద్యా రంగంలో సంస్కరణలు తీసుకొస్తామని చెప్పారు.

APలో 800 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్
AP· 31 Jul 2026

APలో 800 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్

ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పెట్టుబడిదారుల ప్రధాన గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో టాటా పవర్ రెన్యువబుల్ ఎనర్జీ, సుజ్లాన్ సంస్థల ఆధ్వర్యంలో రూ.5,750 కోట్లతో 800 మెగావాట్ల సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులకు భూమిపూజ చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 1200 మందికి ఉపాధి, భూములు ఇచ్చిన 1100 మంది రైతులకు 30 ఏళ్లపాటు లీజు ఆదాయం లభించనుంది. రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మార్చడమే ప్రధాన లక్ష్యమన్నారు.

మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత
Politics· 31 Jul 2026

మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత

TG: వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ MLA, సీనియర్ BRS నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి (52) కన్నుమూశారు. పల్మనరీ ఎంబోలిజంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఇటీవల గుండెపోటుకు గురైన అనంతరం ఆయన ఆస్పత్రిలో చేరారు. 2019లో నర్సంపేట ఎమ్మెల్యేగా గెలిచిన సుదర్శన్ రెడ్డి, తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. KCRకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. ఆయన మృతి పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

100 రోజుల్లో రూ.6,000 కోట్ల బకాయిలు క్లియర్
TG· 31 Jul 2026

100 రోజుల్లో రూ.6,000 కోట్ల బకాయిలు క్లియర్

TG: ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చింది. గత 100 రోజుల్లో రూ.6,000 కోట్ల బకాయిల చెల్లింపులను పూర్తి చేసినట్లు ప్రకటించింది. గురువారం మరో రూ.2,000 కోట్లను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. CM రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఈ నిధులు విడుదలయ్యాయి. మూడు విడతల్లో ఒక్కోసారి రూ.2,000 కోట్ల చొప్పున మొత్తం రూ.6,000 కోట్ల బకాయిలు చెల్లించడంతో విశ్రాంత ఉద్యోగుల కమ్యూటేషన్ బకాయిలు పూర్తిగా క్లియర్ అయ్యాయి.

రాజస్థాన్ ఎడారుల్లో స్ట్రాబెర్రీ పంట !
News· 30 Jul 2026

రాజస్థాన్ ఎడారుల్లో స్ట్రాబెర్రీ పంట !

సాధారణంగా చల్లని ప్రాంతాల్లో మాత్రమే పండే స్ట్రాబెర్రీ పంటను రాజస్థాన్‌లోని ఎడారి నేలల్లో పండించి కొందరు రైతులు విప్లవాత్మక మార్పు తెచ్చారు. డ్రిప్ ఇరిగేషన్, పాలీహౌస్/మల్చింగ్ సాంకేతికత,వినూత్న వ్యవసాయ పద్ధతులను ఉపయోగించి వారు ఈ అసాధ్యమైన పంటను సాధ్యం చేశారు. తక్కువ నీటి వినియోగంతో అధిక దిగుబడి సాధిస్తూ, స్థానిక రైతులు సంప్రదాయ పంటల కంటే కొన్ని రెట్లు ఎక్కువ లాభాలు గడిస్తున్నారు. ఈ విజయం ఎడారి ప్రాంతాల్లో ఉద్యానవన రంగానికి (Horticulture) కొత్త ఊపిరి పోసింది.

మీ మెమరీకి మూలం మీరు తిసుకునే పుడ్డే !
Health· 30 Jul 2026

మీ మెమరీకి మూలం మీరు తిసుకునే పుడ్డే !

మన మెమరీ పవర్ మనం తినే ఫుడ్ పై డిపెండ్అయి ఉంటుందని మీకు తెలుసా? మితిమీరి జంక్ ఫుడ్తినడం, పోషకాహార లోపం ఉంటే మెదడులోని హిప్పో క్యాంపస్ అంటే మెమరీ పవర్ కి కేంద్రం పనితీరును దెబ్బ తింటుందం టున్నారు సైంటిస్టులు. బాలెన్స్ డ్ పుడ్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల మెమరీ పవర్ పెరుగుతుందని, అల్జీమర్స్ లాంటి సమస్యల ముప్పు తగ్గుతుందని సైంటిస్టులు అంటున్నారు.

‘రామాయణ: పార్ట్ 1’ ట్రైలర్ విడుదల: విశేషాలు ఇవే!
Cinema· 30 Jul 2026

‘రామాయణ: పార్ట్ 1’ ట్రైలర్ విడుదల: విశేషాలు ఇవే!

నితీష్ తివారీ దర్శకత్వంలో రూపుదిద్దు కుంటున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'రామాయణ: పార్ట్ 1' 4 నిమిషాల నిడివితో ఉన్న గ్రాండ్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ ట్రైలర్‌లో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణాసురుడిగా యాష్ తమ నటనతో మెప్పించారు. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, DNEG నిర్మిస్తున్న ఈ దృశ్యకావ్యం 2026 దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది

నేరాలకు, బాధితులకందే సాయానికీ పొంతనే లేదు
News· 30 Jul 2026

నేరాలకు, బాధితులకందే సాయానికీ పొంతనే లేదు

దేశంలో మహిళలపై జరిగే నేరాలకు సంబంధించి గంటకు సగటున 51 ఎఫ్‌ఐఆర్‌లు (FIRs) నమోదవుతున్నప్పటికీ, నష్టపరిహారం అందుతున్న బాధితుల సంఖ్య ఏడుగురిలో ఒకరి కంటే తక్కువగానే ఉందంటూ ఓ నివేదిక వెల్లడించింది. తీవ్రమైన లైంగిక దాడి కేసుల్లో కూడా అవగాహన లోపం, సంక్లిష్టమైన దరఖాస్తు ప్రక్రియ, ఫండ్స్ వినియోగంలో నిర్లక్ష్యం వల్ల మెజారిటీ బాధితులకు ప్రభుత్వ సాయం అందడం లేదు. న్యాయ ప్రక్రియలో ఈ వ్యత్యాసాన్ని సరిచేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

విద్యావ్యవస్థపై హరగోపాల్ ప్రసంగాల సంకలనం ఆవిష్కరణ !
News· 30 Jul 2026

విద్యావ్యవస్థపై హరగోపాల్ ప్రసంగాల సంకలనం ఆవిష్కరణ !

పాలమూరు అధ్యయన వేదిక, డెమోక్రటిక్ టీచర్స్ పెడరేషన్ జాయింట్ గా రూపొందించిన సంక్షోభ కాలంలో విద్యారంగం బుక్ ఆవిష్కరణ ఆగస్టు 2, ఆదివారం హైదరాబాద్ లోని బాగ్ లింగం పల్లి, సుందరయ్య విజ్ఞాన వేదికలోని కాట్రగడ్డ శ్రీనివాస రావు హాలులో జరగనుంది.1980 నుంచి 2026 నేటి కాక్రోచ్ ఉద్యమం వరకూ క్షీణిస్తున్న విద్యావ్యవస్థ తీరును వివిధ వేదికలపై ప్రొఫెసర్ హర గోపాల్ చేసిన ప్రసంగాల ఆధారంగా పుస్తక రూపంలోకి తెచ్చారు. ప్రొపెసర్ వి. ఎస్ . ప్రసాద్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు.

కడప జిల్లాలో మెగా స్టార్ మూవీకి అరుదైన రికార్డ్
Cinema· 30 Jul 2026

కడప జిల్లాలో మెగా స్టార్ మూవీకి అరుదైన రికార్డ్

ఓటీటీలు వచ్చాక పెద్ద సినిమాలు ఎక్కువ రోజులు థియేటర్లలో ఆడే పరిస్థితి లేని ఈ తరుణంలో థియేటర్లలో నటుడు చిరంజీవి మూవీ ఏకంగా 200రోజులు ఆడింది. ఈ ఏడాది 2026 జనవరి 12న విడుదలైన మన శివ శంకర వర ప్రసాద్ మూవీ కడప జిల్లా, యర్రగుంట్లలోని "హేమ పిక్చర్ ప్యాలెస్"లో 200 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటికే OTT లోకి వచ్చినప్పటికి ధీయేటర్ లో రోజూ ఇప్పటికీ 4 ఆటలుతో కొనసాగుతుండటం విశేషం.!

ఈట్ క్లబ్ సెంట్రల్ కిచెన్ లైసెన్స్ సస్పెన్షన్
News· 30 Jul 2026

ఈట్ క్లబ్ సెంట్రల్ కిచెన్ లైసెన్స్ సస్పెన్షన్

రంగారెడ్డి జిల్లా ఘట్ కేసర్ లోని ఈట్ క్లబ్ బ్రాండ్స్ సెంట్రల్ కిచెన్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసి అనేక నిబంధనల ఉల్లంఘనలను గుర్తించారు. పరిశుభ్రత లోపం,పురుగుల ముట్టడి, ఫుడ్ నిల్వల్లో నిబంధనలు క్రాస్ చేయడం, లేబిలింగ్ లోపాలు, సింథటిక్ కలర్స్ వాడటం లాంటి అంశాలు చూశాక లై సెన్స్ సస్పెండ్ చేశారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్ట్స్ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటున్నారు.

విద్యా రుణాల పంపిణీ రెట్టింపుకు కేంద్రం భారీ ప్రణాళిక
Education· 30 Jul 2026

విద్యా రుణాల పంపిణీ రెట్టింపుకు కేంద్రం భారీ ప్రణాళిక

దేశంలో విద్యా రుణాల (Education Loans) పంపిణీని రాబోయే ఏడాదిలో రెట్టింపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రక్రియను వేగవంతం చేసి, 10 రోజుల్లోనే రుణాలు మంజూరు చేసేలా బ్యాంక్‌లకు మార్గదర్శకాలు ఇచ్చారు. కళాశాలల్లోనే ప్రత్యేక క్యాంప్‌లు నిర్వహించి స్పాట్ శాంక్షన్లు ఇవ్వనున్నారు. రూ. 7.5 లక్షల వరకు గ్యారెంటీ కవరేజ్, co-applicant నిబంధనల సడలింపు ద్వారా విద్యార్థులకు మరింత సులభంగా రుణాలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇకపై బట్టలకు  ఇండియన్ సైజ్ కొలతలు !
General· 30 Jul 2026

ఇకపై బట్టలకు ఇండియన్ సైజ్ కొలతలు !

ఇప్పటివరకు యూఎస్ (US), యూకే (UK) సైజ్ చార్టుల ఆధారంగా దుస్తులు తయారవు తుండగా, త్వరలోనే భారతీయుల శరీర ఆకృతికి సరిపోయేలా సొంత సైజ్ చార్ట్ రాబోతోంది. భారత జౌళి మంత్రిత్వ శాఖ, నిఫ్ట్ (NIFT) సంయుక్తంగా 'INDIAsize' ప్రాజెక్టు ద్వారా 3D బాడీ స్కేనింగ్ పరిజ్ఞానంతో 25,000 మందికి పైగా భారతీయుల శారీరక కొలతలను సేకరించాయి. దీనివల్ల బట్టల ఫిట్టింగ్ సమస్యలు తొలగిపోయి, ఫిర్యాదులు , ఆన్‌లైన్ రిటర్న్‌లు గణనీయంగా తగ్గుతాయి.