Latest

ఇరాన్‌పై చైనాకు నిజంగానే అంత పట్టు ఉందా?
చైనా ఒక్క మాట చెబితే ఇరాన్ ఆగిపోతుందా..? ఇదే ఇప్పుడు గల్ఫ్ దేశాల ఆశ. ఇరాన్‌తో యుద్ధం మళ్లీ తీవ్రం కావడంతో, గల్ఫ్ దేశాలు ఇప్పుడు అమెరికా కంటే చైనా వైపు చూస్తున్నాయి. హోర్ముజ్ జలసంధి, ఎర్ర సముద్రంలో రాకపోకలు సజావుగా కొనసాగేలా ఇరాన్‌పై తన ఆర్థిక ప్రభావాన్ని ఉపయోగించాలని చైనాను కోరుతున్నాయి. అయితే చైనా మాత్రం యుద్ధంలో ఏ పక్షం వైపు నిలవకుండా, చర్చల ద్వారానే సమస్య పరిష్కారం కావాలని చెబుతోంది. దీంతో ఇరాన్‌పై చైనాకు నిజంగా ఎంత ప్రభావం ఉందనే విషయం ఇప్పుడు పరీక్షగా మారింది.

ఇండియాలో 'డైట్ కోక్' కొరత!
ఇండియాలో ఇటీవల Diet Coke కొరత ఏర్పడటానికి కారణం దాని డిమాండ్ విపరీతంగా పెరగడమేనని కోకాకోలా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జాన్ మర్ఫీ తెలిపారు. వెస్ట్ ఏషియా వార్ వల్ల అల్యూమినియం క్యాన్ల సప్లై దెబ్బతిని, ప్యాకేజింగ్ కాస్ట్స్ పెరగడం వల్లనే ఈ షార్టేజ్ వచ్చిందని చెప్పారు. డైట్ కోక్ కేవలం క్యాన్లలోనే అమ్మడం వల్ల ఈ ప్రాబ్లమ్ ఎక్కువైందని. కొరత ఉన్నప్పటికీ, ఇండియా తమకు లాంగ్ టర్మ్‌లో బిగ్ ఆపర్స్యూనిటీ అని, ఈ ఇయర్ ఆర్డర్లు 10 రెట్లు పెరుగుతాయని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది.

తోటి నటీమణులపై పోలీస్ కేస్?
మలయాళ నటి అన్సిబా హాసన్ ఫిర్యాదు చేసిన పిటిషన్‌పై కేరళ హైకోర్టు రెస్పాండ్ అయింది. తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వీడియోపై కేస్ రిజిస్టర్ చేయడానికి లోకల్ కోర్టు నో చెప్పడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. తోటి నటీమణులు లక్ష్మీప్రియ, శ్వేతా మీనన్‌లపై FIR ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ జరిపేలా పోలీస్‌లను ఆదేశించాలని రిక్వెస్ట్ చేశారు. అన్సిబా పిటిషన్‌ను యాక్సెప్ట్ చేసిన హైకోర్టు, దీనిపై వివరణ ఇవ్వాలని స్టేట్ గవర్నమెంట్‌కు నోటీసులు ఇచ్చింది.

మిస్సైళ్లు తగ్గిపోతున్నాయా? అమెరికా ₹5 లక్షల కోట్ల డీల్!
యుద్ధం కోసం అమెరికా భారీ ప్లాన్.. ₹5 లక్షల కోట్ల మిస్సైల్ డీల్! ఇరాన్, ఉక్రెయిన్ యుద్ధాల కారణంగా అమెరికా వద్ద Patriot మిస్సైళ్ల నిల్వలు తగ్గుతున్నాయనే ఆందోళన పెరుగుతోంది. దీంతో Lockheed Martin కంపెనీతో 58.6 బిలియన్ డాలర్ల (సుమారు ₹5 లక్షల కోట్లు) విలువైన భారీ ఒప్పందం చేసుకుంది. ఈ డీల్‌తో 2026 నుంచి 2032 వరకు Patriot మిస్సైళ్ల తయారీ పెంచాలని అమెరికా ఆర్మీ ప్లాన్ చేస్తోంది. భవిష్యత్తులో యుద్ధ పరిస్థితులకు సిద్ధంగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అమ్మ ఎత్తుకుంటే ఏడుపు.. అన్నయ్య రాగానే సైలెంట్!
అన్నయ్య చేతుల్లో ప్రశాంతంగా ఉన్న చిన్నారిని అమ్మ వచ్చి ఎత్తుకోగానే ఒక్కసారిగా ఏడవడం స్టార్ట్ చేసింది. ఎంత ఓదార్చినా పాప ఏడుపు ఆపకపోవడంతో, మళ్లీ అన్నయ్య ప్రేమగా చేతుల్లోకి తీసుకోగానే వితిన్ సెకండ్స్‌లో సైలెంట్ అయిపోయింది. ఈ క్యూట్ బాండింగ్ అండ్ క్రేజీ రియాక్షన్ చూసి అక్కడ ఉన్నవాళ్లు మురిసిపోయారు. ప్రస్తుతం ఈ లవింగ్ అండ్ హార్ట్‌వార్మింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రాత్రి ఆలస్యంగా తింటున్నారా?
రాత్రి లేట్ గా తినడం వల్ల లివర్ లో ఫ్యాట్ వచ్చి కాలేయం ఖరాబయ్యే ఛాన్స్ ఉంటుంది. లేట్ నైట్ తింటే ఆ ఎక్స్‌ట్రా కాలరీస్ కొవ్వుగా మారి లివర్‌లో డిపాజిట్ అవుతాయి. అలాగని రాత్రి తిండి మానేయడం దానికి సొల్యూషన్ కాదు, నిద్రపోయే 2-3 గంటల ముందే లిమిట్‌గా తింటే సరిపోతుంది. డైలీ ఎక్సర్‌సైజ్, స్వీట్స్ తగ్గించడం, ఆల్కహాల్‌కి దూరంగా ఉండటం వల్ల ఈ లివర్ ప్రాబ్లమ్స్‌కి చెక్ పెట్టొచ్చు.

మంటలు చూసి భయపడిన రైలు ప్రయాణికులు
వెస్ట్ బెంగాల్ దక్షిణేశ్వర్ స్టేషన్ వద్ద సాయంత్రం ఓవర్ హెడ్ వైరు తెగిపోయింది. ప్రయాణికులు మంటలు కనిపించడంతో భయంతో ట్రైన్ నుంచి దిగి పరుగెత్తారు. అయితే ఎవరికీ ఎటువంటి గాయాలు అవ్వలేదు వెంటనే రైల్వే ఉద్యోగులు బాగుచేసారు. దీని వలన ట్రైన్ సర్వీసులు కొంతసేపు ఆగాయి.
ఈ చేపలు ఆకాశం నుంచి పడ్డాయ!
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఒక మైండ్ బ్లోయింగ్ ఇన్సిడెంట్ జరిగింది. గత రెండు రోజులుగా కంటిన్యూస్‌గా పడుతున్న వర్షాల వల్ల, ఆకాశం నుంచి చేపలు కింద పడ్డాయని లోకల్ జనాలు చెబుతున్నారు. పల్లె ప్రకృతి వనం, మజీద్ పల్లి ఏరియాల్లోని రోడ్లు, బురదలో పడిన ముళ్ల చేపలను పట్టుకోవడానికి జనాలు పోటీ పడ్డారు. దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైర్ అవుతున్నాయి.

బస్సు టికెట్ తో పాటే 'ఆటో రైడ్' బుకింగ్..
TGSRTC బస్సు ప్రయాణికులకు శుభవార్త అందిస్తూ 'ఫస్ట్ మైల్, లాస్ట్ మైల్ కనెక్టివిటీ' కోసం ఈ-ఆటో సేవలకు శ్రీకారం చుట్టింది. ప్రయాణికులు ఇంటి నుంచి బస్టాప్‌కు, అలాగే బస్సు దిగాక తమ గమ్యస్థానానికి సులభంగా చేరుకోవడానికి బస్ టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే తక్కువ ఛార్జీలతో ఈ-ఆటో రైడ్‌ను కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ నూతన విధానాన్ని మొదట హైదరాబాద్‌లో పరిశీలించి, ఆ తర్వాత వరంగల్, కరీంనగర్, ఖమ్మం వంటి నగరాలకు విస్తరించనున్నారు.

ఈ20 పెట్రోల్‌తో మైలేజ్ తగ్గుతుంది: నితిన్ గడ్కరీ
20% ఇథనాల్ కలిపిన E20 పెట్రోల్ వాడితే బండి మోడల్ బట్టి 2 నుంచి 6 శాతం దాకా మైలేజ్ తగ్గుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్‌లో చెప్పారు. అయితే ఇలా వాడటం వల్ల ఇంజిన్ పాడవ్వడం లాంటి సమస్యలు ఏమీ రాలేదని ఆయన స్పష్టం చేశారు. మామూలు పెట్రోల్ కన్నా E20 వాడితే బండి పికప్ బాగుంటుందని. పొల్యూషన్ కూడా 30% తగ్గుతుందని తెలిపారు. టూ వీలర్, ఫోర్ వీలర్ బండ్లపై అన్ని రకాల టెస్టులు చేశాకే ఈ విషయాలు తెలిశాయి అని మంత్రి అన్నారు.

రైల్వే ఉద్యోగాల వేటలో ఉన్నారా? NHSRCL లో 237 పోస్టులు..
నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) 237 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి <a href="https://pratibha.eenadu.net/notifications/notification_article/government-jobs/nhsrcl-technician-vacancies/2-8-27-23070028985">ప్రకటన విడుదల</a> చేసింది. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, సిగ్నలింగ్ వంటి విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. 10వ తరగతితో పాటు ITI/అప్రెంటిస్‌షిప్ లేదా డిప్లొమా ఉండి, రైల్వేస్ లేదా మెట్రో విభాగంలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.గరిష్ట వయోపరిమితి 35 ఏళ్లు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 05 ఆగస్టు 2026. సీబీటీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక జరుగుతుంది.
ఫారెన్ ఫండింగ్ ఆరోపణలపై- అభిజీత్ దిప్కే
CJP ఫౌండర్ అభిజీత్ దిప్కే హోం మినిస్టర్ అమిత్ షాపై హాట్ కామెంట్స్ చేశారు. తమకు ఫారెన్ నుంచి ఫండింగ్ వస్తోందన్న ఆరోపణలపై రియాక్ట్ అవుతూ, ఒకవేళ అది నిజమైతే అది అమిత్ షా ఫెయిల్యూర్ అని అన్నారు. హోం మినిస్టర్‌గా ఉండి కూడా విదేశీ ఫండింగ్ రాకుండా ఆపలేకపోతే ఆయన వెంటనే రిజైన్ చేయాలని డిమాండ్ చేశారు. డెమోక్రసీని కాపాడటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన స్పందించారు.

ఆ కేసుపై నాంపల్లి కోర్టుకు వెళ్లనున్న కేటీఆర్
TG: ఫార్ములా-ఈ రేసు కేసులో BRS వర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్ రేపు నాంపల్లి ACB స్పెషల్ కోర్టులో హాజరుకానున్నారు. కోర్టు జారీ చేసిన సమన్ల గురించి ఆయన వ్యక్తిగతంగా కోర్టుకు అటెండ్ అవుతున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా-ఈ రేసుకు సంబంధించి ప్రజాధన వినియోగం, పరిపాలనా నిర్ణయాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ACB ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తోంది.

హాకీ జట్టుకు కాషాయ రంగు జెర్సీ..విపక్షాల మండిపాటు
భారత హాకీ జట్టుకు కొత్తగా కాషాయ రంగు జెర్సీ ప్రవేశపెట్టడంపై విపక్షాలు కేంద్రంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. FIH హాకీ వరల్డ్ కప్‌కు ముందు హాకీ ఇండియా పురుషులు, మహిళల జట్లకు కాషాయ రంగు జెర్సీని ఎంపిక చేయడంతో ఈ వివాదం మొదలైంది. దేశంలో క్రీడారంగాన్ని కాషాయీకరణ చేస్తున్నారా అని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఇలాగే కొనసాగితే భారత సైన్యం యూనిఫాం కూడా కాషాయ రంగులోకి మారుతుందని అంటున్నారు. మాజీ భారత కెప్టెన్ విరెన్ రస్క్విన్హా కూడా దీనిపై విమర్శలు చేశారు.
అమిత్ షా రాజీనామా చేయాలి- మల్లికార్జున ఖర్గే
స్టూడెంట్స్ ప్రొటెస్ట్ పై పోలీసులు చేసిన దాడి, లాఠీఛార్జ్, పెల్లెట్ గన్స్ వాడకంపై కాంగ్రెస్ అధ్యక్షుడు <a href="https://x.com/kharge/status/2082783471077097680?s=20">మల్లికార్జున ఖర్గే</a> రాజ్యసభలో ఫైర్ అయ్యారు. 100 మందికి పైగా స్టూడెంట్స్ గాయపడి హాస్పిటల్లో చేరారని, బాధ్యత వహిస్తూ హోం మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దాడులకు పాల్పడిన వారి వివరాలు చెప్పి, దాడికి ఆర్డర్స్ ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రశ్నించారు.

ఈజిప్ట్‌లో పేలుళ్లు!
అమెరికా మరోసారి ఇరాన్‌లోని కొన్ని చోట్ల దాడులు చేసినట్లు తెలిపింది. అదే సమయంలో ఈజిప్ట్‌లోని డామియెట్టా పోర్ట్ దగ్గర డ్రోన్ దాడి జరగడంతో పరిస్థితి మరింత సీరియస్ అయింది. ఈ దాడిలో రెండు గ్యాస్ నౌకలకు మంటలు అంటుకున్నాయని అధికారులు చెప్పారు. అయితే ఈ దాడి చేసింది ఎవరో ఇప్పటికీ తెలియలేదు. ఇరాన్‌కు మద్దతుగా ఉన్న గ్రూపులు చేసి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.

హర్షిత్ రెడ్డి ‘దీవానా’ ఓటీటీ లాక్..
హర్షిత్ రెడ్డి, స్మేహా మణిమేఘలై జంటగా శ్రీకాంత్ సంఘిశెట్టి దర్శకత్వంలో వచ్చిన యూత్‌ఫుల్ మూవీ ‘దీవానా’ థియేటర్లలో మంచి స్పందన పొందిన ఈ లవ్ స్టోరీని సాధారణ ప్రేక్షకులకు ఇప్పుడు ఆహా (Aha)ఓటీటీలో జూలై 31 నుంచి రానుంది.ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ను అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కారంపూడి సినిమాను నిర్మించారు. నరేష్, ఝాన్సీ, రఘు కారుమంచి, వేణు ప్రధాన పాత్రలు పోషించారు.

భారత జావలిన్ థ్రోయర్లు ముగ్గురు ఫైనల్‌కు క్వాలిఫై
గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్‌వెల్త్ గేమ్స్‌లో మెన్ జావలిన్ థ్రో క్వాలిఫైంగ్ రౌండ్‌లో భారతీయులు అద్భుత ప్రదర్శన చేశారు. ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రా 79.61 మీటర్లతో 5వ స్థానం సాధించగా, రోహిత్ యాదవ్ 78.37 మీటర్లు తో 9వ స్థానం, యశ్ వీర్ సింగ్ 78.36 మీటర్లు 10వ స్థానంతో ఫైనల్‌కు క్వాలిఫై అయ్యారు. శ్రీలంక రుమేష్ తరంగ పతిరాజ్ 82.84 మీటర్లతో టాప్‌లో ఉన్నాడు. ఫైనల్ జూలై 31న రాత్రి 10:15 ISTకి జరగనుంది.

జగన్‌కు జైలు అధికారులు అనుమతి క్యాన్సిల్
AP: YSRCP అధినేత వైఎస్ జగన్‌కు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో ములాఖత్ క్యాన్సిలయ్యింది. జగన్ సమయానికి జైలు వద్దకు చేరుకోకపోవడంతో అనుమతి ఇవ్వలేమని శ్రీకాకుళం జిల్లా అంపోలు జైలు అధికారులు తెలిపారు. నిబంధనల ప్రకారం సాయంత్రం 5 గంటలలోపు మాత్రమే ములాఖత్‌కు అనుమతి ఉంటుందని ఆయనకు స్పష్టం చేశారు. దింతో స్టేషన్ బయట అప్పలరాజు ఫామిలీతో మాట్లాడారు.

‘నీట్’ పేపర్ లీక్ ఉద్యమంపై బాలీవుడ్ మూవీ!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ వివాదం, జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేసిన ఉద్యమంపై బాలీవుడ్‌లో ఒక చిత్రం తెరకెక్కనుంది.ఈ సినిమాకి ‘ది యాక్సిడెంటల్ కాక్రోచ్ పార్టీ’ (The Accidental Cockroach Party)అనే వెరైటీ టైటిల్‌ను ఖరారు చేశారు. జైపూర్‌కు చెందిన గోవింద్ దేవ్ రీసెర్చ్, స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి రూ.20 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 2027లో థియేటర్లలోకి తీసుకురావడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

జంతర్‌మంతర్ నిరసనల్లో దేశ ప్రతిష్ఠను దెబ్బతీశారు: రామ్‌దేవ్
దేశం వీధుల్లో కాదు, పార్లమెంట్ ద్వారానే నడుస్తుందని యోగా గురు రామ్‌దేవ్ అన్నారు. జంతర్‌మంతర్ వద్ద జరిగిన నిరసనల్లో పాల్గొన్న కొందరు భారతదేశ ప్రతిష్ఠను దెబ్బతీశారని రామ్‌దేవ్ విమర్శించారు. విద్యాశాఖ మంత్రి ఎవరు అనేది ప్రధాని, పార్లమెంటే నిర్ణయిస్తుందన్నారు. బ్రాహ్మణవాదం, ఆర్‌ఎస్‌ఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఆయన అన్నారు. పెద్దలను గౌరవించడం భారతీయ సంస్కృతి అని, తల్లిదండ్రులు, గురువులు చూపిన మార్గంలో నడవాలని ఆయన సూచించారు.