Latest

ఫేషియల్ స్కాన్‌లతో ఓల్డ్ క్రిమినల్స్ గుర్తింపు
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఇటీవల జరిగిన నిరసన ప్రదర్శనల్లో 2,873 మంది నేర చరిత్ర కలిగిన వ్యక్తులను ఫేషియల్ రికగ్నిషన్ (Facial Recognition) సిస్టమ్ ద్వారా పోలీసులు గుర్తించారు.CCTV దృశ్యాలను విశ్లేషించగా, వీరిలో 989 మంది హత్య, అత్యాచారం, కిడ్నాప్, దోపిడీ , పోక్సో (POCSO) వంటి తీవ్రమైన నేరాల్లో ప్రమేయం ఉన్న పాత నేరస్థులని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

ఆ పదవికి సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలి: రాంచందర్ రావు
TG: సీఎం రేవంత్‌రెడ్డి విద్యాశాఖ మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు డిమాండ్ చేశారు. యువతను ప్రోత్సహిస్తామని సీఎం తరచూ చెబుతున్నారని, విద్యాశాఖ, హోంశాఖ, అర్బన్ శాఖ వంటి కీలక శాఖలను ముఖ్యమంత్రే నిర్వహిస్తున్నారని అన్నారు. యువ కాంగ్రెస్ ఎమ్మెల్యే పాలకుర్తి యశస్విని రెడ్డిని తెలంగాణ విద్యాశాఖ మంత్రిగా నియమించాలన్నారు. యువతకు ప్రాధాన్యమిస్తామని చెబుతున్న ప్రభుత్వం, అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని ఆయనన్నారు.

ప్రధాని మోదీని కలిసిన స్కైరూట్ ఫౌండర్స్
భారతదేశ తొలి ప్రైవేట్ రాకెట్ 'విక్రమ్-1' ప్రయోగం సక్సెస్ కావడంతో.. స్కైరూట్ ఏరోస్పేస్ ఫౌండర్స్ పవన్ చందన, నాగ భరత్ ప్రధాని మోదీని కలిశారు. వాళ్ళ ఉత్సాహం, లక్ష్యాలు చూస్తుంటే మన ప్రైవేట్ స్పేస్ సెక్టార్ ఫ్యూచర్ ఎంతో బ్రైట్‌గా ఉందని మోదీ 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. ఈ మీటింగ్‌లో విక్రమ్-1 సక్సెస్‌తో పాటు ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మాట్లాడుకున్నట్లు ఆయన చెప్పారు. ప్రధాని ఇచ్చిన సపోర్ట్ తమకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని స్కైరూట్ సంస్థ తెలిపింది.

NTR కి గాయం.. 6-8 వారాలు కంప్లీట్ రెస్ట్!
హీరో జూనియర్ NTRకు షోల్డర్ ఇంజ్యూరీ అయినట్లు ఆయన ఆఫీస్ PR స్టేట్‌మెంట్ రిలీజ్ చేసింది. డాక్టర్ మధుసూదన్ రావు, పూర్ణచంద్ర తేజస్వి టీమ్ చెకప్ చేసి, NTR పూర్తి రికవరీ కోసం 6 నుంచి 8 వారాలు రెస్ట్ తీసుకోమని చెప్పారు. ఫ్యాన్స్ ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని, హెల్త్ అప్‌డేట్స్ ఇస్తూ ఉంటామని టీమ్ క్లారిటీ ఇచ్చింది.

క్రిమినల్ కేసుల జాబితాల్లో రేవంత్ రెడ్డి, చంద్రబాబు
మోస్ట్ క్రిమినల్ కేసుల జాబితాల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నట్టు అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ వెల్లడించింది. 89 క్రిమినల్ కేసులతో రేవంత్ రెడ్డి ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారు. అందులో 72 తీవ్రమైన కేసులున్నాయి. 19 క్రిమినల్ కేసులతో చంద్రబాబు ఫోర్త్ ప్లేస్‌లో ఉన్నారు. రిచెస్ట్ సీఎంగా రూ.1,413 కోట్ల ఆస్తులతో కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారు. రూ.931 కోట్లతో చంద్రబాబు సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు. రూ. 30 కోట్లతో రేవంత్ రెడ్డి 8వ ప్లేస్‌లో ఉన్నారు.

భోపాల్‌లో పది మంది మిస్సింగ్ కలకలం
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో గడిచిన 24 గంటల్లోనే 10 మంది మిస్ అయ్యారు. వీరిలో ముగ్గురు మైనర్లు కూడా ఉన్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లగానే వీళ్ల ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయి. కోలార్, అయోధ్య నగర్, అశోకాగార్డెన్ సహా కొన్ని ప్రాంతాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. అశోకాగార్డెన్‌లో క్లాస్‌కు వెళ్లిన 17ఏళ్ల కుర్రాడు తిరిగి రాలేదు. కొలార్, అయోధ్య నగర్‌లలో కూడా యువకులు, పెద్దవాళ్లు కనిపించకుండా పోయారు. కుటుంబ సభ్యుల కంప్లైంట్‌తో పోలీసులు సెర్చింగ్ మొదలుపెట్టారు.

కోట్ల విలువైన భూమి..ప్రైవేటు సంస్థకు ధారాదత్తం
TG: కోట్ల విలువ చేసే భూమిని తక్కువ ఫీజుతో ఎన్‌ఎస్ ఇన్‌ఫ్రా కన్‌స్ట్రక్షన్స్ సంస్థకు లీజుకు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వడం కలకలంగా మారింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం దర్గా హుస్సేన్ షా వలి గ్రామంలో 1.04 ఎకరాల ఉర్దూ అకాడమీ భూమిని ఆ సంస్థకు 30 ఏళ్ల పాటు లీజుకు ఇస్తూ జీవో జారీ చేశారు. ఏడాదికి రూ.5,220 ఫీజుకే, ఎలాంటి పబ్లిక్ నోటీసులు లేకుండా ఇలా లీజు ఇవ్వడమేంటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నాలుగేళ్ల చిన్నారిపై హెడ్‌మాస్టర్ లైంగిక దాడి!
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో దారుణం జరిగింది. నాలుగేళ్ల చిన్నారిపై తాటికాయల భాస్కర్(50) అనే గవర్నమెంట్ స్కూల్ హెడ్‌మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇంటి ముందు ఆడుకుంటున్న పాపకి మాయమాటలు చెప్పి ఈ ఘోరానికి ఒడిగట్టాడు. చిన్నారి ఇచ్చిన సమాచారంతో ఆమె పేరెంట్స్ వర్ధన్నపేట పోలీసులకు కంప్లైంట్ చేశారు. హెడ్‌మాస్టర్‌పై పోక్సో కేసు ఫైల్ చేసిన పోలీసులు అతడి కోసం సెర్చ్ స్టార్ట్ చేశారు. అయితే ఊరిలోని కొందరు ఈ కేసును సైలెంట్‌గా కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

హైకోర్టు ఆదేశాల తర్వాత ఏవీ రంగనాథ్ రియాక్షన్
TG: తెలంగాణ హైకోర్టు హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్‌ను ఆ పదవి నుంచి తొలగించాలన్న ఆదేశాలకు ఆయన స్పందించారు. గత రెండేళ్లుగా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కుల పరిరక్షణ కోసం హైడ్రా పనిచేసిందని చెప్పారు. బడా భూకబ్జాదారులు ఆక్రమించిన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి అప్పగించినట్లు రంగనాథ్ పేర్కొన్నారు. తనపై ప్రస్తుతం 63 కంటెంప్ట్ కేసులు ఉన్నాయని, అవన్నీ భూకబ్జాదారులు ఫైల్ చేసినవేనని అన్నారు. ఈ కేసులని చట్టపరంగానే ఎదుర్కొంటానని స్పష్టం చేశారు.

నీట్ ప్రోటెస్టర్స్‌కు కేసుల నుండి బిగ్ రిలీఫ్..
నీట్ పేపర్ లీక్ ప్రోటెస్ట్స్‌లో పాల్గొన్న వారిపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటామని బీహార్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. అలాగే జైల్లో ఉన్న వారిని రిలీజ్ చేస్తామని తెలిపింది. ప్రోటెస్టర్స్‌పై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లు, క్రిమినల్ కంప్లైంట్స్ విత్‌డ్రా ప్రాసెస్ వెంటనే స్టార్ట్ చేస్తామని హోమ్ డిపార్ట్‌మెంట్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. జులై 26 సాయంత్రం 6 గంటల కంటే ముందు ప్రోటెస్ట్ చేసిన ఎవరిపైనా లీగల్ యాక్షన్ తీసుకోమని క్లారిటీ ఇచ్చింది.

పెల్లెట్ గన్స్ వాడకంపై సుప్రీం కోర్టులో పిటిషన్!
పెల్లెట్ గన్స్ వాడకాన్ని బ్యాన్ చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ ఫైల్ అయింది. రిటైర్డ్ IB ఆఫీసర్ యశోవర్ధన్ ఆజాద్‌తో పాటు జులై 20 ప్రోటెస్ట్‌లో గాయపడిన బాధితులు దీనిపై కోర్టును ఆశ్రయించారు. క్రౌడ్ కంట్రోల్ కోసం పోలీసులు పెల్లెట్ గన్స్ వాడకుండా పూర్తిగా నిరోధించాలని డిమాండ్ చేశారు. అలాగే గాయపడిన బాధితులకు గవర్నమెంట్ కాంపెన్సేషన్ ఇవ్వాలని, వారి మెడికల్ ట్రీట్‌మెంట్, రిహాబిలిటేషన్ బాధ్యతలను పూర్తిగా చూసుకోవాలని సుప్రీం కోర్టును రిక్వెస్ట్ చేశారు.

బర్త్‌డే సందర్భంగా బిగ్ అప్‌డేట్- అన్నా కొణిదెల
పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నెవా తన పేరు మార్పుపై ఇన్స్టాగ్రామ్‌లో ఆసక్తికర పోస్ట్ చేశారు. తన బర్త్‌డే దగ్గరపడుతుండటంతో ఈ విషయం చెబుతున్నట్లు పేర్కొన్నారు. పెళ్లి వార్తలు వచ్చినప్పుడు అందరూ తన్ను అన్నా లెజ్నెవాగానే గుర్తించారని, కానీ మ్యారేజ్ సర్టిఫికేట్ తర్వాత తన భర్త ఇంటిపేరును తీసుకుని అన్నా కొణిదెలగా మారానని క్లారిటీ ఇచ్చారు. ఇకపై అందరూ తనను అన్నా కొణిదెల అని మాత్రమే పిలవాలని రిక్వెస్ట్ చేశారు. రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ ట్రిప్ పిక్‌ను ఈ సందర్భంగా ఆమె షేర్ చేశారు.
అర్ధరాత్రి 1AM కి బిగ్ బ్రేకింగ్!
అర్ధరాత్రి 1AM కి CJP స్పోక్స్ పర్సన్ ఒక వీడియో రిలీజ్ చేసి బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. ప్రభుత్వ ప్రతినిధులు తమతో 3 గంటల పాటు చర్చలు జరిపారని తెలిపారు. ప్రొటెస్టర్స్‌పై కేసులు విత్‌డ్రా, అరెస్ట్ అయిన వారి రిలీజ్ గ్యారెంటీ ఇస్తూ బీహార్, అస్సాం ఇచ్చిన నోటిఫికేషన్ల కాపీలను అధికారులు అందించారన్నారు. కేంద్రం ఇతర NDA రాష్ట్రాలు కూడా త్వరలోనే గ్యారెంటీ నోటిఫికేషన్లు ఇస్తాయని హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఏ ప్రొటెస్టర్‌ను ఒంటరిగా వదిలేయమని, అందరినీ కేసుల నుండి రిలీజ్ చేయడానికి ఫైట్ చేస్తామని స్పష్టం చేశారు.

ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
మంగళవారం ఉదయం గోల్డ్ రేట్స్ కొద్దిగా పెరిగాయి. ఈరోజు ఉదయం 6 గంటల సమయానికి హైదరాబాద్, విజయవాడల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.1,45,870గా, ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ గోల్డ్ ప్రైస్ రూ.1,33,710గా ఉంది. మరోవైపు సిల్వర్ రేట్ కిలోకు రూ.100 తగ్గడంతో ప్రస్తుతం రూ.2,39,900గా ఉంది. మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు చేంజ్ అవుతుంటాయి కాబట్టి బంగారం కొనే ముందు లైవ్ రేట్స్ చెక్ చేయడం బెటర్.
రాజ్‌ఘాట్‌లో సోనమ్ వాంగ్‌చుక్!
సోనమ్ వాంగ్‌చుక్ ఇంటికి వెళ్లేముందు ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ని విజిట్ చేశారు. అక్కడ గాంధీ సమాధి వద్ద స్పెషల్ ప్రేయర్స్ చేశారు. 100 ఏళ్ల క్రితం బాపూ చూపించిన శాంతియుత పోరాట మార్గం నేటికీ ఎంతో ఉపయోగకరంగా ఉందని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. భారీ సెక్యూరిటీ మధ్య రాజ్‌ఘాట్ చేరుకున్న వాంగ్‌చుక్, గాంధీ ఐడియాలజీతోనే తమ సమస్యలపై పోరాడతామని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

సినీ నటి పావల శ్యామల కన్నుమూత!
సీనియర్ నటి పావల శ్యామల (75) మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, ఉస్మానియా హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ పొందుతూ హార్ట్ అటాక్‌తో కన్నుమూసినట్లు డాక్టర్లు తెలిపారు. గుంటూరు జిల్లాలో జన్మించిన ఆమె అసలు పేరు నేతి శ్యామల. 'స్వర్ణకమలం', 'ఖడ్గం', 'ఆంధ్రావాలా' సినిమాలతో మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. చివరి రోజుల్లో ఆమె ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌తో బాధపడగా పవన్ కళ్యాణ్, దిల్ రాజు మరి కొందరు సినీ ప్రముఖులు సహాయం చేశారు. ఆమె మృతికి టాలీవుడ్ సంతాపం తెలిపింది.

అమిత్ షాకు ది వైర్ మ్యాగజైన్ ప్రశ్నలు !
ఢిల్లీలో విద్యార్థుల నిరసనపై పోలీసుల క్రూరమైన దాడికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా పూర్తి బాధ్యత వహించాలని ది వైర్ పత్రిక కామెంట్ చేసింది.. వాటర్ క్యానన్లు వాడకుండా నేరుగా బలప్రయోగం చేయడం, మేకులు ఉన్న లాఠీలు, పెల్లెట్ తుపాకులు ఉపయోగించడం , మహిళా విద్యార్థులపై మగ పోలీసులు దాడి చేయడం వంటి 12 కీలక అంశాలపై ఆయన స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.

కేసులు తీయకపోతే మళ్లీ నిరసనలు- కేంద్రానికి సీజేపీ డిమాండ్
విద్యార్థి ఆందోళనకారులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలనే ఒప్పందాన్ని ప్రభుత్వం ఉల్లంఘించిందని కాకరోచ్ జనతా పార్టీ (CJP) మండిపడింది.<br>కేంద్ర విద్యారంగ వివాదాలపై 37 రోజుల పాటు సాగిన దీక్షను విరమించినా, విద్యార్థులపై అరెస్టులు, వేధింపులు కొనసాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లను వెంటనే ఎత్తివేయకపోతే రేపటి నుంచే మళ్లీ దేశవ్యాప్త నిరసనలు చేపడతామని హెచ్చరించింది.

చైనా జెట్ల మోహరింపు: లద్ధాఖ్ సరిహద్దుల్లో టెన్షన్
లద్ధాఖ్ , టిబెట్ సమీపంలోని చైనా వైమానిక స్థావరాల్లో 11 'J-20 Mighty Dragon' స్టీల్త్ ఫైటర్ జెట్లు మోహరించినట్లు ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. ఇవి రాడార్లకు చిక్కకుండా దూరప్రాంత లక్ష్యాలను ఛేదించగలవు. మరోవైపు భారత్ వద్ద ప్రస్తుతం 4.5 Gen రఫేల్ జెట్లు ఉన్నప్పటికీ, సొంత 5th Gen AMCA స్టీల్త్ జెట్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి మరికొన్నేళ్లు పట్టనుంది.

నిద్ర లేమి వల్ల బాడీ, బ్రెయిన్ రెంటికీ ప్రమాదమే !
సరిపడా నిద్రపోకపోవడం వల్ల ఏర్పడే 'స్లీప్ డెట్' (నిద్ర లోటు) ను పూర్తిగా తీర్చడం సులభం కాదు. వారాంతాల్లో కాసేపు ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల తాత్కాలిక ఉపశమనం లభించినప్పటికీ, దీర్ఘకాలిక నిద్రలేమి వల్ల శరీరం , మెదడు పై పడే దుష్ప్రభావాలను అది పూర్తిగా సరిదిద్దలేదు. కాబట్టి ప్రతిరోజూ క్రమం తప్పకుండా సరిపడా నిద్రపోవడమే ఆరోగ్యానికి శ్రేయస్కరమని నిపుణులు చెబుతున్నారు.

చిత్తశుద్ధి ఉంటే రాజన్ కమిటీ ఓసారి చూడండి !
కేంద్ర ప్రభుత్వం పరీక్షల సంస్కరణలపై నిజంగా సీరియస్ గా ఉంటే, నీట్ పరీక్షపై తమిళనాడు ప్రభుత్వం నియమించిన జస్టిస్ ఎ.కె. రాజన్ కమిటీ నివేదికను పరిశీలించాలని ది వైర్ కథనం పేర్కొంది. నీట్ వల్ల గ్రామీణ, పేద, స్టేట్ బోర్డు విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, కేవలం ఖరీదైన కోచింగ్ సెంటర్లకు వెళ్లే వారికే సీట్లు దక్కుతున్నాయని కమిటీ స్పష్టం చేసింది. విద్యారంగంలో సమానత్వం కోసం ప్లస్ టూ (12వ తరగతి) మార్కుల ఆధారంగానే వైద్య విద్య ప్రవేశాలు కల్పించాలని సిఫార్సు చేసింది.