Latest

సినీ నటి పావల శ్యామల కన్నుమూత!
సీనియర్ నటి పావల శ్యామల (75) మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, ఉస్మానియా హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ పొందుతూ హార్ట్ అటాక్‌తో కన్నుమూసినట్లు డాక్టర్లు తెలిపారు. గుంటూరు జిల్లాలో జన్మించిన ఆమె అసలు పేరు నేతి శ్యామల. 'స్వర్ణకమలం', 'ఖడ్గం', 'ఆంధ్రావాలా' సినిమాలతో మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. చివరి రోజుల్లో ఆమె ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌తో బాధపడగా పవన్ కళ్యాణ్, దిల్ రాజు మరి కొందరు సినీ ప్రముఖులు సహాయం చేశారు. ఆమె మృతికి టాలీవుడ్ సంతాపం తెలిపింది.

అమిత్ షాకు ది వైర్ మ్యాగజైన్ ప్రశ్నలు !
ఢిల్లీలో విద్యార్థుల నిరసనపై పోలీసుల క్రూరమైన దాడికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా పూర్తి బాధ్యత వహించాలని ది వైర్ పత్రిక కామెంట్ చేసింది.. వాటర్ క్యానన్లు వాడకుండా నేరుగా బలప్రయోగం చేయడం, మేకులు ఉన్న లాఠీలు, పెల్లెట్ తుపాకులు ఉపయోగించడం , మహిళా విద్యార్థులపై మగ పోలీసులు దాడి చేయడం వంటి 12 కీలక అంశాలపై ఆయన స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.

కేసులు తీయకపోతే మళ్లీ నిరసనలు- కేంద్రానికి సీజేపీ డిమాండ్
విద్యార్థి ఆందోళనకారులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలనే ఒప్పందాన్ని ప్రభుత్వం ఉల్లంఘించిందని కాకరోచ్ జనతా పార్టీ (CJP) మండిపడింది.<br>కేంద్ర విద్యారంగ వివాదాలపై 37 రోజుల పాటు సాగిన దీక్షను విరమించినా, విద్యార్థులపై అరెస్టులు, వేధింపులు కొనసాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లను వెంటనే ఎత్తివేయకపోతే రేపటి నుంచే మళ్లీ దేశవ్యాప్త నిరసనలు చేపడతామని హెచ్చరించింది.

చైనా జెట్ల మోహరింపు: లద్ధాఖ్ సరిహద్దుల్లో టెన్షన్
లద్ధాఖ్ , టిబెట్ సమీపంలోని చైనా వైమానిక స్థావరాల్లో 11 'J-20 Mighty Dragon' స్టీల్త్ ఫైటర్ జెట్లు మోహరించినట్లు ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. ఇవి రాడార్లకు చిక్కకుండా దూరప్రాంత లక్ష్యాలను ఛేదించగలవు. మరోవైపు భారత్ వద్ద ప్రస్తుతం 4.5 Gen రఫేల్ జెట్లు ఉన్నప్పటికీ, సొంత 5th Gen AMCA స్టీల్త్ జెట్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి మరికొన్నేళ్లు పట్టనుంది.

నిద్ర లేమి వల్ల బాడీ, బ్రెయిన్ రెంటికీ ప్రమాదమే !
సరిపడా నిద్రపోకపోవడం వల్ల ఏర్పడే 'స్లీప్ డెట్' (నిద్ర లోటు) ను పూర్తిగా తీర్చడం సులభం కాదు. వారాంతాల్లో కాసేపు ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల తాత్కాలిక ఉపశమనం లభించినప్పటికీ, దీర్ఘకాలిక నిద్రలేమి వల్ల శరీరం , మెదడు పై పడే దుష్ప్రభావాలను అది పూర్తిగా సరిదిద్దలేదు. కాబట్టి ప్రతిరోజూ క్రమం తప్పకుండా సరిపడా నిద్రపోవడమే ఆరోగ్యానికి శ్రేయస్కరమని నిపుణులు చెబుతున్నారు.

చిత్తశుద్ధి ఉంటే రాజన్ కమిటీ ఓసారి చూడండి !
కేంద్ర ప్రభుత్వం పరీక్షల సంస్కరణలపై నిజంగా సీరియస్ గా ఉంటే, నీట్ పరీక్షపై తమిళనాడు ప్రభుత్వం నియమించిన జస్టిస్ ఎ.కె. రాజన్ కమిటీ నివేదికను పరిశీలించాలని ది వైర్ కథనం పేర్కొంది. నీట్ వల్ల గ్రామీణ, పేద, స్టేట్ బోర్డు విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, కేవలం ఖరీదైన కోచింగ్ సెంటర్లకు వెళ్లే వారికే సీట్లు దక్కుతున్నాయని కమిటీ స్పష్టం చేసింది. విద్యారంగంలో సమానత్వం కోసం ప్లస్ టూ (12వ తరగతి) మార్కుల ఆధారంగానే వైద్య విద్య ప్రవేశాలు కల్పించాలని సిఫార్సు చేసింది.

సాయికృష్ణ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
విజయవాడ సిట్ ఆఫీసులో సీఐ నాగరాజు 7 రోజుల విచారణకు సుప్రీంకోర్టు అనుమతించింది. మిగిలిన కండిషన్లు యధావిధిగా కొనసాగుతాయని కోర్టు తెలిపింది. రేపటినుంచి సీఐ నాగరాజును కస్టడీలోకి తీసుకుని సిట్ ప్రశ్నించనుంది. హై కోర్టు గతంలో వద్దని ఇచ్చిన ఆదేశాలపై సిట్ సుప్రీం కోర్టును కోరగా కోర్టు విచారణకు అనమతించింది

పెల్లెట్ గన్స్ వాడకంపై సుప్రీం విచారణ షురూ !
జూలై 20న ఢిల్లీ పార్లమెంట్ మార్చ్ సమయంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) నిరసనకారులపై పెల్లెట్ గన్స్ వాడటం వివాదాస్పదమైంది. నడుము కంటే కిందకే కాల్పులు జరపాలనే నిబంధనలు ఉన్నప్పటికీ, బాధితులందరికీ కళ్ళు, ముఖం, మెడ, ఛాతీ భాగాల్లోనే తీవ్ర గాయాలయ్యాయి. ఈ కాల్పుల్లో ఓ విద్యార్థి చూపు కోల్పోయే ప్రమాదంలో పడగా, విలేకరి సహా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమశిక్షణా రాహిత్యం ,బలగాల నియమావళి ఉల్లంఘనపై సుప్రీంకోర్టు విచారణతో పాటు అంతర్గత విచారణ కూడా మొదలైంది.

సత్యజిత్ రే అపు ట్రయాలజీపై నోలన్ ఆసక్తి !
హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్, ఇండియన్ మూవీస్ లో చెరగని ముద్ర వేసిన ప్రముఖ దర్శకుడు సత్యజిత్ రే సృష్టించిన 'అపు ట్రయాలజీ (Apu Trilogy) పై తనకున్న అభిమా నాన్ని వ్యక్తపరిచారు. ఈ క్లాసిక్ సినిమాల్లోని అద్భుతమైన కథా కథనం, భావోద్వేగాలు సినిమా నిర్మాణ తీరు తనను బాగా ప్రభావితం చేశాయని ఆయనన్నారు. సినిమా ప్రేమికులు ఖచ్చితంగా చూడాల్సిన అరుదైన మాస్టర్‌పీస్‌గా దీనిని ఆయన అభివర్ణించారు.

రాం చరణ్ కు మణికట్టు సర్జరీ (రిస్ట్) సక్సెస్ ఫుల్ !
నటుడు రాం చరణ్ కు కోయంబత్తూరు గంగా ఆస్పత్రిలో మణికట్టు సర్జరీ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయింది. సర్జరీల్లో ప్రపంచంలో నెంబర్ వన్ ఎక్స్ పర్ట్ అయిన ఆర్ధో పెడిక్ సర్జన్ డాక్టర్. ఎస్. రాజశేఖరన్ టీమ్ ని లీడ్ చేశారు. గతంలో మెగాస్టార్ చిరంజీవికి వెన్నెముక సర్జరీ కూడా ఆయనే చేశారు.స్పోర్ట్స్ ఇంజురీస్ ను ట్రీట్ చేసే అమెరికాలోని మయామీ రిస్ట్ సర్జరీ డాక్టర్ బాడియాను కూడా రప్పించారు.చిరంజీవి, సురేఖ దంపతులు, ఉపాసన కూడా అక్కడే ఉన్నారు.

చికెన్ 65 అనే ఎందుకు పిలుస్తాం
చికెన్ 65 ఫుడ్ ఐటమ్ కి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా! దానిపై చాలా కథలున్నాయి. 1965లో చెన్నైలోని బుహారీ హోటల్‌లో దీన్ని తొలిసారి తయారు చేశారు. ఆ సంవత్సరం గుర్తుగా దీనికి 'చికెన్ 65' అని పేరు పెట్టారు. 65రోజుల కోడితో చేస్తారని, 1965 ఇండో-పాక్ యుద్ధంలో సైనికులకు వడ్డించడం వల్ల ఆ పేరు వచ్చిందని వేరే కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. అయితే 1965లో బుహారీ హోటల్‌లోనే ఇది మొదలైందనేదే నిజమని ఫుడ్ ఎక్సపర్ట్స్ చెబుతున్నారు.

"యువతను భయపెట్టలేరు".. మోదీ సర్కార్‌పై ఖర్గే ఫైర్
NEET-UG ఉద్యమంలో పాల్గొన్న యువతను బెదిరిస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. తన X పోస్టులో, "లాఠీచార్జ్, పెల్లెట్ గన్స్ తర్వాత ఇప్పుడు సోషల్ మీడియా అకౌంట్లను కూడా చెక్ చేస్తున్నారు. ఇవన్నీ భయపడుతున్న ప్రభుత్వ లక్షణాలు" అని అన్నారు. అలాగే పేపర్ లీక్‌లను అరికట్టే చట్టం ఏమైంది? NTAకి ఇన్ని రోజులు పూర్తి స్థాయి డైరెక్టర్ ఎందుకు లేరు? అంటూ ప్రశ్నలు సంధించారు. చివరగా అమిత్ షా దీనిపై సమాధానం చెప్పాలని, ప్రధాని మోదీ యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

సీజేపీకి ఫండ్స్ ఎక్కడినుంచి వస్తున్నాయి: మహేష్ జెఠ్మలానీ
కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తరువాత సీజేపీ నాయకులు సంబరాలు చేసుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ మహేష్ జెఠ్మలానీ స్పందించారు. సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలు బాలీవుడ్ పాటలకు డాన్స్ చేస్తున్నారని, ఆ పార్టీకి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటూ ఆయన ప్రశ్నించారు.

ఆకివీడులో రామాలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
AP: పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో రామాలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆలయ నిర్మాణాన్ని సవాలు చేస్తూ వేసిన పిటిషన్‌ను కొట్టేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ వివాదానికి సంబంధించి గతంలో జిల్లా కలెక్టర్ జారీ చేసిన NOC(No Objection Certificate) చట్టబద్ధమైనదేనని చెప్పింది. ప్రభుత్వ స్థలంలో రూల్స్ కి తగ్గట్టుగా ఆలయ నిర్మాణం చేపట్టడంలో తప్పులేదని స్పష్టం చేసింది.

పిల్లల పెంపకంపై ప్రియాంక టిబ్రెవాల్ కామెంట్లు
కోల్‌కతాలో నీట్ పరీక్షల రద్దు కోసం జరిగిన ఆందోళనలకు వ్యతిరేకంగా బీజేపీ నాయకులు నగరంలో భారీ త్రివర్ణ యాత్ర చేపట్టారు. ఈ ర్యాలీలో పాల్గొన్న బీజేపీ నేత ప్రియాంక టిబ్రెవాల్ మాట్లాడుతూ కొందరు కావాలనే అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు. "తల్లిదండ్రులు పిల్లల్ని సరిగ్గా పెంచకపోతే వాళ్ళు మాట్లాడే భాషను బట్టే ఆ పెంపకం ఎలాంటిదో ఇట్టే తెలిసిపోతుంది" అని ఆమె అన్నారు.

సీఎం విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ!
తమిళనాడు సీఎం విజయ్ తీసుకున్న నిర్ణయానికి మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కరూర్ తొక్కిసలాట బాధితులకు తమిళనాడు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. అర్హత ఆధారంగానే ప్రభుత్వ ఉద్యోగాలివ్వాలని స్పష్టం చేసింది. బాధితులకు ఉద్యోగాల కల్పనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఈ తీర్పును ఇచ్చింది.
'కాల్చేసేవాడిని'.. CJP నిరసనకారులపై BJP మాజీ నేత
"నేను అక్కడ ఉంటే మూడుసార్లు వెళ్లిపోమని చెబుతా.. వినకపోతే కాల్పులు జరిపేస్తా" అంటూ BJP మాజీ నేత, రాజకీయ వ్యాఖ్యాత TG మోహన్‌దాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. అంతేకాదు, జంతర్ మంతర్‌లో నిరసన చేస్తున్న మహిళలపై కూడా ఆయన తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని, అరెస్ట్ చేయాలని సోషల్ మీడియాలో చాలా మంది డిమాండ్ చేస్తున్నారు.
బీజేపీ రాష్ట్రాల్లోనే పేపర్ లీక్‌లు: అరవింద్ కేజ్రీవాల్
పంజాబ్ ఎడ్యుకేషన్ సిస్టంను 27వ స్థానం నుంచి నెంబర్ 1కి తీసుకొచ్చాం. ఈ సక్సెస్ చూసి ఓర్వలేక బీజేపీ మా మీద పరీక్షా పేపర్స్ లీక్ అంటూ బురదజల్లుతోంది అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలో 10 ఏళ్లుగా, పంజాబ్ లో మా ప్రభుత్వమే ఉన్నా ఒక్క పేపర్ లీక్ అవ్వలేదు. కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రం వరుసగా పేపర్లు లీక్ అవుతున్నాయి. వాళ్ళ ఫెయిల్యూర్ చూసి వాళ్లే ఫ్రస్ట్రేట్ అవుతున్నారని ఆయన అన్నారు.

మతం మారితే ఎస్సీ హోదా లేనట్టే: సుప్రీంకోర్టు
మత మార్పిడితో ఎస్సీ హోదా కోల్పోతారని సుప్రీంకోర్టు తేల్చింది. మార్చిలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్‌ను తిరస్కరించింది. హిందూ, సిక్కు, బౌద్ధం తప్ప ఇతర మతాల్లోని వారికి ఎస్సీ స్టేటస్ వచ్చే అవకాశం లేదని చెప్పింది. క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ హోదా వర్తించదని, తిరిగి హిందూ, సిక్కు, బౌద్ధంలోకి వస్తేనే హోదా పునరుద్ధరణ జరుగతుందని చెప్పింది.
ఆకివీడు రామాలయానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
AP: ఆకివీడు రామాలయం నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై ఎమ్మెల్యే రఘురామ కృష్ణ రాజు ఆనందం వ్యక్తం చేశారు. రామాలయం తరఫున సమర్థవంతంగా వాదించిన సీనియర్ లాయర్ సుయోధన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది ప్రేరణ సింగ్‌ను అభినందించారు. ఈ పోరాటంలో తనకు అండగా నిలిచిన లక్షలాది మంది భక్తులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.
బాలుడు యూరిన్ చేశాడని టీచర్ కత్తితో దాడి
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసిలో ఓ ప్రైవేట్ స్కూల్లో దారుణ ఘటన జరిగింది. వాష్‌రూమ్‌కు వెళ్లేందుకు టీచర్ పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఆ విద్యార్ధి ప్యాంట్‌లోనే యురీన్ పోసుకున్నాడు. ఐదేళ్ల బాలుడిని టీచర్ మరో గదికి తీసుకెళ్లి వేడి కత్తితో అతని ప్రైవేట్ భాగాన్ని కాల్చి, ఎవరికీ చెప్పొదంటూ బెదిరించింది. ఇంటికి వెళ్లిన బాలుడు జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు స్కూల్ ప్రిన్సిపాల్‌ను కలిశారు. ఎలాంటి స్పందన లేకపోవడంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేశారు.