Latest

భార్యను ఉరితీసి వీడియో తీసిన భర్త
భార్యను హత్య చేస్తూ ఆ దృశ్యాలను ఆమె తల్లిదండ్రులకు వీడియో కాల్ చేసి చూపించిన కిరాతక ఘటన కర్ణాటకలో జరిగింది. బాగల్‌కోట్‌కు చెందిన ప్రవీణ్ భార్య భాగ్యశ్రీ(23)పై అనుమానంతో ఆమెను ఉరివేసి చంపాడు. ఆ వీడియోను స్నేహితులకు కూడా పంపాడు. భర్త వేధింపులు భరించలేక ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. బాగా చూసుకుంటానని నమ్మించి తీసుకొచ్చిన ప్రవీణ్ అదే రోజే ఈ దారుణానికి పాల్పడ్డాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.

వావ్..అంతరిక్షంలో యోగా అదుర్స్!
యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ(ESA) Astronaut సోఫీ అడెనోట్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని డెయిలీ లైఫ్ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేశారు. అడెనోట్ మైక్రోగ్రావిటీలో తన యిన్ యోగా రొటీన్‌ను చూపించారు. అంతరిక్షంలో తేలుతూ ఎలా యోగా చేయాలో అందులో వివరించారు. రోజూ యోగా చేయడం అడెనోట్‌కు అలవాటు. ఆ అలవాటును స్పేస్‌లో కూడా ఆమె విజయవంతంగా కొనసాగించారు.

విద్యార్థులపై లాఠీచార్జ్‌పై సుప్రీం సీరియస్!
నీట్ పేపర్ లీక్‌పై ఆందోళన చేపట్టిన విద్యార్థులపై లాఠీచార్జ్, పోలీసుల దౌర్జన్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శాంతియుతంగా నిరసన తెలపడం పౌరుల రాజ్యాంగబద్ధమైన హక్కు అని స్పష్టం చేసింది. CJI జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఈ ఘటనలపై స్వతంత్ర విచారణకు ఆదేశిస్తూ.. బాధ్యులెంతటివారైనా చట్టం ఊరుకోదని హెచ్చరించింది. అటు గాయపడిన పోలీసుల భద్రత, రక్షణ పరికరాలపైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని తెలిపింది.

సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్!
సాయికృష్ణ బాడీ ఇంకా దొరకలేదని, CI నాగరాజును విజయవాడ సిట్ ఆఫీస్‌లోనే విచారించాలని సుప్రీంకోర్టు క్లియర్‌గా చెప్పింది. రాజమండ్రి జైలులోనే విచారించాలనడం కుదరదని, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌కి ఫుల్ ఫ్రీడమ్ ఉండాలని తెలిపింది. విచారణను CCTV, వీడియోగ్రఫీ మానిటరింగ్‌లోనే చేయాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CI నాగరాజును 7 రోజుల పోలీస్ కస్టడీకి తీసుకుని సిట్ అధికారులు విచారించనున్నారు. దీంతో ఈ కేసు ఆసక్తికరంగా మారింది.

న్యూయార్క్ సిటీలో భారీగా చెట్ల పెంపకం
న్యూయార్క్ అనగానే ఎత్తైన బిల్డింగులు, రద్దీగా ఉండే ట్రాఫిక్ మాత్రమే గుర్తుకొస్తాయి. కానీ అక్కడ ఎవరికీ తెలియకుండానే అద్భుతమైన మార్పు జరుగుతోంది. వేసవిలో ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో పచ్చదనం విలువ ఇప్పుడు అందరికీ బాగా అర్థమవుతోంది. అందుకే అక్కడి అధికారులు చెట్ల పెంపకాన్ని మరింత సీరియస్‌గా తీసుకున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే ఏరియాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, 2040 సంవత్సరం నాటికి సిటీలో 30% గ్రీనరీ ఉండేలా టార్గెట్ పెట్టుకున్నారు.

ఎల్‌నినోపై రైతులకు అవగాహన కల్పించాలి: చంద్రబాబు
ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే వాతావరణ మార్పులపై రైతుల్లో అవగాహన కల్పించడంపై సీఎం చంద్రబాబు అధికారులతో చర్చించారు. రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ (RTGS) కేంద్రం నుంచి ఆయా శాఖలతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం అధికంగా ఉండే అవకాశముందని, రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు ప్రోత్సహించాలని సూచించారు. ఈ సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

హీరోపై ప్రేమ ఓకే.. కానీ ఇంత రిస్క్ అవసరమా..?
హీరో సినిమా రిలీజ్ అంటే సెలబ్రేషన్ ఓకే... కానీ థియేటర్‌లోనే ఫైర్‌క్రాకర్స్ కాల్చడం ఎంతవరకు కరెక్ట్? ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. విజయ్ నటించిన 'జన నాయకన్' షో సందర్భంగా బెంగళూరులోని ఓ థియేటర్‌లో అభిమానులు ఫైర్‌క్రాకర్స్ పేల్చిన వీడియో వైరల్ కావడంతో "ఇది ఫ్యాన్ ఎమోషనా..? లేక డేంజరస్ ట్రెండా?" అనే చర్చ మళ్లీ మొదలైంది.. ఫ్యాన్స్‌కు ఇవి ఎమోషన్స్ కావచ్చు.. కానీ థియేటర్‌లో ఉన్న వందల మంది సేఫ్టీ కూడా అంతే ముఖ్యం కదా! అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.

దిల్లీలో తెలంగాణ కాంగ్రెస్‌పై ఏఐసీసీ (AICC) ఫోకస్
TG: దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాలపై కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏఐసీసీ ఆర్గనైజేషన్ కార్యదర్శి కే.సీ. వేణుగోపాల్ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇందులో తెలంగాణ సంస్థాగత కార్యక్రమాలు, సంఘటన్ సృజన్ అభియాన్ (SSA) కార్యక్రమాల పురోగతిపై సమీక్షించారు. తెలంగాణలో ఈ కార్యక్రమాల అమలును కే.సీ. వేణుగోపాల్ అభినందించారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అమలు చేయాలని పార్టీ నాయకత్వానికి సూచించారు.

అమర్‌నాథ్ లో బస్సు యాక్సిడెంట్.. 39 మందికి తీవ్ర గాయాలు!
జమ్మూకశ్మీర్‌లోని గందర్‌బల్ జిల్లా కంగన్ దగ్గర అమర్‌నాథ్ యాత్రికుల బస్సు యాక్సిడెంట్‌కు గురైంది. డ్రైవర్ కంట్రోల్ కోల్పోవడంతో బస్సు ఓ ఇంటిని ఢీకొట్టింది. పక్కనే ఉన్న నదిలో పడకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో 39 మందికి గాయాలయ్యాయి. <a href="https://x.com/manojsinha_/status/2081942282987811197?s=20">ఎల్జీ మనోజ్ సిన్హా</a> స్పందిస్తూ, గాయపడిన వారికి మెరుగైన మెడికల్ ట్రీట్‌మెంట్ అందించాలని అధికారులను ఆదేశించారు.

దిల్లీ ఆందోళనలో మహిళకు బుల్లెట్ గాయం
జూలై 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర జరిగిన స్టూడెంట్స్ ప్రొటెస్టులో తనకు తుపాకీ గుండు తగిలిందని 'నూతన్' అనే మహిళ చెప్పారు. జార్ఖండ్‌కు చెందిన ఆమె మాట్లాడుతూ.. తాను పార్క్ దగ్గర నిలబడి ఉంటే మా వైపు కాల్పులు జరిపారని, తన కుడి చెవికి తీవ్ర గాయమైందని చెప్పింది. హాస్పిటల్లొ సర్జరీ కూడా జరిగిందన్నారు. అయితే ఆమెకు తుపాకీ గాయం కాలేదని ఏదో గట్టి వస్తువు తగలడం వల్లే ఆ గాయమైందని దిల్లీ పోలీసులు చెబుతున్నారు.
ప్రొటెస్ట్‌కి వెళ్లాడు.. కానీ లైఫ్ మొత్తం మారిపోయింది..!
మొదట ఫుడ్ ఇచ్చింది.. తర్వాత వాటర్ ఇచ్చింది.. చివరికి తన లైఫ్ మొత్తాన్నే ఇచ్చేసింది. ప్రొటెస్ట్‌కి వెళ్లి.. లైఫ్ పార్ట్‌నర్‌తో తిరిగి వస్తానని ఆ కుర్రాడు కూడా ఊహించి ఉండడు. బీహార్ నుంచి NEET-UG ఉద్యమానికి వచ్చిన ఓ యువకుడికి జంతర్ మంతర్ దగ్గర ఓ అమ్మాయితో పరిచయం అయ్యింది. తర్వాత లాఠీచార్జ్‌లో అతనికి గాయాలవ్వడంతో హాస్పిటల్ వరకు వెళ్లి చూసుకుందట. అక్కడే ఇద్దరూ కలిసి ఉండాలని డిసైడ్ అయి.. గుడిలో పెళ్లి చేసుకున్నట్లు వీడియోలో చెప్పారు. ఇప్పుడు ఈ లవ్ స్టోరీ ఫుల్ వైరల్ అవుతోంది.

ఫేషియల్ స్కాన్‌లతో ఓల్డ్ క్రిమినల్స్ గుర్తింపు
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఇటీవల జరిగిన నిరసన ప్రదర్శనల్లో 2,873 మంది నేర చరిత్ర కలిగిన వ్యక్తులను ఫేషియల్ రికగ్నిషన్ (Facial Recognition) సిస్టమ్ ద్వారా పోలీసులు గుర్తించారు.CCTV దృశ్యాలను విశ్లేషించగా, వీరిలో 989 మంది హత్య, అత్యాచారం, కిడ్నాప్, దోపిడీ , పోక్సో (POCSO) వంటి తీవ్రమైన నేరాల్లో ప్రమేయం ఉన్న పాత నేరస్థులని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

ఆ పదవికి సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలి: రాంచందర్ రావు
TG: సీఎం రేవంత్‌రెడ్డి విద్యాశాఖ మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు డిమాండ్ చేశారు. యువతను ప్రోత్సహిస్తామని సీఎం తరచూ చెబుతున్నారని, విద్యాశాఖ, హోంశాఖ, అర్బన్ శాఖ వంటి కీలక శాఖలను ముఖ్యమంత్రే నిర్వహిస్తున్నారని అన్నారు. యువ కాంగ్రెస్ ఎమ్మెల్యే పాలకుర్తి యశస్విని రెడ్డిని తెలంగాణ విద్యాశాఖ మంత్రిగా నియమించాలన్నారు. యువతకు ప్రాధాన్యమిస్తామని చెబుతున్న ప్రభుత్వం, అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని ఆయనన్నారు.

ప్రధాని మోదీని కలిసిన స్కైరూట్ ఫౌండర్స్
భారతదేశ తొలి ప్రైవేట్ రాకెట్ 'విక్రమ్-1' ప్రయోగం సక్సెస్ కావడంతో.. స్కైరూట్ ఏరోస్పేస్ ఫౌండర్స్ పవన్ చందన, నాగ భరత్ ప్రధాని మోదీని కలిశారు. వాళ్ళ ఉత్సాహం, లక్ష్యాలు చూస్తుంటే మన ప్రైవేట్ స్పేస్ సెక్టార్ ఫ్యూచర్ ఎంతో బ్రైట్‌గా ఉందని మోదీ 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. ఈ మీటింగ్‌లో విక్రమ్-1 సక్సెస్‌తో పాటు ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మాట్లాడుకున్నట్లు ఆయన చెప్పారు. ప్రధాని ఇచ్చిన సపోర్ట్ తమకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని స్కైరూట్ సంస్థ తెలిపింది.

NTR కి గాయం.. 6-8 వారాలు కంప్లీట్ రెస్ట్!
హీరో జూనియర్ NTRకు షోల్డర్ ఇంజ్యూరీ అయినట్లు ఆయన ఆఫీస్ PR స్టేట్‌మెంట్ రిలీజ్ చేసింది. డాక్టర్ మధుసూదన్ రావు, పూర్ణచంద్ర తేజస్వి టీమ్ చెకప్ చేసి, NTR పూర్తి రికవరీ కోసం 6 నుంచి 8 వారాలు రెస్ట్ తీసుకోమని చెప్పారు. ఫ్యాన్స్ ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని, హెల్త్ అప్‌డేట్స్ ఇస్తూ ఉంటామని టీమ్ క్లారిటీ ఇచ్చింది.

క్రిమినల్ కేసుల జాబితాల్లో రేవంత్ రెడ్డి, చంద్రబాబు
మోస్ట్ క్రిమినల్ కేసుల జాబితాల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నట్టు అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ వెల్లడించింది. 89 క్రిమినల్ కేసులతో రేవంత్ రెడ్డి ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారు. అందులో 72 తీవ్రమైన కేసులున్నాయి. 19 క్రిమినల్ కేసులతో చంద్రబాబు ఫోర్త్ ప్లేస్‌లో ఉన్నారు. రిచెస్ట్ సీఎంగా రూ.1,413 కోట్ల ఆస్తులతో కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారు. రూ.931 కోట్లతో చంద్రబాబు సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు. రూ. 30 కోట్లతో రేవంత్ రెడ్డి 8వ ప్లేస్‌లో ఉన్నారు.

భోపాల్‌లో పది మంది మిస్సింగ్ కలకలం
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో గడిచిన 24 గంటల్లోనే 10 మంది మిస్ అయ్యారు. వీరిలో ముగ్గురు మైనర్లు కూడా ఉన్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లగానే వీళ్ల ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయి. కోలార్, అయోధ్య నగర్, అశోకాగార్డెన్ సహా కొన్ని ప్రాంతాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. అశోకాగార్డెన్‌లో క్లాస్‌కు వెళ్లిన 17ఏళ్ల కుర్రాడు తిరిగి రాలేదు. కొలార్, అయోధ్య నగర్‌లలో కూడా యువకులు, పెద్దవాళ్లు కనిపించకుండా పోయారు. కుటుంబ సభ్యుల కంప్లైంట్‌తో పోలీసులు సెర్చింగ్ మొదలుపెట్టారు.

కోట్ల విలువైన భూమి..ప్రైవేటు సంస్థకు ధారాదత్తం
TG: కోట్ల విలువ చేసే భూమిని తక్కువ ఫీజుతో ఎన్‌ఎస్ ఇన్‌ఫ్రా కన్‌స్ట్రక్షన్స్ సంస్థకు లీజుకు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వడం కలకలంగా మారింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం దర్గా హుస్సేన్ షా వలి గ్రామంలో 1.04 ఎకరాల ఉర్దూ అకాడమీ భూమిని ఆ సంస్థకు 30 ఏళ్ల పాటు లీజుకు ఇస్తూ జీవో జారీ చేశారు. ఏడాదికి రూ.5,220 ఫీజుకే, ఎలాంటి పబ్లిక్ నోటీసులు లేకుండా ఇలా లీజు ఇవ్వడమేంటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నాలుగేళ్ల చిన్నారిపై హెడ్‌మాస్టర్ లైంగిక దాడి!
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో దారుణం జరిగింది. నాలుగేళ్ల చిన్నారిపై తాటికాయల భాస్కర్(50) అనే గవర్నమెంట్ స్కూల్ హెడ్‌మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇంటి ముందు ఆడుకుంటున్న పాపకి మాయమాటలు చెప్పి ఈ ఘోరానికి ఒడిగట్టాడు. చిన్నారి ఇచ్చిన సమాచారంతో ఆమె పేరెంట్స్ వర్ధన్నపేట పోలీసులకు కంప్లైంట్ చేశారు. హెడ్‌మాస్టర్‌పై పోక్సో కేసు ఫైల్ చేసిన పోలీసులు అతడి కోసం సెర్చ్ స్టార్ట్ చేశారు. అయితే ఊరిలోని కొందరు ఈ కేసును సైలెంట్‌గా కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

హైకోర్టు ఆదేశాల తర్వాత ఏవీ రంగనాథ్ రియాక్షన్
TG: తెలంగాణ హైకోర్టు హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్‌ను ఆ పదవి నుంచి తొలగించాలన్న ఆదేశాలకు ఆయన స్పందించారు. గత రెండేళ్లుగా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కుల పరిరక్షణ కోసం హైడ్రా పనిచేసిందని చెప్పారు. బడా భూకబ్జాదారులు ఆక్రమించిన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి అప్పగించినట్లు రంగనాథ్ పేర్కొన్నారు. తనపై ప్రస్తుతం 63 కంటెంప్ట్ కేసులు ఉన్నాయని, అవన్నీ భూకబ్జాదారులు ఫైల్ చేసినవేనని అన్నారు. ఈ కేసులని చట్టపరంగానే ఎదుర్కొంటానని స్పష్టం చేశారు.

నీట్ ప్రోటెస్టర్స్‌కు కేసుల నుండి బిగ్ రిలీఫ్..
నీట్ పేపర్ లీక్ ప్రోటెస్ట్స్‌లో పాల్గొన్న వారిపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటామని బీహార్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. అలాగే జైల్లో ఉన్న వారిని రిలీజ్ చేస్తామని తెలిపింది. ప్రోటెస్టర్స్‌పై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లు, క్రిమినల్ కంప్లైంట్స్ విత్‌డ్రా ప్రాసెస్ వెంటనే స్టార్ట్ చేస్తామని హోమ్ డిపార్ట్‌మెంట్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. జులై 26 సాయంత్రం 6 గంటల కంటే ముందు ప్రోటెస్ట్ చేసిన ఎవరిపైనా లీగల్ యాక్షన్ తీసుకోమని క్లారిటీ ఇచ్చింది.