← Back to news

సినీ నటి పావల శ్యామల కన్నుమూత!

By sahani· 28 Jul 2026
సినీ నటి పావల శ్యామల కన్నుమూత!

సీనియర్ నటి పావల శ్యామల (75) మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, ఉస్మానియా హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ పొందుతూ హార్ట్ అటాక్‌తో కన్నుమూసినట్లు డాక్టర్లు తెలిపారు. గుంటూరు జిల్లాలో జన్మించిన ఆమె అసలు పేరు నేతి శ్యామల. 'స్వర్ణకమలం', 'ఖడ్గం', 'ఆంధ్రావాలా' సినిమాలతో మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. చివరి రోజుల్లో ఆమె ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌తో బాధపడగా పవన్ కళ్యాణ్, దిల్ రాజు మరి కొందరు సినీ ప్రముఖులు సహాయం చేశారు. ఆమె మృతికి టాలీవుడ్ సంతాపం తెలిపింది.

More in Cinema