← Back to news

ఆ పదవికి సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలి: రాంచందర్ రావు

By Mahesh· 28 Jul 2026
ఆ పదవికి సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలి: రాంచందర్ రావు

TG: సీఎం రేవంత్‌రెడ్డి విద్యాశాఖ మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు డిమాండ్ చేశారు. యువతను ప్రోత్సహిస్తామని సీఎం తరచూ చెబుతున్నారని, విద్యాశాఖ, హోంశాఖ, అర్బన్ శాఖ వంటి కీలక శాఖలను ముఖ్యమంత్రే నిర్వహిస్తున్నారని అన్నారు. యువ కాంగ్రెస్ ఎమ్మెల్యే పాలకుర్తి యశస్విని రెడ్డిని తెలంగాణ విద్యాశాఖ మంత్రిగా నియమించాలన్నారు. యువతకు ప్రాధాన్యమిస్తామని చెబుతున్న ప్రభుత్వం, అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని ఆయనన్నారు.

More in Politics