ముద్రగడ పద్మనాభం కొడుకు ఎమోషనల్!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కుమారుడు గిరిబాబు YS జగన్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటామని ఎమోషనల్ అయ్యారు. తన తండ్రి హాస్పిటల్‌లో ఉన్నప్పటి నుంచి చివరివరకు జగన్ నిరంతరం డాక్టర్లతో మాట్లాడుతూ కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారని గుర్తుచేసుకున్నారు. రాజకీయ లబ్ధి కోసం కాకుండా, ఒక కుమారుడిలా ఆఖరి గౌరవం ఇస్తూ జగన్ స్వయంగా పాడె మోశారని, ఆ క్షణాన్ని తమ కుటుంబం ఎప్పటికీ మర్చిపోలేదన్నారు. కష్టకాలంలో తమకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.



