'రాయన్' నేషనల్ అవార్డు వివాదం: ధనుష్ షాకింగ్ రియాక్షన్!
నేషనల్ అవార్డ్స్ వివాదంపై తమిళ స్టార్ హీరో ధనుష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తన 'రాయన్' కంటే బెటర్ సినిమాలు ఉన్నాయని ఆయన ఒప్పుకున్నారు. అయితే గతంలో తన 'పుదుపేట్టై, వడ చెన్నై, కర్ణన్' లాంటి క్లాసిక్ సినిమాలకు అవార్డులు రానప్పుడు ఎవరూ మాట్లాడలేదని, ఇప్పుడు తనకు అవార్డు వస్తే 90% మంది విమర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చిన అవార్డును గుర్తించి ప్రోత్సహించాలని ధనుష్ ఫ్యాన్స్ మీట్‌లో కామెంట్స్ చేశారు.



