బ్యాడ్మింటన్ అకాడమీ సమీపంలో కాల్పులు కలకలం

AP: కర్నూలు జోహరపురంలోని వీఆర్ఎస్ బ్యాడ్మింటన్ అకాడమీ సమీపంలో నిన్న రాత్రి తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. ఒక వాహనంలో వచ్చిన ఇద్దరు వ్యక్తులు గాలిలోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న కర్నూలు మూడో టౌన్ పోలీసులు వెంటనే స్పందించి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఘటనలో ఉపయోగించిన తుపాకీని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



