Latest

తిరుపతిలో మొదటి కరోనా కేసు
AP: తిరుపతిలో ఫస్ట్ కరోనా కేసునమోదయ్యింది. ఎస్టీవీ నగర్‌కు చెందిన 65 ఏళ్ల మహిళకు ఆరోగ్య సమస్యలు ఉండటంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్లారు. అక్కడ డాక్టర్లు టెస్ట్ చేస్తే కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని డీఎంహెచ్‌వో చెప్పారు.
సోయా చాప్ తినేముందు ఈ వీడియో చూడండి
సోయా చాప్ తయారీకి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియోలో ఓ వ్యక్తిని సోయా చాప్ పిండిలా కనిపిస్తున్న మిశ్రమంలో ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు చూసి చాలామంది 'ఇక సోయా చాప్ తినలేం' అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ఈ వీడియో నోయిడాలో తీసిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నా, దానికి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక కన్ఫర్మేషన్ లేదు. కొన్ని రిపోర్ట్స్ మాత్రం ఇది ఆగ్రాలో తీసిన పాత వీడియో అని చెబుతున్నాయి.

నోలన్‌కు నచ్చిన సత్యజిత్ రే సినిమాలు
హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టఫర్ నోలన్‌కు మన దేశానికి చెందిన సత్యజిత్ రే సినిమాలు బాగా నచ్చాయంట. నోలన్ రీసెంట్‌గా న్యూయార్క్‌లోని క్రైటీరియాన్ క్లోజెట్‌కు వెళ్లారు. అక్కడి సినిమాల కలెక్షన్ నుంచి నోలన్ సత్యజిత్ రే తీసిన ‘ది అపూ ట్రైలాజీ’ని ప్రత్యేకంగా ఎంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ 'సత్యజిత్ రే తీసిన ‘పథేర్ పాంచాలి’ సినిమా చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆ ట్రైలాజీలో ఉన్న మిగతా రెండు సినిమాలు నేను ఇంకా చూడలేదు. ఆ రెండు సినిమాలను ఇంటికి తీసుకెళ్లి మొత్తం కథను పూర్తిగా చూస్తాను' అని ఒక వీడియోలో చెప్పారు.

మోదీని తొలిగిస్తేనే ప్రజాస్వామ్యం బాగుపడుతుంది: సిద్దరామయ్య
ధర్మేంద్ర రాజీనామా చేసినంత మాత్రాన దేశ విద్యావ్యవస్థ బాగుపడదని కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య అన్నారు. రాజకీయాల నుంచి విద్య వరకు ప్రతి వ్యవస్థను కమర్షియల్ చేసిన ప్రధాని మోదీని తొలగిస్తేనే విద్య, ప్రజాస్వామ్యం బాగుపడుతుందని విమర్శించారు. ప్రజా వ్యతిరేక, అవినీతి పాలనకు వ్యతిరేకంగా విద్యార్థులు వారి ఉద్యమాన్ని కొనసాగించాలని ఆయనన్నారు.
వైరల్ అవ్వడం కోసం ప్రాణాలతో ఆట
సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో ఓ యువకుడు బైక్‌పై చేసిన డేంజరస్ స్టంట్ నెటిజన్లను షాక్‌కు గురిచేస్తోంది. వైరల్ వీడియోలో అతడు బైక్‌ను హై స్పీడ్‌లో జిగ్‌జాగ్‌గా నడుపుతుండగా, వెనుక కూర్చున్న మహిళ బ్యాలెన్స్ కోల్పోయినట్లు కనిపించింది. వీడియో చూసిన నెటిజన్లు "వైరల్ కోసం ప్రాణాలతో ఆట ఎందుకు?", "ఒక్క సెకండ్ తేడా అయితే పెద్ద ప్రమాదమే" అంటూ ఫైర్ అవుతున్నారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందనే విషయంపై స్పష్టత లేదు.

బ్యాడ్మింటన్ అకాడమీ సమీపంలో కాల్పులు కలకలం
AP: కర్నూలు జోహరపురంలోని వీఆర్ఎస్ బ్యాడ్మింటన్ అకాడమీ సమీపంలో నిన్న రాత్రి తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. ఒక వాహనంలో వచ్చిన ఇద్దరు వ్యక్తులు గాలిలోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న కర్నూలు మూడో టౌన్ పోలీసులు వెంటనే స్పందించి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఘటనలో ఉపయోగించిన తుపాకీని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ముద్రగడ పద్మనాభం కొడుకు ఎమోషనల్!
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కుమారుడు గిరిబాబు YS జగన్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటామని ఎమోషనల్ అయ్యారు. తన తండ్రి హాస్పిటల్‌లో ఉన్నప్పటి నుంచి చివరివరకు జగన్ నిరంతరం డాక్టర్లతో మాట్లాడుతూ కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారని గుర్తుచేసుకున్నారు. రాజకీయ లబ్ధి కోసం కాకుండా, ఒక కుమారుడిలా ఆఖరి గౌరవం ఇస్తూ జగన్ స్వయంగా పాడె మోశారని, ఆ క్షణాన్ని తమ కుటుంబం ఎప్పటికీ మర్చిపోలేదన్నారు. కష్టకాలంలో తమకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
అమెరికాలో అయితే ఏకంగా కాల్చి చంపేస్తారు- BJP MP
ప్రొటెస్టర్లపై పోలీస్ యాక్షన్‌ను బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సపోర్ట్ చేశారు. పార్లమెంట్ వైపు దూసుకొచ్చినప్పుడు పోలీసులు లాఠీఛార్జ్ చేయడం తప్పు కాదని అన్నారు. అమెరికా లాంటి కంట్రీస్‌లో అయితే ఇలాంటి సిట్యుయేషన్‌లో డైరెక్ట్‌గా గన్స్‌తో షూట్ చేస్తారని చెప్పారు. ఈ బీజేపీ ఎంపీ కామెంట్స్‌పై మీ ఓపీనియన్ ఏంటో కామెంట్స్‌లో చెప్పండి!

పెల్లెట్ గన్ ఫైరింగ్: రూల్స్ బ్రేక్ చేసి కాల్పులు జరిపారు!
ఢిల్లీ ప్రొటెస్ట్‌లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) పెల్లెట్ గన్స్ వాడటంపై వివాదం నడుస్తోంది. జులై 20న నిబంధనలకు విరుద్ధంగా ఏడు రౌండ్ల ఫైరింగ్ జరిగిందని, అందులో స్టూడెంట్‌తో పాటు జర్నలిస్ట్‌కి దెబ్బలు తగిలాయని ఇంటర్నల్ రివ్యూలో తేలింది. దీనిపై RAF ఇన్స్‌పెక్టర్ జనరల్ సీమా ధుండియా స్పందిస్తూ... పద్ధతి ప్రకారం హెచ్చరికలు ఇచ్చిన తర్వాతే లారీఛార్జ్ లేదా కన్నీటివాయువు వాడాలని, పరిమితి దాటి ఫోర్స్ వాడకూడదని జవాన్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

మాజీ మంత్రి రోజాకి పోలీసు నోటీసులు?
YCP నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజాకి తిరుపతి ఈస్ట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 30న విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. దీనిపై స్పందించిన రోజా, కూటమి ప్రభుత్వం పొలిటికల్ రివేంజ్‌లో భాగంగానే తనపై అక్రమ కేసులు పెట్టిందని విమర్శించారు. జగన్ గారి కుటుంబ మహిళలపై అబద్ధాలు రాసిన పేపర్‌ను నిరసనగా తగలేస్తే కేసు పెట్టడం ఏంటని మండిపడ్డారు. బెదిరింపులకు బెదిరేది లేదని రోజా స్పష్టం చేశారు.
మంత్రులను మార్చాలి: MLA అనిరుధ్ రెడ్డి!
మంత్రుల పదవులపై జడ్చర్ల కాంగ్రెస్ MLA అనిరుధ్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. కార్పొరేషన్ ఛైర్మన్ల పదవీ కాలం రెండేళ్లు పూర్తయ్యాక మారుస్తున్నట్లే, మంత్రుల పదవులు కూడా రెండేళ్లు పూర్తయ్యాయి కాబట్టి వాళ్లను మార్చాలని డిమాండ్ చేశారు. తమలాంటి ఇంజనీర్లు, డాక్టర్లు ఉన్న యంగ్ ఎంబిషియస్ MLAలకు అవకాశం ఇవ్వాలని అన్నారు. అయితే ఈ విషయంలో పార్టీ అధిష్ఠానం, రేవంత్ రెడ్డి గారి నిర్ణయానికే కట్టుబడి ఉంటానని చెప్పారు. Video Credits - Zee Telugu News
జయకృష్ణ ఎంట్రీపై మహేష్ బాబు రియాక్షన్!
సూపర్ స్టార్ మహేష్ బాబు తన అన్న రమేష్ బాబు కొడుకు జయకృష్ణ గ్రాండ్ ఎంట్రీపై రియాక్ట్ అయ్యారు. 'శ్రీనివాస మంగపురం' సినిమాతో డెబ్యూ చేస్తున్న జయకృష్ణ, రాషా తడానీలకు బెస్ట్ విషెస్ చెప్పారు. టీజర్, సాంగ్స్ చాలా బాగున్నాయని, వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో ఇంట్రడ్యూస్ అవ్వడం వాళ్ల లక్ అని కామెంట్స్ చేశారు. జులై 30న రిలీజ్ అవుతున్న ఈ మూవీ బిగ్ హిట్ అవ్వాలని విష్ చేశారు.

ఆసుపత్రికి మెగా ఫ్యామిలీ!
రామ్ చరణ్ రీసెంట్‌గా కొయంబత్తూర్ ఆసుపత్రికి వెళ్లారు. 'పెద్ది' మూవీ షూటింగ్‌లో రెజ్లర్లతో ఫైట్ సీన్ చేస్తుండగా హ్యాండ్ మణికట్టు (wrist)కి గట్టిగా దెబ్బ తగిలింది. షూటింగ్ డిస్టర్బ్ అవ్వకూడదని పెయిన్ ఉన్నా అలాగే కంటిన్యూ చేయడంతో ప్రాబ్లం సీరియస్ అయింది. ఈ హ్యాండ్ సర్జరీ కోసం ఆదివారం ఫ్యామిలీ మెంబర్స్ చిరంజీవి, సురేఖ, ఉపాసనలతో కలిసి చరణ్ కొయంబత్తూర్ బయలుదేరి వెళ్లారు. చరణ్ త్వరగా రికవర్ అవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
'రాయన్' నేషనల్ అవార్డు వివాదం: ధనుష్ షాకింగ్ రియాక్షన్!
నేషనల్ అవార్డ్స్ వివాదంపై తమిళ స్టార్ హీరో ధనుష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తన 'రాయన్' కంటే బెటర్ సినిమాలు ఉన్నాయని ఆయన ఒప్పుకున్నారు. అయితే గతంలో తన 'పుదుపేట్టై, వడ చెన్నై, కర్ణన్' లాంటి క్లాసిక్ సినిమాలకు అవార్డులు రానప్పుడు ఎవరూ మాట్లాడలేదని, ఇప్పుడు తనకు అవార్డు వస్తే 90% మంది విమర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చిన అవార్డును గుర్తించి ప్రోత్సహించాలని ధనుష్ ఫ్యాన్స్ మీట్‌లో కామెంట్స్ చేశారు.

బాలయ్యను పరామర్శించిన CM చంద్రబాబు!
సినిమా షూటింగ్‌లో గాయపడిన బాలకృష్ణకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని AIG ఆసుపత్రిలో మోకాలికి సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హాస్పిటల్‌లో కోలుకుంటున్న ఆయనను AP CM చంద్రబాబు నాయుడు ఆదివారం పరామర్శించారు. డాక్టర్లతో మాట్లాడి బాలయ్య హెల్త్ కండిషన్‌పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా AIG హాస్పిటల్ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి కూడా వారి వెంటే ఉన్నారు. బాలకృష్ణ త్వరలోనే డిశ్చార్జ్ అయ్యే ఛాన్స్ ఉంది.

అయ్యో పాపం.. 11 ఏళ్ల కవలలను బావిలో తోసేసి..!
తమిళనాడులోని తేని జిల్లా రంగానాథపురానికి చెందిన శ్రీహరీష్ (11), శబరీష్ (11) అనే కవల అన్నదమ్ములను కేశవ్ బాలాజీ (19) అనే యువకుడు బావిలోకి తోసి దారుణంగా హత్య చేశాడు. శుక్రవారం సాయంత్రం ఆడుకోవడానికి వెళ్లిన పిల్లలు మిస్సింగ్ అవ్వడంతో పేరెంట్స్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ చేపట్టిన పోలీసులకు కరడుపట్టిలోని వ్యవసాయ బావిలో పిల్లల డెడ్‌బాడీస్ కనిపించాయి. ఊరి బయట మంచి పావురాళ్లు ఉన్నాయని నమ్మించి, బావి దగ్గరకు తీసుకెళ్లి తోసేసినట్లు నిందితుడు విచారణలో ఒప్పుకున్నాడు.

టైట్ డ్రెస్సింగ్, హై హీల్స్ తో హెల్త్ రిస్కులు !
ఫిట్ గా కనిపించే పేరుతో టైట్ డ్రెస్, హైట్ కోసం మరీ హై హీల్స్ వేసుకోవడం వల్ల హెల్త్ రిస్క్ లు ఎక్కువని ఫ్యాషన్ ఎక్స్ పర్టులు వార్న్ చేస్తున్నారు. కేవలం స్టైల్ కోసమే కాకుండా, శరీరానికి హాని కలిగించని విధంగా డ్రెస్ చేసుకోవాల్సిన అవసరం పెరిగింది. టైట్ డ్రెస్సింగ్ వల్ల బ్లడ్ ఫ్లో ఆగిపోవడం, బ్యాక్ పెయిన్, లాంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఫ్యాషన్ ప్రపంచంలో కంఫర్ట్ కి పెద్ద పీట వేస్తూ ట్రెండీగా ఉంటూనే హెల్తీ డ్రెస్సింగ్ అలవాటు చేసుకోవాలని నిపుణుల సలహా.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనల్ని ఎంతవరకు పసిగడుతోంది?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అసిస్టెంట్లు మన వ్యక్తిగత వివరాలు, ఇష్టాయిష్టాలను ఎంతవరకు గుర్తు పెట్టుకుంటున్నాయో తెలుసుకునేందుకు నాలుగు ప్రత్యేక చాట్‌బాట్ ప్రాంప్ట్‌లు ఎంతగానో ఉపయోగపడతాయి. మన డైలీ చాటింగ్ ఆధారంగా ఏఐ తయారు చేసుకునే డిజిటల్ ప్రొఫైల్ లోతు పాతులను ఇవి బయటపెడతాయి. ఏఐ పరిజ్ఞానం మన అలవాట్లను, థింకింగ్ స్టైల్ ని అతి దగ్గరగా గమనిస్తోందనే విషయాన్ని ఈ ప్రాంప్ట్‌ల ద్వారా పసిగట్టవచ్చని టెక్నికల్ ఎక్స్ పర్టులు అంటున్నారు.

ఫుడ్ లవర్స్ నోరూరించే తైవాన్ రుచులపై కథనాలు !
తైవాన్ ఫుడ్ కల్చర్, అక్కడి ట్రెడిషనల్ డిషెస్ ప్రయారిటీని వివరిస్తూ సైరీనా లీ రాసిన స్పెషల్ స్టోరీ రీడర్స్ ని బాగా ఆకట్టుకుం టోంది. ఉదయాన్నే లభించే ఫ్లాట్ బ్రెడ్, పాలు, టర్నిప్ కేక్‌ల నుంచి రాత్రి వేళల్లో దొరికే ఐస్టర్ ఆమ్లెట్లు, షేవ్డ్ ఐస్ వంటి వెరైటీ టేస్టులను ఇందులో వివరించారు. తైపీ నగరాన్ని ఆసియా ఖండంలోనే ది బెస్ట్ పుడ్ స్టేజ్ గా వర్ణిస్తూ, అక్కడి నైట్ మార్కెట్లు, ట్రెడిషనల్ ఫుడ్ కేఫ్‌ల విశేషాలను అందిస్తూ ఫుడ్ లవర్స్ నోరూరేలా రాస్తున్నారు.

పాపులర్ అవుతున్న మిల్స్ ప్రోడక్ట్స్ కల్చర్ !
పాల ఉత్పత్తులకు రకరకాల రుచులు, పోషకాలను జోడిస్తూ డెయిరీ రంగంలో నయా ట్రెండ్ మొదలవుతోంది. పాల పదార్థాల స్థానంలో చీజ్, ప్రొబయోటిక్ పెరుగు, ఫర్మెంటెడ్ పాల ఉత్పత్తుల తయారీకి కల్చర్ ఉపయోగించడం పెరిగింది. కన్సూమర్స్ లో హెల్త్ కాన్షస్ పెరగడంతో క్వాలిటీ, ఇమ్యూనిటీని పెంచే ఈ టైప్ ప్రోడక్ట్స్ కు మార్కెట్‌లో డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. దీంతో అనేక డెయిరీ బ్రాండ్లు మోడ్రన్ టెక్నాలజీలో, ట్రెండీగా మిల్క్ ప్రోడక్ట్స్ ని అందిస్తూ విస్తరిస్తున్నాయి.

మానసిక ప్రశాంతతనిచ్చే 'ఆప్-లిట్' బుక్స్ ట్రెండ్!
బుక్ రీడింగ్ ఇన్ఫర్మేషన్ కోసమే కాకుండా మానసిక ప్రశాంతతను, రిలీఫ్ ను ఇచ్చే ట్రీట్మెంట్ గా మారుతోంది. ఈ క్రమంలో 'ఆప్-లిట్' లేదా ఉపశమనాన్నిచ్చే సాహిత్యం పేరిట సరికొత్త బుక్స్ ట్రెండ్ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అవుతోంది. థిక్ స్టోరీస్, ఫిక్షన్ స్టోరీస్, ఇన్సిడెంట్స్ కంటే లవ్, ఎఫెక్షన్, సెకండ్ ఛాన్స్ ఇన్ లైఫ్ లాంటి ఎమోషన్స్ కి ప్రయార్టీ ఇచ్చే బుక్స్ చదివేందుకు రీడర్స్ ఆసక్తి చూపుతున్నారు. టెన్షన్ లైఫ్ లో మెంటల్ పీస్ నిచ్చేఈ టైప్ బుక్స్ కి మార్కెట్ లో డిమాండ్ పెరుగుతోంది.