Latest

పార్లమెంట్ వద్ద ప్రతిపక్షాల నిరసన
India· 22 Jul 2026

పార్లమెంట్ వద్ద ప్రతిపక్షాల నిరసన

దిల్లీలోని పార్లమెంట్ వద్ద ఇండియా కూటమి ఎంపీలు నల్లటి బట్టలు ధరించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసన చేపట్టారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే హక్కు ఎవరికీ లేదంటూ నినాదాలు చేశారు.

గిగ్ వర్కర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: కవిత
TG· 22 Jul 2026

గిగ్ వర్కర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: కవిత

TG: గిగ్ వర్కర్లు, ఆటో, క్యాబ్ డ్రైవర్ల సమస్యలపై TRS చీఫ్ కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి సంస్థల్లో పనిచేస్తున్న లక్షలాది మంది రోజంతా కష్టపడినా కుటుంబ పోషణకు సరిపడా ఆదాయం రావడం లేదన్నారు. మూడేళ్లుగా రేట్లు పెంచాలని కోరుతున్నా ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని ఆరోపించారు. అగ్రిగేటర్ సంస్థలు అధిక కమీషన్లు, కోత విధిస్తూ డ్రైవర్లను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెడుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఛార్జీలు పెంచేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

48 ఏళ్ల తర్వాత ఆ ఊరికి ఆర్టీసీ బస్సు
News· 22 Jul 2026

48 ఏళ్ల తర్వాత ఆ ఊరికి ఆర్టీసీ బస్సు

AP: నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం జానాలగూడెం గ్రామానికి 48 ఏళ్ల తర్వాత ఆర్టీసీ బస్సు వచ్చింది. గ్రామస్థులు విద్య, వైద్య అవసరాల కోసం 8 కిలోమీటర్ల నడిచి వెళ్లి బస్కెక్కేవారు. ప్రజల కష్టాలను గమనించిన ప్రజాప్రతినిధులు ఊరికి బస్సు సౌకర్యం కల్పించారు. దీంతో గ్రామస్థులు సంతోషంతో బస్సుకు పూజలు చేశారు.

యురేనస్, నెప్ట్యూన్‌లపై డైమండ్ల వర్షం
Education· 22 Jul 2026

యురేనస్, నెప్ట్యూన్‌లపై డైమండ్ల వర్షం

మన దగ్గర వాన వస్తే నీటి చుక్కలు పడతాయి. కానీ యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలపై మాత్రం వజ్రాల వర్షం కురుస్తుంది. ఈ గ్రహాలు రాళ్లతో కాకుండా మీథేన్, నీరు, అమోనియా వంటి మంచు రూపాలతో నిండి ఉంటాయి. గ్రహం లోపలికి వెళ్లేకొద్దీ ఒత్తిడి బాగా పెరిగిపోతుంది. ఆ ప్రెజర్‌కి మీథేన్‌లోని కార్బన్ విడిపోయి చిన్న డైమండ్లలా మారుతుంది. అక్కడి గాలి వేగం, తీవ్రమైన ఒత్తిడిని తట్టుకోవడం స్పేసిషిప్స్‌కి సాధ్యం కాకపోవడం వల్ల ఆ వజ్రాలను సేకరించడం కుదరదు.

కొడంగల్‌లో సీఎం రేవంత్ ర్యాలీ
Politics· 22 Jul 2026

కొడంగల్‌లో సీఎం రేవంత్ ర్యాలీ

TG: నిన్న దిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ అరెస్ట్‌ను నిరసిస్తూ సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ అంబేడ్కర్ చౌరస్తాలో ర్యాలీ చేశారు. నిందితులకు శిక్ష వేయాల్సిందిపోయి విద్యార్థులపై లాఠీలతో దాడి చేస్తారా అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పోలీసుల దెబ్బలకు రాహుల్‌కు రక్తాలొచ్చాయని ఆగ్రహించారు. ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజని కేంద్ర ప్రభుత్వంపై ఫైరయ్యారు.

జననాయగన్' సినిమా లీక్‌పై డైరెక్టర్ వినోద్ స్పందన
Cinema· 22 Jul 2026

జననాయగన్' సినిమా లీక్‌పై డైరెక్టర్ వినోద్ స్పందన

విజయ్ నటించిన ‘జననాయగన్’ లీక్‌పై డైరెక్టర్ హెచ్.వినోద్ స్పందించారు. సినిమాను లీక్ చేశారనే ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు. ఎన్నికల లాభం కోసం బిగ్ బడ్జెట్ సినిమాని ఎవరైనా లీక్ చేస్తారా అని ప్రశ్నించారు. ఈ వివాదంపై నిర్మాతల ఫిర్యాదుతో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఆలస్యం కావడం వల్ల ఆరు నెలలు ఎంతో కష్టంగా గడిచాయని వినోద్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. జులై 23న సినిమా విడుదల కానుంది.

హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్‌ను సందర్శించిన సీఎం రేవంత్
News· 22 Jul 2026

హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్‌ను సందర్శించిన సీఎం రేవంత్

TG: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా హకీంపేటలో ఎడ్యుకేషన్ హబ్ పనుల పురోగతిని సమీక్షించారు. విద్యా సంస్థల భవన నిర్మాణాలను, ప్రణాళికలను క్షేత్రస్థాయిలో తిరిగి పరిశీలించారు. ఎడ్యుకేషన్ హబ్‌కు సంబందించిన హాస్టల్స్ నిర్మాణ పనులను పరిశీలించి కొన్ని సూచనలు చేశారు.

ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం
Crime· 22 Jul 2026

ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం

TG : శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్ లో నైట్ డ్యూటీకి క్యాబ్ లో వెళ్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిని ఎవరూ లేని చోటికి తీసుకెళ్లి క్యాబ్ డ్రైవర్, ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. ఆమె ధైర్యంతో అతడిపై ఎదురుతిరిగింది , ఎక్కడ దొరుకుతాననే భయంతో డ్రైవర్ తన కారుతో పారిపోయాడు. బాధితురాలు శంషాబాద్ ఎయిర్ పోర్టు ఔట్ పోస్టు పోలీసులకు పిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

కరోనా కలకలం.. సీలేరు పర్యాటకుల ప్రవేశం నిలిపివేత
AP· 22 Jul 2026

కరోనా కలకలం.. సీలేరు పర్యాటకుల ప్రవేశం నిలిపివేత

APలో కరోనా కేసులు పెరుగుతుండటంతో విశాఖపట్నం జిల్లా సీలేరు ప్రాంతంలో అధికారులు అలెర్ట్ అయ్యారు. సీలేరు పవర్ కాంప్లెక్స్ పరిధిలోకి పర్యాటకుల ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. సీలేరు, డొంకరాయి, పొల్లూరు, మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రాలు, రిజర్వాయర్లకు బయటి వ్యక్తుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. విద్యుత్ కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది ఆరోగ్య భద్రత కోసం మాస్కులు, శానిటైజేషన్, భౌతిక దూరం వంటి కోవిడ్ నిబంధనలు తప్పనిసరి చేశారు. ప్రజలు కూడా మాస్క్‌లు ధరించి జాగ్రత్తలు పాటించాలని వైద్యాధికారులు సూచించారు.

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దు: పొన్నం
Politics· 22 Jul 2026

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దు: పొన్నం

TG: నీట్ పేపర్ లీకేజీతో విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వెంటనే రాజీనామా చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. లోకసభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ ఇతర ముఖ్య నేతల అరెస్ట్‌కు నిరసనగా కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించిన మహాధర్నాలో మంత్రి పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ నేతల అరెస్ట్ అప్రజాస్వామికం అని, ఢిల్లీలో హింసపై విచారణ జరిపించి దోషులను శిక్షించాలన్నారు. నీట్ పేపర్ లీక్‌తో ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్నారు.

ఏపీలో మళ్లీ కరోనా టెన్షన్..!
News· 22 Jul 2026

ఏపీలో మళ్లీ కరోనా టెన్షన్..!

AP: ఏపీలో Omicron RF.5 వేరియంట్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా 7 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 26కి చేరింది. ఇప్పటివరకు నలుగురు మృతి చెందగా, వారంతా ఇప్పటికే ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం వైరస్ 10 జిల్లాలకు విస్తరించింది. అయితే ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, జ్వరం, దగ్గు, జలుబు లాంటి లక్షణాలు ఉంటే వెంటనే టెస్ట్ చేయించుకోవాలని హెల్త్ డిపార్ట్‌మెంట్ సూచించింది.

CJP ధర్నాలో నిరసనకారుల ఇబ్బందులకు ఇదిగో సాక్ష్యం
India· 22 Jul 2026

CJP ధర్నాలో నిరసనకారుల ఇబ్బందులకు ఇదిగో సాక్ష్యం

దిల్లీ నగరంలోని జంతర్‌మంతర్ వద్ద మొన్న జరిగిన ‘చలో సంసద్’ ర్యాలీ మీద పోలీసులు జరిగిన లాఠీచార్జ్ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మద్దతుదారులను ముందుకు సాగనీయకుండా పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. వారిపై తమ ప్రతాపం చూపించారు. లాఠీలు, టియర్ గ్యాస్‌తో విరుచుకుపడ్డారు. జనాన్ని చెల్లాచెదురు చేశారు. ఆ క్రమంలో ఎంతోమంది చెప్పులు వదిలేసి పరిగెత్తారు. ఆ దాష్టీకానికి సాక్ష్యంగా నిలుస్తోంది ఈ చిత్రం.

ఆర్టీసీ బస్సునే దొంగలించిన దుండగుడు
Viral· 22 Jul 2026

ఆర్టీసీ బస్సునే దొంగలించిన దుండగుడు

TG: జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్ నుంచి ఓ దుండగుడు ఆర్టీసీ బస్సును చోరీ చేశాడు. బస్సును వేగంగా నడుపుతూ ఇతర వాహనాలను ఢీకొట్టడంతో పోలీసులు సినిమా రేంజ్ లో బస్సును ఛేజ్ చేశారు. చివరకు జిల్లా సరిహద్దు వద్ద అడ్డుకుని బస్సును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

తల్లికి వందనం నిధులు రూ.10,120.78 కోట్లు విడుదల : నారా లోకేష్
AP· 22 Jul 2026

తల్లికి వందనం నిధులు రూ.10,120.78 కోట్లు విడుదల : నారా లోకేష్

AP: 'ఈ ఏడాది 67.47 లక్షల మంది విద్యార్థులకుగానూ, 42.70 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.10,120.78 కోట్లు జమ చేస్తున్నాం, ఈనెల 24 వరకు నిధుల విడుదుల కొనసాగుతుంది' అని మంత్రి నారా లోకేష్ తెలిపారు. పిల్లల చదువులే రాష్ట్రానికి నిజమైన ఆస్తి అని, ఏ ఒక్క చిన్నారీ విద్యకు దూరం కాకూడదనేది కూటమి ప్రభుత్వం లక్ష్యమని, ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు చదివినా ఈ సాయం అందించేలా 'తల్లికి వందనం' పథకాన్ని రూపొందించామంటూ మంత్రి లోకేష్ 'X' లో తెలిపారు.

నేషనల్ హైవేపై కాంగ్రెస్ నాయకులు బైఠాయింపు
TG· 22 Jul 2026

నేషనల్ హైవేపై కాంగ్రెస్ నాయకులు బైఠాయింపు

TG: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మంగ్లూర్ గేట్ వద్దనున్న హైవేపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం భారీ ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. నీట్, పేపర్ లీక్ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీతో పాటు ఇతర ప్రతిపక్ష నేతల అరెస్టులను తీవ్రంగా ఖండించారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన మోడీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

నేడు దాశరథి కృష్ణమాచార్య జయంతి
Infotainment· 22 Jul 2026

నేడు దాశరథి కృష్ణమాచార్య జయంతి

'నా తెలంగాణ కోటి రతనాల వీణ' అని చాటిచెప్పిన విప్లవ కవి, రచయిత దాశరథి కృష్ణమాచార్య జయంతి నేడు. ప్రజల స్వేచ్ఛను అణచివేసే నిజాం పాలనకు వ్యతిరేకంగా తన 'కవితల'తో ప్రజల్లో చైతన్యాన్ని రగిలించిన ఉద్యమసారథి మన దాశరథి. జైలు గోడలపైన బొగ్గుతో పద్యాలు రాసి, అన్యాయాలకు ఎదురు నిలిచిన వ్యక్తి. విప్లవ సాహిత్యమే కాకుండా తెలుగు సినిమాలకి కూడా ఎన్నో మరపురాని మధురమైన పాటలను అందించారు.

రెడ్కో డీఈ ఇంట్లో ACB రైడ్స్
TG· 22 Jul 2026

రెడ్కో డీఈ ఇంట్లో ACB రైడ్స్

TG: హైదరాబాద్‌లో తెలంగాణ REDCO (రెన్యువల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) DE ముత్యం వెంకటరమణ నివాసాలపై ACB అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఆరోపణల రావడంతో మాదాపూర్‌లోని ఆయన ఇంటితో పాటు మరో 15 ప్రాంతాల్లో ఏసీబీ DSP మాజిదాఖాన్ ఆధ్వర్యంలో ఎనిమిది బృందాలు ఏకకాలంలో తనిఖీలు కొనసాగిస్తున్నాయి. స్థిర, చరాస్తులకు సంబంధించిన పత్రాలతో పాటు భారీగా నగదు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

ఆకాశంలో GOLD RATES..తులం ఎంతో తెలుసా?
News· 22 Jul 2026

ఆకాశంలో GOLD RATES..తులం ఎంతో తెలుసా?

గోల్డ్ రేట్స్ మరోసారి భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,46,510కు చేరగా, ఒక్కరోజే రూ.2,290 పెరిగింది. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,34,300గా ఉంది. గ్లోబల్ మార్కెట్ పరిస్థితులు, యుద్ధ ఉద్రిక్తతల ప్రభావంతో గోల్డ్ రేట్స్ పెరుగుతున్నాయని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. మరోవైపు వెండి ధర కూడా పెరిగింది. హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ ధర రూ.2.40 లక్షలకు చేరి, ఒక్కరోజే రూ.5,000 పెరిగింది

ఆగస్ట్ 1న భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం: చంద్రబాబు
News· 22 Jul 2026

ఆగస్ట్ 1న భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం: చంద్రబాబు

AP: భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవానికి సంబంధించి సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. ఉత్తరాంధ్రకు గ్రోత్ ఇంజన్‌గా మారే భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌తోపాటు పాసింజర్ టెర్మినల్, ఏవియేషన్ యూనివర్సిటీ, ఎడ్యుసిటీలను ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 1న ప్రారంభిస్తారని తెలిపారు. అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని వైభవంగా నిర్వహించుకోవాలని సీఎం పిలుపునిచ్చారు

సిడ్నీ హీరోగా హైదరాబాద్ వాసి
News· 22 Jul 2026

సిడ్నీ హీరోగా హైదరాబాద్ వాసి

సిడ్నీలోని బాండీ బీచ్‌లో జరిగిన కాల్పుల ఘటనలో హైదరాబాద్‌కు చెందిన రెహ్మత్ పాషా దాదాపు 20 మంది ప్రాణాలను కాపాడారు. గాయపడినవారిని ఆంబులెన్సుల వద్దకు చేర్చిన ఆయన తెగువను మెచ్చి ఆస్ట్రేలియా ప్రభుత్వం శాశ్వత నివాస హోదా కల్పించింది. ఈ ధైర్యసాహసాలకు గుర్తుగా ఆయన టోపీని సిడ్నీ మ్యూజియంలో ఉంచనున్నారు. త్వరలోనే ఆయన కుటుంబం కూడా ఆస్ట్రేలియా వెళ్లనుంది. ఈ ఘటనకు పాల్పడిన నిందితులు సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్‌లకు కూడా హైదరాబాద్‌తో సంబంధాలున్నాయి.

తెలుగు గజల్ రచనకు ఆద్యుడు దాశరథి
Infotainment· 22 Jul 2026

తెలుగు గజల్ రచనకు ఆద్యుడు దాశరథి

తెలుగు సాహిత్యంలో గజల్ రచనకు ఆద్యుడిగా నిలిచివారు దాశరథి కృష్ణమాచార్యులు. ‘వలపునై నీ హృదయసీమల నిలువవలెనని ఉన్నది..పిలుపునై నీ అధర వీధుల పలుకవలెనని ఉన్నది’’ అంటూ 1965లో తొలిసారి తెలుగు గజల్‌ రాశారాయన. 14 ఏప్రిల్ 1965లో ఆంధ్రప్రభ వారపత్రికలో ‘ఉగాది గజల్’ అన్న శీర్షికతో అచ్చయింది. 'గజల్' అంటే “ఇంతులతో మంతనాలు" అన్నారు దాశరథి. తెలుగులో గజల్‌కు దాశరథి ‘మంజరి’ ‌అని పేరు పెట్టారు.