Latest

కృష్ణా జలాలపై CM మౌనం ఎందుకు? : హరీశ్ రావు
TG· 4d ago

కృష్ణా జలాలపై CM మౌనం ఎందుకు? : హరీశ్ రావు

TG: వెలిగొండ ప్రాజెక్టు ద్వారా AP ప్రభుత్వం కృష్ణా జలాలను తరలిస్తుంటే CM రేవంత్‌రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. ఇది తెలంగాణ రైతాంగానికి తీరని ద్రోహమని ఎక్స్‌ వేదికగా విమర్శించారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో సాగునీటి కష్టాలు పెరుగుతుండగా, బీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టులకు నీరు లేక ఆయకట్లు ఎండిపోతున్నాయని పేర్కొన్నారు. కృష్ణా బేసిన్‌తో సంబంధం లేని ప్రాంతాలకు ఏపీ నిబంధనలు ఉల్లంఘించి నీటిని తరలిస్తోందని ఆరోపించారు.

భారత్‌ GDP 7.8% పెరిగింది.. ఇంత వేగంగా ఎలా?
National· 4d ago

భారత్‌ GDP 7.8% పెరిగింది.. ఇంత వేగంగా ఎలా?

భారత్‌ ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే వేగంగా పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు దేశ GDP అంచనాలను మించి 7.8% వృద్ధి నమోదైంది. ప్రజలు ఎక్కువగా ఖర్చు చేయడం, కంపెనీలు పెట్టుబడులు పెట్టడం, తయారీ మరియు సర్వీసుల రంగాలు బాగా పనిచేయడం దీనికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు అంతగా బాగోలేని సమయంలో కూడా భారత్‌ ఇంత వృద్ధి సాధించడం ఆసక్తికరంగా మారింది. మరి ఈ వేగం ఇకముందు కూడా కొనసాగుతుందా? ఈ వృద్ధి సామాన్యుడికి ఎంతవరకు మేలు చేస్తుంది?

ఇళ్ల మంజూరులో రాజకీయాలకు చోటులేదు: పొంగులేటి
TG· 4d ago

ఇళ్ల మంజూరులో రాజకీయాలకు చోటులేదు: పొంగులేటి

TG: గుడి లేని ఊరు ఉండొచ్చేమో కానీ.. ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం ఉండదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో మంత్రి సీతక్కతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అర్హులైన రైతులకు పట్టా పాస్‌బుక్కులు పంపిణీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో కులం, మతం, రాజకీయాలకు తావులేదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించిన గ్రామాల్లోనే ఓట్లు అడుగుతామని అన్నారు. కాంగ్రెస్‌ విధానం గల్లీగల్లీకి అభివృద్ధి, గడపగడపకు సంక్షేమమని సీతక్క పేర్కొన్నారు.

ప్రతిపక్ష నేతగా KCR ఫెయిల్‌:  CM రేవంత్‌రెడ్డి
TG· 4d ago

ప్రతిపక్ష నేతగా KCR ఫెయిల్‌: CM రేవంత్‌రెడ్డి

TG: ప్రధాన ప్రతిపక్ష నేతగా KCR పూర్తిగా విఫలమయ్యారని, వెంటనే రాజీనామా చేయాలని CM రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ అంబర్‌పేటలో మూసారాంబాగ్‌ వద్ద రూ.52 కోట్లతో నిర్మించిన హైలెవల్‌ వంతెనను CM ప్రారంభించారు. అనంతరం సభలో మాట్లాడుతూ.. వెయ్యి రోజులుగా KCR ప్రజలకు అందుబాటులో లేకుండా బాధ్యతలను విస్మరించారని విమర్శించారు. MLAగా ఆయనకు వెయ్యి రోజుల్లో రూ.1.25 కోట్ల జీతం, భద్రత, ఇతర అవసరాల కోసం ప్రభుత్వం రూ.21 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. కేసీఆర్‌ ప్రజా సమస్యలపై స్పందించకుండా ఉండటం సరికాదన్నారు.

వెలిగొండతో కరువు నేలకు కొత్త ఊపిరి: చంద్రబాబు
AP· 4d ago

వెలిగొండతో కరువు నేలకు కొత్త ఊపిరి: చంద్రబాబు

AP: కరువు నేలపై కృష్ణా జలాలతో కొత్త చరిత్ర ప్రారంభమైందని CM చంద్రబాబు అన్నారు. మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండలం గంటవానిపల్లెలో పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను CM ప్రారంభించారు. నల్లమలసాగర్‌లోకి కృష్ణా జలాలను విడుదల చేశారు. వెలిగొండతో పశ్చిమ ప్రాంతంలో ఫ్లోరైడ్‌ సమస్యకు ముగింపు పలుకుతుందని, ప్రతి ఇంటికీ కుళాయి నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రాజెక్టు కోసం ఇళ్లు, భూములు త్యాగం చేసిన 11 గ్రామాల ప్రజలకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.

“రేపటి నుంచి స్టార్ట్‌ చేస్తా”.. ఈ రేపు ఎప్పుడొస్తుంది?
Motivational· 5d ago

“రేపటి నుంచి స్టార్ట్‌ చేస్తా”.. ఈ రేపు ఎప్పుడొస్తుంది?

“రేపటి నుంచి స్టార్ట్‌ చేస్తా”.. ఈ మాట మనలో చాలామంది రోజూ అనుకుంటూనే ఉంటాం. జిమ్‌కి వెళ్లాలి, చదవాలి, కొత్త స్కిల్‌ నేర్చుకోవాలి, ఖర్చులు తగ్గించాలి.. ఏదైనా సరే, మొదలు పెట్టాల్సిన పనిని రేపటికి వాయిదా వేయడం చాలా ఈజీ. ఎందుకంటే ఇప్పుడున్న కష్టం కంటే.. తర్వాత చేస్తాననే ఆలోచన మనకు కాస్త రిలీఫ్‌ ఇస్తుంది. కానీ ఆ “రేపు” మళ్లీ మరో రేపుగా మారిపోతుంది. చివరికి పని కంటే.. దాన్ని మొదలుపెట్టడమే పెద్ద సమస్యగా మారుతుంది. రేపు ఎప్పుడూ వస్తూనే ఉంటుంది.. కానీ మార్పు మాత్రం మనం మొదలు పెట్టినప్పుడే వస్తుంది.

పేదల కోసం సత్రం ప్రారంభం
Local· 5d ago

పేదల కోసం సత్రం ప్రారంభం

భీమావారిపాలెంలోని పేద ప్రజల అవసరాలకు కంబాల రంగయ్య సత్రం అండగా నిలవనుంది. రూ.56 లక్షలతో పునర్నిర్మించిన సత్రాన్ని మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ ప్రారంభించారు. సత్రంలో నాలుగు వసతి గదులు, భోజనాలు ఏర్పాటు చేసుకునేందుకు హాలు అందుబాటులోకి వచ్చాయి. అద్దె ఇళ్లలో నివసించే పేదలు, అవసరమైనవారు ఇక్కడ నిద్రించడంతోపాటు భోజన కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని సతీష్ తెలిపారు. పేదలకు సత్రం ఉపయోగపడేలా ట్రస్ట్ సభ్యులు అందుబాటులో ఉంటారని చెప్పారు.

మాసాయిపేటలో ఘనంగా జాతర
Local· 5d ago

మాసాయిపేటలో ఘనంగా జాతర

మాసాయిపేట మండల కేంద్రంలో మహంకాళి అమ్మ బోనాల జాతర ఘనంగా జరిగింది. మండలం చుట్టుపక్కల గ్రామ ప్రజలు భారీగా వచ్చారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న దర్గాకు చాదర్ పూలు అలంకరించారు. మతాలకతీతంగా హిందూ ముస్లింలు ఈ వేడుకలో పాల్గొన్నారు. కార్యక్రమానికి సర్పంచ్ కృష్ణారెడ్డి, మండల స్థాయి నాయకులు హాజరయ్యారు.

ప్రజావాణికి మళ్ళీ పాత పద్ధతేనా?
Local· 5d ago

ప్రజావాణికి మళ్ళీ పాత పద్ధతేనా?

లోకేశ్వరం మండలంలో ప్రజావాణి దరఖాస్తులకు ఆన్‌లైన్ రసీదులు ఇవ్వకుండా మాన్యువల్ స్టాంపులు వేస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పిప్రి గ్రామానికి చెందిన శ్రీకాంత్ గౌడ్ ఇచ్చిన వినతికి కూడా ఆన్‌లైన్ రసీదు ఇవ్వలేదు. పాత పద్ధతి వల్ల ఫిర్యాదుల స్థితిని ఆన్‌లైన్‌లో తెలుసుకోలేకపోతున్నామని, ఉన్నతాధికారులు స్పందించి డిజిటల్ రసీదులు అందేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

వచ్చే నెలలో నాగార్జున యూనివర్సిటీలో ప్రత్యేక కార్యక్రమం
Local· 5d ago

వచ్చే నెలలో నాగార్జున యూనివర్సిటీలో ప్రత్యేక కార్యక్రమం

AP: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సెప్టెంబర్‌ 9, 10వ తేదీల్లో యువతలో నిర్వహణ నైపుణ్యాలను పెంపొందించే కార్యక్రమం జరగనుంది. వ్యాపార విజ్ఞాన పోటీ, యువ మేనేజర్‌ పాత్రధారణ, మార్కెటింగ్‌ సవాలు, వాణిజ్య అనుకరణ, ప్రకటనల తయారీ, మానవ వనరులు–సంస్థ సంస్కృతి వంటి పోటీలు నిర్వహించనున్నారు. నాయకత్వం, సృజనాత్మకత, వ్యూహాత్మక ఆలోచన, నిర్ణయ సామర్థ్యం, బృంద స్ఫూర్తిని పెంపొందించడంతోపాటు పరిశ్రమ నిపుణులతో చర్చలు, నెట్‌వర్కింగ్‌కు అవకాశాలు కల్పించనున్నారు.

జాహ్నవి మృతిపై విచారణ కమిటీ
Local· 5d ago

జాహ్నవి మృతిపై విచారణ కమిటీ

AP: పోలవరం జిల్లా కూనవరం మండలం కోతులగుట్ట గురుకుల పాఠశాలలో ఏడో తరగతి స్టూడెంట్ తెల్లం జాహ్నవి మృతి ఘటనపై సమగ్ర విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు చింతూరు ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ తెలిపారు. ఐటీడీఏ ఏపీవో కన్వీనర్‌గా ట్రైబల్ వెల్ఫేర్ డీడీ, డీఎంఅండ్ హెచ్ఓ, డీసీహెచ్ఎస్ సభ్యులుగా కమిటీని నియమించామని పీవో పేర్కొన్నారు. కమిటీ సభ్యులు పాఠశాల, హాస్టల్ సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది, విద్యార్థులను విచారించడంతో పాటు రికార్డులు, వాంగ్మూలాలను పరిశీలించి ఏడురోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని ఆర్డర్ ఇచ్చారు.

కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు జర్మనీ వైద్యుల ప్రశంస
Local· 5d ago

కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు జర్మనీ వైద్యుల ప్రశంస

AP: దుగ్గిరాల మండలం మోరంపూడి గ్రేటనాల్టెస్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో కుష్ఠువ్యాధిగ్రస్తులకు అందుతున్న సేవలు ప్రత్యేకతగా నిలిచాయి. జర్మనీ లెప్రసీ రిలీఫ్ అసోసియేషన్ వైద్యులు ఈ కేంద్రాన్ని సందర్శించి చికిత్స, శస్త్రచికిత్సలు, ఉచిత మందుల పంపిణీ, అవగాహన కార్యక్రమాలను పరిశీలించారు. రోగులతో మాట్లా డి సూచనలు చేశారు. మెరుగైన సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం 25 మంది రోగులకు దుప్పట్లు, చెప్పులు పంపిణీ చేశారు.

పాల సేకరణ ధరలు పెంపు
Local· 5d ago

పాల సేకరణ ధరలు పెంపు

భీమదేవరపల్లి మండలంలోని ములుకనూరు డెయిరీ సభ్యులకు పాల సేకరణ ధరలను పెంచుతూ డెయిరీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలు రేపు ఉదయం నుంచి అమల్లోకి రానున్నాయి. డెయిరీ అధ్యక్షురాలు బుర్ర ధనశ్రీ, జనరల్‌ మేనేజర్‌ మార్పటి భాస్కర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఆవు పాలకు లీటరుకు రూ.1.25, గేదె పాలకు లీటరుకు రూ.3.50 చొప్పున ధర పెంచినట్లు తెలిపారు. పాల ఉత్పత్తిదారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ధరల పెంపు నిర్ణయం తీసుకున్నామని వారు పేర్కొన్నారు.

IHRPC జిల్లా అధ్యక్షుడిగా వేల్పుల వెంకటేష్
Local· 5d ago

IHRPC జిల్లా అధ్యక్షుడిగా వేల్పుల వెంకటేష్

అంతర్జాతీయ మానవ హక్కుల పరిరక్షణ మండలి (IHRPC) కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడిగా వేల్పుల వెంకటేష్‌ను నియమించింది. జిల్లాలో మానవ హక్కుల పరిరక్షణ, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, సామాజిక న్యాయం తదితర అంశాల్లో మండలి కార్యకలాపాలను బలోపేతం చేయడం వెంకటేష్‌ బాధ్యతగా ఉంటుందని తెలిపింది. కొత్త బాధ్యతలు స్వీకరించిన వెంకటేష్‌కు ఐహెచ్‌ఆర్‌పిసి జాతీయ నాయకత్వం అభినందనలు తెలిపింది.

సెప్టెంబర్ 12న జాతీయ లోక్ అదాలత్
Local· 5d ago

సెప్టెంబర్ 12న జాతీయ లోక్ అదాలత్

సెప్టెంబర్ 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని 6వ అదనపు జిల్లా జడ్జి మారగాని శ్రీనివాస్ అన్నారు. సత్తుపల్లి కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న వివిధ కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. క్రిమినల్, సివిల్, చెక్ బౌన్స్, బ్యాంకు రుణాలకు సంబంధించిన కేసులతో పాటు ఇతర రాజీ పడదగిన కేసులను గుర్తించి పరిష్కారానికి తీసుకురావాలని తెలిపారు.

రూల్స్‌కు విరుద్ధంగా లేఅవుట్లు..కంప్లైంట్
Local· 5d ago

రూల్స్‌కు విరుద్ధంగా లేఅవుట్లు..కంప్లైంట్

వ్యవసాయ భూములను నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్లుగా మార్చి ఫ్లాట్లు అమ్ముతున్నవారిపై చర్యలు తీసుకోవాలని మండల స్థాయి ప్రజావాణి (గ్రీవెన్స్‌)లో ఫిర్యాదు చేశారు. భీమదేవరపల్లి మండలంలో ఉమ్మడి కొత్తపల్లి గ్రామ అబాదికి సంబంధించిన సర్వే నంబర్‌ 266లోని వ్యవసాయ భూమి విషయంలో ఈ ఫిర్యాదు చేసినట్లు కొత్తపల్లి 8వ వార్డు సభ్యుడు నడిగోటి నరేష్ తెలిపారు. వ్యవసాయ భూములను వెంచర్లుగా మార్చి నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్ల విక్రయాలు చేయడం వ్యాపారంగా మారిందని ఆయన ఆరోపించారు.

రైతుల సహకారంతో రాజధాని భూసేకరణ
Local· 5d ago

రైతుల సహకారంతో రాజధాని భూసేకరణ

AP: రాజధాని అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న భూసేకరణపై తుళ్లూరు మండలం పెదపరిమిలో రైతులతో గ్రామసభ నిర్వహించారు. ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్‌కుమార్, భాష్యం ప్రవీణ్, కలెక్టర్ సాయికాంత్ వర్మ రైతుల అభిప్రాయాలు, సందేహాలు తెలుసుకున్నారు. రైతుల ప్రయోజనాలు పరిరక్షిస్తూ భూసేకరణ చేపడతామని తెలిపారు. రాజధాని నిర్మాణానికి సహకరించేందుకు పలువురు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ భూములకు సంబంధించిన పత్రాలను ప్రజాప్రతినిధులు, కలెక్టర్‌కు అందించారు.

రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి ఓఎన్‌జీసీ చేయూత
Local· 5d ago

రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి ఓఎన్‌జీసీ చేయూత

రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి ఓఎన్‌జీసీ సంస్థ చేయూత అందించింది. ఓఎన్‌జీసీ ఆధ్వర్యంలో కళాశాలకు 47 బెంచీలు, 5 కంప్యూటర్లను అందించారు. కళాశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ప్రిన్సిపాల్‌ డా.పితాని సాయిబాబు అధ్యక్షత వహించారు. రాజమహేంద్రవరం ఓఎన్‌జీసీ అసెట్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌, హెచ్‌ఆర్‌ హెడ్‌ శ్రీ రామారావు ముఖ్య అతిథిగా పాల్గొని బెంచీలు, కంప్యూటర్లను కళాశాల యాజమాన్యానికి అందించారు. ఎమ్మెల్యే దేవవరప్రసాద్ హాజరై కళాశాలలో ఇండోర్‌ స్టేడియం నిర్మాణానికి సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు.

కోడేరు పోలీస్‌ స్టేషన్‌లో ఉద్రిక్తత
Local· 5d ago

కోడేరు పోలీస్‌ స్టేషన్‌లో ఉద్రిక్తత

కోడేరు పోలీస్‌ స్టేషన్‌లో ఉద్రిక్తత నెలకొంది. SM(Social Media) పోస్టుల విషయంలో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య వివాదం తలెత్తింది. SM కార్యకర్త పరమేష్ నాయక్‌పై ఎస్సై వేణుగోపాల్ దాడి చేశారంటూ బీజేపీ నేతలు ఆరోపించారు. SMలో అతను చేసిన పోస్టులపై కాంగ్రెస్ నేత పాండు నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పరమేష్ నాయక్‌పై ఎస్సై దాడి చేయడాన్ని ఖండిస్తూ బీజేపీ నేత ఎల్లేని సుధాకర్ రావు ఆధ్వర్యంలో కార్యకర్తలు స్టేషన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించారు.

ఇంటి గాలి.. మన మెదడుపైనా ప్రభావం చూపుతుందా?
Education· 5d ago

ఇంటి గాలి.. మన మెదడుపైనా ప్రభావం చూపుతుందా?

ఇంట్లో గాలి ఎంత క్లీన్‌గా ఉందో.. అది మన ఆరోగ్యానికే కాదు, మెదడు పనితీరుకూ సంబంధం ఉండొచ్చని కొత్త స్టడీలు చెబుతున్నాయి. ఇటీవల 66 మంది పిల్లలపై చేసిన పరిశోధనలో.. గాలిలోని కాలుష్య కణాలను తగ్గించినప్పుడు వారి కాగ్నిటివ్‌ పనితీరు మెరుగుపడినట్టు గుర్తించారు. మరో రివ్యూలో కూడా ఇంటి గాలి కాలుష్యం పిల్లల మెదడు అభివృద్ధి, చదువుపై ప్రభావం చూపొచ్చని తేలింది. అయితే గాలి శుభ్రం చేస్తే వెంటనే మెదడు పవర్ పెరుగుతుందని కాదు.. కాలుష్యాన్ని తగ్గించడం వల్ల ప్రయోజనం ఉండొచ్చన్నదే ఇప్పటి ఆధారం.

ఓర్సీల ద్వారా భూములకు పట్టాలు ఇవ్వాలి
Local· 5d ago

ఓర్సీల ద్వారా భూములకు పట్టాలు ఇవ్వాలి

కోడేరు మండలం కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జనుంపల్లి గ్రామంలోని దళిత రైతుల భూ సమస్యను పరిష్కరించాలని కోరుతూ సీపీఐ(ఎం) జనుంపల్లి గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. గ్రామంలోని దళితుల భూములకు సంబంధించి గతంలో ఓఆర్‌సీలు మంజూరైనప్పటికీ, నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు భూములకు పట్టాలు చేయలేదని సీపీఐ(ఎం) నాయకులు తెలిపారు. పట్టాలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైతు భరోసా పథకాల ప్రయోజనాలు కూడా పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.