Latest

'శ్రీనివాస మంగాపురం'తో ఘట్టమనేని వారసుడి సినిమా ఎంట్రీ
Cinema· 21 Jul 2026

'శ్రీనివాస మంగాపురం'తో ఘట్టమనేని వారసుడి సినిమా ఎంట్రీ

సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ ఘట్టమనేని 'శ్రీనివాస మంగాపురం' సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ లవ్ డ్రామాలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. మోహన్‌బాబు విలన్‌గా పవర్‌ఫుల్ పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకి జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. చందమామ కథలు పిక్చర్స్ బ్యానర్‌పై పి.కిరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 30న విడుదల కానుంది.

హీరో బాలకృష్ణకు గాయాలు
Cinema· 21 Jul 2026

హీరో బాలకృష్ణకు గాయాలు

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో హీరో నందమూరి నటిస్తున్న కొత్త సినిమా 'NBK111' షూటింగ్ సమయంలో బాలకృష్ణ ప్రమాదానికి గురయ్యారు. కాకినాడలో జరుగుతున్న యాక్షన్ సీక్వెన్స్‌లో ఆయనకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. చికిత్స అనంతరం బాలకృష్ణ కోలుకుంటున్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సినిమా టీం చెప్పారు.

డాక్యుమెంట్ రైటర్లకు ఆందోళన అక్కర్లేదు: చంద్రబాబు
AP· 21 Jul 2026

డాక్యుమెంట్ రైటర్లకు ఆందోళన అక్కర్లేదు: చంద్రబాబు

AP: డాక్యుమెంట్ రైటర్ల ఉపాధికి ఇబ్బంది లేకుండా చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రభుత్వం ప్రైవేటీకరిస్తున్నదని కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. అందులో వాస్తవం లేదని సీఎం స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ సేవలు సులభతరం చేసేలా RSKలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పాస్‌పోర్టు సేవా కేంద్రాల తరహాలోనే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు పని చేస్తాయన్నారు.

పుష్కరాల పనులు త్వరగా పూర్తిచేయండి: పవన్ కళ్యాణ్
AP· 21 Jul 2026

పుష్కరాల పనులు త్వరగా పూర్తిచేయండి: పవన్ కళ్యాణ్

AP: ‘స్వచ్ఛ గోదావరి–పవిత్ర పుష్కరాలు’ అనే థీమ్‌తో గోదావరి పుష్కరాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలోని మునికూడలిని మోడల్ పుష్కర్ పంచాయతీగా తీర్చిదిద్దుతున్నారు. ఇందుకోసం రూ.7 కోట్ల వ్యయంతో పనులు చేపట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యవేక్షణలో ఈ పనులు కొనసాగుతున్నాయి. మునికూడలి మోడల్ నమూనాతో మిగిలిన పుష్కర పంచాయతీల పనులను పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశించారు.

ఉదయ్ కృష్ణారెడ్డి హెల్త్ అప్డేట్
News· 21 Jul 2026

ఉదయ్ కృష్ణారెడ్డి హెల్త్ అప్డేట్

TG: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటూ సూసైడ్‌కి పాల్పడిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు హైదరాబాద్‌లోని జయంతి హాస్పిటల్ డాక్టర్లు తెలిపారు. ఆయన బ్లడ్ సాంపిల్స్‌లో ఎలాంటి విషపదార్థాలు లేవని డాక్టర్ రవిశంకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆహారం తీసుకోకపోవడం, మోతాదుకు మించి మద్యం తాగడం వల్లే స్పృహ కోల్పోయారని తెలిపారు.

మీరు మమ్మల్ని ఆపలేరు: ప్రకాష్ రాజ్
News· 21 Jul 2026

మీరు మమ్మల్ని ఆపలేరు: ప్రకాష్ రాజ్

దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, యువత చేపట్టిన నిరసనలకు మద్దతుగా నటుడు ప్రకాష్‌రాజ్ 'X' అకౌంట్‌లో పోస్ట్ చేశారు. పోలీసుల ఆంక్షలు, అణచివేతలను నిరసిస్తూ ‘మీరు మమ్మల్ని ఆపలేరు. ఈ పోరాటం కొనసాగుతుంది’ అని రాశారు. పరీక్షల లీకేజీలు, యువత భవిష్యత్తుపై ప్రశ్నిస్తూ #justasking హ్యాష్‌ట్యాగ్‌తో ఆయన ఈ నిరసనలో భాగమయ్యారు. ఎంత అణచివేస్తే అంతగా తిరగబడతామని, ప్రజాస్వామ్యంలో యువత హక్కుల కోసం చేసే పోరాటం ఆగదని చెప్పారు.

ప్రొటెస్ట్‌లో నా  పిల్లలు కూడా ఉన్నారు': కేజ్రీవాల్
Politics· 21 Jul 2026

ప్రొటెస్ట్‌లో నా పిల్లలు కూడా ఉన్నారు': కేజ్రీవాల్

నిన్న పార్లమెంట్ దగ్గర జరిగిన ప్రొటెస్ట్‌లో తన ఇద్దరు పిల్లలు కూడా పాల్గొన్నారని AAP లీడర్ అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. పోలీసులు టియర్ గ్యాస్ యూజ్ చేసిన టైమ్‌లో తన పిల్లలు స్టూడెంట్స్‌తో పాటే 4-5 గంటలు అక్కడే ఉన్నారని తెలిపారు. తాను పంజాబ్ పర్యటన వల్ల అటెండ్ అవ్వలేకపోయినా, పార్టీ లీడర్స్, తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ప్రొటెస్టర్స్‌కి సపోర్ట్‌గా నిలిచారని స్పష్టం చేశారు. దేశంలో ఉన్న 140 కోట్ల మంది ఒకే ఫ్యామిలీ అని, ఎవరూ దేనికీ భయపడాల్సిన అవసరం లేదని కేజ్రీవాల్ చెప్పారు.

దైవ దర్శనానికి వెళ్లిన కుటుంబంలో విషాదం
AP· 21 Jul 2026

దైవ దర్శనానికి వెళ్లిన కుటుంబంలో విషాదం

AP: కర్నూలు జిల్లా మంత్రాలయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాఘవేంద్రస్వామి దర్శనానికి కుటుంబ సభ్యులతో వెళ్తున్న రవి శెట్టి (43) ప్రయాణిస్తున్న కారు నేషనల్ హైవేపై అదుపుతప్పి కల్వర్టును బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో రవి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

షాకింగ్.. బైక్ ఇంజిన్‌లో నాగుపాము
TG· 21 Jul 2026

షాకింగ్.. బైక్ ఇంజిన్‌లో నాగుపాము

TG: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ బస్టాండ్‌లో పార్క్ చేసి ఉన్న ఓ బైక్ ఇంజిన్‌లో భారీ నాగుపాము కనిపించడంతో కలకలం రేపింది. పామును గమనించిన ప్రయాణికులు భయాందోళనకు గురై వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న స్నేక్ క్యాచర్ చాకచక్యంగా బైక్ ఇంజిన్‌లో నుంచి నాగుపామును సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం దానిని పట్టణ శివారులోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఈ ఘటనతో బస్టాండ్‌లో కొద్దిసేపు ఉత్కంఠ నెలకొంది. వర్షాకాలంలో పాములు వాహనాల్లోకి చేరే అవకాశం ఉన్నందున, పార్క్ చేసిన వాహనాలను స్టార్ట్ చేసే ముందు క్షుణ్ణంగా తనిఖీ చేయాలని స్నేక్ క్యాచర్ సూచించారు.

దిల్లీలో నిరసనకారులపై ఉక్కుపాదం
News· 21 Jul 2026

దిల్లీలో నిరసనకారులపై ఉక్కుపాదం

నిన్న పార్లమెంట్ ముట్టడి కోసం జంతర్ మంతర్ వద్ద వేలాది మంది నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీలు ఉపయోగించి, టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో వందమంది వరకూ గాయపడ్డారు. అయినా నిరసన ఆపకుండా కొనసాగించారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఉద్రిక్తతలు పెరగడంతో నిరసనకారులు సంయమనం పాటించాలని, హింసాత్మక చర్యలకు పాల్పడవద్దని దిల్లీ పోలీసులు అధికారిక ప్రకటనలో కోరారు.

విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం
Viral· 21 Jul 2026

విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం

అమెరికాలోని నార్తర్న్ కెంటకీ ఎయిర్‌పోర్ట్‌లో కలిట్టా ఎయిర్ విమానం ల్యాండింగ్ చేస్తున్న టైంలో వెనుక భాగం రన్‌వేను బలంగా తాకింది. దీంతో నిప్పురవ్వలు ఎగసిపడ్డాయి. పైలట్ వెంటనే విమానాన్ని మళ్లీ గాల్లోకి తీసుకెళ్లి చుట్టూ తిప్పారు. ఆ తర్వాత రన్‌వేపై సురక్షితంగా దించారు. ఈ ఘటనలో ప్రయాణికులకు, సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

సీజేపీ ప్రొటెస్ట్‌పై మోదీ స్పందన
News· 21 Jul 2026

సీజేపీ ప్రొటెస్ట్‌పై మోదీ స్పందన

నీట్ పేపర్ లీక్ నివేదికలు వచ్చిన వెంటనే ప్రభుత్వం స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ చెప్పినట్లు కేంద్ర మంత్రి రిజిజు స్పష్టం చేశారు ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ 'మంగళ్ మిలన్' సమావేశం అనంతరం మంత్రి మాట్లాడుతూ సీజేపీ ప్రతినిధులు నిన్న ఉదయం కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసి తమ డిమాండ్లను వివరిస్తూ లేఖను సమర్పించినట్లు చెప్పారు.

మహిళ ఆత్మహత్యాయత్నం
TG· 21 Jul 2026

మహిళ ఆత్మహత్యాయత్నం

TG: భద్రాచలం వద్ద గోదావరి వంతెనపై ఓ మహిళ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. ములకలపల్లి మండలం పొగళ్లపల్లి గ్రామానికి చెందిన గొళ్లమూడి శైలజ (37) కుటుంబ తగాదాలు, ఆస్తి వివాదాలతో తీవ్ర మనస్తాపానికి గురై నదిలోకి దూకేందుకు ప్రయత్నించింది. స్థానికులు, వాహనదారులు సమయస్ఫూర్తితో ఆమెను అడ్డుకుని కాపాడారు. అనంతరం బూర్గంపాడు పోలీసులు ఆమెను పోలీస్ స్టేషన్‌కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చారు. తన ఇంటి స్థలాన్ని మరిది అక్రమంగా ఆక్రమించుకున్నాడని, భర్తపై తప్పుడు కేసులు పెట్టించి వేధిస్తున్నారని శైలజ ఆరోపించింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

సంసద్ నిరసనల్లో డెలివరీ ఏజెంట్లు, తల్లిదండ్రులు
News· 21 Jul 2026

సంసద్ నిరసనల్లో డెలివరీ ఏజెంట్లు, తల్లిదండ్రులు

దిల్లీలో నిన్న టియర్ గ్యాస్ ప్రయోగం, లాఠీఛార్జ్‌కు ముందే చలో సంసద్ ర్యాలీలో పాల్గొనడానికి వివిధ వర్గాల ప్రజలు జంతర్ మంతర్ వద్ద గుమిగూడారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, డెలివరీ ఏజెంట్లు ఈ దేశ విద్యావ్యవస్థలో మార్పు కోసం నిరసనల్లో పాల్గొనాలని వారంతా పిలుపునిచ్చారు. ఉదయం 9 గంటలకు సీజేపీ చేపట్టిన ఈ ర్యాలీకి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చారు. పోలీసుల ఆంక్షలను తట్టుకొని వారు ముందుకు కదిలి పార్లమెంట్ దాకా చేరుకున్నారు.

విద్యార్థులపై విరుచుకుపడ్డ దిల్లీ పోలీసులు
News· 21 Jul 2026

విద్యార్థులపై విరుచుకుపడ్డ దిల్లీ పోలీసులు

నీట్ పరీక్ష లీకేజ్‌పై దిల్లీలో 'చలో సంసద్' ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘర్షణలో వందమందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను వెంటనే రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్‌కు తరలించారు. గాయపడిన వారిలో 90 మంది నిరసనకారులున్నారు. తలకు బలమైన గాయాలతో కొందరి పరిస్థితి విషమించడంతో ఐసీయూలో చేర్చి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
TG· 21 Jul 2026

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

TG: సంగారెడ్డి జిల్లా కల్హేర్‌ మండలం బాచుపల్లి దగ్గర్లో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారితోపాటు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. విదేశాల నుంచి వచ్చే బంధువును తీసుకురావడానికి నాందేడ్‌ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వాళ్ళని నారాయణఖేడ్‌ హాస్పిటల్ తరలించారు.

ఎవ్వరో ఈ బిడ్డలు.. 🥺
AP· 21 Jul 2026

ఎవ్వరో ఈ బిడ్డలు.. 🥺

ఛలో పార్లమెంట్ చేపట్టి పోలీసుల లాఠీ చార్జిలో గాయపడ్డ విద్యార్థులు. తీవ్ర గాయాలతో బాధపడుతూ మళ్లీ జంతర్ మంతర్ ఏరియాకు చేరుకున్నారు.

టాలీవుడ్‌లో సిరి హనుమంతుకు భారీ అవకాశం?
Cinema· 21 Jul 2026

టాలీవుడ్‌లో సిరి హనుమంతుకు భారీ అవకాశం?

అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో వస్తున్న పాన్‌ ఇండియా సినిమా 'రాకా'లో బిగ్‌బాస్ తెలుగు ఫేమ్, నటి సిరి హనుమంతు నటిస్టున్నట్లు సమాచారం. ఇప్పటికే షూటింగ్‌లో పాల్గొన్నట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. ఆమె పాత్రకు సంబంధించిన వివరాలను మూవీ టీమ్ వెల్లడించలేదు. సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్‌ కాగా, సిరి హనుమంతు పాత్ర ఏమిటనే ఉత్కంఠ నెలకొంది.

వర్షాకాలంలో చికెన్ or మటన్?
Health· 21 Jul 2026

వర్షాకాలంలో చికెన్ or మటన్?

వర్షాకాలంలో మనం తీసుకునే ఫుడ్ త్వరగా అరగదు. అందుకే మటన్ కంటే చికెన్ తినడం మంచిదని న్యూట్రీషియన్లు చెబుతున్నారు. మటన్ రెడ్‌మీట్ కావడం వల్ల దీనిలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇది అరగడానికి ఎక్కువ టైం పడుతుంది. ఇది కడుపుబ్బరం, అసిడిటీకి దారితీస్తుంది. చికెన్ తేలికగా అరుగుతుంది. వేడి చికెన్ సూప్ తాగడం వల్ల జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. చికెన్ వండేటప్పుడు శుభ్రంగా కడిగి, బాగా ఉడికించి మాత్రమే తీసుకోవాలి. రోడ్డ్ పక్కన ఫాస్ట్‌ఫుడ్స్ కాకుండా ఇంట్లోనే తక్కువ నూనెతో వండుకోవడం మంచిది.

సానుభూతి కోసమే ట్రైనీ IPS నాటకం
TG· 21 Jul 2026

సానుభూతి కోసమే ట్రైనీ IPS నాటకం

TG: మహిళా ట్రైనీ IPSపై లైంగిక వేధింపుల కేసులో ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేశాడన్న ప్రచారంలో బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అతడు విషం తాగలేదని వైద్య పరీక్షల్లో తేలింది. అధిక మద్యం సేవించి అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనను సానుభూతి కోసం ఆత్మహత్యాయత్నంగా చూపించేందుకు ప్రయత్నించాడని తెలిపారు. నేషనల్ పోలీస్ అకాడమీ అధికారులు ఈ కేసుపై అంతర్గత కమిటీ ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అత్తాపూర్ పోలీసులు CCTV ఫుటేజ్ సేకరించి విచారణ కొనసాగిస్తున్నారు.

అమెరికాలో పల్నాడు యువకుడు మృతి
AP· 21 Jul 2026

అమెరికాలో పల్నాడు యువకుడు మృతి

AP: పల్నాడు జిల్లా గురజాల మండలం దైద గ్రామానికి చెందిన రావిపాటి వెంకట రవితేజ (34) ఉన్నత చదువుల కోసం 2019లో అమెరికా వెళ్లి, అక్కడ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా స్థిరపడ్డాడు. ఒహియో రాష్ట్రం కీవ్‌లాండ్‌లో కొత్త ఇల్లు కొనుగోలు చేసి, గృహప్రవేశానికి తల్లిదండ్రులను కూడా అమెరికాకు ఆహ్వానించాడు. రాత్రి అందరూ కలిసి భోజనం చేశారు. సంతోషంగా ఉన్న సమయంలో రవితేజకు ఒక్కసారిగా తీవ్రమైన గుండెనొప్పి వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు డాక్టర్స్ తెలిపారు.