దైవ దర్శనానికి వెళ్లిన కుటుంబంలో విషాదం

AP: కర్నూలు జిల్లా మంత్రాలయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాఘవేంద్రస్వామి దర్శనానికి కుటుంబ సభ్యులతో వెళ్తున్న రవి శెట్టి (43) ప్రయాణిస్తున్న కారు నేషనల్ హైవేపై అదుపుతప్పి కల్వర్టును బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో రవి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



