మహిళ ఆత్మహత్యాయత్నం

TG: భద్రాచలం వద్ద గోదావరి వంతెనపై ఓ మహిళ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. ములకలపల్లి మండలం పొగళ్లపల్లి గ్రామానికి చెందిన గొళ్లమూడి శైలజ (37) కుటుంబ తగాదాలు, ఆస్తి వివాదాలతో తీవ్ర మనస్తాపానికి గురై నదిలోకి దూకేందుకు ప్రయత్నించింది. స్థానికులు, వాహనదారులు సమయస్ఫూర్తితో ఆమెను అడ్డుకుని కాపాడారు. అనంతరం బూర్గంపాడు పోలీసులు ఆమెను పోలీస్ స్టేషన్‌కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చారు. తన ఇంటి స్థలాన్ని మరిది అక్రమంగా ఆక్రమించుకున్నాడని, భర్తపై తప్పుడు కేసులు పెట్టించి వేధిస్తున్నారని శైలజ ఆరోపించింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.



