ప్రొటెస్ట్‌లో నా పిల్లలు కూడా ఉన్నారు': కేజ్రీవాల్
నిన్న పార్లమెంట్ దగ్గర జరిగిన ప్రొటెస్ట్‌లో తన ఇద్దరు పిల్లలు కూడా పాల్గొన్నారని AAP లీడర్ అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. పోలీసులు టియర్ గ్యాస్ యూజ్ చేసిన టైమ్‌లో తన పిల్లలు స్టూడెంట్స్‌తో పాటే 4-5 గంటలు అక్కడే ఉన్నారని తెలిపారు. తాను పంజాబ్ పర్యటన వల్ల అటెండ్ అవ్వలేకపోయినా, పార్టీ లీడర్స్, తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ప్రొటెస్టర్స్‌కి సపోర్ట్‌గా నిలిచారని స్పష్టం చేశారు. దేశంలో ఉన్న 140 కోట్ల మంది ఒకే ఫ్యామిలీ అని, ఎవరూ దేనికీ భయపడాల్సిన అవసరం లేదని కేజ్రీవాల్ చెప్పారు.


